పుష్కర ఉవాచః-
గ్రామస్యాధిపతిం కుర్యాద్దశ గ్రామాధిపం నృపః ।
శతగ్రామాధిపంచాన్యం తథైవ విషయేశ్వరమ్.
తేషాం భోగ విభాగశ్చ భవేత్కర్మానురూపత ।
నిత్యమేవత థాకార్వం తేషాంచారైః పరీక్షణమ్.
గ్రామేదోషాన్సముత్పన్నా న్ గ్రా మేశః ప్రశమం నయేత్ ।
ఆశక్తోదశపాలస్య సతు గత్వా నివేదయేత్.
శ్రుత్వాపి దశ పాలోఽపి తత్రయుక్తి ముపాచరేత్ ।
విత్తాద్యాప్నోతి రాజావై విషయాత్తు సురక్షితాత్.
ధనవాన్ ధర్మమాప్నోతి ధనవాన్ కామమశ్నుతే ।
ఉచ్ఛిద్యన్ తే వినాహ్యర్ధైః క్రియా గ్రీష్మే సరిద్యథా.
విశేషో నాస్తిలో కేషు పతితసాధనస్య చ ।
పతితాన్నతు గృహ్ణంతి దరిద్రో న ప్రయచ్ఛతి.
ధనహీనస్య భార్యాపి నై కాస్యాదుపవ ర్తినీ ।
రాష్ట్రపీడాక రోరాజా నరకే వసతే చిరమ్.
నిత్యం రాజ్ఞా తథా భావ్యం గర్భిణీ సహధర్మిణీ ।
యథాస్వం సుఖముత్సృజ్య గర్భస్య సుఖమావ హేత్.
కిం యజ్ఞై స్తపసాతస్య ప్రజాయస్యన రక్షితాః ।
సురక్షితాః ప్రజా యస్య స్వర్గస్తస్య గృహోపమః.
ఆరక్షితాః ప్రజా యస్య నరకం తస్య మందిరమ్ ।
రాజాషడ్బాగమాదత్తే సుకృతాద్దుష్కృతాదపి.
ధర్మాగమో రక్షణాచ్చ పాపమాప్నోత్యరక్షణాత్ ।
సుభ గా విటభీతేవ రాజవల్లభ తస్కరైః.
భక్ష్యమాణాః ప్రజారక్ష్యాః కాయ స్థైశ్చ విశేషతః ।
రక్షితా తద్భయేభ్యస్తురాజ్ఞోభవతిసాప్రజా.
అరక్షితా సా భవతి తేషా మేవేహ భోజనమ్ ।
దుష్టసమ్మర్దనం కుర్యాచ్చా స్త్రోక్తం కర మాదయేత్.
కోశే ప్రవేశ యేదర్థం నిత్యం చార్ధం ద్విజేదదేత్ ।
నిధిం ద్విజోత్తమః ప్రాప్య గృహ్ణీయాత్సకలం తథా.
చతుర్థమష్టమం భారం తథాషోడశమం ద్విజః ।
వర్ణక్రమేణ దద్యాచ్చ నిధిం పాత్రేతు దర్మతః.
అనృతంతువదన్దండ్య సువి త్తస్యాంశమష్టమమ్ ।
ప్రసష్టస్వామికంరిక్థం రాజాత్య్రబ్దం నిదాపయేత్ .
అర్వాక్ త్య్రబ్దాద్దరేత్స్వామీ పరేణనృపతి ర్హరేత్ ।
మమేదమితి యో బ్రూయాత్సోర్థయుక్తోయథావిధి.
సమ్పాద్య రూపసంఖ్యాడీ న్స్వామీ తద్ద్రవ్యమర్హతి ।
బాలదాయాదికం రిక్థం తావ ద్రాజాతుపాల యేత్.
యావత్స్యాత్స సమావృత్తో యావద్వాతీత శైశవః ।
బాలపుత్రాసు చైవం స్యాద్రక్షణం నిష్కులాసుచ.
