ఆగ్ని రువాచః
తుర్వసోశ్చ సుతోవర్గో గోభానుస్తస్య చాత్మజః ।
గోభానో రాసిత్త్రైశానిస్త్రై శానేస్తు కరంధమః.
కరంధమాన్మరుత్తోఽభూద్దుష్య న్తస్తస్య చాత్మజః ।
దుష్యన్తస్య వూరూథోఽభూద్గాండీరస్తు వరూథతః.
గాండీరాచ్చైవ గాంధారః పంచజాన పదాన్తతః ।
గాంధారాః కేరళాశ్చోలాః పాండ్యాః కోలామహాబలాః.
ద్రుహ్యస్తు బభ్రుసేతుశ్చ బభ్రుసేతోః పురోవసుః ।
తతోగాంధారా గాంధారైర్ఘర్మో ఘర్మాద్ఘృతోఽభవత్ .
ఘృతాత్తు విదుషస్తస్మాత్ప్రచేతాస్తస్య వైశతమ్ ।
ఆనద్రశ్చ సభానరశ్చాక్షుషః పర మేషుకః.
సభానరాత్కాలానలః కాలానలజః సృంజయః ।
పురంజయః సృంజయస్య తత్పుత్రో జనమేజయః.
తత్పుత్రస్తు మహాశాల స్తత్పు తోఽభూన్మ హోమనాః ।
తస్మాదుశీనరో బ్రహ్మన్నగాయాంతునృగస్తతః.
నరాయాంతు నరశ్చాసీత్కృమిస్తు కృమితః సుతః ।
దశాయాం సువ్రతో జజ్ఞే దృషద్వత్యాం శిబిస్తథా.
శిబేః పుత్రాస్తు చత్వారః పృథుదరృశ్చ వీరకః ।
కైకేయో భద్రకస్తేషాం నామ్నాజనపదాః శుభాః.
తితిక్షురుశీనరజస్తితి క్షోశ్చ రుషద్రథః ।
రుషద్రథాదభూత్పైలః వైలాచ్చ సుతపాఃసుతః.
మహాయోగీ బలిస్తస్మాదంగా వంగశ్చ ముఖ్యకః ।
పుండ్రః కలింగో బాలేయో బలేర్యోగి బలాన్వితః.
అంగాద్దధివాహనోఽభూత్తస్మాద్ది విరథోనృపః ।
దీవిరథాద్ధర్మరథస్తస్య చిత్రరథఃసుతః.
చిత్రరథాత్సత్యరథో లోమపాదశ్చ తత్సుతః ।
లోమపాదాచ్చతురంగః పృథులాక్షశ్చ తత్సుతః.
పృథులాక్షాచ్చ చమ్పోఽభూచ్చంపాద్దర్యంగ కోఽభవత్ ।
హర్యంగాచ్చ భద్రరథో బృహత్కర్మాచ తత్సుతః.
తస్చాదభూద్బృహ ద్భానుర్బృహద్భానోర్బృహాత్మవాన్ ।
తస్మాజ్జయద్రథోహ్యా సీజ్జయద్రథాద్బృహద్రథః.
బృహద్రథాద్విశ్వజిచ్చ కర్ణో విశ్వజితోఽభవత్ ।
కర్ణస్య వృషసేనస్తు పృథుసేనస్తదాత్మజః.
ఏతేఽగ వంశజాభూపాః పురోర్వంశం నిబోధమే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే రాజవంశవర్ణనం నామ నప్తసప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
ఆగ్ని దేవుడు పలికెను. తుర్వసునికి వర్గుడు వానికి గోధానుడు వానికి శ్రీ9శాని, వానికి కరంధముడు, వానికి మరుత్తుడు, వానికి దుష్యంతుడు, దానికి వరూథుడు, పొనికి గాండీరుడు, వానికి గాంధారుడు పుట్టెను. గాంధారునకు ఐదుగురుపుత్రులు పుట్టిరి. వీరి నామధేయములననుసరించి గాంధార-కేరశ-చోశ-పాండ్య-కోల-దేశమాలు ఏర్పడినవి. వీరందరును మహాబలవంతులు. దృహ్యునికి బభ్రు సేతువు వానికి పురోవసువు, పానికి గాంధారుడు, వానికి ధర్ముడు, వానికి మృతుడు పొనికి విదుషుడు, వానికి ప్రచేతసుడు, పుట్టిరి. ప్రచేతసుని నూర్గురి కుమారులలో ఆనద్ర.సభానర-చాక్షుష-పర-మేశుపులు- ప్రధానులు సభానరునకు కానలుడు, వానికి సృంజయుడు, దానికి పురంజయుడు, వానికి జనమేజయుడు, వానికి మహాశాడు, పానికి మహామానసుడు, వానికి ఉశ్వరుడు, పుట్టెను. మహామానసుని భార్యయగు నృగకు నృగుడను కుమారుడు పుట్టెను. నృగువకు నరయను భార్యయందు వరుడుమ కృమియను భార్యయందు కృమియు, దశయను భార్యయందు సువ్రతును దృషద్వతియందు శిబి జనించేను. శిబికి పృథుదర్భుడు వీరకుడు-కై కేయుడు-భద్రకుడు ఆనునలుగురు పుత్రులు జనించిరి. వీరి పేర్లతో నాలుగుదేశమును ప్రసిద్ధములై సవి. ఉశీనరునికి తితిక్షువు వానికి రుషధ్రథుడు, వానికి పైలుడు, వానికి సుతకుడు, వానికి మహాయోగిన బలిజన్మించేను. బలికి, ఆంగ-వంగ-ముఖ్యక-పుండ్ర-కశింగులను పుత్రులు పుట్టిరి. వీరందరికిని బాలేయులని పేరు. యోగియైన బలి మహాబలవంతుడు. ఆంగునికి దధివాహనుడు వానికి దివిర థుడు వానికి డెర్మరథుడు, వానికి చిత్రరథుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు వానికి చతురఁగుడు వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి భద్రరథుడు, వానికి బృహత్కర్మ, వానికి బృహద్భానుడు, వానికి జయద్రథుడు, వానికి బృహద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి కర్ణుడు, పానికి వృషసేనుడు పుట్టెను. అంగవంశమునందు పుట్టినరాజులను గూర్చిచెప్పితిని. ఇపుడు పురువంశవర్ణనము వినుము.
ఆగ్ని మహాపురాణమన రాజవంశవర్ణనమను రెండువందల డెబ్బది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 277 of the Agni Purāṇa is as follows:
The lineages descending from Yayāti's sons Turvaśu, Druhyu, and Anu are described. Turvaśu's lineage runs through Vargu → Gobhānu → Traiśāni → Karandama → Marutta → Duṣyanta → Varūtha → Gāṇḍīra → Gāndhāra, the progenitor of the Gāndhāra people. The five Pāñcāla nations are traced from this branch. Druhyu's lineage gives rise to the northern tribes, while Aṅga is traced through Karṇa and his son Vṛṣasena. The chapter presents the complex genealogical tapestry that underlies the political geography of ancient Bhārata.