అగ్ని మహా పురాణము

59 - అథాధివాసకథనమ్

శ్రీ భగవానువాచః

హరేః సాన్నిధ్యకరణ మధివాసన ముచ్యతే

సర్వజ్ఞం సర్వగంధ్యాత్వా ఆత్మానం పురుషోత్తమమ్.

ఓంకా రేణ సమాయోజ్య చిచ్చ క్రిమభిమానినమ్

నిఃసార్యాత్మైకతాం కృత్వా స్వస్మిన్ సర్వగతే విభౌ.

యోజయేన్మరుతా పృథ్వీం వహ్ని బీజేప దీపయేత్

సంహ ద్వాయునా చాగ్నిం వాయుమా కాశతోనయేత్ .

అధిభూతాధిదై వేస్తు సాధ్యాతైర్విభవైః సహ

తన్మాత్రపాతకాన్ కృత్వా సంహరే త్తత్రమాద్బుధః.

ఆకాశం మనసాహృత్య మనోహజ్కరణేకురు

అహఙ్కారం చమహతి తం చాప్యవ్యాకృతేనయేత్ .

హయగ్రీవుడు చెప్పెను : శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు ఆధివాసనమని పేరు. “నేను సర్వజ్ఞుడు, సర్వవ్యాపియు ఆయిన పురుషోత్తముడమ” అని భావన చేయుచు సాధకుడు ఓంకార వాచ్యుడగు పరమాత్మతో ఏకత్వంను చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరు చేసి, ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి, స్వాత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపి వేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయ వలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశ మునందు లీనము చేయవలెను. అధిభూత - అధ్యాత్మ - అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మా త్రలలో విలీనము చేసి, వీటినన్నింటిని క్రమముగ ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకాశ మన మనస్సునందు మనస్సును అహంకారమునందు, అహంకారమును మహత్తత్త్వమునందు, తహ తత్త్వమును అప్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.

అవ్యాకృతం జ్ఞానరూపే వాసుదేవఃస ఈరీతః

సతామవ్యాకృతాం మాయామవష్టభ్య సిసృషయా.

 సజ్కర్షణం స శబ్దాత్మా స్పర్శాఖ్యమ సృజత్ర్పభుః

క్షోభ్యమాయాం సప్రద్యుమ్నం తేజోరూపసచాసృజత్.

అనిరుద్ధం ర సమాత్రం బ్రహ్మాణం గన్దరూపకమ్

అనిరుద్ధః సచ బ్రహ్మా అప ఆదౌ ససర్జహ.

తస్మిన్ హిరణ్మయం చాణం సోసృజత్ప్చభూతవత్

తస్మిన్ సంక్రామితే జీవే శ క్తి రాత్మోపసంహృతా.

ప్రాణో జీవేన సంయుక్త వృత్తిమానితి శబ్ద్యతే

జీనోవ్యాహృతి సంజ్ఞస్తు ప్రాణేష్వాధ్యాత్మిక స్మృతః.

 ప్రాణై ర్యుక్తాతతో బుద్ధిః సంజాతా చాష్టమూ ర్తికా

అహఙ్కార స్తతో జజ్జీ మన స్తస్మారదజాయత.

అర్థాః ప్రజజ్ఞిరే పఞ్చా సంకల్పాదియుతా స్తతః

శబ్దః స్పర్శశ్చ రూపంచ రసోగన్ద ఇతిస్మృతాః.

ఆప్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు విలీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృతమాయాశ్రయముచే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను ముఖముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్దుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమొదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచార మేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తి యే. జీవశక్తితో ప్రాణము నకు సంయోగ మేర్పడినప్పుడు ఆది ‘వృత్తి మతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి ఆధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ది పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును. బుద్ది నుండి ఆహంకారము, అహంకారమునుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద - స్పర్శ - రూప - రస - గంధము లనెడు సంకల్పాదియు క్త ముంగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.

జ్ఞానశ క్తియుతాన్యేతై రారబ్దానీన్తి యాణితు

త్వక్ చ్రోత్ర ఫ్రణ చక్షంషి జిహ్వాబుద్దీంద్రీయాణితు.

పాదౌ పాయు స్తథాపాణి వాగుపస్థశ్చ పఞ్చమః

కర్మేశ్రియాణి చై తానిపణ భూతాన్యతః శృణు.

ఆకాశ వాయు తేజాంసి సలిలం పృథివీ తథా

స్థూలమేభిః శరీరంతు సర్వాధారం ప్రజాయతే.

