అగ్నిగువాచః-
ప్రథమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తునః।
తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్గో హి స స్మృతః.
మొదటిది మహత్తు యొక్క సృష్టి. అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్పబడును
వై కారికస్తృతీయస్తు సర్గ ఐంద్రియక స్కృతః।
ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్ధిపూర్వకః.
మూడవ సృష్టి వై కారికము. అదియే ఐంద్రియిక సృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్త త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి.
ముఖ్యః సర్గశ్చతోర్దస్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః।
తిర్యకోసోలాస్తు యః ప్రోక్త స్తిర్యగ్యోన్యస్త తః స్మృతః.
నాల్గవది ముఖ్యసర్గము. స్థావరములు ముఖ్యములని చెప్పబడుచునవి. తిర్యక్రోతస్సు అని చెప్పబడిన నృష్టికి “తైర్యగ్యోన్యము” (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు.
తథోర్వశాసాం షష్ఠో దేవసర్గస్తు స స్మృతః ।
తతోర్వశ్రోతసాం సర్గః సప్త మః స తు మానుష .
ఊర్ధ్వసోతన్సుల సృష్టి ఆరవది. ఆదియే దేవనర్గము. పిమ్మట ఆర్వాక్రోతసుల సృష్టి ఆది ఏడవదై న మానుష సర్గము.
అష్ట మోఽనుగ్రహః సర్గః సాత్త్వికస్తామనశ్చ యః।
ప్చతే వైకృతాః సర్గః ప్రాకృతాశ్చ త్రయః స్మృతాః.
ఎనిమిదవ సర్గము అనుగ్రహ నరము. సాత్విక ము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును, వైక్బత వర్గములు, మొదటి మూడును కృతసర్గములు,
ప్రాకృతో వైకృత శ్చైవ కౌమారో నవమస్త థా ।
బ్రహ్మణే నవ సర్గాస్తు జగతో మూల హేతవః.
ప్రాకృత సర్గములు మూడును, వైకృతసర్గములు ఐదును, తొమ్మిదవ దైన కౌమార సర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గ ములును జగత్తు యొక్క మూలకారణములు.
నిత్యో నైమిత్త కః సర్గశ్రిధా ప్రకథతో జనై ।
ప్రాకృతో దై నందినః స్యాదాన్తరప్రలయాదను.
జాయతే యత్రాసుదినం నిత్యసర్గో హి స స్మృతః
సృష్టి నిత్యము, నైమితి కము ప్రాకృతము అని రెండు విధములే నదిగా కొందరిచే చెప్పబడినది. ఆవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్య సర్గము, ఆది దైనందిన సర్గము ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.
ఖ్యాత్యా ద్యా దశక న్యాస్తు భృగ్వాద్యా ఉవ యేమీరే.
దేవౌ ధాతా విధాతారౌ భృగోః ఖ్యాతిర సూయత।
శ్రియం చ పత్నీ విష్ణార్యా స్తుతా శక్రేణ వృద్దయే.
భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్ష కన్యలను వివాహ మాడిరి. ఖ్యాతి భృగువు వలన ధాత, విధాత అను దేవతలను లక్ష్మీని క నెను. విష్ణుపత్ని యైన ఈ లక్ష్మనీ ఇంద్రుడు వృద్దికొర కై స్తుతించెను.
దాతుర్విధాతుర్ధ్వా పుత్రా క్రమాత్పాతో మృకణ్డుక।
మార్కణ్డేయో మృకణోశ్చ జజే వేదశిరాస్త తః.
పౌర్ణమాసశ్చ సమూ తాళం మరీచేర భవత్సుతః।
స్మృత్యామజిరసః పుత్రాఃసినీవాలీ కుహూస్త థా.
ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రులు జనించిరి. మృకండునకు మార్కండేయుడు ను. ఆతనికి వేద శిరస్పు జనించిరి.
రాకా బానుమతీశ్చాతే రనసూయాప్యజీజనల్।
సోమం దుర్వాసనం పుత్రం దత్తాత్రేయం చ యోగినమ్.
అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను.
ప్రీత్యాం పులస్త్యభార్యాయాం దత్తాలిస్త త్సుతోభవత్ ।
క్షిమాయాం పులహాజ్ఞాతా సహిష్ణుక్రమపాదికాః.
పులస్త్యుని భార్యయైన ప్రీతికి దత్తాలియను కుమారుడు పుట్టెను. క్షమకు పులహుని వలన సహిష్ణువు, క్ర ముడు, పాదకుడు అను పు తులు జనించిరి.
సన్న త్యాం చ క్రతోరాసనాలఖిల్యా మహౌజసః।
అజుష్ట పర్వమాత్రా స్తే మే హి షష్టి సహస్రాణః.
క్రతువునకు స్న తియందు గొప్ప తేజస్సు గలవారును, బొటన వేలు కణుపు ప్రమాణము కలవారును. ఆగు అర వై వేలమంది వాలఖిల్యులు పుట్టిరి.
