అగ్ని మహా పురాణము

286 - అధ మృత్యుంజయ కల్పాః  

ధన్వ న్తరి రువాచః

కల్పాన్మృత్యుంజయాన్వ క్ష్యే హ్యాయుర్ధా న్రోగమర్దనాన్

త్రిశతీ రోగహా సేవ్యా మధ్వాజ్య త్రిఫలామృతా.

వలం పలార్థం కర్షం వా త్రిఫలాం (లీం) సకలాంతథా

బిల్వ తైలస్య నస్యంచ మాసం పంచశతీక విః.

రోగాపమృత్యు బలిజిత్తిలం భల్లాతకం తథా

పంచాంగం వాకుచీ చూర్ణం షణ్మాసంఖదీరోద కైః .

క్వాథః కుష్ఠం జయేత్సేవ్య చూర్ణం నీలకురంటజమ్

 క్షీరేణ మధునా వాపి శీతాయుః ఖండదుగ్ధభుక్.

మధ్వాజ్య శుంఠీం సంసేవ్య పలం ప్రాతః సమృత్యుజిత్

వలీపలిత జిజ్ఞీ వేన్మాండకీ చూర్ణ దుగ్ధపాః

ఉచ్చటా మధునాకర్షం పయః పామృత్యు జిన్నరః

 మద్వాజ్యైః పయసాకాపి నిర్గుండీ రోగమృత్యుజిత్.

పలాశ తైలం కర్షైకం షణ్మాసం మధునాపిబేత్

దుగ్ధ భోజీ పంచశతీ సహస్రాయుర్భవేన్నరః.

జ్యోతిష్మతీ పత్రరసం పయసా త్రిఫలాం పిబేత్

మధునాజ్యం తత స్తద్వచ్ఛతావర్యా రజఃఫలమ్.

క్షౌద్రాజ్యైః పయసా వాపి నిర్గుండీ రోగమృత్యుజిత్

పంచాంగం నిమ్బ చూర్ణస్య ఖదీర క్వాథ భావితమ్.

కర్షం భృంగర సేనాపి రోగజిచ్చామ రోభవేత్

రుదంతికాజ్య మధుభుగ్ధుగ్ధ భోజీచమృత్యుజిత్.

కర్ష చూర్ణం హరీతక్యా భావితం భృంగరాడ్ర సైః

ఘృతేన మధునాఽసేవ్య త్రిశతాయుశ్చ రోగజిత్.

వారాహికా భృంగరసం లోహచూర్ణం శతావరీ

సాజ్యం కర్షం పంచశతీ కార్త చూర్ణం శతావరీ.

భావితం భృంగరాజేన మధ్వాజ్యం త్రిశతీభవేత్

తా మ్రంమృతం త్రివృత్తుల్యం గంధకంచ కుమారికా.

రసైర్విమృజ్యద్వేగుంజే సాజ్యం పంచశాతాబ్దవాన్

 అశ్వగంధపలం తైలం సాజ్యంఖండం శతాబ్దవాన్. 

