అగ్ని మహా పురాణము

215 - అథ సన్ధ్యావిధిః

ఆగ్ని రువాచః-

ఓఙ్కారం యో విజానాతి సయోగీ సహరిః పుమాన్

ఓఙ్కారమభ్యసేత్తస్మాన్మంత్రసారం తు సర్వదమ్.

సర్వమంత్ర ప్రయోగేషు ప్రణవః ప్రథమః స్మృతః

తేన సమ్పరిపూర్ణం యత్తత్పూర్ణం కర్మనేతరత్.

ఓఙ్కారపూర్వికా స్తిస్రో మహావ్యాహృతయోఽవ్యయాః

త్రిపదా చైవసావిత్రీ విజ్ఞేయం బ్రహ్మణోముఖమ్.

యోఽధీతేఽహన్యహన్యేతాస్త్రీణి వర్షాణ్యతంద్రితః

న బ్రహ్మ పరమభ్యేతి వాయుభూతః ఖమూర్తిమాన్.

ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామాత్పర న్తపః

సావిత్య్రాస్తు పరం నాస్తి మౌనాత్సత్యం విశిష్యతే.

సప్తావర్తా పాపహరా దశభిః ప్రాపయేద్దివమ్

వింశావర్తాతు సాదేవీ నయతే హీశ్వరాలయమ్.

అష్టోత్తరశతం జప్త్వా తీర్ణఃసంసారసాగరాత్

రుద్రకూష్మాణ్డ జప్యేభ్యో గాయత్రీతు విశిష్యతే.

న గాయత్య్రాః పరంజప్యం న వ్యాహృతిసమంహుతమ్

గాయత్య్రాః పాదమ ప్యర్ధమృగర్థమృచ మేవవా.

బ్రహ్మహత్యా సురాపానం సువర్ణ స్తేయమేవచ

గురుదారాగమశ్చైవ జప్యేనైవపునాతిసా.

ఆగ్ని దేవుడు చెప్పెను : ఓంకారము నెరిగినవాడే యోగి. ఆతడే విష్ణుస్వరూపుడు. ఆందు వలన సకలమంత్ర సారభూతము, సర్వప్రదము అగు ఓంకారమును అభ్యసించవలెను. సమ సమంతప్రయోగ ప్రారంభము నందును ఓంకార ముచ్చరింపబడును. ఓంకార యుక్తమగు కర్మయే పరిపూర్ణము; అది లేనిది పూర్ణము కాజాలదు. మొదట ఓంకారము తోడను, మూడుశాశ్వత వ్యాహృతులతోడను కూడిన మూడుపదముల గాయత్రి వేదమునకు ముఖము. మూడు సంవత్సరముల పాలు నిత్యము గాయత్రీజపము చేయువాడు పాయువై, ఆకాశ స్వరూపుడై , పరబ్రహ్మను పొందును, ఏకాక్షరమగు ఓంకారమే పర బ్రహ్మము. ప్రాణాయామమే పరమతపస్సు. గాయత్రిని మించినది ఏదియు లేదు. మౌనమాగానుండుట కంటె సత్యభాషణము శ్రేష్ఠము. ఏడు పర్యాయములు గాయత్రి ఆవృత్తి చేసినచో సర్వపాపములును తోలగును. పది అవృత్తులు చేయువాడు స్వర్గము పొందును. ఇరువది ఆవృత్తులు చేయువానిని గాయత్రి స్వయముగా ఈశ్వరలోకమునకు తీసికొని పోవును. నూటఎనిమిది పర్యాయములు గాయత్రీ జపము చేసినవాడు సంసారసాగర మును తరించును. రుద్ర పాత్ర జపమికంటెను, కూష్మాండ మంత్ర జపముకంటెను గాయత్రీమంత్ర జపము శ్రేష్టము. గాయత్రికంటె శ్రేష్ఠమైన జపించదగిన మంత్రమేమియును లేదు. వ్యాహృతి హోమ తుల్యమగు హోమమేమియును లేదు గాయుత్రిమంత్రము లోని ఒక పాదమును గాని, సగము పాదమును గాని, సంపూర్ణ ఋక్కును గాని, సగము ఋక్కును గాని జపించినంత మాత్రమున గాయత్రి బ్రహ్మహత్యా - సురాపాన - సువర్ణ స్తేయ, గురుపత్నీగమనాది మహాపాతకముల నుండి విముక్తుని చేయును.

