ఈశ్వర ఉవాచః -
సస్థానం శాన్త్యతీతాయాః శాన్త్యా సార్ధం విశుద్ధయా ।
కుర్వీత పూర్వవ తత్ర తత్వవర్ణాది తద్యథా.
ఓం హీం ఔం హౌం హాం ఇతి సన్గానాని ।
ఉభౌ శ క్తిశివా తత్వే భువనాష్టక సిద్దికమ్ ।
దీపకం రోచకం చైవ మోచకం బోర్వగామి చ.
వ్యోమరూప మనాథం చ స్యాదనాశ్రితమష్టవమ్ ।
ఓంకారపదమీశానే మనో వర్ణాశ్చ షోడశ.
ఆకారుదివిసర్గానా బీజేన దేహకార ।
కుహూశ్చ శ జినీ నాఢ్యా దేవదత్తధనజ్ఞయా.
మారుతో స్పర్శనం శ్రోత్రమినియే విషయో నభః ।
శబ్ధో గుణె ఒస్యావస్థా తు తుర్యాతీతా తు పఞ్చ.
హేతుః సదాశివో దేవ ఇతి తత్త్వాని సణయమ్ ।
సహ్చో న్య శాన్యతీదాఖ్యం విదధ్యాత్తాడనాదికమ్.
కలాపాళం సమాసాద్య పడ నేన విభిద్య చ ।
ప్రవిశ్యా నర్న మో నేన ఫడ నేన వియోజయేత్.
శీఖాహృత్సము దేభూతం స్వాహా నం సృణిముద్రయా ।
పూర కేణ సమాకృష్య పాశం మస్తక సూత్రత.
కుమ్భ కేన సమాదాయ రేచ కేనోద్భవాఖ్యయా ।
హృత్సమ్పుటనమో నేన వహ్నిం కుణ్డే నివేళ యేత్.
అస్యాః పూజాదికం సర్యం నివృరివ సాధయేత్।
సదాశివం సమావాహ్య పూజయిత్వా ప్రతర్ప్య చ.
సదాఖ్యాతేజధికారేస్మిన్ముమునుం దీక్షయామ్యహమ్।
భావ్యం త్వయానుకులేన భక్త్యా విజ్ఞాపయేదితి.
మహేశ్వరుడు చెప్పెను. విశద్ధశాంతికళతో శాంత్యతీతకళను సంధానము చేయవలెను. దానియందు కూడ వెనుకటి వలెనే తత్వవర్ణాది భావన చేయవలెను. ఎట్లనగా సంధానసమయమునందు “ఓం హం హం హం హాం” అను మంత్ర ము నుచ్చరించవలెను. శాంత్యతీతకళలు శివ-శక్తులు రెండు తత్త్వములు. ఇంధకదేపక-రోచక- మోచక ఊర్ధ్వగామి వ్యోమరూప-అనాథ-ఆనుశితములను ఎనిమిది భువనములు. ఓంకారము పదము. ఈశానము మంత్రము. అకారము మొదలు విసర్గవరకును ఉన్నవి పదునారు అక్షరములు. నాద-హకారములు బీజములు. కుహూ, శంఖినులు రెండు నాడులు. దేవదత్త-ధనంజయములు రెండు ప్రాణవాయువులు. వాక్-శ్రోత్రములు రెండు ఇంద్రియములు, శబ్దము విషయము అదియే గుజము కూడ. ఐదవ దైన తురీయాతీతావస్థ అవస్థ. సదాశివుడు ఏకైక కారణము. శాంత్యతీతకళలో ఈ తత్త్వాదు లన్నియు ఉన్న వని భావన చేసి తొడనాదికము చేయవలెను. పడంత మగు మంత్రముచే కలాపాశతాడనము బోధనముచేసి, నమస్కారాంతమంత్రముతో శిష్యుని అంతఃకరణమునందు ప్రవేశము చేయవలెను. పిమ్మట ఫడంతమంత్రముతో జీవచైతన్య మును పాశ విముక్తము చేయవలెను. “వషట్' 'నమః' అను మంత్రములతో సంపుటిత మైన స్వాహాంతమంత్రము నుచ్చ రించి, అంకుశ ముద్రా పూరక ప్రాణాయామములతో పాశమును మస్తకసూత్రముతో ఆకర్షించి, దానిని కుంభక ప్రాణాయా మముతో గ్రహించి, రేచక ప్రాణాయామఉద్భవముద్రలతో హృదయమంత్రసంపుటితము చేసి, నమస్కారాంత మంత్రముతో దానిని అగ్నికుండములో స్థాపించవలెను. దాని పూజనాదికము నంతను నివృత్తికళకు చేసినట్లే చేయవలెను. సదాశివుని ఆవాహన-పూజన-తర్పణములు చేసి భక్తిపూర్వకముగ విజ్ఞాపన చేయవలెను. “భగవంతుడా! ఈ ముముక్షువునకు సత్పురుషులు చెప్పిన నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా ఈతనికి అనుకూలుడవుగ ఉండవలెను.”