ధన్వంతరి చెప్పెను. ఆయుర్దాయ ప్రదములు రోగ వినాశ కములగు మృత్యుంజయ కల్పములను చెప్పెదను. మధు, మృత, త్రిఫలా, అమృతములు మూడు వందల రోగములను తొలగించును. త్రివలను నాలుగు లేదా రెండు లేదా ఒక తులములు సేవించవలేను. ఒకమాసము, విల్వ లనగ్యము చేసికొన్న చో ఐదువందల సంవత్సరములు జీవిం చును. కవియగును. తిల, భల్లాతకములు రోగమును, అపమృత్యువును వశులను తొలగించును. వాకుచీపంచాంగ చూర్ణములను అడిరోదక ముతో ఆరుమాసములు సేవించినచో కుష్ఠము నశించును. నీలకురంట చూర్ణమును క్షీరముతోగాని. మధువుతోగాని సేవించిన మంచిది. ఖండ దుర్గ వణను పానము చేయువాడు, నూరు సంవత్సరములు జీవించును. మధు ఆజ్య శంథులను, ప్రతి దినము ప్రాతఃకాలము, ఒక పలము సేవించువాడు మృత్యువును జయించును. మాండకీ చూర్ణముతో క్షీరము సేవించువానికి వకులు, పలితము వుండదు. ఉచ్చటను, మధువుతో ఒక కర్తమా, తిని క్షీరపానము చేయువాడు, మృత్యువును జయించును, మధుమృతముతో గాని, క్షీరముతోగాని, నుర్గండిరసమును సేవించువాడు రోగ మును మృత్యువును జయించును. ఒక తులము పలాశ తైలమును మధువుతో ప్రతిదినము ఆరుమాసములు, , సేవించుచు, దుగ్గము త్రాగువాడు ఐదువందల సంవత్సరములు జీవించును. పాలతో కూడ జ్యోతిష్మతి పత్రరసమునుగాని త్రివలను గాని త్రాగువాడు వెయ్యి సంవత్సరములు జీవించును. మధువుతో ఘృతము, వాలుగు తులముల శతావరి చూర్ణము, సేవించు వాడు, సహస్ర వర్ష జీవియగును నిర్గుండిని, మధు మృతములతోగాని, పాలతో గాని సేవించిన రోగమృత్యువు లను నశింపచేయును. పంచాంగ నింబరసమును ఐదీర క్వాథముతో భావన చేసి భృంగరాజ రసముతో ఒక తులము సేవించినచో రోగములను జయించి అమర్త్యుడగును. రుదంతికా చూర్ణమును మృతమధువులతో గాని దుగ్గ ముతో గాని సేవించువాడు, మృత్యువును జయించును. హరీతకీ చూర్ణమును భృంగరాజరసముతో భావ నచేసి మృతమధువులతో సేవించినచో రోగముక్తుడై మూడువందల సంవత్సరములు జీవించును. వారాహికా భృంగ ర సలోహ చూర్ణ శతావరీ, ఆజ్యములను ఒక తులము సేవించినచో అయిదువందల సంవత్సరములు జీవించును. లోహ భస్మను శతావరిని భృంగరాజ రసముతో భావన చేసి మధుమృతములతో సేవించినవాడు మూడువందల సంవత్సరములు జీవించును. తామభస్మ, అమృతాత్రివృత్, గంధకములను సమముగ గ్రహించి కుమారికా రసముతో రెండుగురివిందెల గోలీలు తయారు చేసి ఘృతముతో సేవించుటచే ఐదువందల సంవత్సరములు జీవించును. ఆశ్వగంధ; త్రిఫలాశర్కర, తైల ఘృతములను సేవించువాడు నూరు వర్షములు జయించును.

పలం పునర్న వాచూర్ణం మధ్వాజ్యపయసా పిబన్

అశోకచూర్ణస్య పలం మధ్వాజ్యం పయసార్తినుత్.

తిలస్య తైలం సమధునస్యాత్కృష్ణ కచః శతీ

కర్షమక్షం సమధ్వాజ్యం శతాయుః పయసాపిబన్.

ఆభయాం సగుడాం జగ్ధ్వా ఘృతేన మధురాదిభిః

దుగ్ధాన్న భుక్కౄష్ణ కేశోఽరోగి పంచశతాబ్దవాన్.

పలం కూష్మాండికా చూర్ణం మధ్వాజ్య పయసా పిబన్

మాసం దుగ్ధాన్న భోజీ చ సహస్రాయుర్విరోగవాన్.

శాలూక చూర్ణం భృంగాజ్యం సమధ్వాజ్యం శతాబ్దికృత్

కటుతుంబీ తైలనస్యం కర్షంశత ద్వయాబ్దవాన్.

త్రిఫలా పిప్పలీ శుంఠీ సేవితా త్రిశతాబ్దకృత్

శతావర్యాః పూర్వయోగః సహస్రాయుర్బలాదికృత్.

