అగ్నిగువాచః-
ఏకాంగాం దశగుర్దర్యాద్దశ దద్యాచ్చ గోశతీ ।
శతం సహసగుర్తద్యాత్సర్వే తుల్య ఫలా హీ తే.
ప్రాసాదా యత్ర సౌవర్ణ వసోర్దారా చ యత్ర సా ।
గంధర్వాపర సో యత్ర తత్ర యా న్తి సహస్ర .
గవాం శతప్రదానేన ముచ్యతే నర కార్ణ వాత్ ।
దత్వా వత్సతరీం చైవ స్వర్గలో కే మహీయతే.
గోదానాదాయురారోగ్యం సౌభాగ్యస్వర్గమాప్నుయాత్ ।
ఇన్గాదిలోక పొలానాం యా రాజమహిషి శరా.
మహిషీ దానమాహాత్మ్యాదస్తు మే సర్వ కామదా ।
ధర్మరాజస్య సాహాయ్యే యస్యాః పుత్రః ప్రతిష్టితః.
మహిషాసురన్య జననీ యా సాస్తు వరదా మమ ।
మహిషీ దానాచ్చ సౌభాగ్యం వృషదానాద్దివం వ్రజేత్.
ఆగ్ని దేవుడు చెప్పెను : వసిష్ఠా! పది గోవు లున్న వాడు ఒక గోవును, నూరుగోవులున్న వాడు పదిగోవులను, వెయ్యి గోవు లున్న వాడు నూర గోవులను దానము చేయగా వారికి లభించు ఫలము సమముగనే ఉండును. కుబేరుని రాజధాని యగు అలకాపురియందు ఉన్న సువర్ణనిర్మిత భవనమున గంధర్వులును, అప్పర సలును విహరించుచుందురు. సహస్రగోదానము చేసినవాడు ఆచటికి వెళ్లను. శతగోదానములు చేసినవాడు నరక సముద్రము నుండి విముక్తు డగును. వత్పదానము చేసినవాడు స్వర్గమున పూజింపబడును. గోదానము చేయుటచే దీరాయురారోగ్యసౌభాగ్యములు లభించును. స్వర్గము ప్రాప్తించును. ఈ క్రింది మంత్రము చదువుచు మహిషిదానము చేయుటచే సౌభాగ్యము లభించును “ఇంద్రాది లోకపాలుల మంగళమయజమహిషి యైన దేవి ఈ మహిషీ దానము చేసిన పుణ్యముచే నాకు సకలాభీష్టవస్తువులను ఇచ్చుగాక. ఏ మహిషి పుత్రుడు యమధర్మరాజునకు సహాయుడుగ నియుక్తుడై నాడో, ఏ మహిషి మహిషాసురుని తల్లియో ఆ దేవి నాకు వరములనొసంగుగాక! వృషభదానముచే మనుష్యుడు స్వర్గమును పొందును.
సంయుక్తహలపజ్త్యాఖ్యం దానం సర్వఫలప్రదమ్ ।
పజ్త్కిర్దశహలా ప్రోక్తా దారుజా వృషసంయుతా.
సౌవర్ణపట్టసన్న దాన్ దత్త్వా స్వరే మహీయతే ।
దళానాం కపిలానాం తు దత్తానాం జ్యేష్ఠపుష్కరే.
తత్ఫలం చాడ్యం ప్రోక్తం వృషభస్య తు మోక్షణే ।
ధర్మోఓసి త్వం చతుష్పాదశ్చతసస్తే ప్రియా ఇమాః.
నమో బ్రహ్మణ్య దేవేశ పితృభూతరిపోషక ।
త్వయి ము కేఒక్షయా లో కా మమ సత్తు నిరామయాః.
మా మే ఋణీస్తు దైవత్యో భీతఃవైడ్రోథ మానుషః ।
ధర్మ స్వం త్వత్పపన్న స్య యా గతిః సాస్తు మే ధ్రువా.
అజయేచ్చక్రశూలాభ్యాం మ శ్రేణానేన చోత్సృజేత్।
ఏకాదశాహే పేతస్య యస్య చోత్సృజ్యతే వృషః.