ఉర్జాయాం చ వసిష్ఠచ్చ రాజా గాత్రోర్ధ్వబాహుకౌ।
నవనశ్చాలము శుక్రసుతపాః సప్త చర్షయః
పావకః పవమానోభూచ్ఛుచిః స్వాహిగ్నిజో భవత్।
అగ్ని ష్వాత్రా బర్హిషదో ఒనగ్న యః సాగ్న యో హ్యజాత్.
వసిష్టుని వలన ఉగ్టయందు రాజు, గాతుడు, ఊర్ధ్వబాహుడు సవనుడు. ఆలఘుడు డు కుడు, సుతపుడు అను ఏడుగురు ఋషులు జనించిరి. స్వాహా - అగ్నులకు పావకుడు, పవమానుడు, శుచి అను కుమారులు పుట్టిరి. అజునినుండి అగ్ని ష్వాత్తుడు, బర్షి షత్, ఆనగ్ని , సాగ్ని అను కుమారులు జనించిరి.
పితృభ్యశ్చ స్వధాయాం చ మేనా వై ధారిణీ సుతే।
హింసా భార్యా త్వధర్మస్యతయోర్జజ్ఞే తథానృతమ్.
పితృదేవతలకు స్వధయందు మేన, వైధారిణి అను కుమార్తెలు పురి. అధర్ముని భార్య హింస. వారిరువురికిని ఆనృతము పుట్టెను.
కన్యా చ నికృతిస్తాభ్యాం భయం నరక మేవ చ।
చూయా చ వేదనా చైవ మిథునం త్విదమ్త యో.
త యోర్జజ్ఞేథ వై మాయా మృత్యుం భూ తాపహరణం।
వేదనా చ సుతం చాపి దుఃఖ జజ్ఞేథ రౌరవాత్.
ఆధర్మహింసలకు నికృతి ఆను కన్యయు పుట్టినది. ఈ ఆనతము నికృతయు మీకు సమయ్యెసు. వారివలన భయము, నరకము పుదైను వారికి వరసగా మాయయు, వేదనయు భార్యలైరి. వారిలో మాయ భూతములను నశింప చేయు మృతు వును ఈ నెను. వేడన రకము వల, దుఃఖమనే కుమారుని క నేను.
మృత్యోర్వాధిజరాశోక తృష్ణాక్రోధిశ్చ జజ్ఞిరే ।
బ్రహ్మణశ్చ రుధజాతో రోదనాద్రుద్రనామక.
భవం సర్వమధీశానాం తథా పశుపతిం ద్విజ।
భీమముగ్రం మహాదేవము వాచ స పితాహః.
మృత్యువునకు వ్యాధి, జర శోక ము, తృష్ణ, కోధము సుతానముగా జనించిరి బ్రహ్మదేవుని నుంచి రోదించును ఏడ్చుచు) పుట్టుటచే రుద్రుడను పేరు గల కుమారుడు పుటేను. ఆతనికే పితా మహుడు -భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి. భీముడు. ఉగ్రుడు, మహాదేవుడు అను పేర్లు పెట్టెను.
దక్ష కోపాచ్చ తద్భార్యా దేహం తత్యాజ సా సతీ।
హిమవద్దుహితా భూత్వా పత్నీ శమోర భూత్పునః.
ఆతని భార్యయైన నతీదేవి దకుని పై కోపముచే దేహమును విడచి, హిమవంతుని కుమార్తెగా జనించి మరల ఆతని (రుద్రని) బార్య ఆయెను.
ఋషిభ్యో నారదా మ్యుక్తాః పూజాః స్నా నాదిపూర్వికాః ।
స్వాయమ్ళువాద్యాస్తాః కృత్వా విష్ణ్వాదేరు క్తిము క్తిదాః.
స్వాయంభువాదులు నారదాదులచే ఋషులకు చెప్పబడినవియు, భుక్తి ముక్తి ప్రదములును ఆగు విష్ణ్వాదులకు చేయదగిన స్నా నాది పూజలను చేసి (చరితార్థులైరి)
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జగత్సర్గవర్ణనం నామ వింశతిత మోధ్యాయః.
ఆగ్ని మహాపురాణమునందు జగత్సర్గవర్ణన మను ఇరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 20 of the Agni Purāṇa is as follows:
This chapter provides a detailed procedural account of the worship of Durgā, covering the installation of her image, the sequence of upacāra-s (services), and the recitation of her names and hymns. The appropriate tithis, nakṣatra-s, and seasons for her worship are specified, with particular emphasis on the Navarātra observance in the month of Āśvina. The nine forms of Durgā (Śailaputrī, Brahmacāriṇī, Candraghaṇṭā, etc.) to be worshipped across the nine nights are enumerated. The bali offerings, homage to the goddess's vehicle (the lion), and the proper conduct of the worshipper during the vrata period are described. The immense merit of Durgā pūjā — including victory over enemies, removal of disease, and ultimate liberation — is affirmed.