పిత్రోదా వాహనం పూజాం కృత్వా తర్పణ సన్నిధా ।
హృత్సంపుటాత్మ బీజేన శిష్యం వక్షన్ తాడయేత్.
ఓం హాం హూం ఫట్.
ప్రవిశ్య చాప్యనేనైవ చైతన్యం వీథ జేత్తతః ।
శస్త్రేణ పాశ సంయుక్తం జ్యేష్ఠయాజ్కుశముద్రయా.
ఓం హాం హః హూం ఫట్.
స్వాహ నేన తదాకృష్య తేనె ర పుటితాత్మనా।
గృహీత్వా తన్న మో నేన నిజాత్మని నియోజయేత్.
ఓం హం హం హీం ఆత్మనే నమః
పూర్వవతిపితృసంయోగం భావయిత్వోద్భవాఖ్యయా ।
వామయా తదనేనైవ దేవ్యా గర్భే నియోజయేత్.
గర్భాధానాదికం సర్వం పూర్వోక్తవిధినా చరేత్ ।
మూలేన పాశ శైథిల్యే నిష్కృత్యైవ శతం జపేత్.
నలశ క్షితిరోధానే పాశానాం చ వియోజనే ।
పజ్చపడ్చాహుతీర్ధద్యాదాయుధేన యథా పురా.
పాశానాయుధమ శ్రేణ సప్తవారాభిజ ప్రయా ।
చిన్ష్యాద ఫ్రేణ కర్తర్యా కాలబీజయుజా యథా.
ఓం హోం శాన్యతకలాపాశాయ హః హూం
ఫట్ విసృజ్య వర్తులీకృత్య పాశాన స్రణ పూర్వవత్ ।
ఘృతపూరే సువే దత్త్వా కలా గ్రేడైవ హోమయేత్.
ఆత్రేణ జుహుయాత్పళ్చి పాశాఙ్కుశ నివృత్తయే ।
ప్రాయశ్చిత్తని షేధార్థం దద్యాదష్టాహతీ స్తతః.
సదాశివం హృదావాహ్య కృత్వా పూజనతర్పడే ।
పూర్వోత్తవిధినా దద్యాదధికారసమర్పణమ్.
ఓం హాం సదాశివమనోబిన్దుం శుల్కం గృహాణ స్వాహా .
నిః శేషధగ్గపాశస్య పరస్య సదా శివ ।
బిందాయ న త్వయా స్థేయం శివాజ్ఞాం శ్రావయేదితి.
మాతాపితరుల ఆవాహన-పూజన-తర్పణ సంవిధానములు చేసి, హృదయసంపుటిత మగు ఆత్మబీజముతో శిష్యుని వక్షస్థలమున తాడనము “ఓం హం హం హః హూం ఫట్” అను మంత్రముతో చేయవలెను. ఆ మంత్రముతోడనే శిష్యుని హృదయమునందు ప్రవేశించి అస్త్రమంత్రముతో చైతన్యమును పాశమునుండి విముక్తము చేయవలెను. పిదప జేష్టాంకుశ ముద్రతో సంపుటిత మైన ఆ స్వాహాంతమంత్రముతో దానిని ఆకర్షించి, గ్రహించి, నమోంతమంత్రముతో దానిని ఆత్మయందు కూర్చవలేను. “ఓం హాం హాం హాం హః హూం ఫట్” అనునది ఆకర్షణమంత్రము. “ఓం హం హాం హాం ఆత్మనే నమః” అనునది ఆత్మ నియోజన మంత్రము. వామా ఉద్భవముద్రతో వెనుక టివలెనే మాతాపితృసంయోగభావన చేసి, ఆ మంత్రముతోడనే జీవచైతన్యమును దేవీగర్భమునందుంచవలెను. పిమ్మట పూర్వోక్తవిధానానుసారము గర్భాధానాది సంస్కారము లన్ని యు చేయవలెను, పాశ బంధ శైథిల్యము కొరకై, ప్రాయశ్చిత్తముగా మూలమంత్రమును నూరు సార్లు జపించవలెను. మలశ క్షితిరోధానము