ఆగ్ని రువాచః-
వ్రతం మాసోపవాసం చ సర్వోత్కృష్టం వదామి తే ।
కృత్వా తు వైష్ణవం యజ్ఞం గురోరాజ్ఞామవాప్య చ.
కృచ్చాద్యైః స్వబలం బుద్ధ్వా కుర్యాన్మా సోపవాసకమ్ ।
వానప్రస్థో యతిర్వాథ నారీ వా విధవా మునే.
ఆగ్ని దేవుడు చేప్పెను ; వసిష్ట మహామునీ! ఇప్పుడు అన్నింటికంటెను ఉత్తమమైన మాసోపవాస వ్రతమున గూర్చి చెప్పేదను. వైష్ణవయజ్ఞము చేసి, ఆచార్యుని ఆజ్ఞ గైకొని, కృచ్చైదివ్రతములను ఆచరించుట ద్వారా తన శక్తిని పరీక్షించుకొని, మాసోపవాసవ్రతము చేయవలెను. వానప్రస్థుడు, సన్యాసి, విధవయగు శ్రీ ఈ వ్రతము చేయవలెను.
ఆశ్వినస్యామలే పక్షే ఏకాదశ్యాముపోషితః ।
వ్రత మేతత్తు గృహ్ణీయాద్యావత్రింశ ద్ధినాని తు.
ఆద్య ప్రభృత్యహం విష్ణో యావదుత్థాసకం తవ ।
అర్చయే త్వామనశ్నన్ హి యావ త్రింశద్దినాని తు.
కార్తిక్యాశ్వినయోర్విష్ణోర్యావదుత్థానకం తవ ।
మియే మధ్య నరాలేఒహం వ్రతభజో న మే భవేత్.
త్రికాలం పూజయే ద్విష్ణుం త్రిః స్నాతో గన్గపుష్పకైః ।
విష్ణోద్గీతాదికం జప్యం ధ్యానం కుర్యాద్ర్వతీ నరః.
వృథానాదం పరిహ దర్గా కాజ్ఞాం వివర్జయేత్ ।
నావ్రతస్థం స్పృ శత్కచ్చోద్వికర్మస్థాన్న చాల పేత్.
దేవతాయతనే తిషేద్యావత్రింశద్దినాని తు ।
ద్వాదశ్యాం పూజయిత్వా తు భోజయిత్వా ద్విజాన్ వతీ.
సమాప్య దక్షిణాం దత్త్వా పారణం తు సమాచరేత్ ।
భుక్తిము క్తిమవాప్నోతి కల్పాంశ్చైవ త్రయోదశ.
ఆశ్వయుజశుక్ల ఏకాదశిపాడు ఉపవాస ముండి ముప్పదిదివసములకై ఈ క్రింది విధముగ సంకల్పించి మాసో పవాస వ్రతమును గ్రహించవలేను : “ఓ! మహావిష్ణూ! నేను ఈ దినము మొదలు ముప్పది దినములు నీ ఉత్థానముపర్యంతము నిరాహారుడుగా ఉండి నిన్ను పూజించెదను. సర్వవ్యాపి వైన ఓ హరీ! ఆశ్వయుజశుక్ల ఏకాదశి మొదలు నీ ఉత్తానకాల మైన కార్తికశుద్దఏకాదశి లోగా నేను మరణించినను, నీ కృపచే ప్రతభంగము కాకుండుగాక”. వ్రతము నాచరించువాడు దినమున మూడు పర్యాయములు స్నానము చేయుచు, సుగంధ ద్రవ్యములతోను, పుష్పములతోను, ప్రాతఃకాలమునను, మధ్యాహ్న మందును, సాయంకాలమునందును శ్రీ మహావిష్ణువును పూజించవలెను. తత్సంబంధి-గాన-ధ్యాన-జపాదులు చేయవలెను. వ్యర్థాలాపములను విడువవలెను. ధనాశ పరిత్యజించవలెను. ప్రతహీను నెవ్వనిని స్పృశింపరాదు. శాస్త్రనిషిద్ధ కర్మల నాచరించు వారిని ప్రేరేపించరాదు. ముప్పది దివసముల పాటు దేవాయమునందే నివసించవలెను. వ్రతము చేయువాడు కార్తిక శుక్ల ద్వాదశినాడు శ్రీమహ్మాష్ణువును పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వారికి దక్షిణ లిచ్చి, తాను కూడ పారణము చేసి, వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ పదమూడు మాసోపవాసము చేసిన వాడు భుక్తిముక్తు లను రెండింటిని పొందును.
కారమేద్వైష్ణవం యజ్ఞం యజేద్వి ప్రాంస్త్రయోదశ ।
తావస్తి వస్త్రయుగ్మాని భాజనాన్యాసనాని చ.