ఏతేషాం వాచకా మన్రా న్యాసాయోచ్యన ఉత్తమాః

జీవభూతం మకారంతు దేవస్య వ్యాపకం న్య సేత్.

ప్రాణత త్వం భకారంతు జీవోపాధిగతం న్య సేల్

హృదయస్థం బకారంతు బుద్ధిత త్వం న్య సద్బుధః.

ఫకార మపి తత్రైవ అహఙ్కారమయం న్య సేత్

మనస్తత్వం పకారంతు స్య సేత్స జ్కల్ప సంభవమ్.

            వీటినుండి జ్ఞానశక్తి గల త్వక్ - శ్రోత్ర - ఘ్రాణ - నేత్ర - జిహ్వలను ఐదు ఇంద్రియములావిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద - పాయు పాణి - వాక్ - ఉపస్థలు పంచకర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాశ వాయు తేజో - జల - పృథివులు పంచమహాభూతములు. అన్నింటికిని ఆధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈత త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసమునిమిత్తమై చెప్పు చున్నాను. ‘మం’ అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వవాచకము) ఇది శరీరమంతయు వ్యాపించియున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపక న్యాసము చేయవలెను. ‘థం’ అనునది ప్రాణతత్త్వబీజము, ఇది జీవోపాధియందున్నది. అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వవాచకమగు 'బం' అను బీజమును, విద్వాంసుడు హృదయముపై ప్యాసము చేయవలెను. అహంకారరూపమగు 'సం' అను బీజమును కూడ హృదయమునందే వ్యాసము చేయవలెను. సంకల్ప కరణ భూతమనస్తత్వ రూపమగు ‘పం' అను బీజమును గూడ హృదయమునందే న్యాసము చేయవలెను.

శబ్దతన్మాత్ర తత్త్వంతు నకారంమస్తకే న్య సేత్

 స్పర్మాత్మకంధకారంతు వక్రదే శేతు విన్య సేత్ .

తరం రూపతత్త్వంతు హృద్దే వినివేళ యేత్

థూరం వస్తి దేశేతు రసత న్మాత్రకం న్యసేత్.

ద్విత కారంగస్ధ తస్మాత్రం జజయోర్వినివేశ యేత్

ణకారం శ్రోత్రయోర్న్య స్యఢకారం విన్య సేత్త్వచి.

డకారం నేత్రయుగ్మేతు రసనాయాం ఠకారకమ్

టకారం నాసికాయాంతు ఇకారంవాచి విన్య సేత్.

రకారం కరయోర్న్యస్య పాణితత్త్వం విచక్షణః

జకారం పదయోర్న్యస్య ఛంపాయా చముపస్థ కే.

విన్య సేతృథివీత త్వం జకారం పాదయుగ్మ కే

వస్తా మకారం గంత త్వం లై జసంహృది విన్య సేత్ .

జకారం వాయుత త్వం చ నాసికాయాం నివేశ యేత్

క కారం విన్న్యసేన్నిత్యం ఖత త్త్వం మస్త కే బుధః.

శబ్దతన్మాత్ర తత్త్వవాచక మగు నకారమును (నం) శిరస్సు పైనను, స్పర్శరూప ధకారమును (ధం) ముఖ ప్రదేశమునందును, రూపతత్త్వవాచకమగు దకారమును (దం) నేత్రప్రాంతము నందును, రసతన్మాత్రబోధక. థకారమును (థం) వస్తే ప్రదేశ (మూత్రాశయ) మునందును, గంధతన్మాత్ర స్వరూపమగు తకారమును (తం), పిక్కలయందును, ఇకారమును (ఐం) శ్రోత్రములందును, ఢకారమును (ఢం) త్వక్కుపైనను, డకారమును డం) నేత్రములందును, ఈకారమును (ఠం) జిహ్వయందును. టకారమును (టం) నాసికయందును ఇకారమును (ఇం) వాగింద్రియమునందును, పాతత్త్వ రూప మగు రకారమును (రం) హస్తములందును. జకారమును (జం) పాదములందును, ఛకారమును (ఛం) పాయువునందును చకారము (చం) ఉపస్థయందును, పృథ్వీతత్వ రూపమగు జకారమును (జం) పాదములందును, మకారము (ఘం) వస్తి యందును, తేజస్తత్వరూపమగు (గం) ను హృదయమునందును, వాయుతత్వరూపమగు ఖకారమును (ఖం) నాసికయందును న్యాసము చేయవలెను. కకారము (కం) ఆకాశ తత్త్వరూపమైనది. విద్వాంసుడు దాని నెల్లప్పుడును శిరస్సుపై న్యాసము చేయవలెను.