కొరకును, పాశ వియోజనము కొరకును అస్త్రమంత్రముతో వెనుకటివలెనే ఐదేసి హోమములు చేయవలెను. కళకు సంబంధించిన, బీజముతో కూడిన ఆయుధమంత్రముతో ఏడు పర్యాయములు అభిమంత్రించిన ఖడ్గరూప మగు అస్త్రముతో పాశములను భేదించవలెను. “ఓం హః హాం శాన్యతీతకళాపాళాయ హుం ఫట్” అనునది మంత్రము. పిదప ఆ పాశములను వెనుక టివలె అస్త్రమంత్రముతో సలిపి, వర్తులా కారము చేసి, నేతితో నింపిన స్రువముల నుంచి, కళాస్త్రమంత్రముతో హోమము చేయవలెను. పాశాంకుర నివృత్తికొరకై ఐదు హోమములును, ప్రాయశ్చిత్తనిషేఢము కొరకు ఎనిమిది హోమములను చేసి హృదయమంత్రముతో సదాశివుని ఆవాహన - పూజాతర్పణములు చేసి, వెనుక చెప్పిన విధముగ ఆధికారసమర్పణము చేయవలెను. అందుకుమంత్రము. “ఓం హాం సదాశివ మనోబిన్దుం శుల్కం గృహాణ స్వాహా” అనునది. పిదప సదాశివునకు కూడ శివుని ఆజ్ఞను వినిపింపవలేను. సదాశివా! ఈ పశువునందలి పాపము లన్నియు దగ్గములై నవి. కావున ఈతనికి బంధనము కలిగించుటకై నీ విచట ఉండరాదు”.
మూలేన జుహుయాత్పూర్ణాం విసృజేత్తు సదాశివమ్ ।
తతో విశుద్దమాత్మానం శరచ్చన్దమివోదితమ్.
సంహారముద్రయా రౌద్ర్యా సంయోజ్య గురురాత్మని ।
కుర్వీత శిష్యదేహస్థముద్దృత్యోద్భవముద్రయా.
విధి దద్యాదాప్యాయనాయాస్య మస్తకేజర్హ్యమ్బుబిన్దుకమ్।
క్షమయిత్వా మహాభక్త్యా పితరౌ విసృ తదా.
లేదితా శిష్యదీయై యన్మయా పితరౌ యువామ్ ।
కారుణ్యాన్మోక్షయిత్వా తద్వతిధ్వం. స్థానమాత్మనః.
శిఖామ నితక ఝార్యా బోధశ క్తిస్వరూపిణీమ్ ।
శిఖాం ఛిన్హ్యాచ్ఛివాస్రణ శిష్యస్య చతురజ్ఞులామ్.
ఓం క్లీం శిఖాయై హూం ఫట్ ఓం అస్రాయ హూం ఫట్
స్రుచి తాం మృత పూర్ణాయాం గోవిందాలక మద్యగామ్ ।
సంవిధాయాస్త్రమశ్రేణ హూం ఫడ నేన హోమయేత్ .
ఓం హం హ ఆస్రాయ హూం ఫట్.
ప్రక్ష్యాళ్య స్రుక్ స్రువౌ శిష్యం సంస్నా ప్యాచమ్య చ న్వయమ్ ।
యోజనికాస్థమాత్మానం శశ్రమ నేణ తాడయేత్ .
వియోజాకృష్య సంపూజ్య పూర్వవద్ధ్వాదశా స్తతః।
ఆత్మీయహృదయామ్భోజకర్ణికాయాం నివేశయేత్.
పూరితం సువమాజ్యేన విహితాధోముఖసుచా ।
నిత్యోక్తవిధినాదాయ శంఖసన్నిభముద్రయా.
ప్రసారితశిరోగ్రీవో నాదోచ్చారానుసారతః ।
సమదృష్టిః స్థిర శాస్త్ర పరభావసమన్వితః.
కుమ్భమణ్డలవహ్నిభ్యః శిష్యాదపి నిజాత్మనః ।
గృహీత్వా షడ్విధార్వానం సుగగ్రే ప్రాణినాడికమ్.
