అగ్ని రువాచః
జ్యోతిఃశాస్త్రాదిసారం చ వక్ష్యే యుద్ధజయార్ణవే ।
వేలామన్త్రౌషధాద్యం చ యథోమామీశ్వరోఽబ్రవీత్.
దేవ్యువాచః
దేవైర్జితా దానవాశ్చ యేనోపాయేన తద్వద ।
శుభాశుభవివేకాద్యం జ్ఞానం యుద్దజయార్ణవమ్.
ఈశ్వర ఉవాచః
మూలదేవేచ్చయా జాతా శక్తిః పఞ్చదశాక్షరా ।
చరాచరం తతో జాతం యమారాధ్యాభిలార్థవిత్.
మనపీఠం ప్రవక్ష్యామి పఞ్చమన్త్రసముద్భవమ్ ।
తే మన్త్రాః సర్వమన్త్రాణాం జీవితే మరణే స్థితాః.
ఋగ్యజుఃసామాథర్వాఖ్యవేదమన్త్రాః క్రమేణ తే ।
సద్యోజాతాదయో మన్త్రాః బ్రహ్మ విష్ణుశ్చ రుద్రకః.
ఈశః సప్తశిఖా దేవాః శక్రాద్యాః పఞ్చ చ స్వరాః ।
ఆ ఇ ఉ ఏ ఓ కలాశ్చ మూలం బ్రహ్మేతి కీర్తితమ్.
కాష్ఠమధ్యే యథా వహ్నిరప్రవృద్ధోన దృశ్యతే ।
విద్యమానా తథా దేహే శివశక్తిర్న దృశ్యతే.
ఆదౌ శక్తిః సముత్పన్నా ఓఙ్కారస్వరభూషితా ।
తతో బిన్దుర్మహాదేవీ ఏకారేణ వ్యవస్థిత.
జాతో నాద ఉకారస్తు నదతే హృది సంస్థితః ।
ఆర్ధచన్ద్ర ఇకారస్తు మోక్షమార్గస్య బోధకః.
ఆకారో వ్యక్త ఉత్పన్నో భోగమోక్షప్రదః పరః ।
ఆకార ఐశ్వరే భూమిర్నివృత్తిశ్చ కలా స్మృతా.
గన్దో నబీజః ప్రాణాఖ్య ఇడాశ క్తిః స్థిరా స్మృతా ।
ఇకారశ్చ ప్రతిష్ఠాఖ్యో రసో పాలశ్చ పిఙ్గలా.
క్రూరా శ క్తిరీం బీజః స్యాద్ధరబీజోఽగ్నిరూపవాన్ ।
విద్యా సమానా గాంధారీ శక్తిశ్చ దహనీ స్మృతా.
ప్రశాన్తిర్వాయోః స్పర్శీయశ్చోదానశ్చలాక్రియా ।
అగ్ని దేవుడు పలికెను : శంకరుడు పార్వతికి చెప్పిన ప్రకారము నే నిపుడు యుద్ధజయార్ణవప్రకరణసార మైన సమయమును, మంత్రమును, ఔషధములు మొదలగువాటిని వర్ణించి చెప్పెదను. పార్వతి ప్రశ్నించేను: దేవా! దేవతలు అసురులపై విజయము.. నెట్లు సాధించిరి? ఆ విషయమును. యుద్ధజయార్ణవోక్తశుభాకతవేకాదిజ్ఞానమును గూర్చి వర్ణింపుము. శంకరుడు చెప్పెను ! పరమాత్మేచ్ఛప్రకారము వదునై దుఅక్షరముల ఒక శక్తి ఆవిర్భవించినది, దాని నుండియే చరాచర జీవుల సృష్టి ఏర్పడినది. ఆ శక్తిని ఆరాధించుటచే మానవుడు అన్ని విషయములను తెలిసికొనగల్గును. ఇపుడు ఐదు మంత్రములతో ఏర్పడిన మంత్రపీఠమును వర్ణించెదను. ఆ మంత్రములు. అన్ని మంత్రముల జీవన మరణములం దున్నవి. ఋగ్యజుఃసామాథర్వవేదమంత్రములు ప్రథమమంత్రములు. సద్యోజాతమంత్రములు ద్వితీయ మంత్రములు. బ్రహ్మ విష్ణరుద్రులుతృతీయ మంత్రస్వరూపులు. ఈశ్వరుడు, సప్తశిఖలు గల అగ్ని, ఇంద్రాది దేవతలు వీరు