పాపేకృతే తిలైర్హోమో గాయత్రీ జప ఈరితః

జప్త్వాసహస్రం గాయత్య్రా ఉపవాసీ సపాపహా.

 గోఘ్నః పితృఘ్నో మాతృఘ్నో బ్రహ్మహాగురుతల్పగః

బ్రహ్మఘ్నః స్వర్ణహారీచ సురాపోలక్షజప్యతః.

శుద్యతే వాఽథ వాస్నాత్వా శతమంతర్జలే జపేత్

 జపః శతేన పీత్వాతు గాయత్య్రాః పాపహాభవేత్.

 శతం జప్తాతు గాయత్రీ పాపోపశమనీ స్మృతా

సహస్రజప్తా సాదేవీ హ్యుపపాతకనాశినీ.

 అభీష్టదా కోటిజప్తా దేవత్వం రాజతామియాత్

 ఓఙ్కారం పూర్వముచ్చార్య భూర్భువః స్వస్తథైవచ.

 గాయత్రీ వ్రణవశ్చాన్తే జపే చై వముదాహృతమ్

విశ్వామిత్ర ఋషిశ్చందో గాయత్రం సవితాతథా.

 దేవతోపనయే జప్యే వినియోగో హుతే తథా

అగ్ని ర్వాయూరవిర్విద్యుద్యమో జలపతిర్గురుః.

 పర్జన్య ఇంద్రో గంధర్వః పూషాచ తదనంతరమ్

మిత్రోఽథ వరుణ స్త్వష్టా వసవో మరుతఃశశీ.

 అఙ్గిరా విశ్వనానత్యౌ క స్తథా సర్వదేవతాః

రుద్రో బ్రహ్మాచ విష్ణుశ్చ క్రమశోఽక్షర దేవతాః.

 గాయత్య్రా జపకాలేతు కథితాః పాపనాశనాః.

ఏ పాపమునకైనను తిలహోమము, గాయత్రి జపము ప్రాయశ్చిత్తములు. ఉపవాసపూర్వకముగ సహస్ర గాయత్రీ జపము చేయువాడు తన పాపములను నశింప చేసుకొనును. గోవధ-పితృవధ-మాతృవధ-బ్రహ్మహత్యా-గురపత్నీ గమన-బ్రాహ్మణజీవితాపహరణ-సుపర్ణ సేయ–సురాపానాదీ మహాపాపములు చేసినవాడు కూడ ఒక లక్ష గాయత్రీ జపము చేయుటచే శుద్ధుడగును. లేదా స్నానానంతరము నీటిలో ఉండి నూరు పర్యాయములు గాయత్రీ జపము చేయవలెను. పిదప గాయత్ర్యభిమంత్రితమగు జలముతో నూరు ఆచమనములు చేయవలెను. అట్లు చేసినవాడు కూడ పాపరహితు డగును. నూరు పర్యాయములు గాయత్రీ జపము సమస్త పాపములను శమింపచేయును. సహస్ర జపము ఉప పాతకములను కూడ నశింపచేయును. కోటి జపము చేసిన వానికి గాయత్రీదేవి అభీష్టఫలము నొసగును. జపము చేయువాడు దేవత్వమును,దేవరాజత్వమును కూడ పొందును. మొదట “ఓం” కారమును, పిదప “భూర్భువఃస్వః” ను ఉచ్చరించి పిదప గాయత్రి ఉచ్చరించి, చివర ‘ఓం’ చేర్చవలెను. జపమున ఈ విధముగ గాయత్రీ మంత్రము విహితమైనది. గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందస్సు. దేవత సవిత. ఉపనయన–జప-హోమములందు దీనిని వినియోగించవలెను. గాయత్రీమంత్రమునందలి ఇదువది నాలుగు అక్షరములకు వరుసగా -ఆగ్ని -వాయు-రవి -విద్యుత్-యమ-జలపతి-గురు-పర్జన్య-ఇంద్ర-గంధర్వ-పూషన్-మిత్ర-వరుణ-త్వష్టృ- వసుగణ-మరుద్గణ-చంద్ర-అంగిరస్-విశ్వేదేవ -అశ్వినీ కుమార-ప్రజాపతిసహిత సమస్తదేవగణ-రుద్ర-బ్రహ్మ విష్ణువులు ఆధిష్ఠాతృదేవతలు. గాయత్రీజప సమయమున పైదేవతలను ఉచ్చరించినచో వారు జపము చేయువాని పాపములను తొలగింతురు.

