అగ్ని మహా పురాణము

159 - అథ అసంస్కృతాశౌచమ్.

పుష్కర ఉవాచః-

 సంస్కృతస్యాసంస్కృతస్య స్వరో మోనో హరిస్మృతేః

అఫ్ఘ్నాం గజ్జామ్భసి మేపాల్ పేతస్యాభ్యుదయో భవేత్.

గంగాతోయే నరస్యార్థి యావత్తావద్దివి స్థితిః

ఆత్మనస్త్యాగినాం నాస్తి పతితానాం తథా క్రియా.

తేషామపి తథా గా తోయేస్థాం పతనం హితమ్

తేషాం దత్తం జలం చాన్నం గగనే తతీలీయతే.

అనుగ్ర హే మహతా పేతస్య పతితన్య చ

నారాయణబలిః కార్య క్షేనానుగ్రహమశ్నుతే.

అక్షయః పుష్ఠిరీకాక్ష సత్ర దత్తం న నశ్యతి

పతనాత్రాయతే యస్మాత్త స్మాత్పాత్తం జనార్దనః.

 పతతాం భుక్తి ముక్త్యాది ప్రద ఏకో హరిర్దవమ్

దృష్ట్వా లోకాన్మియమాణాన్ సహాయం ధర్మమాచరేత్.

మృతో2పి బాన్ధవః శక్తో నానుగత్తుం నరం మృతమ్

జాయావర్ణాం హి సర్వస్య యామ్యః పశౌ విభిద్యతే.

ధర్మ ఏకో ప్రజల్యేనం యత్ర క్వచన గామినమ్

శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహే చా పరాక్ట్రికమ్.

న హి ప్రతీక్షతే మృత్యుః కృతం వాస్య న వా

కృతమ్ లాపణ గృహాసక్త మన్యత్ర గతమానసమ్.

వృకీవోరణమాసాద్య మృత్యురాదాయ గచ్ఛతి

న కాలస్య ప్రియః కశ్చిద్ద్వేష్యశాస్య న విద్యతే.

ఆయు ష్యే కర్మణి క్షీణే ప్రసహ్య హరతే జనమ్

నా ప్రాప్త కాలో ప్రియతే విద్ద శరశతైరపి.

కుశాగేణాపి సంస్పృష్ఠ ప్రాప్త కాలో న జీవతి

ఔషధాని న మనాద్యాస్తాయనే మృత్యువాన్వితమ్.

వత్సవతాకృతం కర్మ కర్తారం విన్ధతి ధ్రువమ్

అవ్యక్తాది వ్యక్త మధ్యమవ్యక్త నిధనం జగత్.

కౌమారాది యథాదే హే తథా దేహాన రాగమః

నవమన్యద్యథా వస్త్రం గృహ్ణత్యేవం శరీరకమ్.

దేహీ నిత్యమవధ్యోయం యతః శోకం తతస్త్యజేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యేసంస్కృతాద్యా శౌచవర్ణనం నామైకోన షష్ట్యధిక శతతమోధ్యాయః.

పుష్కరుడు చెప్పెను : మరణించినవానికి సంస్కారము జరిగినను జరుగకపోయినను శ్రీహరినామస్మరణ చేసినచో వానికి స్వర్గమోక్షములు రెండును లభించును. మృతుని అస్థులను గంగలో పడవేయుటచే ఆతనికి అభ్యుదయము కలుగును. తన ఆస్తులు గంగలో ఎంత కాల ముండునో అంత కాలము మానవుడు స్వర్గములో నుండును. ఆత్మహత్యశ్రీ మదగ్ని మహాపురాణము చేసికొన్న వానికిని, పతితునకును పిండోదక క్రియ లేకున్నను వాని ఆస్తులను గంగలో పడవేసినచో వానికి మంచి కలుగును. వానికై ఇచ్చిన అన్న జలములు ఆకాశములో లీనమైపోవును. పతితు డగువానీ ప్రేతను ఉద్దేశించి మహానుగ్రహబుద్ధితో వారాయణబలి ఇవ్వవలెను. వానికి నారాయణానుగ్రహము లభించును. కమలలోచను డగు శ్రీహరి వినాళ రహితుడు. అందుచే ఆతని కరించినది వినాశ రహిత వై యుండును. జనార్దనుడు జీవుని పతితుడు కాకుండ కాపాడును; అందుచే అతడే ఉత్తమ పాత్ర, పతితు లై బోవ నున్న జీవులకు భోగమోక్షముల నిచ్చు ఏకైక ప్రభువు శ్రీమహావిష్ణువు. జగత్తులో నున్న వారందరుమ ఏదో ఒక రోజున మరణింపవలసినవారే అను విషయమును గుర్తించి, తనకు నిజముగ సహాయముగా నిలువబోవు ధర్మమును ఆచరించవలెను. పతివ్రత యైన పత్ని తప్ప మరి యే బంధువును గూడ మరణించిన దానికొరకై మరణించియు అతనితో కలసి వెళ్ళజాలరు. యమలోకమార్గము ప్రతి ఒక్కరికిని వేరువేరుగా నుండును. జీవుడు ఎచటికి వెళ్ళివను ఆతనితో కూడ కలిసి వెళ్ళు ఏకై కసహాయము ధర్మమే. రేపు చేయవలసిన పని ఈ రోజునే చేయవలెను. మధ్యాహ్న మునచేయవలసిన పని పూర్వాహ్లమునందే చేయవలెను. ఏలనన ఈతడు చేయవలసిన పని పూర్తి యైనదా లేదా అని మృత్యువు నిరీక్షించదు. మనుష్యుడు పొలములు, ఆపణములు, గృహములు మొదలగు వాటియందు ఆసక్తుడై మనస్సంతయు మరొక వైవున ఉండి యుండగా ఏమరియున్న గొర్రెను ఆడతోడేలు వచ్చి తన్నుకొనిపోయి నట్లు మృత్యువు తీసికొనిపోవును. కాలమునకు ఇష్టుడు గాని, ఆనిష్టుడు గాని లేడు. ఆయుర్దాయము, ప్రారబ్ధకర్మ పూర్తి యైన వెంటనే మృత్యువు హటాత్తుగా వచ్చి జీవుని ఎత్తి కొనిపోవును. కాలము రానివానిని వందలకొలది బాణములతో కొట్టినను మరణించడు. కాలము వచ్చినవానిని కుశాగ్రముతో ముట్టినను వాడు మరణించును. మృత్యుగ్రస్తుని ఔషధములు గాని, ముత్రాదులు గాని రక్షింపజాలవు. లేగ దూడ సరిగా తన తల్లి దగ్గరకే వెళ్ళి నట్లు పూర్వజన్మకృత మైన కర్మ కర్తను అనుసరించును. ఈ జగత్తుయొక్క ఆది అవ్యక్తము ఆంతము కూడ అవ్యక్త మే. కేవలము మధ్యయే వ్యక్తము. శరీరమునందు కౌమార - వనావ్యవస్థలు వచ్చిన విధముననే మరొక శరీరము కూడ వచ్చును. నూతన వస్త్రమును ధరించిన విధముగ జీవుడు వెనుకటి శరీరమును విడచి క్రొత్త శరీర ముమ పొందును. జీవుడు సర్వదా అవధ్యుడు. వాడు ఎన్నడను మరణించడు. అందుచే మృత్యువును గూర్చి శోకమును విడువవలెను.

ఆగ్ని మహాపురాణమునందు అసంస్కృతాదిశుద్ధి యను నూట ఏబది తొమ్మిదవ అధ్వాయము సమాప్తము.