అగ్ని మహా పురాణము

63 - అథ సుదర్శనచక్రాదిప్రతిష్ఠాకథనమ్.

శ్రీ భగవానువాచః

ఏవం తార్ఖ్యస్య చక్రస్య బ్రహ్మణో నృహరే స్తథా

ప్రతిష్ఠా విష్ణువత్కార్యా స్వస్యమ స్తోణ తాం శృణు.

సుదర్శన మహాచక్ర శాస్త్ర దుష్టభయంకర

ఛిన్ది ఛిన్ది ఛిఛి ఛిఛీ విదారయ విదారయ.

పరమక్రాన్ గ్రస గ్రస భక్షయ భక్షయ భూతాన్

త్రాసయ త్రాసయ హుం ఫట్ సుదర్శనాయ నమః.

అభ్యర్య చక్రం చానేన రణే దారయతే రిపూన్

ఓం క్షౌ నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల

స్వాహా.నరసింహస్య మంత్రోయం పాతాలాఖ్యస్య వచ్మి తే.

హయగ్రీవుడు చెప్పెన : గరుడ - సుదర్శన - బ్రహ్మ-నృసింహమూర్తుల ప్రతిజ్ఞ కూడ, వారి వారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము. “ఓం సుదర్శన... సుదర్శనాయ నమః” అను (మూలపులో వ్రాసిన) మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు. “ఓం శేం నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా” అనునది నరసింహ మంత్రము. ఇప్పుడు నీకు పాతాలనృసింహమంత్ర ముపదేశించుచున్నాను.

ఓం వోం నమో భగవతే నరసింహాయ, ప్రదీప్త సూర్యకోటి సమతేజ నే

వజ్రనఖదంష్ట్రాయుధాయ, స్ఫుటవికట వికీర్ణ కేసర సటాగ్ర ప్రక్షుభిత

 మహార్ణవామ్బోదున్దుభినిర్దోషాయ, సర్వమన్తోత్తారణాయ, ఏ హేహి

భగవన్న రసింహ, పురుష, పరాపర బ్రహ్మ, సత్యేన స్ఫుర- సుర, విజృమ

విజృమ్భ, ఆక్రమ-ఆక్రమ, గర్ణ-గర్ణ, ముఞ్చ-ముఞ్చ, సింహనాదాన్,

విదారయ-విదారయ, విద్రావయ-విద్రావయ, ఆవిశ - ఆవిత , సర్వమంత్ర

రూపాణి సర్వమన్తజాతీశ్చ హన-హన, ఛిన్ద-చిన్ద, సంక్షిప-సంక్షిప,

సర-సర, (దర-దర) దారయ-దారయ, స్పుట-స్పుట, స్పోటయ-స్పోటయ, జ్వాలా

 మాలాసంఘాతమయ, సర్వతోనన జ్వాలావడ్రాశ నిచ కేణ సర్వపా

తాబాన్ ఉత్సాదయ- ఉత్సాదయ, సర్వతోనన జ్వాల

వజ్రకరపఞ్చ రేణ సర్వపాతాలాన్ పరివారయ-పరివారయ, సర్వపా

తాలాసుర వాసినాం హృదయాన్యాకర్షయ ఆకర్షయ. శీఘ్రం దహ-

 దహ, పచ-పచ, మథ-మథ, శోషయ-శోషయ, నికృన య-వికృన్తయ,

తావద్యావన్మే వశమాగతాః పాతాళేభ్యః (ఫట్ సురేభ్యః) ఫట్ అసు రేభ్యః , ఫట్

మంత్రరూ పేభ్యః ఫట్, మనజాతిభ్యః ఫట్, సంశయాన్మాం భగవన్న రసిం

హరూప విష్ణో సర్వాపద్భ్యః సర్వమన్తరూ పేభ్యో రక్ష రక్ష హుం ఫట్

నమో నమస్తే.”

ఇది పాతాలనృసింహమంత్రము. దీనిని ఈ విధముగ జపించగనే సత్పలము లభించును. శత్రువు ఆపకారము చేయు అసురులుమొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము అని దీని తాత్పర్యము. మధ్యనున్న 'హుం' 'ఫట్' ఆనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణమాత్రముచేతనే అవి నశింపచేయుటలను ఆర్గమును సూచించును. “ఫట్' అనుదానికి మారకాస్త్రమని పేరు.]