పుష్కరుడు పలికెను : రాజు ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క అధిపతిని నియమించవలెను. పదేసి గామములకు ఒక అధ్యక్షుని, నూరేసి గ్రామములకు మరొక అధ్యక్షుని నియమించవలెను. వారందరి పైనను మొత్తము రాష్ట్రమునకు శాసకుడుగ ఒకనిని నియమించవలేను. వారందరికిని వారివారి పనులను బట్టి వేరువేరుగా భృతిని నిర్ణయించ వలెను. గూఢచారులద్వారా ప్రతిదినము వారి ప్రవృత్తులనుగూర్చి తెలుసుకొనుచుండవలెను. గ్రామములో ఏదైనదోషము (వ్యవహారము) ఉత్పన్నమైనచో గ్రామాధిపతి దానిని పరిష.. రించవలెను. తానుపరిష్కరింపజాలకున్నచో దశ గ్రామాధిపతి వద్దకు వెళ్ళి ఆవిషయములన్నియు ఆతనికి తెలుపవలెను. విషయమునంతను తెలిసికొనిన పిమ్మట దశ గ్రామాధిపతి ఆదోషమును పరిష్కరించుటకు ప్రయత్నించవలెను. రాజ్యము సురక్షితముగా ఉన్న యెడలనే రాజునకు దానినుండి ధనాడులు లభించును. ధనవంతుడే ధర్మమునార్జించగలుగును. అతడే కామసుఖములను అనుభవింపగ లగును. ధనములేనిచో గ్రీష్మమునందు నదుల నీరు ఎండిపోయినట్లు కార్యములన్నియు విఫలములై పోవును. ఈ ప్రపంచమునందు పతితునకును, దరిద్రునకును భేద మేమియు లేదు. పతితునిచేతినండి ఎవరును ఏవస్తువును తీసికొనరు. దరిద్రుడుకూడ ఏమి లేనివాడగుటచే ఇతరుల కేమియు ఇవ్వ జాలడు భార్యకూడ దరిద్రుని మాట వినదు. అందుచే రాష్ట్రమునుపీడించి, దానిని నిస్సారముచేయు రాజు చిరకాలము నరకములో సండను. గర్భవతియైన స్త్రీ తనసుఖముకొరకు చూచుకౌనక గర్భస్థశిశువుడే మానికై ప్రయత్నించునో, అట్లే రాజు కూడ ప్రజార క్షణమునే సర్వదాదృష్టిలోనుంచుకొనవలెను. ప్రజలను రక్షించ జాలనీరా జు యజ్ఞము, తపస్సు చేసి ఏమి ప్రయోజనము? ప్రజలను బాగుగా రక్షించు వాని గృహమేస్వర్గము. ప్రజలు కష్టపడుచున్న రాజు గృహమే నరకము. ప్రజల పుణ్యపాపములలో ఆరవవంతు రాజుకు చెందును. రక్షించుట చే ప్రజలపుణ్యమునందలి ఆగవభాగమును పొందినట్లే రక్షించకపోవుట చే వారి పాపములోని ఆరవవుతుగూడ పొందును. పర స్త్రీలంపటలగు దరాత్ములనుండి పతివ్రతలను రక్షించుట ధర్మము. రాజ బంధువులచేతను, చోరులచేతను, అధికారులచేతను పీల్చివేయబడుచున్న ప్రజలను రక్షించవలెను. ప్రజలను బాగుగా రక్షించినచో వారు రాజుకు ఉపయోగ పడుదురు. ప్రజలను రక్షించకున్నచో వారు పైన చెప్పిన రాజ బంధ్వాదులకు గ్రాసమైపోదురు. ఆదుచే రాజు దుష్టులను శిక్షించి కాస్తోక ప్రకారము ప్రజలనుండి పన్ను తీసికొనవలెను. రాజ్యమునందలి సగము ఆయమును కోశాగారములో రక్షించి సగము బ్రాహ్మణులకీయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు దానినంతను గ్రహించి నాల్గవవంతు క్షత్రియులకును, ఎనిమిదవ భాగము వైశ్యులకును, పదునార వభాగము . శూద్రులకును ఇవ్వవలెను. ధనమును ధర్మానుసారముగా సలాతలకు దానము చేయవలెను. ఆసక్యముపలుకువానిని దండించవలెను. వానీధనములో ఎనిమిదవవంతు దండముగా తీసికొనవలెను. స్వామి ఎవరో తెలియని ధనమును రోజు మూడుసంవత్సరముల పాటు తనవశములో నుంచుకొనవలెను. మూడు సంవత్సరములలోపుగా ధసస్వోమి వచ్చినచో ఆధవమును అతడు తీసిన వచ్చును. ఆసమయము దాటినచో ఆ ధనము రాజధన మైపోవును. మూడుసంవత్సరములలోపున వచ్చి ‘ఇది నాధనము’ అని చెప్పుచు, ధనస్వామి దాని స్వరూపము, సంఖ్య మొదలగు వాటిని రాజు ఎదుట సరిగా చెప్పగలిగినచో ఆ ధనము పొంద వచ్చును. చిన్న పిల్లవానికి చేరిన సొత్తును రాజు, ఆతనికి సమావర్తన సంస్కారము అగువరకును లేదా అతని బాల్యావస్థ తీరువరకును తన ఆధీనమునందుంచుకొనవలెను. సంరక్షులెవ్వరును లేని కాలమునందు పిల్లలు చిన్నవారైనపుడు స్త్రీల పోషణ బాధ్యత కూడ రాజు వహించవలెను.