చిత్ర కేణ తథా పూర్వ స్తథా శుంఠీ విడంగతః

లోహేన భృంగరాజేన వలయానింబ పంచకైః

ఖది రేణ చ నిర్గుండ్యా కంఠ కార్యథ వాసకాత్

 వర్షాభువాతద్ర సైర్వాభావితో వీటి కాకృత.

చూర్ణం ఘృతై ర్వామధునా గుడాద్యైర్వారిణా తథా

ఓంహ్రూంస ఇతిమంత్రేణ మంత్రితో యోగరాజకః.

మృతసంజీవనీ కల్పో రోగమృత్యుంజయో భవేత్

సురాసురైశ్చ మునిభిః సేవితాః కల్పసాగరాః.

గజాయుర్వేదం ప్రోవాచ పాలకాప్యోంఽగ రాజకమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మృత్యుంజయ కల్పో నామ షడశీత్యధిక ద్విశతతమోఽధ్యాయ. 

అశోక వృక్షము బెరడు యొక్క చూర్ణమును మధు ఘృతములతో సేవించి దుగ్గ పానము చేయుటచే రోగములు నశించును. పునర్నవా చూర్ణమును మధు ఆజ్య క్షీరములతో సేవించిన పోడు రోగ విముక్తుడగును. మధు సహిత మగు తిల తైలమును నశ్యముగ తీసుకొన్న చో శత వర్ష జీవి యగును. కృష్ణ కేశములు కలవాడు యగును. ఆక్ష చూర్ణమున ఒక తులము మధ్వాజః క్షీర ములతో సేవించిన శరాయువగును, ఆభయా గుడములను మధురాది ఓషధులను ఘృతముతో తిని, పాలతో అన్నము భుజించు వాని కేశములు సర్వదా కృష్ణ వర్ణములై యుండును. ఆతడు రోగ రహితుడై అయిదు వందల సంవత్సరములు జీవించును. ఒక పలము కూష్మాండ చూర్ణమును మృత దుగ్గములతో ఒక మాసము సేవించుచు దుర్గాన్న భోజనము చేయువాడు రోగరహితుడై సహస్ర వర్ష జీవియగును కౌలుక చూర్ణమును భృంగాజ్యమును మడమృతము లతో సేవించిన వాడు నూరు సంవత్సరములు జీవించును. ఒక తులము కడుతుంటే తైలమును నశ్యముగా గ్రహించు వాడు రెండు వందల సంవత్సరములు జీవించుమ. త్రిఫలా పిప్పలి కుంతుల సేవనము మూడు వందల సంవత్సరము ఆయుర్దా యము నిచ్చును. వీటిని శతావరితో కలిపి సేవించినచో బలమును, సహస్రాయువును ఇచ్చును. చిత్ర శుంఠి విడంగముల సేవనము పూర్వోక్తి ఫలమును ఇచ్చును. త్రిఫలా, పిప్పల శుంఠులను లోహ భృంగరాజ, నింబ పంచక, ఖదిర నిర్గుండి, అంటకారి వాసక పునర్నవలతో గాని, వీటి రసముతో భావవ చేసి కాని, వటి లేదా చూర్ణము తయారు చేసి మృత మధుగుడ జలాదులతో సేవించినచో పూర్వోక్త ఫలము లభించును. "ఓం హ్రూంసః" అను మంత్రముచే అభి మంత్రిత మగు యోగ రాజము మృత్యు సంజీవని సమానమై రోగములను మృత్యువులను జయింప చేయును. ఈ కల్ప సాగరములను దేవతాసుర మునులు సేవించిరి. పాలకాప్యుడు అంగరాజునకు గజాయుర్వేదము బోధించెను.

ఆది మహాపురాణమున మృత్యుంజ కల్పమను రెండు వందల యెనుబది ఆరవ అధ్యాయము సమాప్తము.