పాదాజ్గుష్ఠౌ చ గుల్పౌచ నలకౌ జానునీతథా.

జం ఘే శిశ్నశ్చ వృషణౌ కటిర్నాభి స్తథోదతమ్

స్తనౌ చ హృదయం గ్రీవా ముఖంతాలుచనాసి కే.

 చక్షుషీచ భ్రువోర్మధ్యం లలాటం పూర్వమాననమ్

దక్షిణో త్తరపార్శ్వే ద్వే శిర ఆస్యమనుక్రమాత్.

 పీతః శ్యామశ్చకపిలో మరకతోఽగ్ని సన్నిభః

రుక్మవిద్యుద్దూమ్ర కృష్ణరక్తగౌరేంద్రనీలభాః.

 స్పాటిక స్వర్ణపాండ్వాభాః పద్మరాగోఽఖిలద్యుతిః

హేమద్దూమ్ర రక్తనీల రక్తకృష్ణసువర్ణభాః.

 శుక్లకృష్ణ పలాశాఖా గాయత్య్రా వర్ణకాః క్రమాత్

ధ్యానకాలే పాపహరా హుతై పా సర్వకామదా.

 గాయత్య్రా తు తిలై ర్హోమః సర్వపాపప్రణాశనః

శాంతికామో యవైః కుర్యాదాయుష్కా మోఘృతేనచ.

 సిద్ధార్థ కైః కర్మసిద్ద్యె పయసా బ్రహ్మవర్చసే

పుత్రకామ స్తథా దధ్నా ధ్యానకామస్తు శాలిభిః.

 క్షిరివృక్షసమిద్భిస్తు గ్రహపీడోపశాంతయే

ధనకామ స్తథా బిల్వైః శ్రీ కామః కమలై స్తథా.

ఆరోగ్యకామో దూర్వాభిర్ గురూత్పాతే సఏవహి

సౌభాగ్యేచ్ఛుర్గుగ్గులునా విద్యార్థీ పాయ సేన చ.

అయుతే నో క్తసిర్ధిః స్యాల్లక్షేణ మన సేప్సితమ్

కోట్యా బ్రహ్మవదాన్ముక్తః కులోద్దారీ హరిర్భవేత్.

గ్రహయజ్ఞముఖోవాపి హోమోఽయుతముఖోఽర్ధకృత్

ఆవాహనం చ గాయత్య్రా స్తత ఓంకారమభ్యసేత్.