“ప్రకాశించుచున్న కోటిసహస్రసూర్యులతో సమానమైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు, కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభిధ్వని కలవాడును, సర్వమంత్రప్రయోగ ములనుండి తరింపచేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము. భగవంతుడవైన నర సింహా! రమ్ము; రమ్ము పురుషాః పరాపరబ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము ప్రకాశించుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, ఆక్రమించుము. గర్జించుము, గర్జించుము. సింహ నాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము. పారద్రోలుము, పారద్రోలుము. ఆవేశించుము, ఆవేశించుము. సర్వ మంత్రరూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బద్దలుకొట్టుము, బద్దలుకొట్టుము. జ్వాలామాలాసముదాయస్వరూపాః ఆంతటను వ్యాపించిన అనంత మైన జ్వాలలయొక్కయు, వజములయొక్కయు, ఆశనులయొక్కయు సముదాయముచే పాతాలము లన్నింటిని నశింపచేయుము, నశింపచేయుము. అంతటను వ్యాపించిన, అనంత మైన జ్వాలలచేతను, వజ్రముల చేతను, శరపంజరముచేతను పాతాళముల నన్నింటిని చుట్టుముట్టుము. సర్వపాతాలములందు నివసించు అసురుల హృదయము లను లాగుము, లాగుము. శీఘ్రముగ కాల్చివేయుము, కాల్చివేయుము. వండుము, వండుము. మథించుము, మథించుము. ఎండ చేయుము, ఎండచేయుము. వారందరును నాకు వశ మగునంతవరకు ఖండించుము, ఖండించుము. “పాతాలేభ్యః ఫట్, అసురేభ్యః ఫట్, మనరూ పేభ్యః ఫట్, మంత్రజాతిభ్యః ఫట్” భగవంతుడవైన, నరసింహ రూపములో నున్న ఓ విష్ణ! నన్ను సందిగ్ధ స్థితి నుండియు, సర్వాపదల నుండియు, సర్వమంత్ర రూపములనుండియు రక్షింపుము, రక్షింపుము, “హుం”, “ఫట్” నీకు నమస్కారము, నమస్కారవం”.

నరసింహస్య విద్యేయం హరిరూపార్థసిద్ధిదా.

త్రైలోక్యమోహనైర్మనౌ స్థాప్య స్త్రైలోక్యమోహనః

గదీ దమే శాస్త్రి కరో ద్విభుజో వా చతుర్భుజః.

వామోధ్వే కార యచ్చక్రం పాణ్చజన్యమథో హ్యధః

శ్రీపుష్టిసంయుతం కుర్యాద్బవేన సహభద్రయా.

ప్రాసాదే స్థాపయేద్విష్ణుం గృహే వా మడ్డ పేపి వా

వామనం చైవ వైకుణం హయాస్యమనిరుద్ధకమ్

స్థాపయేజ్జలశయ్యాస్థం మత్స్యాదీంళ్చావతారకమ్

సజ్కక్షణం విశ్వరూపం లిఙం వై రుద్రమూర్తి కమ్.

అర్ధ నారీశ్వరం తద్వద్ధరిశ జ్కరమాతృకాకి

శైరవం చ తథా సూర్యం గ్రహాంస్త ద్వద్వినాయకమ్.

గౌరిమింద్రాదిభిః సేవ్యాం చిత్రజాం చ బలాబలామ్

ఇది శ్రీహరిరూపిణి యగు నృసింహవిద్య, సర్వార్థములను ఒసగునది. త్రైలోక్యమోహన శ్రీ విష్ణుమూర్తి ప్రతిష్ట త్రైలోక్యమోహనమంత్ర సమూహముతో చేయవలెను. ద్విభుజవిగ్రహమునకు ఎడమ చేతిలో గద, కుడి చేతిలో అభయ ముద్ర ఉండవలెను. చతుర్భుజరూప మైనచో పై కుడి చేతిలో చక్రము, పై ఎడమచేతిలో పాంచజన్యము ఉండవలెను. ఈ విగ్రహముతో శ్రీపుష్టులను గాని, బలరామ-సుభద్రలను గాని స్థాపింపవలెను. శ్రీవిష్ణు-వామన - వైకుంఠ-హయగ్రీవఅనిరుద్ధులను ప్రాసాగములో గాని గృహములో గాని, మండపమునందు గాని స్థాపింపవలెను. మల్యాద్యవతారములలో జల శయ్య పై స్థాపించి పరుండబెట్టవలెను. సంకర్షణ - విశ్వరూప-రుద్రమూర్తిలింగ ఆర్ధనారీశ్వర-హరిహర-మాతృకాగణభైరవ-సూర్య-గ్రహ-వినాయకులను, ఇంద్రాదులచే సేవింపబడు గౌరిని, చిత్రజను, బలాబలవిద్యను కూడ ఈ విధముగనే స్థాపింపవలెను.

పుస్త కానాం ప్రతిషాం చ వ్య లిఖనత ద్విధిమ్.