సంచి న్య బిందువద్ద్యాత్వా క్రమశః సప్తధా యథా ।
మూలమంత్రముతో పూర్ణాహుతి ఇచ్చి సదాశివుని విసర్జించవలెను. శరత్కాలచంద్రదృశ, మై విశుద్ధ మైన శిష్యుని జీవాత్మను రౌదీసంహారముద్రతో తనలో సంయోజితము చేసికొనవలెను. శిష్యుని శరీరములో నున్న జీవాత్మను ఉద్భవ ముద్రతో ఉద్ధరించి, దాని పోషణము కొరకై, శిష్యుని తలపై అర్ఘ్యజలబిందు వొకటి ఉంచవలెను. పిదప పరమభక్తి భావముతో క్షమార్పణము చెప్పుకొని, ఈ విధముగ పలుకుచు మాతాపితరుల విసర్జనము చేయవలెను. “శిష్యునకు దీక్ష ఇచ్చుటకై మిమ్ముల నిరువురిని కష్ట పెట్టితిని. అందులడు. నన్ను క్షమించి, మీ యిరువురును. తమ స్థానమునకు వెళ్ళడు”, అస్త్రమంత్రముచే అభిమంత్రించిన కర్తరితో, “ఓం హూం శిఖాయై హూం ఫట్” “ఓం అస్త్రాయ హూం ఫట్” అను ఛేదనమంత్రములతో, శిఖాస్త్రముతో, బోధనశక్తి స్వరూపిణి యగు, శిష్యుని నాలుగు అంగుళమల శిఖను ఛేదించవలెను. దానిని మృతపూర్ణ మగు ధ్రువమునం దుంచి ‘హుం ఫట్' అని అంతమునందు గల అస్త్రమంత్రముతో ఆగ్నిలో హోమము చేయవలెను. “ఓం ఓం హః అస్త్రాయ హూం ఫట్ అనునది మంత్రము. పిదప స్రుక్ స్రువములు - కడిగి, శిష్యునకు స్నానము చేయించి, తాను ఆచమనము చేసి, యోజనాస్థానము కొరకై అస్త్రమంత్రముతో తనను తాను తాడనము చేసికొన వలేను. పిమ్మట వియోజన - ఆకర్షణ - సంగ్రహణములు చేసి వెనుకటి వలె ద్వాదశాంతము (లలాటముపై భాగము) నుండి జీవచైతన్యమును తీసికొని తన హృదయకమలకర్ణికామధ్యమునం దుంచవలెను. సుక్కును నేతితో నింపి, దానిపై స్రువమును ఆధోముఖముగా నుంచి, శంఖతుల్యముద్రతో, నిత్యో క్ష విధి ప్రకారము హస్తమునందు గ్రహించవలెను. పిమ్మట నాదోచ్చారణానుసారము శిరస్సును, కంఠమును చాపి, దృష్టిని సమభావములో నుంచి, స్థిర - శాంత - పరభావసంపన్నుడై కలశ - మండల - అగ్ని - శిష్యులనుండియు, తననుండియు ఆరు విధము లగు ఆధ్వలను గ్రహించి, సుక్కు అగ్ర భాగమునందు, ప్రాణమయనాడిలోపల నుంచి, దానిని ఆ భావముతోడనే భావన చేయవలెను. ఈ విధముగ చింతించి క్రమముగ ఏడు విధములగు విషవలను ధ్యానించవలెను.
ప్రథమం శ్రేణసంయోగస్వరూపపరవడం తతః.
హృదయాదిక్ర మెచ్చారవిసృష్టం మన్తసంజకమ్ ।
పూరకం కుమ్భకం కృత్వా వ్యాదాయ వదనం మనాక్ .
సుషుమ్నానుగతం నాదస్వరూపం తు తృతీయకమ్ ।
సప్తమే కారతే త్యాగాత్పశాస్త్ర విశ్వరం లయః.
శక్తినాదోర్ధ్వసళ్చార స్తచ్ఛక్తి విస్వరం మతమ్ ।
ప్రాణస్య నిఖిలస్యాపి శక్తి ప్రమేయవర్జితమ్.
తత్కాల విశ్వరం షష్ఠం శ క్త్యతీతం చ సప్తమమ్ ।
తదేతద్యోజనాస్థానం విశ్వరం తత్త్వసంజ్ఞకమ్.
పూరకం కుమ్భకం కృత్వా వ్యాదాయ వదనం మనాక్ ।
శనై రుదీరయేన్మూలం కృత్వా శిష్యాత్మనో లయమ్.
ఫట్ కారే తడిదాకారే షడధ్వప్రాణరూపిణి ।
ఫట్ కారం పరతో నాభేర్వితస్లిం వ్యాప్య సంస్థితమ్.