ముచ్యతే పేతలో కాత్తు షణ్మా నే చాబ్దికాదిషు ।
దళహస్తేన కుణేన త్రింశత్కుణాన్ని వర్తనమ్.
లాన్యేవ దశ విస్తారాదోచర్మైతతదేమభిత్ ।
గోభూహిరణ్యసంయుక్తం కృష్ణాజినం తు యేర్పయేత్.
సర్వదుష్కృతకర్మాపి సాయుజ్యం బ్రహ్మణో వ్రజేత్ ।
భాజనం ఆలసంపూర్ణం మధునా పూర్ణమేవ చ.
దద్యాత్కృష్ణతిలానాం చ ప్రస్థమేకం చ మాగధమ్ ।
శయ్యాం దత్త్వా తు సగుణాం భుక్తిముక్తిమవాప్నుయాత్ .
“సంయుక్తహలపంక్తి” యను దానము సమస్త ఫలప్రదము. కఱ్రతో తయారు చేసిన పది నాగళ్ళ పంక్తిని సువర్ణమయ మగు పట్టిక తో ఒకదానితో ఒకటి కట్టవలెను. ఒక్కొక్క హలముతో ఆవశ్యక సంఖ్యలో వృషభము లండ వలెను. వాటి దానము “సంయుక్తహలపంక్తి దానము”. ఈ దానము చేసినవాడు స్వర్గమున పూజించబడును. జ్యేష్ట పుష్కర తీర్థమునందు పది కపిలగోవుల దానము చేసినచో దాని ఫలము అక్షయము. వృషోత్సర్గముచేత గూడ అక్షయ ఫలము లభించును. ఆబోతకు చక్ర-త్రిశూలముద్రలు వేసి “దేవేశ్వరా! నీవు సాక్షాత్తు నాలుగు పాదములు గల ధర్మ దేవతవు. ఈ నాలుగు నీ ప్రియతమలు, పితృ-మమష్య-ఋషులను పోషించు ఓ వేదమూర్తి యైవ వృషభమా! నిన్ను విడచుటచే నాకు ఆమృతమయము లగు శాశ్వతలోకములు ప్రాప్తించుగాక. దేవ-భూత-పితృ ఋణముల నుండి విముక్తుడ నగుదును గాక. నీవు సాక్షాత్తు ధర్మము. నిన్ను ఆశ్రయించువారికి కలుగు గతి నాకు ప్రాప్తించు గాక” అని పఠించుచు విడువవలెను. మృతుని ఏకాదశ-షాణ్మాసిక - వార్షిక శ్రాద్ధములలో ఒక దానియందు వృషోత్సర్గము చేసినచో ఆతడు పేత లోకము నుండి విముక్తు డగును. పది హస్తముల దండములు మొదలు ముప్పది హస్తముణదండనలకు సమాన మైన భూమి “నివర్తనము: పది నివర్తనముల భూమి “గోచర్మము”. అంత భూమి దానము చేసినవాడు తన సమ స్తపాపములను నశింప చేసికొనును. గో-భూ-సువర్ణ యుక్త కృష్ణమృగచర్మ ను దానము చేసినవాడు ఎన్ని పాపములు చేసినవాడై నను, బ్రహ్మ సాయుజ్యమును పొందును. తిలములతోను, మధువుతోను నింపిన పాత్రను, మగధదేశీయమానానుసారము ఒక ప్రస్థము కృష్ణతిల లను దానము చేయవలెను దీనితో పాటు ఉత్తను మగు శయ్యను కూడ దానము చేయుటచే దాత భుక్తిముక్తులను పొందును.
హైమీం ప్రతికృతిం కృత్వా దత్త్వా స్వర్గస్తథాత్మనః ।
విపులం తు గృహం కృత్వా దత్తాస్యాద్భు క్తిముక్తిభాక్ .
గృహం మఠం సభాం స్వర్గీ దత్వా స్వాచ్చ ప్రతిక్రయమ్ ।
దత్త్వా కృత్వా గోగృహం చ నిష్పాపః స్వర్గమాప్నుయాత్.