ఛత్రాణి సపవిత్రాణి తథోపానద్యుగాని చ ।
యోగపట్టోపవీతాని దద్యాద్విప్రాయ తైర్మతః.
పిదప వైష్ణవ యజ్ఞము చేసి (పదముగ్గురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి ఆజ్ఞచే) ఒక బ్రాహ్మణునకు పద మూడు ఉత్తరీయములను, పదమూడు ఆధ్వస్త్రములను, పాత్ర-ఆసన-చత్ర-పవిత్ర-పాదుకా-యోగ పట్ట-యజ్ఞోపవీతము లను దానము చేయువలెను,
అన్యవిప్రాయ శయ్యాయాం హైమం విష్ణుం ప్రపూజ్య చ ।
ఆత్మనశ్చ తథా మూర్తిం వస్త్రాద్యైశ్చ ప్రపూజయేత్.
సర్వపాపవినిర్ముక్తో విప్రో విష్ణప్రసాదతః ।
విష్ణులోకం గమిష్యామి విష్ణురేవ భవామ్యహమ్.
వ్రజ వ్రజ దేవ బుద్దే విష్ణోః స్థానమనామయమ్ ।
విమానేనామల స్తత్ర తిషే ద్విష్ణుస్వరూపధృక్.
ద్విజాను క్వాథ తాం శయ్యాం గుర వేథ నివేద యేత్ ।
కులానాం శతముద్దృత్య విష్ణులోకం నయేద్ర్వతి.
మాసోపవాసీ యద్దేశ స దేశ నిర్మలో భవేత్ ।
కింపున స్తత్కులం సర్వం యత్ర మాసోపవాసకృత్.
వ్రతస్థం మూర్ఛితం దృష్ట్వా క్షీరాజ్యం చైవ పాయయేత్ ।
నైతే వ్రతం వినిమ్న స్త్రీ హవిర్విఫ్రానుదితమ్.
క్షీరం గురో రితోషద్య ఆపో మూలఫలాని చ ।
విష్ణుర్మహౌషధం కర్తా వ్రతమస్మాత్సముద్ధ రేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మాసోపవాస వ్రతం నామ చతురధిక ద్విశతత మోధ్యాయః.
పిదప శయ్య పై తప ప్రతిమను, సువర్ణమయమగు మహావిష్ణు ప్రతిమను పూజించి వాటిని మరొక బ్రాహ్మణ నకు దానము చేసి, ఆతనిని వస్త్రాదులచే సత్కరించవలెను. “నేను సర్వపాపవిముక్తుడనై, బ్రాహ్మణ శ్రీమహా విష్ణు ప్రసాదముచే విష్ణులోకమునకు వెళ్ళగలను”. అని ఆతడు పలుకగా బ్రాహ్మణులు “ఓ దేవాత్మకా! నీవు రోగ శోక రహిత మగు విష్ణులోకమునకు వెళ్ళి, ఆచట విష్ణురూపధారివై విమానమున విరాజిల్లుము” అని పలుకవలెను. పిదప వ్రతము నాచరించినవాడు ద్విజులకు నమస్కరించి, ఆ శయ్యను ఆచార్యునకు ఇచ్చి వేయవలెను. ఈ విధముగ వ్రత మాచరించిన వాడు తన నూరు కులములను ఉద్దరించి వారిని కూడ విష్ణులోకమునకు తీసికొని వేళ్ళును. మాసోపవానము చేయువాడు నివసించు దేశము పాపరహితమై యుండును. మాసోపవాసవ్రతానుష్టానము చేసినవాడు పుట్టిన కులము మాట చెప్పవలేనా ? వ్రతము నాచరించు వాడు మూర్చ చెందినచో అతనికి నెయ్యి కలిపిన పాలు త్రాగించవలెను. ఈ క్రింద చెప్పిన పదార్థములు వ్రతభంగకరములు కావు. బ్రాహ్మణుని అనుమతిచే గ్రహించిన హవిస్సు, ఆచార్యుని అనుజ్ఞచే గ్రహించిన ఓషధి, ఫలము, మూలము, ఫలము. ఈ వ్రతమునందు “శ్రీమహావిష్ణువే మహౌషధిస్వరూపుడు” అను విశ్వాసముతో వ్రత మాచరించు వాడు వ్రతమును సమాప్తి చేయగలడు.
అగ్ని మహాపురాణమునందు మాసోపవాసవ్రతవర్ణన మను రెండువందలనాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 204 of the Agni Purāṇa is as follows:
The chapter presents the Vaśya-karma, the rite of attracting and binding persons to one's will. Agni teaches Vasiṣṭha the mantras invoking Manmatha and Ratī for this purpose. The use of specific herbs such as vaṭa-mūla and guggulu, combined with the appropriate lunar tithi, is prescribed. The sādhaka must observe brahmacarya during the rite and direct the mantra toward the intended person while meditating upon Kāmadeva.