పతివ్రతాసు చ స్త్రీషు విధవస్వాతురాసుచ ।
జీవ న్తీనాం తు తాసాం యే సంహరేయుః స్వబాంధవాః.
తాఞ్చిష్యాచ్చౌరదండేన ధార్మికః పృథివీపతిః ।
సామాన్యతోహృతం చౌరై స్తద్వై దద్యాత్స్వయంనృప.
చౌరరక్షాధికారిభ్యో రాజాపిహృతమాప్నుయాత్ ।
అహృతే యో హృతం బ్రూయాన్నిః సార్యోదండ్యఏవనః.
నతద్రాజ్ఞా ప్రదాతవ్యంగృ హేయద్గృహగైర్హృతమ్ ।
స్వరాష్ట్రపణ్యాదాదద్యాద్రాజా వింశతిగం ద్విజ.
శుల్కాంశం పర దేశాచ్చక్షయవ్యమ ప్రకాశకమ్ ।
జ్ఞాత్వాసంకల్పయేచ్ఛుల్కం లాభంవణిగ్యథాప్నుయాత్.
వింశాంశం లాభమాదద్యాద్దండనీయ స్తతోఽన్యథా ।
స్త్రీణాం ప్రవ్రజితానాం చ తరశుల్కం వివర్జయేత్.
తరేషు దాశ దోషేణ నష్టం దాశాంస్తు దాపయేత్ ।
శూక ధాన్యేషు షడ్భాగం శింబిధాన్యేతథాష్టమమ్.
రాజావన్యార్థమాదద్యాద్దేశ కాలానురూపకమ్ ।
పఞ్చషడ్భాగమాదద్యాద్రజా పశుహిరణ్యయోః.
గంధౌషధిరసానాం చ పుష్పమూల ఫలస్య చ ।
పత్రశాక తృణానాం చ వంశీ వైణవ చర్మణామ్.
వైద లానాం చ భాండానాం సర్వ స్యాశ్మమయస్య చ ।
షడ్భాగమేవ చాదద్యాన్మధుమాంసస్యసర్పిషః.
పతివ్రతలైన స్త్రీలు వైధవ్యము పొందివను, రోగగ్రస్తులైన వారిని కూడ ఈ విధముగనే రక్షించవలేను. ఆట్టి స్త్రీలు జీవించి ఉండగా వారి బంధువులెవ్వరైవ హాళ, ధనమును అపహరించినచో రాజు పారిని చోరులను దండించినట్లు దండించవలెను. చోరులు ప్రజల ధనమును అపహరించినపుడు రాజు పోయినంత ధనమును ప్రజలకిచ్చి, దానిని రక్షాధికారుల నుండి రాబట్టవలెను. ధనము అపహంపబడకపోయినను అపహంపబడినట్లు చెప్పిన దానిని దండించి రాజ్యము నుండి బైటకు పంపిచేయవలెను. ధనమును ఇంటిలోని హరే దొంగిలిచినపుడు రాజు తన ధనమును ఈయవ:సిన పనిలేదు. రాజ్యమునందలి ఆపణము నుండి వారి ఆదాయములో వవవంతు పన్నుగా రాజు గ్రహించవలెను. పరదేశము మంచి వస్తువులు దిగుమతి చేసుకోను నపుడు ఎంత ఖర్చు, నష్టము అగునో దానిని కాలిబుక్కుల ద్వారా పరిశేటించి, వస్తువు మీద పన్ను ఎంత ఇచ్చుచున్నారో చూచి ప్రతి వ్యాపారస్థుని మీదను ఆతనికి నష్టము కలగ కుండునట్లు పన్ను వేయవలెను. రాజు ఆదాయములోని ఇరువదవవంతు మాత్రమే తీసికొనవలెను. ఎవరైన అధికారి అంతకంటే ఎక్కువ వసూలు చేసినచో ఆతని దండించవలెను. స్త్రీల నుండియు, సన్యాసుల నుండియు నావ దాటించుటకు కేవు తీసుకొన గూడదు. నావికుని పొరబాటుచేత ఏ వస్తువై న నష్టమైనచో ఆ నష్టము నావికుని నుండి వసూలు చేయవలెను. శూకధాన్యములో (వరి, గోధుమ మొ.) ఆరవవంతు, శింబిధాన్యములో (శనగ మొ.) ఎనిమిదవ వంతు పన్నుగా తీసికొనవలెను. అడవిలో పండు ఫలమూలాదులపై గూడ దేశ కాలానుసారముగా పన్ను గ్రహించవలెను. పశువులలో ఐదవ భాగము, బంగారములో ఆరవ భాగము తీసికొనవలెను. గంధము, ఓషధులు, రసము, పుష్పములు, ఫలములు, మూలములు, పత్రములు, శాకములు, తృణము, వెదురు, చర్మ, వెదురుబుట్టలు, శిలాపాత్రలు, మధువు, మాంసము, నెయ్యి వీటిపై కూడ ఆదాయములో ఆరవవతు మాత్రమే వసూలు చేయవలెను.