చతుర్ధమంత్రస్వరూపులు, అ,ఇ,ఉ,ఏ,ఓ, అను ఐదు స్వరములు పంచమమంత్రస్వరూపులు. ఈ స్వరములకే మూలబ్రహ్మ అని కూడ పేరు. కజ్జలో వ్యాపించి యున్న ఆగ్ని ఆ కజ్ఞను అంటించకుండ పైకి కనబడ నట్లు శరీరమున మన్న శివశక్తిప్రతీతి జ్ఞానము లేకుండ కాజాలదు. పార్వతీ! ఓంకారస్వర విభూషిత మైన శక్తి మొదట ఆవిర్భమిచినది. తరవాత బిందువు ఏకారరూపమున పరిణత వైనది. పిదప ఓంకారమునందు శబ్ద మావిర్భవించినది. దానినుండి ఉకార మావిర్భవించినది. ఈ ఉకారము హృదయములో శబ్దము చేయుచు ఉండును. ఆర్ధచంద్రునినుండి మోక్షమార్గప్రదర్శక ముగ ఇకారము ఆవిర్భవించినది. పిదప భోగమోక్షముల నిచ్చు అవ్యక్త’ఆ’కారము ఆవిర్భవించినది. ఆ ఆకారము స్వరశక్తిమత్తు. ప్రవృత్తి నివృత్తి బోధకము. ‘ఆ’ కారము ప్రాణ (శ్వాస) రూపమున శరీరమునందు స్థిరముగా నుండును. దీనికే ‘ఇడ’ అని పేరు, ఇకారము ‘ప్రతిష్ఠ’ అను పేరుతో రసరూపమునను, పాలక స్వరూపమనను, ఉండును, దీనికే ‘పింగల’ అని పేరు. ‘ఈ’ ఆను స్వరమును కూరళ క్తియందును, హరబీజము (ఉకారము) శరీరములో అగ్ని రూపమున నుండును. ఇదియే సమానబోధిక విద్య. దీనిని ‘గాంధారి’ అందురు. దీనిలో దహనాత్మక శక్తి యున్నది. ‘ఏ’ కారము శరీరములో జలరూపమున నున్నది. దీనిలో శాంతిక్రియ యున్నది. ఓకారము శరీరములో వాయు రూపమున నున్నది. ఇది ఆపాన -వ్యావ-ఉదానాదిలించస్వరూపములను పొంది, స్పర్శ చేయుచు, గతి శీలమై యుండును.
ఓఙ్కారః శాన్త్యతీతాఖ్యః ఖశబ్దయూథపాణినః.
పఞ్చవర్గాః స్వరా జాతాః కుజజ్ఞగురుభార్గవాః ।
శనిః క్రమాదకారాద్యాః కకారాద్యాస్తధః స్థితాః.
ఏతన్మూలర్వం కుర్వం జాయతే సచరాచరమ్ ।
విద్యాపీఠం ప్రవక్ష్యామి ప్రణవః శివఈరితః.
ఉమాసోక్షః స్వతయం శ క్తిర్వామా జ్యేష్ఠా చ రౌద్ర్యపి ।
బ్రహ్మ విష్ణుః క్రమాద్రుద్రో గుణాః సర్గాదయన్త్రయః.
రత్ననాడీత్రయం చైవ స్థూలః సూక్ష్మః పరోఽపరః ।
చిన్తయేచ్ఛ్వేతవర్ణం తం ముఞ్చమానం పరామృతమ్.
ప్లావ్యమానం యథాత్మానం చిన్తయేత్తం దివానిశమ్ ।
అజరత్వం భవేద్దేవి శివత్వముపగచ్చతి.
ఆఙ్గుష్ఠాదౌ న్యసేదఙ్గాన్నేత్రం మధ్యేఽథ దేహకే ।
మృత్యుఞ్జయం తతః ప్రార్చ్య రణాదౌ విజయో భవేత్.
శూన్యో నిరాలయః శబ్దః స్పర్శం తిర్యఙ్నతం స్పృశేత్ ।
రూపస్యోర్థ్వగతిః ప్రోక్తా జలస్యాధః సమాశ్రితా.
సర్వస్థానవినిర్ముక్తో గన్ధో మద్యే చ మూలకమ్ ।
నాభిమూలే స్థితం కన్ధం శివరూపం తు మణ్డితమ్.