స్వస్తి కే మణ్డలేభ్యర్చ్యశరపత్రాసనే స్థిరమ్

లేఖ్యం చ లిఖితం పుస్తం గురుర్విద్వాం హరిం యజేత్

యజమానో గురుం విద్యాం హరిం లిపికృతం నరమ్

ప్రాజ్ముఖః పద్మినీం ధ్యాయేల్లిఖిత్వా శ్లోక పశ్చికమ్.

రౌప్యస్థమష్యా హెమ్యా చ లేఖన్యా నాగరాక్షరమ్

బ్రాహ్మణాన్ భోజయచ్ఛక్త్యా శక్త్యా దద్యాచ్చ దక్షిణామ్.

గురుం విద్యాం హరిం ప్రార్చ్య పురాణాది లిఖేన్నరః

పూర్వవన్మజ్ఞలాద్యైశ్చ ఐశాన్యాం భద్రపీఠ కే.

దర్పణే పుస్తకం దృష్ట్వా సేచయేత్పూర్వవద్దదే

నేత్రోన్మీలనకం కృత్వా శయ్యాయాం తు న్య సేన్నరః,

న్య సేత్తు పౌరుషం సూక్తం వేదాద్యం తత్రపుస్త కే

కృత్వా సజీవీకరణం ప్రార్చ్య హుత్వా చరుం తతః.

సంప్రార్చ్య-దక్షిణాభిస్తు గుర్వాదీన్ఫోజయేద్ది జాన్

రథేన హస్తి నా వాపి భ్రమయేత్పుస్తకం నరై.

గృహే దేవాలయాదౌ తు పుస్తకం స్థాప్య పూజయేత్

వస్త్రాదివేష్టితం పాఠాదాదావనే సమర్చయేత్.

జగ చ్చా చావధార్య పుస్తకం వాచయేన్నరః

అధ్యాయ మేకం కుమ్బాద్భిర్యజమానాది సేచయేత్.

ద్విజాయ పుస్త కం దత్వా ఫలస్యానో న విద్యతే

త్రీణ్యాహురతిదానాని గావ పృథ్వీ సరస్వతీ.

విద్యాదానఫలం దత్త్యా మష్యాక పత్రసంచయమ్,

యావత్తు పత్రసంఖ్యానమక్షరాణాం తథానమ.

తావద్వర్షసహస్రాణి విష్ణు లో కే మహీయతే

పఞ్చారాత్రం పురాణాది భారతాది దదన్నరః.

కు లైక వింశముద్ధృత్య పరే తత్వే తు లీయతే.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే దేవతాది ప్రతిష్ఠాకథనం నామ త్రిషష్టితమోధ్యాయః.

ఇపుడు నేను గ్రంథ ప్రతిష్టను దానిలేఖన విధానమునుగూర్చి చెప్పెదను, ఆచార్యుడు స్వస్తిక మండలముపై శరయంత్రా సనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని), లిఖిత పుస్తకమును, విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభీముఖుడై పద్మివిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరి లిపిలో వ్రాయవలెను. ఎదట బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను, ఆచార్య-విద్యా-శ్రీ మహావిష్ణువులను పూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటి వలె మండలాదుల పై ఈశాన్యము నందున్న అద్దముమీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశ ములచే తడపవలేను. పిదప యజమానుడు నేత్రములను తెరచి, ఆ పుస్తకమును శయ్య పై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుషసూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్టా పూజాచరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రాహ్మణ భోజనము ఏర్పరుపవలేను. ఆంతమున ఆ పుస్తకమును గృహమునందు గాని, దేవాలయమునందు గాని స్థాపించి పూజించవలెను. గ్రంథమును వస్త్రముతో ఆచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును. అంతమునందును దానిని పూజించవలేను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలె నని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగు వారికి అభిషేకము చేయించవలెను. బ్రాహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన భూదాన విద్యాదానము లను మూడు దానములకును అతిదానము అని పేరు. పాలుపిదుకుట, విత్తనములు, చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసిన వాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో రాసిన పత్రములను దానము చేసినచో విద్యాదానఫలము లభించును. ఆ పత్రము లెన్ని యున్నవో, అక్షరము లెన్ని యున్నవో అన్ని వేల సంవత్సరములు దాత విష్ణులోకములో పూజింప బడును. పంచరాత్రము, పురాణములు, మహాభారతము దానము చేసిన వాడు తన వంశములో ఇరువది యొక్క తరము వారిని ఉద్ధరించి తాను పరమ తత్త్వమునందు విలీను డగును.

అగ్ని మహాపురాణమునందు దేవతాప్రతిష్టాకథన మను ఆరువదిమూడవ అధ్యాయము సమాప్తము.