యమమాహిషదానాత్తు నిష్పాపః స్వర్గమాప్నుయాత్ ।
బ్రహ్మ హరే హరిర్డీవై ర్మధ్యే చ యమదూతకః.
పాశీ తస్య శిరశ్ఛిత్వా తం దద్యాత్స్వర్గభాగ్భవేత్ ।
త్రిముఖాఖ్యమిదం దానం గృహీత్వా తు ద్విజో మధాక్ .
చక్రం రూప్యమయం కృత్వాక్కే ధృత్వా తత్పదాపయేత్ ।
హేమయుక్తం ద్విజాయేతత్కాలచక్రమిదం మహత్.
ఆత్మతుల్యం తు యో లౌహం దదేన్న నరకం వ్రజేత్ ।
పఞ్చతత్పలసంయుక్తం లౌహదణ్ణం తు యోర్పయేత్ .
వస్రణాచ్ఛాద్య విప్రాయ యమదజ్జో న విద్యతే।
మూలం ఫలాది వా ద్రవ్యం సంహతం వాథ చైకశః.
మృత్యుజ్ఞయం నముద్దిశ్య దద్యాదాయుర్వివృద్ధయే ।
పుమాన్ కృష్ణతిలైఃకార్యో రౌప్యద న్తః సువర్ణదృక్.
అణోద్యతక రో దీర్ఘ జపాకుసుమమజ్జలః ।
రక్తామ్బరధరః సర్వీ శ ష్ణమాలావిభూషితః.
ఉపానద్యుగయుక్తాః కృష్ణకమలపార్శ్వకః ।
గృహీతమాంసపిణశ్చ వామే వై కాలపూరుషః.
సంపూజ్య తం చ గన్టాద్యైః బ్రాహ్మణా యోవపాద యేత్ ।
మరణ వ్యాధిహీనః స్యాద్రాజరాజేశ్వరో భవేత్.
గోవృషా తు ద్విజే దత్త్వా భుక్తిముక్తిమవాప్నుయాత్ ।
రేవస్త్రాధిష్ఠితం చాక్వం హైమం దత్త్వా న మృత్యుభాక్ .
మణ్టాదిపూర్ణమ ప్యేకం దత్త్వా స్యాద్భుక్తిముక్తిభాక్ ।
స్వర్ణముతో తన ప్రతిమ చేయించి దానము చేయువాడు స్వర్గమును పొందును విశాల మగు ఇల్లు కట్టించి దానము చేయువాడు భోగ మోక్షములను పొందును. గృహమును, మఠమును, ధర్మశాలను, ఆవాసస్థానమును దానము చేసిన వాడు స్వర్గమున సుఖము లనుభవించును. గోశాల నిర్మించి దానము చేయువాడు పాపరహితుడై స్వర్గము పొందును. యమునికి సంబంధించిన మహిషమును దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గము పొందును. దేవతాసహితు లగు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పాశధారి యగు యమదూత మూర్తి స్థాపించి ఆ యమదూత శిరస్సు ఖండించి ఆ మూర్తితో కూడిన మండలమున బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేయుటచే దాత స్వర్గమునకు వెళ్లును గాని, ఆ ‘త్రిముఖ’ మను దానము పట్టిన బ్రాహ్మణుగకు పాపము సంక్రమించును, వెండి చక్ర మొకటి చేయించి, దానిని నీటిలో నుంచి దాని నిమిత్తము హోమములు చేసి, దానిని బ్రాహ్మణునకు దానము చేసినచో అది “కాలచక్ర దానము”. తన బరువుతో సమాన మై బరువు గల ఇనుము దానము చేయువాడు నరకమున పడడు. ఏబది పలమాల లోహదండమును వస్త్రము చుట్టి దానము చేయువానికి యమదండ భయ ముండదు. దీర్ఘాయువును కోరువాడు మృత్యుంజయుని ఉద్దేశించి ఫలములు, మూలములు, ద్రవ్యము అన్నింటిని ఒక్కసారిగాని, వేరువేరుగా గాని దానము చేయవలెను. కృష్ణతిలలతో పురుషుని చేసి వెండి దంతములు, బంగారు కళ్లు అమర్చవలెను. మాలను ధరించి దీరాకారముతో నున్న ఆ పురుషుని కుడి చేతిలో ఎత్తిన ఖడ్గ ముండవలెను. ఎఱ్ఱని వస్త్రములు, జపాపుష్పములు, శంఖమాల ధరించి యుండవలెను. రెండు పాదములందు పాదుకలు, పార్శ్వమున నల్లని కంబళి ఉండవలెను. ఎడమ చేతిలో మాంసపిండ ముండవలెను. ఈ విధముగ కాలపురుషుని నిర్మించి గంధాది ద్రవ్యములచే పూజించి, బ్రాహ్మణునకు దానమీయవలెను. ఇట్లు చేసిన దాత త్యాధి మృత్యురహితుడై రాజరాజేశ్వరు డగును. బ్రాహ్మణునకు రెండు ఎద్దులు దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును.