తతః పరమకారను హృదయాచ్చతుర జ్ఞులమ్ ।
ఉకారం వాచకం విష్ణో స్తతోపాఱుళ కణకమ్,
చతుర జులతాలుష్ఠం మకారం రుద్రవాచకమ్ ।
తద్వల్లలాటమధ్యస్థం బిన్దుమీశ్వరవాచకమ్.
నాదం సదాశివం దేవం బ్రహ్మరన్తావసానకమ్ ।
శ క్తిం చ బ్రహ్మరన్తస్థాం త్యజన్ని త్యమనుక్ర మాత్.
దివ్యం పిపీలికాస్పర్శం తస్మిన్నే వానుభూయ చ ।
ద్వాదశాంతే పరే త త్త్వేపరమానన్ద లక్షణే.
భావశూన్యే మనోతీతే శివే నిత్యం గుణోదయే ।
విలీయ మానసే తస్మిన్ చ్చిష్యాత్మానం విభావయేత్.
మొదటిది ప్రాణసంయోగ స్వరూపము. రెండవది హృదయాది క్రమమున ఉచ్చరింపబడిన మంత్రము. మూడవది సుషుమ్నానుగ తనాదరూపము. నాడీసంబద్ద మగు నాదము శ క్తిలో లీనమగుటకు ప్రశాంత విషువ మని పేరు. “శక్తిలో లీన మైన నాదము పునరుజ్జీవితమై పైకి సంచారము చేసి, సమతలో లయము అయినచో అది శక్తి యను విషువము, సంపూర్ణ వాదము శక్తిసీమను లంఘించి, ఉన్మనీలో లీనమైనచో ఆలవిఘవము, “ఆరవ దగు ఇది శక్యతీతము. ఏడవ విషువము తత్వసంజ్ఞకము”, ఇదియే యేజనాస్థానము. పూరక కుంభకములు చేసి, ముఖము కొంచెము తెరిచి, మెల్ల మెల్లగా మూల మంత్రము నుచ్చరించుచు శిష్యాత్మలయ భావనచేయవలెను. దానిక్రమము ఆడిషడధ్వప్రాణరూపమును విద్యుత్సదృశము అగు షడధ్వల ప్రాణరూపముగ పట్కారమునుచింతన చేయవలెను. అది నాభికి పైన జానెడు దూరమునందు ఉండును దాని పైన హృదయమునుండి నాలుగు అంగుళముల దూరమునందు ఆకారమును చింతన చేయవలెను. దాని పైన ఎనిమిది ఆంగుళ మల దూరమున విష్ణుపాచక మరుగు ఉకారము, దాని పైన నాలుగు అంగుళముల దూరమున తాజస్థానమున రుద్రవాచక కొరమీను ఉండును. లలాటమధ్యమున ఈశ్వరవాచక మగు బిందువు ఉండును. లలాటము పైన బ్రహ్మరంధ్రము వరకును వాదమయు డగు సదాశివు డుండును. శ క్తి కూడ అచటనే యుండును. ఈ తత్త్వముల నన్నింటిని క్రమముగ చింతన చేయుచు, త్యజించి చివరికి శక్తి తత్త్వమును కూడ త్యజించవలెను. అచటనే దివ్యపిపీలికాస్పర్శానుభవము పొంది లలాటము పైన పరమతత్త్వము, పరమానందస్వరూపము, భావశూన్యము, మనోతీతము, నిత్యము గుణోదయశాలి అగు శివతత్త్వమునందు శిష్యాత్మ విలీనమై నట్లు భావన చేయవలెను.
వింభుఞ్చన్ సర్పిషో ధరాం జ్వాలా నేపి పరే శివే ।
యోజనికాస్థిరత్వాయ వౌషడంత శీవాణునా.
దత్త్వ పూర్ణాం విధానేన గుణాపాదనమాచరేత్.
ఓం హాం ఆత్మనే సర్వజ్ఞో భవ స్వాహా. ఓం హాం ఆత్మనే పరితృప్తో
భవ స్వాహా, ఓం, హుం ఆత్మనే అనాదిబోధో భవస్వాహా. ఓం హోం
ఆత్మనే స్వతనో భవ స్వాహా, ఓం హౌం ఆత్మనే అలు ప్రశ కిర్భవ స్వాహా.
ఇత్తం షడ్గణమాల్మానం గృహీత్వా పరమాక్షరాత్.
లిథినా దాత ప్రేతః శిష్యదేహ నియోజయేత్ ।
తీవ్రేణుక క్రికంపాతజనితత్రను స్తయే.
