అగ్ని మహా పురాణము

151 - అథ వర్ణాశ్ర మేతరధర్మాః

ఆగ్ని రువాచః-

 మన్వాదయో భుక్తిముక్తి ధర్మాంశ్చీర్వాప్నువల్లి యాన్

బ్రోచే పరశురామాయ వరుణ్ క్రం తు పుష్కరః.

పుష్కర ఉవాచః

వర్ణాశ్ర మేతరాణాం తే ధర్మాన్వక్ష్యామి సర్వదాన్

మన్వాదిభిర్ని గదితాన్ వాసు దేవాదితుష్టిదాన్.

అహింసా సత్యవచనం దయా భూతేష్వనుగ్రహః

తీర్థానుసరణం దానం బ్రహ్మచర్యమమత్సరః.

కి దేవద్విజాతిశుశ్రూషా గురూణాం చ భృగూత్తమ

శ్రవణం సర్వధర్మాణాం పితృణాం పూజనం తథా.

భక్తిశ్చ నృపతా నిత్యం తథా సచ్ఛాస్త్ర నేగ్రతా

ఆనృశంన్యం తితిక్షా చ తథా చౌ స్తిక్యమేవ చ.

వర్ణాశ్రమాణాం సామాన్యధర్మా ధర్మం సమీరితమ్

యజనం యాజనం దానం వేదాద్యధ్యాపనక్రియా.

 ప్రతిగ్రహశ్చాధ్యయనం విప్రకర్మాణి నిర్ధి శేత్

దానమధ్యయనం చైవ యజనం చ యథావిధి.

క్షత్రియస్య సవైశ్యస్య కర్మేదం పరికీర్తితమ్

క్షత్రియస్య విశేషేణ పాలనం దుష్టనిగ్రహః.

కృషిగోరక్షవాణిజ్యం వైశ్యస్య పరికీర్తితమ్

శూద్రస్య ద్విజశుశ్రూషా సర్వశిల్పాని వా పునః.

మౌజైబన్జనతో జన్మ విప్రాదేశ్చ ద్వితీయకమ్

ఆనులోమ్యేన వర్ణానాం జాతిర్మాతృసమామతా.

చణాలో బ్రాహ్మణీపుత్రః శూద్రాచ్చ ప్రతిలోమతః

సూతస్తు క్షత్రియాజ్జితో వైర్యాద్వైదేహక స్తథా.

పుక్కసః క్షత్రియాపుత్రః శూద్రాత్స్యాత్పతిలోమతః

మాగధః స్యాత వైశ్యాల్ శూద్రాదయోగవోభవల్.

వై శ్యాయాం ప్రతిలో మేభ్యః ప్రతిలోమాః సహస్రశః

వివాహః సదృశై స్తేషాం నో మైర్నాధమైస్తథా.

చణ్ణలకర్మ నిర్దిష్టం వధ్యానాం ఖాతనం తథా

స్త్రీ జీవనం ' తు తద్రతా ప్రోక్తం వైదేహకస్య చ.

సూతానామశ్వసారథ్యం పుక్కసానాం చ వ్యాధతా

స్తుతిక్రియా మాగధానాం తథా చాయోగవస్య చ.

రజ్ఞావతరణం ప్రోక్తం తథా శిల్పైశ్చ జీవనమ్

బహిర్గామనివాసశ్చ మృతచైలస్య ధారణమ్.

న సంస్పర్శ స్తథైవాన్యైశ్చజ్ఞాలస్య విధీయతే

బ్రాహ్మణార్థ గవాగ్గే వా డేహత్యాగోత్ర యః కృతః.

శ్రీబాలాద్యుపపత్తా వా బాహ్యానాం సిద్దికారణమ్

సజ్కరే జాతయో జ్ఞేయాః పితుర్మాతుశ్చ కర్మతః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే వర్ణాంతరధర్మో నామైక పఞ్చాశ దధిక శతతమోధ్యాయః.