సర్వకామానవాప్నోతి యః ప్రయచ్ఛతి కాఞ్చానమ్.
సువర్ణే దీయమానే తు రజతం దక్షిణేష్యతే ।
ఆన్యేషామపి దానానాం సువర్ణం దక్షిణా స్మృతా.
సువర్ణం రజతం తామం తజ్ఞులం ధాన్యమేవ చ ।
నిత్యశ్రాద్ధం దేవపూజా సర్వమేతదద జమ్.
రజతం దక్షిణా పిత్రే ధర్మకామార్థసాధనమ్ ।
సువర్ణం రజతం తామ్రం మణిముక్తావసూని చ.
సర్వమేతన్మహాప్రాజ్ఞో దదాతి వసుధాం దదత్ ।
పితృంశ్చ పితృలోక స్థానేవస్థానే చ దేవతాః.
సన్తర్పయతి శాస్తాల్మా యో దదాతి వసున్దరామ్ ।
ఖర్వటం ఖేటకం వాపి గ్రామం వా సస్యశాలినమ్.
నివర్తనశతం వాపి తదర్గం వా గృహాదికమ్ ।
ఆపి గోచర్మమాత్రాం వా దత్త్వార్వీం సర్వభాగ్భవేత్.
జై లబిన్దుర్యథా చాప్సు ప్రసర్పేద్భూగతం తథా ।
సర్వేషా మేవ దానానా మేక జస్మౌనుగం ఫలమ్.
హాటక క్షితి గౌరీణాం సప్తజన్మానుగం ఫలమ్ ।
త్రిసప్తకులముద్దృత్య కన్యాదో బ్రహ్మలోక భాక్.
గజం సదక్షిణం దత్త్వా నిర్మలకి స్వర్గ భాగ్భవేత్ ।
ఆశ్వం దత్త్వాయురారోగ్యసౌభాగ్యం స్వర్గమాప్నుయాత్.
దాసీం దత్త్వా ద్విజేన్గాయ ఆపుకోలేక మాప్నుయాత్ ।
దత్త్వా తామమయీం స్థాలీం పలానాం పణ్చ భిః శతైః.
