ఈశ్వర ఉవాచః-
షట్కర్మాణి ప్రవక్ష్యామి సర్వమంత్రేషు తచ్ఛృణు ।
ఆదౌ సాధ్యం లిఖేత్పూర్వం చా నే మ గ్రసమన్వితమ్.
పల్లవ స తు విశ్లేయో మహోచ్చాటకరః పరః ।
ఆదౌ మన్రో స్తతః సాధ్యో మధ్యే సాధ్యః పునర్మనుః
యోగ్యాః సంప్రదాయోయం గంలో త్పాదేషు యోజయేత్ ।
ఆదౌ మనపదం దద్యాన్మధ్యే సాధ్యం నియోజయేత్.
పునళ్చా నే లిథేన్మ నం సాధ్యం మనపదం పునః ।
రోధకః సంప్రదాయస్తు స్తమ్భనాదిమ యోజయేత్.
ఆరోర్ధం యామ్యవామే తు మధ్యే సాధ్యం తు యోజయేత్ ।
నమ్పుటః స తు విశ్లేయో వళ్యకార్యేషు యోజయేత్.
మన్రాక్షరం యథాసాధ్యం ప్రథితం చాక్షరాక్షరమ్ ।
ప్రథమః సంప్రదాయః స్యాదాకృష్టివశకారకః.
మన్రాక్షరద్వయం లిఖ్య ఏకం సాధ్యాక్షరం పునః ।
విదర్భ స తు విషైయో వశ్యకార్యేషు యోజయేత్.
ఆకర్షణాది యత్కర్మ వసనే చైవ కారయేత్ ।
తాపజ్వరే తథా వ్య స్వాహా చాకర్షణే శుభమ్.
నమస్కారపదం చైవ శా నివృద్ధే ప్రయోజయేత్ ।
పౌష్టి కేషు వషట్కారమాకర్ష వశ్యకర్మణి.
విద్వేషోచ్చాటనే మృత్యో ఫట్ స్యార్ధణీకృతా శుభే ।
లాభాదౌ మ నదీ దౌ వషట్కారస్తు సిద్ధిదః.
యమోసి యమరాజోసి కాలరూపోసి ధర్మరాట్ ।
మయా దత్తమమం శత్రుమచారేణ నిపాతయ.
నిపాతయామి యత్నేన నిర్వృతో భవ సాధక ।
సంవృష్టమనసా బూయాద్దేశికోరి ప్రసూదనః.
పడే శు యమం ప్రార్చ్య హోమాదేతత్రసిద్ధ్యతి ।
ఆత్మానం భైరవం ధ్యాత్వా తతో మధ్యే కులేశ్వరమ్.
రాత్రౌ వార్తాం విజానాతి ఆత్మనశ్చ పరస్య చ ।
దుర్గే దుర్గో రక్షణీతి దుర్గాం ప్రార్చ్యారిహా భవేత్.
జప్త్వా హసక్షమలవర యూం భైరవీం ఘాత చేదరిమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే యుద్ధజయార్ణవే షట్కర్మనిరూపణం నామఅష్టత్రింశదధీక శతతమోధ్యాయః.