ఆగ్ని పలికేను : ఏ ధర్మముల నాచరించి మన్వాదులు భుక్తిముక్తులు పొందిరో వాటిని పుష్కరుడు, పరశు రామునకు, వరుణ్ కప్రకారమున చెప్పెను. పుష్కరుడు చెప్పెను : వాసుదేవాదులకు సంతోషమును కలిగించునవియు, మన్వాదులు చెప్పిన వియు అగు వర్ణ - ఆశ్రమ - సర్వసాధారణధర్మములను నీకుచెప్పెదను; పరశురామా! అహింస, సత్యము, భూతదయ, అనుగ్రహబుద్ది, తీర్థయాత్ర, దానము, బ్రహ్మచర్యము, మాత్సర్యము లేక పోవుట, దేవబ్రాహ్మణ పూజనము, గురువు శ్రూష, సర్వధర్మశ్రవణము, పితృపూజనము, రాజభక్తి, సర్వదా ఉత్తమశాస్త్రము సాహాయ్యముననే విషయములను తెలిసికొనుట, కౌర్యము లేకుండుట, ఓర్పు, ఆస్తిక్యబుద్ది - ఇవి అన్ని వర్ణములకును, ఆశ్రమములకును సాధారణము లగు ధర్మములు. యజనము, యజ్ఞము చేయించుట, దానము, వేదాద్యధ్యాపనము, ప్రతిగ్రహము, ఆధ్యయనము ఇవి బ్రాహ్మణుల ‘ర్మలు. దానము. అధ్యయనము, యజనము - ఇవి క్షత్రియ వైశ్యుల ధర్మములు, పాలనము, దుష్ట నిగ్రహము, ఇవి క్షత్రియుని విశేషధర్మము, ఆట్లే వైశ్యునకు వ్యవసాయము. గోసంరక్షణ, వాణిజ్యము, విశేష ధర్మములు. శూద్రునకు బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్యుల శుశ్రూష లేదా వివిధశిల్పములు ధర్మము. బ్రాహ్మణాదులకు ఉప :యన మైనది మొనలు రెండవ జన్మ: ఆనులోమ్యము (తండ్రి పై వర్ణమువాడై, తల్లి క్రింది వర్ణమునకు చెందినపుడు పుట్టినవారి జాతి తల్లి జాతితో సమమగును, ప్రాతిలో మ్య మున పై కులము. స్త్రీ పురుషుడు క్రింది కులము ఆయినపుడు) శూద్రునివలన బ్రాహ్మణస్త్రీకి పుట్టినవాడు చండాలుడు. క్షత్రియునివలన బ్రాహ్మణియందు పుట్టినవాడు సూతుడు. వైశ్యుని వలన పుట్టినవాడు దేవలుడు. క్షత్రియస్త్రీయందు శూద్రునివలన పుట్టినవాడు మాగధుడు. వైశ్యస్త్రీయందు  శూద్రునివలన పుట్టిన వాడు ఆయోగవుడు, ప్రతిలోమశ్రీలకు ప్రతిలోమపురుషులవలన వుట్టిన వారు వేలకొలది భేదములలో నుందురు. వారికి వివాహము తమతో సమాన మైన జాతికలవారితోనే జరుగవలెను. అధములతో గాని ఉత్తములతో గాని జరుగరాదు. వధ్యులను చంపుట చండాలుల కర్మ. స్త్రీల కుపయోగించు వస్తువులను తయారుచేయుట, స్త్రీలను రక్షించుట వై దేహకుని కర్మ. సారథ్యము సూతుని కర్మ. వేట చే జీవనము పక్కసుని కర్మ. స్తుతి చేయుట మాగధుని కర్మ. రంగమునందు దిగుట, శిల్పజీవనము ఆయోగవుని కర్మ. చండాలుడు గ్రామముబై ఓ నుండి శవవస్త్రములను ధరించవలెను. ఇతర వర్ణములవారిని స్పృశించగూడదు. గోబ్రాహ్మణుల నిమిత్తము, శ్రీబాలాదుల రక్షణ నిమిత్తము ప్రాణత్యాగము చేయుటచే చండాలాదులకు ఆధ్యాత్మిమకోన్నతి లభించును. సంకరజాతులవారి జాతిని వారి తలిదండ్రులను బట్టియు, జాతిసిద్ధము లగు కర్మలను బట్టియు నిర్ణయించవలెను.

ఆగ్ని మహాపురాణమునందు వర్ణాశ్రవేతరధర్మవర్ణన మను నూట ఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.