అర్ద్రైస్తదర్ద్రైరర్ద్రైర్వా భు క్తిము క్తిమవాప్నుయాత్ ।
సువర్ణ దానమును చేయువానికి అభీష్టవస్తుసిద్ధి యగును. సువర్ణదానము సఫల మగు టకు వెండి దక్షిణ ఇవ్వ వలెను. అన్యదానముల సాద్గుణ్యము నిమిత్తము ను వర్ణదక్షిణ మంచిది. సువర్ణమే కాక రజతము, తామ్రము, తండు లములు ధాన్యములు కూడ రక్షణకు తగినవి. నిరః శ్రాద్ధ నిత్యదేవపూజాదు ఎందు దక్షిణ ఇవ్వవలసిన పని లేదు. పితృకార్యమునందు ర జతదక్షిణ ధర్మార్థ కామప్రదము. భూమి దానము చేసి బుద్ది కుంకుడు సువర్ణ - రజత - తామ్ర మణి - ముక్తాదుల దానము కూడ చేసిన ఫలము పొందును. భూదానము చేసిన శాంతచిత్తుడు పితృలోకములో నున్న పితృ దేవగలను, దేవలోకములో నున్న దేవతలను గూడ పూర్తిగా సంతృప్తిపరచును. సస్యములతో నిండి గరున్న చిన్న పల్లె, గ్రామము, ఖర్వటము, నూరు నివర్తనముల ప్రమాణము లేదా దానిలో సగము ప్రమాణమున నిర్మించిన గృహాదికము గోచర్మప్రమాణము గల (పది నివర్తనము) భూమి దానము చేసినవాడు అన్ని యు పొందును. తైలబిందువు నీటిపై గాని, భూమి పై గాని పడి వ్యాపించి నట్లు అన్ని దానముఫలము ఒక జన్మవరకును ఉండును. స్వర్గ - భూ - గౌరీకన్యా దానఫలము ఏడు జన్మల వతకును స్థిరముగా నుండును. కన్యాదానము చేసినవాడు ఇరువది యిక్క తరములను నరకము నుండి ఉద్దరించి, బ్రహ్మలోకమును పొందును. దక్షిణా సహితముగ గజ దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గమును చేరును. అశ్వదానము చేయుటచే దీర్ఘాయురారోగ్య సౌభాగ్య - స్వర్గములను పొందును. శ్రేష్ఠ బ్రాహ్మణులకు దాసీదానము చేయువాడు ఆప్సరస్రాలలోకమున సుఖము లనుభవించును. ఐదువండు పలములు లేదా రెండువందల ఏబది పంములు, నూటఇరువదియైదు పలములు, లేదా వాటిలో సగము పలములు బరువు గల తా మ్రపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తు లను పొందును.
శకటం వృషసంయుక్తం దత్వా మానేన నాకధాక్.
వస్త్రదానాల్లభేదాయురారోగ్యం న్వర్గమక్షయమ్ ।
ధాన్యగోధూమ కలమయవాదీ స్వర్గభాగ్గదత్ .
ఆసనం తై జసం పాత్రం లవణం గన్తచన్దనమ్ ।
ధూపం దీపం చ తామ్బూలం లోహం రూప్యం చ రత్నకమ్.
దివ్యాని నానా ద్రవ్యాణి దత్త్వా స్యాద్భు క్తిము క్తిభాక్ ।
తిలాంశ్చ తిలపాత్రం చ దత్త్వా స్వర్గమవాప్నుయాత్.
అన్న దానాత్సరం నా స్తి న భూతం న భవిష్యతి ।
హస్త్యశ్వరథదానాని దాసీదాసగృహాణి చ.
అన్న దానస్య సర్వాణి కలాం నార ని షోడశీమ్ ।
కృత్వాపి సుమహల్సాపం యః పశ్చాదన్నదో భవేత్ .
సర్వపాపవినిర్ముక్తో లోకానాప్నోతిచాక్షయాన్ ।
పానీయం చ ప్రపాం దత్త్వా భుక్తిం ముక్తిమవాప్నుయాత్ .
అగ్నిం కాం చ మార్గాదౌ దత్త్వా దీప్తిమవాప్నుయాత్ ।
దేవగన్దర్వనారీభిర్విమానే సేవ్యతే దివి.
ఘృతం తైలం చ లవణం దత్త్వా సర్వమవాప్నుయాత్ ।
ఛత్రోపానహకాష్ఠాది దత్త్వా స్వర్ణే సుఖీ వసేత్.
ప్రతిపత్తిథిముఖేషు విష్కుమ్బాదిక యోగ కే ।
చైత్రాదౌ వత్సరాదౌ చ హ్యశ్విన్యాదౌ హరిం హరమ్.
బ్రహ్మాణం లోకపాలాదీన్ ప్రార్చ్య దానం మహాఫలమ్ ।
వృ క్షా రామానోజనాదీన్మార్గసంవాహనాదికాన్.