గాయత్రీమంత్రమునందలి ఒక్కొక్క అక్షరమును క్రింద చెప్పిన అవయవములపై వరుసగా న్యాసము చేయవలెను- రెండు పాదాంగుష్ఠములు, రెండు మడమలు, రెండుపిక్కలు, మోకాళ్లు, తొడలు, ఉపస్థ, వృషణములు, కటిభాగము, నాభి. ఉదరము, స్తన మండలము, హృదయము, కంఠము, అధరోక్షము, తాలు, నాసిక, నేత్రములు, కనుబొమ్మల మధ్య భాగము, లలాటము, ఉత్తరోష్ఠము, దక్షిణపార్శ్వము, ఉత్తరపార్శ్వము, శిరస్సు, సంపూర్ణముఖ మండలము. ఇరువదినాలుగు గాయత్ర్యక్షరముల రంగులు. వరుసగా - పీత - శ్యామ - కపిల - మర క తమణిసదృశ - ఆగ్నితుల్య, స్వర్ణతుల్య - విద్యుత్రథ - ధూమ - కృష్ణ - రక్త - గౌర - ఇంద్రనీల మణిసదృశ - స్ఫటికమణికుల్య - స్వర్ణతుల్య - పాండు - పుష్పరా, తుల్య - ఆఖీలద్యుతి - హేమాభధూమ - రక్త నీల - రక్త కృష్ణ - సువర్ణాభ - శుక్ల - కృష్ణ - పలాశ వర్ణములై యుండును. గాయత్రిని ధ్యానము చేసినచో ఆ దేవి ధ్యానించు వానిపాపములను తొలగించును. హోమము చేసినచో ఆభీష్టముల నిచ్చును. గాయత్రీ మంత్రముతో తిలహోమము చేసినచో సకలపాపములు నశించును. శాంతికోరువాడు యవలను, దీరాయుర్ధాయము కోరువాడు ఘృతమును హోమము చేయవలెను. కర్మసిద్ది కోరువాడు ఆవాలను, బ్రహ్మతేజస్సు కోరువాడు క్షీరమును, పుత్రులను కోరువాడు పెరుగును అధిక ధాన్యము కోరువాడు శాలితండులములు హోమము చేయవలెను. గ్రహపీడాశాంతికై అదిర వృక్ష సమిధలను, ధనముకొరకు బిల్వపత్రములను, లక్ష్మి కొరకు కమలములను, ఆరోగ్యముకొరకు మహోత్పాత శాంతి కొరకును దూర్వలను, సౌభాగ్యముకొరకు గుగ్గులును, విద్యకౌరకు పాయసమును హోమము చేయవలెను. పదివేల హోమములచే పూర్యోక్త ఫలము లభించును. ఒక లక్ష హోమములచే మనోభిలషితములగు వస్తువు లన్నియు లభించును. ఒక కోటి ఆహుతులు చేసినవాడు బ్రహ్మహత్యాపాపవిముక్తుడై , తన కులము నుద్దరించి, శ్రీ మహా విష్ణు స్వరూపుడగును. గ్రహశాంతికై చేయు యజ్ఞములలో కూడ గాయత్రీ మంత్రముచే పదివేల హోమములు చేసినచో ఆభీష్టసిద్ధి కలుగును.

స్మృత్వౌఙ్కారం తు గాయత్య్రా నిబధ్నీ యాచ్చిఖాంతతః

పునరాచమ్య హృదయం నాభిం, స్కంధౌచ సంస్ఫృ శేత్.

ప్రణవన్య ఋషిర్బ్రహ్మా గాయత్రీచ్ఛంద ఏవచ

దేవోఽగ్నిః పరమాత్మా స్వాద్యోగోవై సర్వకర్మసు.

 శుక్లా చాగ్ని ముఖీ దివ్యా కాత్యాయన సగోత్రజా

త్రైలోక్యవరదా దివ్యా పృథివ్యా ధార సంయుతా.

ఆక్ష సూత్రధరా దేవీ పద్మాసన గతాశుభా.

 ఓం తేజోఽసి మహోఽసి, బలమసి, భ్రాజోఽసి, దేవానాం దామనామాసి, విశ్వమసి, విశ్వాయుః, సర్వమసి, సర్వాయుః ఓం అభిభూః.