పరమేశ్వరుడు చెప్పెను: అన్ని మంత్రముల సాధ్యరూపములకు ఆరు కర్మలను గూర్చి చెప్పెదను వినుము. శాంతి, వశ్యము, స్తంభనము, ద్వేషము, ఉచ్చాటనము, మారణము ఆని ఆరు కర్మలు. ఈ కర్మ లన్నింటియందును ఆరు సంప్రదాయములు లేదా విన్యాసము లుండును. ఆవిపల్లవ యోగ-రోధక-సంపుట-గ్రథన విదర్బములు. ఎవని ఉచ్చాటనము చేయవలెనో వాని పేరు భూర్ణ పత్రాదులపై వ్రాయవలెను. పిదప ఉచ్చాటన మంత్రము వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయు సంప్రదాయమునకు పల్లవ మని పేరు. ఇది ఉచ్చకోటికి చెందిన ఉచ్చాటనము చేయు ప్రయోగము. మొదట మంత్రము వ్రాసి పిదప సాధ్యవ్యక్తి పేరు వ్రాయవలెను. చివర మరల మంత్రము వ్రాయవలెను. దీనికి 'యోగ' సంప్రదాయ మని పేరు. శత్రువు కలము నంతను సంహరించుటకై ఈ ప్రయోగము చేయవలెను. మొదట మంత్రము వ్రాసి, మధ్యసాధ్యనామము వ్రాసి, అంతమునందు మరల మంత్రము వ్రాసి, మరల సాధ్యనామమును వ్రాసి, మరల నుంత్రము వ్రాయవలెను. ఇది రోధక సంప్రదాయము. దీని ప్రయోగము గ్రంథనాదులందు చేయవలెను. మంత్రమునకు పైన, క్రింద, కుడిఎడమ ప్రక్కల, మధ్య సాధ్యనామము వ్రాయగా ఇది ‘సంపుటము'. దీనిని వశ్యాకర్షణ కర్మమున ప్రయోగించవలెను. మంత్రాక్షరము ఒకటి వ్రాసి, పిదప సాధ్యనామాక్షరము వ్రాసి, మరల రెండవ మంత్రాక్షరము వ్రాసి, పిదప నామాక్షరము రెండవది వ్రాసి ఈ విధముగా మంత్రాక్షరములు, నామాక్షరము ఒక దాని తరువాత ఒకటి వ్రాసినచో దీనికి గ్రథన సంప్రదాయ మని పేరు. దీనిని ఆకర్షణవశీకరణములందు చేయవలెను. మొదట మంత్రాక్షరములు రెండు వ్రాసి, సాధ్యనామాక్షరము ఒకటి వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయుచు పూర్తి చేయగా విదర్భ మని పేరు. దీనిని వశీకరణ ఆకర్షణములకు ఉపయోగింతురు. ఆకర్షణాది మంత్రానుష్టానము వసంతమునందు చేయవలెను. తాప జ్వరనివారణవశీకరణ-ఆకర్షణకర్మలందు 'స్వాహా' ప్రయోగము శుభకరము. శాంతి - వృద్ధికర్మలందు 'నమః' ప్రయోగము చేయవలెను. పౌష్టిక కర్మ-వశీకరణములందు ‘వషట్' ను ప్రయోగించవలెను. లాభాదులందును. మంత్ర దీవాదులందును వషట్కారమే సిద్ధిదాయకము. మంత్రదీక్ష నిచ్చు ఆచార్యుని యమునిగా భావించి “ప్రభో ! నీవు యముడవ యమధర్మరాజువు. కాలరూపుడవు, ధర్మరాజువు. నేను సమర్పించు ఈ శత్రువును శీఘ్రముగా సుహ రింపుము' అని ప్రార్థించవలెను. అపుడు శత్రుసంహారకు డగు ఆచార్యుడు ప్రసన్న చిత్తముతో ఈ విధముగ ప్రత్యుత్తరము ఇవ్వవలెను. “సాధకా! నీవు సఫలుడ వగుదువు గాక. నేను ప్రయత్నపూర్వకముగ శత్రువును చం పెదను” శ్వేత కమలముపై యమధర్మరాజును పూజించి, హోమము చేయుటచే ఈ ప్రయోగము సఫల మగును. తనను భైరవునిగా భావించచు తనలో కులేశ్వరి కూడ ఉన్నట్లు భావన చేయవలెను. ఇట్లు చేయుటచే సాధకునకు రాత్రియందు తన వృత్తానము, శత్రువునకు సంబంధించిన వృత్తాంతము తెలియును. “దుర్గే దుర్గే రక్షిణి” అను మంత్రముతో, దుర్గాపూజ చేయుటచే సాధకుడు శత్రునాశనసమర్థుడగును. “హ స ష మ ల వ ర యు మ్” ఆను భైరవీ మంత్రమును జపించుటచే సాధకుడు శత్రుసంహారము చేయగల్గును.
అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమున షట్కర్మనిరూపణ మనునూటముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 138 of the Agni Purāṇa is as follows:
The six classical tantric operations (ṣaṭkarman) are defined: śānti (pacification), vasīkaraṇa (attraction), stambhana (immobilization), vidveṣaṇa (sowing enmity), uccāṭana (uprooting), and māraṇa (causing death). Agni provides the general mantra-framework and ritual conditions for each, noting that only śānti and puṣṭi prayogas are freely permissible; the remaining four are hedged with strict conditions and warnings. The appropriate deities, colours, directions, and samidhs for each operation are listed. The text emphasizes that ṣaṭkarma used for adharmic ends results in the practitioner suffering the intended effect.