పాదాభ్యజ్గాదికం దత్త్వా భు క్తిము క్తి మవాప్నుయాత్ ।
వృషభసహితశకట దానము చేసినవాడు విమానముపై స్వర్గమునకు వెళ్లను. వస్త్రదానముచే ఆయురారోగ్యములు, అక్షయస్వర్గప్రాప్తి కలుగును. ధాన్యము, గోధుమలు, ఆగ్రహాయణీ తండులములు, జొన్నలు మొదలగునవి దానము చేయువాడు స్వర్గము పొందును. ఆసనము, ధాతునిర్మితపాత్రమ, లవణము, సుగంధి చందనము ధూపదీపములు, తాంబూలము, ఇనుము, వెండి, రత్నములు, వివిధ, దివ్యపదార్థములు దానము చేయువాడు భుక్తిముక్తులను పొందును. తీలలనుతిపాత్రము దానము చేసినవాడు స్వర్గసుఖము పొందును. అన్నదానమును మించిన దాన మేదియు లేదు, ఉండ బోదు. గజ-అశ్వ-రథ-దాసదాసీ-గృహాదుల దానము అన్న దానము యొక్క పదహారవ కలకు కూడ సరితూగవు. మహాపాపములు చేసిన వాడు కూడ ఆన్న దానము చేసినచో ఆ పాపము లన్నింటినుండియు విముక్తుడై అక్షయ్యలోకములను పొందును. జలమున, పానపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. శీతకాలమునందు మార్గమధ్యాదులందు ఆగ్నిని, కట్టెలను ఇచ్చువాడు తేజోయుక్తుడై స్వర్గమునందు దేవతా - గంధర్వాపరాదులచే సేవింపబడును. మృతతై ల లవణదానము చేసినవానికి అన్నియు లభించును. ఛత్ర - పాదుకా - కాషాదులను దానము చేసినవాడు స్వర్గములో సుఖముగ నివసించును. ప్రతిపదాది పుణ్యతిథులందును, విష్కంభాది యోగములందును, చైత్రాది మాసములందును, సంవత్సరారంభమునందును, అశ్విన్యాది నక్షత్రములందును, విష్ణు - శివ - బ్రహ్మలోక పాలాదుల నర్చించి చేసిన దానము మహాఫలప్రదము. వృక్ష - ఉద్యాన - భోజన - వాహవాదులను, పాదములకు మర్ధించుటకై తైలాదికమును ఇచ్చిన మానవుడు భుక్తిముక్తులను పొందును.
త్రీణి తుల్యఫలాన్యాహ గావః పృథ్వీ సరస్వతి.
బ్రాహ్మీం సరస్వతీం దత్త్వా నిర్మలో బ్రహ్మలోక భాక్ ।
సప్తద్వీపమహీద! స బ్రహ్మజ్ఞానం దదాతి యః.
అభయం సర్వభూతేభ్యో యో దద్యాత్సర్వభాజ్నరః ।
పురాణం భారతం వాపి రామాయణమథాపి వా.
లిఖిత్వా పుస్తకం దత్త్వా భుక్తిం ముక్తిమవాప్నుయాత్ ।
వేదశాస్త్రం నృత్యగీతం యోధ్యాపయతి నాకభాక్.
విత్తం దద్యాదుపాధ్యాయే ఛాత్రాణాం భోజనాదికమ్ ।
కిమదత్తం భవే త్రేన ధర్మకామాదిదర్శినా.
వాజపేయసహస్రస్య సమ్యఢత్తస్య యత్ఫలమ్ ।
తత్ఫలం సర్వమాప్నోతి విద్యాదానాన్న నంశయః.
శివాలయే విష్ణగృహే సూర్యనః భవనే తథా ।
సర్వదానప్రదః స స్యాత్సు స్తకం వాచయేత్తు యః.
త్రైలో క్యే సర్వవర్ణాశ్చ చత్వారకాశ్రమాః పృథక్ ।
బ్రహ్మాది దేవతాః సర్వా విద్యాదానే ప్రతిష్ఠితాః.
విద్యాకామదుఘా ధేనుర్విద్యా చ క్షురను తమమ్ ।
ఉపవేదప్రదానేన గనర్వైః సహ మోదతే.
వేదాజ్ఞానాం చ దానేన స్వర్గలోక మవాప్నుయాత్ ।
ధర్మశాస్త్ర ప్రదానేన ధర్మేణ సహ మోదతే.