ఆగచ్ఛ వరదే దేవి జుప్యేమే సన్నిధౌభవ.

వ్యాహృతీనాంతు నర్వాసామృషి రేవ ప్రజాపతిః

వ్యస్తాశ్చైవ నమస్తాశ్చ బ్రాహ్మమక్షరమామితి.

విశ్వామిత్రో జమదగ్నిర్భరద్వాజోఽథ గౌతమః

ఋషిరత్రిర్వశిష్ఠశ్చ కాశ్యపశ్చయతాక్రమమ్.

 అగ్నిర్వాయూ రవిశ్చెవ వాక్పతిర్వరుణ స్తథా

ఇంద్రో విష్ణుర్ వ్యాహృతీనాం దైవతాని యథాక్రమమ్.

 గాయత్య్రుష్ణిగనుష్టుప్ చ బృహతీప జి రేవచ

 త్రిష్టుప్ చ జగతీ చేతి ఛందాంస్యాహురనుక్రమాత్.

 వినియోగో వ్యాహృతీనాం ప్రాణాయామేచ హోమ కే

అపోహిష్ఠేత్యృచా చాపాం ద్రుపదాదీతివాస్మృతా.

 తథా హిరణ్యవర్ణాభిః పావమానీభిరన్త తః

విప్రుషోష్టౌ క్షిపేదూర్ధ్వ మాజన్మకృతపాపజిత్.

 అంతర్జలే ఋతఞ్చేతి ఆ పేత్త్రి రఘమర్షణమ్

ఆపోహిష్ఠే తిత్వృచస్య సింధుద్వీపఋషిస్మృతః.

 బ్రాహ్మస్నానాయ ఛందోఽస్య గాయత్రీదేవతా జలమ్

మార్జనే వినియోగోఽస్య హయావభృథకే క్రతోః.

అఘమర్షణ సూక్త స్య ఋషి రేవాఘమర్షణః

అనుష్టుప్ చ భవేచ్ఛందో భావవృత్తస్తు దైవతమ్.

 ఆపోజ్యోతీ రస ఇతి గాయత్య్రాస్తు శిరః స్మృతమ్

ఋషిః ప్రజాపతిస్తస్య ఛందోహీనం యజుర్యతః.

 బ్రహ్మాగ్నివాయుసూర్యాశ్చ దేవతాః పరికీర్తితాః

 ప్రాణరోధాత్తు వాయుః స్యాద్వాయోరగ్నిశ్చ జాయతే.

 అగ్నే రాపస్తతః శుద్దిస్తతశ్చాచమనం చరేత్

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తి మ.

 తపోయజ్ఞవషట్ కార ఆపోజ్యోతీ రసోఽమృతమ్

ఉదుత్వం జాతవేదసమృషిః ప్రష్కణ్వ ఉచ్యతే.

 గాయత్రీచ్ఛంద ఆఖ్యాతం సూర్యశ్చైవ తు దైవతమ్

అతిరాత్రేనియోగః స్యాదగ్నీషోమో నియోగకః.

 చిత్రం దేవేతి ఋచి చ ఋషిః కౌత్స ఉదాహృతః

త్రిష్టుప్ ఛందో దైవతం చ సూర్యోఽస్యాః పరికీర్తితమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సంధ్యావిధిర్నామ పంచదశాఽధిక ద్విశతతమోధ్యాయః