శక్తివ్యూహేన సోమోర్కోహరిస్తత్ర వ్యవస్థితః ।
దశవాయుసమోపేతం పఞ్చతన్మాత్రమణ్డితమ్.
కాలానలసహకారం ప్రస్ఫురన్తం శివాత్మకమ్ ।
తజ్జీవం జీవలోకస్య స్థావరస్య చరస్య చ.
తస్మిన్నష్టేమృతం మన్యే మన్త్రపీఠేఽనిలాత్మకమ్ ।
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే జ్యోతిఃశాస్త్ర సారోనామ చతుర్వింశత్యధికశతతమోఽధ్యాయః .
పంచస్వరముల సంమిలితసూక్ష్మరూప మగు ఓంకారము “శాన్యతీతము” అను పేరుతో బోధితమై శబ్దగుణక మగు ఆకాశము రూపమున నుండును. ఈ విధముగ ఏర్పడిన ఐదు స్వరములకు క్రమముగా కుజ-బుధ-గురు-శుక్ర-కనులు. కకారాదివర్ణములు ఈ స్వరములకు క్రింద నుండును. ఇవే ప్రపంచమూలకారణములు. వీటివలననే అన్ని చరాచరపదార్థముల జ్ఞానము కలుగును. ఇపుడు విద్యాపీఠస్వరూపమును చేప్పెదను. దీనియందు ఓంకారము శివరూప ముగా చెప్పబడినది. సాక్షాత్తు ఉమసోమ (అమృత) రూపిణి. ఈమెనే వామా-జ్యేష్ఠ-రౌద్రీ నామములతో కూడ వ్యవహరింతురు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులే వరుసగ మూడు గుణములు, సృష్టి-స్థితి-సంగర కారణభూతులు, శరీరములోపల మూడు రత్న నాడు లున్నవి; వీటికి స్థూల-సూక్ష్మ-పర లని పేరు. ఇవి శ్వేతవర్ణములు. వీటి నుండి సర్వదా అమృతము స్రవించుచుండును. దానిచే ఎల్లప్పుడును ఆత్మ తడుపబడుచుండును. దీనిని ఈ విధముగ దివారాత్రులు ధ్యానించవలెను. దేవీ! ఆట్టి సాధకుని శరీరము ఆజర మగును. ఆతడు శివసాయుజ్యమును పొందును? మొదట అంగుష్ఠాదులందును. నేత్రములందును, దేహమునందును అంగన్యాసము చేసి, పిదప మృత్యుంజయార్చన చేసి యాత్ర చేయువాడు యుద్దారుణందు విజయవంతు డగును. ఆకాశము శూన్యము, నిరాధారము, శబ్దగుణకము. వాయువు నందు స్పర్శగుణ మున్నది. అది అడ్డముగా ప్రసరించుచు స్పృశించును. రూపమ (అగ్ని) ఊర్ధ్వగతి గలది. జలము అధోగతి గలది. గంధగుణము గల పృథివి అన్ని స్థానములను విడచి మద్యయందుండి, అన్నింటికిని , ఆధారముగా నుండును. శివుడు నాభిమూలమునందు కంద దుంప), రూపమున నున్నాడు. శక్తి సముదాయముతో గూడ సూర్య-చంద్ర-విష్ణువులును, పంచతన్మాత్రలతో దశ ప్రాణములును అచటనే ఉన్నవి. ఆ శివమూర్తి కాలాగ్ని వలె దేదీప్యమానమై సర్వదా ప్రకాశించుచుండును. అదే చరాచర జీవలోకమునకు ప్రాణము. ఆ మంత్రపీఠము నష్టమైనపుడు వాయురూపు డగు జీవుడు నశించి నట్లు తెలిసికొనవలెను.
అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున జ్యోతిశాస్త్రసార మను నూటఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 124 of the Agni Purāṇa is as follows:
The incomparable sanctity of Kāśī, Śiva's eternal city on the Gaṅgā, is celebrated. Agni declares Kāśī to be Maheśvara's own trikhaṇḍa established before the creation of the earth and never submerged even in the pralaya. The Maṇikarṇikā ghāṭa is singled out as the place where Viṣṇu dug the kuṇḍa and filled it with his perspiration (sveda), and where Śiva himself whispers the tāraka-mantra into the ear of every dying person. Death at Kāśī is therefore not mere physical dissolution but taraka-mukti—liberation through the divine sound. The chapter lists the celebrated liṅgas of Kāśī including Viśvanātha and Kedāreśvara.