మ్రియమాణోపి నాదద్యాద్బ్రాహ్మణేభ్య స్తథాకరమ్ ।
యస్యరాజ్ఞస్తు విషయే శ్రోత్రియః సీదతిక్షుధా.
తస్యసీదతి తద్రాష్ట్రం వ్యాధిదుర్భిక్షతస్కరైః ।
శ్రుతం వృత్తంతు విజ్ఞాయ వృత్తిం తస్య ప్రకల్పయేత్ .
రక్షేచ్ఛ సర్వత స్త్వేనం పితా పుత్రమివౌరసమ్ ।
సంరక్ష్యమాణోరాజ్ఞాయః కురుతేధర్మమన్వహమ్.
తేనాయుర్వర్ధతేరాజ్ఞో ద్రవిణం రాష్ట్రమేవ చ ।
కర్మకుర్యున్న కేంద్రస్య మాసేనై కంచశిల్పినః ।
భుక్తమాత్రేణ యే చాన్యం స్వశ రీరోపజీవినః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రాజధర్మో నామ త్రయోవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః॥
బ్రాహ్మణుల నుండి ప్రియవస్తువేదియు, లేదా పన్ను తీసికొనగూడదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులు ఏ రాజు రాజ్యములో ఆకలితో బాధపడుచుందురో ఆ రాజ్యము రోగములు, కరువు, దోపిడీదొంగలు వీటిచే పీడింపబడును. ఆందు వలన బ్రాహ్మణుల విద్యా సదాచారాదులను తెలిసికొని వారికి అనుకూలమగు జీవికను ఏర్పాటు చేయవలెను. తండ్రి తన కుమారుని పాలించినట్లు రాజు సదాచారవంతులును, విద్వాంసులును అగు బ్రాహ్మణులను పాలించవలెను. రాజుచే రక్షింపబడి బ్రాహ్మణుడాచరించు స్వధర్మానుష్టానముచే రాజు యొక్క ఆయుర్దాయము పెరుగును. రాష్ట్రము, కోశము కూడ వృద్ధి పొందును. శిల్పకారులు వేతనము తీసికొనకుండ, భోజనము మాత్రము చేసి మాసము నందు ఒక రోజు రాజు పనులు చేయవలెను. రాజ్యములో నివసించుచు శరీర పరిశ్రమచే జీవించు ఇతరులు కూడ ఈ విధముగనే మాసమునందొక రోజు రాజకార్యములు చేయవలెను.
ఆగ్నిమహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 223 of the Agni Mahā Purana is as follows:
This chapter presents an overview of the major vratas observed throughout the Hindu lunar calendar. Each vrata's presiding deity, the tithi on which it falls, the prescribed fast, pūjā procedure, and phalasruti are summarized. The Ekādaśī vrata honoring Viṣṇu, the Śivarātri honoring Śiva, the Navaratri honoring Devī, and the Gaṇeśa Caturthī are among those described. Agni declares that sincere observance of vratas purifies accumulated karma and leads the soul toward mokṣa.