సిద్ధాన్తా నాం ప్రదానేన మోక్షమాప్నోత్యసంశయమ్ ।
విద్యాదానమవాప్నోతి ప్రదానాతు న్తకస్య తు.
శాస్త్రాణి చ పురాణాని దత్త్వా సర్వమవాప్నుయాత్ ।
శిష్యాంశ్చ శిక్షయేద్యస్తు పౌ ణ్డరీకఫలం లభేత్ .
గోదాన - విద్యాదాన - భూదానములు మూడును సమానఫలములు. వేద విద్యాదానము చేసిన వాడు పాపరహితుడై బ్రహ్మలోకమునందు నివసించును. యోగ్యుడైన శిష్యునకు బ్రహ్మ జాన మిచ్చినవాడు సప్తద్వీపసమన్విత యగు భూమిని దానము చేసినట్లే. సకల ప్రాణులకును ఆయదానము చేసినవాడు సర్వమును, పొందగల్గును. పురాణమును గాని, మహాభారతమును గాని రామాయణమును గాని వ్రాసి ఆ పుస్తకము దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. వేదాది ములను నృత్యగీతములను నేర్పినవాడు స్వర్గము పొందును, ఉపాధ్యాయునకు వృత్తిని, విద్యార్థులకు భోజనమును ఏర్పరిచి నవాడు ధర్మ కామాది పురుషార్థముల రహస్యము తెలిసినవాడు; అతడు చేయని దాన మేమున్నది ? విద్యాదానము చేసినవాడు సహస్ర వాజపేయములను విధిపూర్వకముగ దానము చేయు ఒచే ఎట్టి ఫలము లభించునో అంతఫలమును పూర్తిగ పొందున. సందేహ మేమాత్రము లేదు. శివ - విష్ణు - సూర్యదేవాలయములలో గ్రంథ ప్రవచనము చేయువానికి సకలదానఫలములు లభించును. త్రిలోకములలో నున్న బ్రాహ్మణాది వర్ణములును, బ్రహ్మచర్యాది ఆశ్రమములును, బ్రహ్మాదిదేవగణములును విద్యాదానమునందు ప్రతిష్టితము లై యున్నవి. విద్యయే కామధేనువు; విద్యయే నేత్రము; గాంధర్వాద్యుపవేదములు దానము చేసినవాడు గంధర్వులతో కలిసి ఆనందించును. వేదాంగముల దానముచే స్వర్గమును పొందును. ధర్మశాస్త్రదాన ముచే ధర్మసంనిధి చేరి ఆనందించును. సిద్దాంతచరుల దానము చేసినవాడు నిస్సంశయముగ మోక్షమును పొందును. పుస్తకదానముచే పద్యాదాన ఫలము లభించును. ఆందుచే శాస్త్రపురాణముల దానము చేసినవాడు సర్వమును పొందును. శిష్యులకు శిక్షాదానము చేసినవాడు పౌండరీకయాగము చేసిన ఫలము పొందును.
యేన జీవతి తద్దత్వా ఫలస్యానో న విద్యతే ।
లోకే శ్రేష్ఠతమం సర్వమాత్మనశ్చాపి యత్ప్రియమ్.
సర్వం పితృణాం దాతవ్యం తేషా మేవాన్షయార్డినా।
విష్ణుం రుద్రం పద్మయోనిం దేవీవీ ఘ్నేశ్వరాదికాన్.
పూజయిత్వా ప్రదద్యాద్యః పూజాద్రవ్యం స సర్వభాక్ ।
దేవాలయం చ ప్రతిమా కారయన్సర్వమాప్నుయాత్.
సంమార్జనం చోపలేపం కుర్వన్ స్యాన్నిర్మలః పుమాన్ ।
నానామణలకార్య గ్రే మణలాధీపతిర్భవేత్.
గన్దం పుష్పం ధూపదీపం నైవేద్యం చ ప్రదక్షిణమ్ ।
ఘణాధ్వజవితానం చ పేక్షణం వాద్యగీతకమ్.