హృత్ఫుణ్డరీ కే విన్యస్య యకారం సూర్య దైవతమ్

ద్వాస పతి సహస్రాణి హృదయా దభినిఃసృతాః.

కలాషోడశ సంయుక్తం సకారం తత్ర విన్య సేత్

తన్మధ్యే చిన్తయేన శ్రీ బిన్దు వ హ్నే స్తు మజ్ఞలమ్.

హకారం విన్య సేతత్ర ప్రణవేన సురోత్తమ

ఓం వాం పరమేష్ట్యాత్మనే ఆం నమః పురుషాత్మనే.

 ఓంవాం నమో నివృత్త్యాత్మనే నాం చవిశ్వాత్మనే నమః

ఓంవాంనమః సర్వాత్మనే ఇత్యుక్తాః పణ్చ శ క్షయః.

స్థానే తు ప్రథమా యోజ్యా ద్వితీయా ఆసనే మతా

తృతీయా శయనే తద్వచ్చతుర్థి యానకర్మణి.

ప్రత్యర్చాయాం పఞ్చమీ స్యాత్పఞ్చోపనిషదః స్మృతాః

హుంకారం విన్య సేన్మధ్యే ధ్యాత్వా మంత్రమయం హరిమ్.

హృదయ కమలమునందు సూర్యదేవతకు సంబంధించిన 'యం' బీజము న్యాసము చేసి, హృదయము నుండి బయ, ల్వెడలిన డెబ్బది రెండువేలనాడులలో షోడశకలాయుక్త సకార (సం) న్యాసము చేయవలెను. దాని మధ్యభాగమునందు బిందుస్వరూపపహ్ని మండలమును భావించవలేను. ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహితహకార (హం) న్యాసము చేయవలెను. “ఓం ఆం నమ! పర మేష్ట్యాత్మ నే”ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వారి నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే ఓం వం నమః సర్వాత్మనే” అనునవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానమునందును. ఆసనకర్మయందు, ద్వితీయ. శక్తి ని, శయనమునందు తృతీయ శక్తి ని, యానకర్మయందు చతుర్థశక్తిని, ఆర్చనాకాలమునందు పంచమశక్తి ని వినియోగించ వలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు. మంత్రమయు డగు శ్రీహరిని ధ్యానించి క్షకారము (క్షం)ను. న్యాసము చేయవలెను.

యాం మూర్తిం స్థాపయేత్తస్యా మూలమన్తం న్య సేత్తతః

 ఓం నమో భగవతే వాసుదేవాయ మూలకమ్.

శిరోఘ్రణలలాటేషు ముఖీ కణ్ఠే హృది క్ర మాత్

భుజయోరజయోరజ్యోః కేశవం శిరసి న్య సేత్.

నారాయణం న్య ద్వకే గ్రీవాయాం మాధవం న్య సేత్

గోవిన్దం భుజయోర్న్యస్య విష్ణుం చ హృదయే న్య సేత్.

మధుసూదనకం పృషే వామనం జఠ రే న్య సేత్

కట్యాం త్రివిక్రమం న్యస్య జట్టాయాం శ్రీధరం న్యసేత్.

హృషీ కేశం దక్షిణాయాం పద్మనాభం తు గుల్బ కే

దామోదరం పాదయోశ్చ హృదయాది షడజ్గకమ్.

ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తి కి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. “విష్ణు స్థాపన చేసినపుడు) “ఓం నమో భగవతీ వాసుదేవాయ” అనునది మూలముత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు. వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సు పై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయము పై విష్ణువును, పృష్ఠ భాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణభాగమున హృషీ కేశుని, చీలమండల పై పద్మ నాభుని, పాదముల పై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాదిషడంగన్యాసము చేయవలెను. సత్పురుషులలో శ్రేష్ఠుడ వై న బ్రహ్మ దేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణన్యాసము.

ఏతత్సాధారణం ప్రోక్తమాదమూ ర్తేస్తు సత్తమ

అథవా యస్య దేవస్య ప్రారబ్ధం స్థాపనం భవేత్.

తస్యైవ మూలమ శ్రేణ సజీవకరణం భవేత్

యస్యా మూ ర్తోస్తు యన్నామ తస్యాద్యం చాక్షరం చ యత్.

తత్స్వరైర్గ్వాదశై ర్భేద్య హ్యజ్ఞాని పరికల్పయేత్

హృదయాదీని దేవేశ మూలం చ దశమాక్షరమ్.