గాయత్రిని ఆవాహనము చేసి ఓంకారమును ఉచ్చరించవలెను. గాయత్రీ మంత్ర సహితమగు ఓంకార ముచ్చరించుచు శిఖనుబంధించి, ఆచమనము చేసి హృదయ-నాభి - కుజద్వయములను స్పృశించవలెను. ప్రణవమునకు ఋషి బ్రహ్మ, గాయత్రి ఛందస్సు. అగ్ని లేదా పరమాత్మదేవత. సర్వకర్మ ప్రారంభమునందును దీనిని ప్రయోగించ వలెను. “శుక్లా-శుభా” ఆను (మూలోక్త) మంత్రముచే గాయత్రిని ధ్యానించి “ఓం తేజోఽసి......తతః స్మృతా” అను (మూలోక్త) మంత్రముచే ఆవాహన చేయవలెను. సమ స్తవ్యాహృతులకును ఋషి ప్రజాపతి. అవన్నియు వ్యష్టిసమష్టి రూపములతో పర బ్రహ్మరూపమగు ఓంకార ములో ఉన్నవి. సప్తవ్యాహృతులకు వరుసగా - విశ్వామిత్ర - జమదగ్ని - భరద్వాజ - గౌతమ - అత్రి - వసిష్ఠ - కశ్యపులు ఋషులు. అగ్ని - వాయు - సూర్య - బృహస్పతి - వరుణ - ఇంద్ర - విశ్వదేవులు దేవతలు. గాయత్రీ - ఉషైక్ - అనుష్టుప్ - బృహతీ - పంక్తి త్రిష్టుప్. జగతి అనునవి ఛందస్సులు. ఈ వ్యాహృతులు ప్రాణాయాయ హోమములందు వినియోగింపబడును. “ఆపోహిష్ఠామయోభువః......జనయథాచన” అను మూడు ఋక్కులను, “ద్రుపదాదివ......ముముచానః” “హిరణ్యవర్ణాఃశుచయః” ఇత్యాది పవమాన ఋక్కులను పఠించుచు ఎనిమిది పర్యాయములు జలమును మీద చల్లుకొనవలెను. నీటిలోపలనిలచి “ఋతంచ” ఇత్యా ద్యమమర్షణమంత్రమును మూడు పర్యాయములు జపించవలెను. “ఆపోహిష్ఠా” ఇత్యాది ఋక్షయమునకు ఋషి సింధుద్వీపుడు, ఛందస్సు గాయత్రి. దేవత జలము. బ్రాహ్మస్నానమున కై మార్జనమునందు ఇది వినియోగింపబడును. ఆఘమర్షణసూక్త మునకు ఋషి ఆఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్, దేవత భావవృత్తుడు. పాపనిస్సారణమునందు వినియోగము. “ఓం ఆపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మభూర్భువఃసువరోమ్” ఇది గాయత్రీ మంత్ర శిరోభాగము. దాని ఋషి ప్రజాపతి. ఇది ఛందోరహితమైన యజుర్వేద మంత్రము. ఏలననగా యజుర్వేదము ఛందోబద్ధము కాదు. శిరోమంత్రమునకు దేవతలు బ్రహ్మ - అగ్ని - వాయు - సూర్యులు. ప్రాణాయామము నుండి వాయువు, వాయువు నుండి ఆగ్ని, ఆగ్ని నుండి జలము ఉత్పన్నమైనవి. ఈ జలమువలన శద్ధి కలుగును. ఆందుచే “అన్తశ్చర సిభూతేషు......రసోఽ మృతమ్” అను (మూలోక్త) మంత్రముతో ఆచమనము చేయవలెను. “ఉదుత్యం జాతవేదసమ్” అను మంత్రమునకు ప్రస్కణ్వఋషి. ఛందస్సు గాయత్రి. దేవత సూర్యుడు. దీనికి అతిరాత్ర - ఆగ్నిష్టోమములందు వినియోగము. “చిత్రందేవానామ్” అను మంత్రమునకు ఋషికౌత్సుడు. ఛందస్సుత్రిష్టుప్. దేవతసూర్యుడు. సూర్యోపస్థానమునందు వినియోగము.

అగ్ని మహాపురాణమునందు సంధ్యావిధి వర్ణన మను రెండు వందల పదునైదవ అధ్యాయము సమాప్తము.