శిష్యశూర్ధని విద్య స్యే డర్యాడమృతబిన్దుకమ్।
ప్రణమయ్యేళకుమ్ళాడీజ్ఛి వాద్దక్షిణమణలే.
సౌమ్య క్రం వ్యవసాప్య శిష్యం ఢక్షిణమూత్మనః।
త్వయైవాను గృహీతోడుంమూ డ్రైమాస్థాయ మాముకిమీ.
డేతే వహ్నౌ గురౌ తస్మాద్భక్తం చాప్యస్య వర్ధయ ।
ఇతి విజ్ఞాన్య దేవేశం ప్రణమ్యచ, గుడుః ద్వయమ్
తతః షడ్రమయా భక్త్యా ద్వ దేవేష్టపుష్పికామ్ ।
ఫుత్రకం శివకుమ్భేన సంస్నాఫ్య విసృజేన్మఖమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నిర్వాణ దీక్షావిధిర్నా మాష్టా శీతితమోధ్యాయః.
పరమశివునియందు యోనిస్థిరత్వముకొరకై “ఓం నమః శివాయ వౌషట్” అను మంత్ర ముచ్చరించుచు అగ్ని జ్వాలలో మృతధార విడచుచుండవలెను. పిదప విథిపూర్వకముగ పూర్ణాపత్రి ఇచ్చి గుణపాదనము చేయవలెను. పిదప విధిపూర్వకముగ పూర్ణాహుతి ఇచ్చి గుణపాదనము చేయవలెను. అందులకై “ఓం హం ఆత్మ నే సర్వజ్ఞో భవ స్వాహా ఇత్యాది మంత్రములను (మూలములో ఉన్నవి) పఠించుచు ఆగ్నిలో హోమము చేయవలెను. ఈ విధముగ షడ్గుణసంపన్న మగు ఆత్మను వరమశివునినుండి గ్రహించి, యథావిధిగా, శిష్యుని శరీరమునందు కూర్చినట్లు భావన చేయవలెను. తీవ్రము, మందము అయిన శ క్తిపాతముచే కలిగిన శ్రమ కాంతించుటకై శిష్యుని శిరముపై న్యాసపూర్వకముగ అమృతబిందువు ఉంచ వలెను. ఈశానకలశాదిరూపమున పూజింపబడిన శివస్వరూపకలశములకు నమస్కారము చేసి, దక్షిణమండలమునందు, శిష్యుని తనకు కుడి ప్రక్కన ఉత్తరాభిముఖునిగా కూర్చుండబెట్టి దేవేశ్వరు డైన ఈశ్వరుని ఈ విధముగా ప్రార్థించవలేను. “ప్రభూ! నా శరీరమునం దుండి నీవే ఈజీపుని అనుగ్రహించినావు. అందుచే దేవా! వీనికి దేపతా-అగ్ని-గురువులందు శక్తిని అధికము చేయుము.” ఈ విధముగ ఫ్రార్థించి శివునకు నమస్కరించిన పిదప గురుపు శిష్యునకు ఆదరపూర్వక ముగా “నీకు శుభమగుగాక “ ఆని ఆశీర్వదించవలెను. పిమ్మట శివునకు భక్తితో ఎనిమిది పుష్ఫములు సమర్పించి శివకల శములోని ఉదకముతో శిష్యునకు స్నానము చేయించి యజ్ఞ సమాప్తి చేయవలెను.
అగ్ని మహాపురాణమునందు నిర్వాణదీక్షావర్ణన మను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 88 of the Agni Purāṇa is as follows:
This chapter describes the purification of the highest kalā — the śāntyatīta (beyond śānti), the fifth cosmic level associated with the space element and the grace-bestowing function of Sadāśiva. The 8 bhuvana-s of this kalā represent the innermost circle of creation, closest to Śiva's own nature. The presiding deity is Sadāśiva — the eternally auspicious supreme — and the turīyātīta-avasthā (the state "beyond the fourth") — pure, unconditioned Śiva-consciousness — is the realization associated with this level. The yoga of seven viṣvara (cosmic breaths) — from prāṇa-saṃyoga through to śaktyatīta — is described as the guru's method for leading the śiṣya's consciousness from the gross breath to the transcendent level. The chapter climaxes with the śikhā-chedana (the symbolic cutting of the śiṣya's top-knot), the conferring of the ṣaḍguṇa-prāpti (attainment of six divine qualities), and the final śivakalaśa-abhiṣeka bathing the newly liberated śiṣya with waters from the Śiva kalaśa.