యథా దేవే తథా దేహే తత్త్వాని వినియోజయేత్

చక్రాబ్దమణ్డలే విష్ణుం యజేద్దనాదినా తథా.

పూర్వవచ్చా సనం ధ్యాయేత్సగాత్రం సపరిచ్ఛదమ్

శుభం చక్రం ద్వాదశారం హ్యుపరిష్టాదించి క్షయేత్.

త్రినాభిచక్రం ద్వినేమి స్వరై సచ్చ సమన్వితమ్

పృష్ఠదేశే తతః ప్రాజ్ఞః ప్రకృత్యాదీన్ని వేళ యేత్.

పూజయేదారకాగ్రేషు సూర్యం ద్వాదశ ధా పునః

కలాషోడశ సంయుక్తం సోమం తత్రవిచి క్షయేత్.

సబలం త్రితయే నాభౌ చిన్తయేద్దేశికో త్తమః

పద్మం చ ద్వాదశ దలం పద్మమధ్యే విచిన్తయేత్.

లేదా ఏదేవత ప్రతిష్టింపబడుచున్నదో దాని మూలమంత్రముచేతనే మూర్తి సజీవకరణ ప్రక్రియ జరుపవలెను. ఆ మూర్తి యొక్క పేరులోని మొదటి అక్షరము గ్రహించి, దానికి పండ్రెండు స్వరములను చేర్చి అంగకల్పన చేయవలెను. దేవేశ్వరా! విగహముపై హృదయాద్యంగన్యాసము, ద్వాదశాక్షరమూలమంత్రన్యాసము, తత్త్వన్యాసము ఏ విధముగ చేయబడునో ఆ విధముగనే తన శరీరముమీద కూడ చేయవలెను. పిమ్మట చక్రాకార మగు పద్మమండలముపై మహావిష్ణు వును గంధాదులచే పూజించవలెను. వెనుకటి వలెనే మహావిష్ణు శరీరమును, వస్త్రాలంకాదులను, ఆసనమును ధ్యానించ వలేను. పై భాగమున పండ్రెండు ఆకుల సుదర్శన చక్రమును ధ్యానించవలేను. ఆ చక్రమునకు మూడు నాభులు, రెండు నేములు (చక్రాంతములు), పండ్రెండు స్వర ములు ఉండును. పిమ్మట విద్వాంసుడు పృష్ణదేశ మన ప్రకృత్యాదులను స్థాపింప వలేను. ఆకులు చివర పండ్రెండు గురు సూర్యులను పూజింపవలెను. పిమ్మట అచట పదునారు కళ లతో కూడిన చంద్రుని ధ్యానించవలెను. చక్రనాభియందు మూడు వస్త్రములను ధ్యానించవలెను. పిమ్మట శ్రేమడైన ఆచార్యుడు పద్మములోపల ద్వాదశదల పద్మమును ధ్యానించవలెను.

తన్మధ్యే పౌరుషీం శ క్తిం ధ్యాత్వా  భ్యర్చ్య చ దేశికః

ప్రతీమాయాం హరిం న్యస్య తత్ర తం పూజయేత్సురాన్.

గన్దపుష్పాదిభిః సమ్యక్ సాజం సావరణం క్రమాత్

ద్వాదశాక్షర బీజైస్తు కేశ వాదీన్ సమర్చయేత్.

ద్వాదశారే మణ్డ పే తు లోకపాలాదికం క్రమాత్

ప్రతిమా మర్చయేత్పశ్చాధన పుష్పాదిభిర్ద్విజ.

పౌరుషేణ తు సూ కేన క్రియాః సూ కేన పిణ్డికామ్

జననాది క్రమాత్పశ్చాజ్జనయే ద్వైష్ణ వాలయమ్.

హుత్వాగ్నిం వైష్ణవైర్మ నౌః కుర్యాచ్చాస్త్యుదకం బుధః

తతిక్త్వా ప్రతిమామూఠి వహ్నిప్రణయనం చరేత్.

దక్షిణేగ్నిం హుతమితి కుజేఒగ్నిం ప్రణమేద్బుధః

అగ్ని మగ్నీతి పూ ర్వేతు కుణేఒగ్నిం ప్రణయేద్బుధః.

ఉత్తరే ప్రణయేదగ్నిమగ్ని మగ్నీ హవామ హే

 అగ్ని ప్రణయనే మంత్ర స్వమగ్నే హ్యగ్ని రుచ్యతే.