వస్త్రాది దత్త్వా దేవాయ భుక్తిం ముక్తిమవాప్నుయాత్ ।
కస్తూరికాం సిమ్లాకం చ శ్రీఖడ్గమగరుం తథా.
కర్పూరం చ తథా ము స్తం గుగ్గులుం విజయం దదేత్ ।
మృతప్రసేన సంస్థాప్య సంక్రాక్ష్యాదౌ స సర్వభాక్.
స్నానం పలశతం జేయమభ్యజ్ఞం పళ్చావింశతిః ।
పలానాం తు సహ సేణ మహాస్నానం ప్రకీర్తితమ్.
దశాపరాధాన్తయేన స్త్రీ రేణ స్నాపనాచ్చతమ్ ।
సహస్రం పయసా దధ్ని ఘృతేనాయుతమిష్యతే.
దాసీదాసమలక్ష్కారం గోభూమ్యశ్వగజాదికమ్ ।
దేవాయ దత్త్వా సౌభాగ్యం ధనాయుష్మాన్వజేద్దివమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నానాదానాని నామ ఏకాదశాధిక ద్విశతతమోధ్యాయః.
జీవికా దానఫలము అనంతము. పితరులకు అక్షయలోకాచాప్తి కోరువాడు, ఈ లోకమునందు సర్వ శ్రేష్టము లైన వస్తువులను, తనకు ప్రియ మగు సకలపదార్థములను పితరుల నుద్దేశించి దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివదేవీగణే శాదుల పూజ చేసి ఆ పూజాద్రవ్యముల నన్నింటిని బ్రాహ్మణునకు దానము చేయువాడు. సర్వమును పొందగలడు. దేవా లయములను కట్టించువారును, దేవప్రతిమలు నిర్మించువారును సమ స్తమైన అభిలషిత వస్తువులను పొందగలరు. దేవాలయ ములలో తుడిచి కడుగు వాడు పాపరహితు డగును. దేవ ప్రతిమకు ఎదురుగ వివిరమండలముల నిర్మాణము చేయువాడు మండలాధిపతి యగును. దేవతలకు గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ప్రదక్షిణ - ఘంటా - ధ్వజ - వస్త్రా దులను సమర్పించుట చేతను, దేవతాదర్శనము చేతను, దేవతాసమక్షమున నాట్యగానములు చేయుటచేతను మనుష్యుడు భుక్తిని ముక్తిని కూడ పొండును. భగవంతునకు కస్తూరి, సింహలదేశీయచందనము, అగురు, కర్పూరము, ముస్తాది సుగంధద్రవ్యములు, విజయగుగ్గులు సమర్పించవలెను. సంక్రాంత్యాదిదినములందు ఒక ప్రస్థము నేతితో స్నానము చేయించువాడు అన్నియు పొందును. నూరుపలములతో స్నానము, ఇరువదియైదుపలములతో అభ్యంగము, వేయిపలములతోమహా స్నానము చేయించవలెను. భగవంతునకు జలస్నానము చేయించుటచే పది అపరాధములు, దుగ్ధ - దధులతో స్నానము చేయించుటచే సహస్రాపరాధములు, మృతస్నానము చేయించినచో వెయ్యి అపరాధములు వినష్టములగును. దేవతలను ఉద్దేశించి దాసదాసులను, అలంకారములను, భూమిని, గజాశ్వములను, సౌభాగ్యద్రవ్యములను సమర్పించువాడు దీరాయుర్యుక్తుడై స్వర్గలోకమును పొందును.
అగ్ని మహాపురాణమునందు నానాప్రకారదానమహిమవర్ణన మను రెండువందలపదకొండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 211 of the Agni Purāṇa is as follows:
Agni teaches the construction and worship of yantras as physical embodiments of mantra-śakti. The chapter describes the Śrī Yantra, Sudarśana Yantra, and Durgā Yantra, along with their respective nyāsa and āvaraṇa pūjā sequences. The materials prescribed for drawing yantras — red ochre on copper, turmeric on birch-bark — are given. Agni declares that a properly consecrated yantra continuously emits the śakti of the mantra even when the sādhaka is not actively engaged in japa.