ఆ పద్మముపైన పురుషశక్తి ని ధ్యానించి, దానిని పూజించవలెను. పిమ్మట, దేశికుడు, ప్రతిమపై శ్రీహరి న్యాసము చేసి, ఆ శ్రీహరిని, ఇతర దేవతలను పూజింపవలెను. గంధపుష్పాద్యుపచారములు సమర్పించి ఆంగావరణ సహితముగా ఇష్ట దేవతను బాగుగా పూజింపవలెను. ద్వాదశాక్షర మంత్రములోని ఒక్కొక్క అక్షరమును బీజాక్షరముగ చేసి దానితో కేశ వాది భగవద్విగ్రహములను క్రమముగ పూజింపవలెను. పండ్రెండు ఆకులుగల మండలము మీద ఆ క్రమ ముగ లోక పాలాదులను పూజింపవలెను. పిమ్మట, ద్విజుడు, గంధపుష్పాద్యుపచారములతో పురుషసూక్తమును పఠించుచు పురుషప్రతిమలను, శ్రీ సూక్తము పఠించుచు పిండికలను పూజింపవలెను. పిమ్మట జననాదిక్రమమున వైష్ణవాగ్నిని ఆవిర్భ వింపచేయవలెను. విష్ణుదేవతకు సంబంధించిన మంత్రములతో అగ్నిలో హోమము చేసి, విద్వాంసుడు, శాంతిజలమును సిద్దము చేసి దానిని ప్రతిమ శిరస్సు పై చల్లి, అగ్ని ప్రణయనము చేయవలెను. 'అగ్నిం దూతం' ఇత్యాది మంత్రముతో దక్షిణ కుండము నందును, “అగ్ని మగ్నిమ్” ఇత్యాది మంత్రముతో పూర్వ కుండమునందును. 'ఆగ్ని మగ్నిం హనీమభిః' ఇత్యాది మంత్రముతో ఉత్తర కుండమునందును అగ్ని ప్రణయనము చేయవలెను. ఆగ్ని ప్రణయనసమయమునందు 'త్వమగ్నే ద్యుభిః” ఇత్యాది మంత్రము పఠింపవలెను.

పలాశ సమిధాం తత్ర అష్టోత్తర సహస్రకమ్

కుణ్డే కుణ్డే హోమధేచ్చ వీహీన్వేదాది కై స్తథా.

ప్రాజ్యాం స్తిలాన్యాహృతిభిర్మూల మ శ్రేణ వై ఘృతమ్

కుర్యాత్తతః శాన్తిహోమం మధురత్రితయేన చ.

ద్వాదశాక్షైః స్పృ శేత్పాదౌ నాభిం హృన్మ స్తకం తతః

ఘృతం దధి పయో హుత్వా స్పృశేన్మూర్దన్యథో బుధః.

స్పృష్ట్వా శిరోనాభి పాదాంశ్చతసః స్థాపయేన్నదీః

గఙా యమునా గోదా క్రమాన్నామ్నా సరస్వతీ.

దు హేతు విష్ణుగాయత్ర్యా గాయత్ర్యా శపయేచ్చరుమ్

హోమధేచ్చ బలిం దద్యాదుత్తరే భోజయేద్ద్విజాన్.

సామాధిపానాం తుష్ట్యర్థం హేమగాం గురవే దదేత్

దిక్పతిభ్యో బలిం దత్త్వా రాత్రే కుర్యాచ్చ జాగరమ్.

బ్రహ్మ గీతాది శ బ్ధేన సర్వభాగధీవాసనాత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యేధివాసం నామైకోనషష్టితమోధ్యాయః.

ఒక్కొక కుండములో ఓం కారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశ సమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో మృతమిశ్రతిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధురత్రయము (నెయ్యి, తేనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాద కాక్షర మంత్రముతో పాడనాభి - హృదయ - శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు హోమము చేసి శిరస్సు స్పృశింపవలెను. పిమ్మట శిరో-నాభి - పాదములు స్పృశించి గంగా - యమునా - గోదావరి - సరస్వతీ నదు లను ఆవాహనము చేయవలెను. విష్ణుగాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్ని పై చరువును వండవలెను. గాయత్రీ మంత్రముతో మనం చేసి, బలు లిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధిపతులైన ద్వాదశాది దిత్యుల తుష్టికే ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులకు బలి ఇచ్చి. వేదపాఠ - గీత కీర్తనాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ అధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును.

అగ్ని మహాపురాణమునందు అధివాసన మను ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.