అగ్ని మహా పురాణము

56 - అథ దిక్పాలయాగ కథనమ్ :

 శ్రీ భగవానువాచః-

ప్రతిష్టా పఞ్చకం వక్ష్యే ప్రతిమాత్మాతు పూరుషః

ప్రకృతిః పిండికాలక్ష్మీః ప్రతిష్ఠా యోగక స్తయోః.

ఇచ్ఛా ఫలార్థిభి స్తస్మాత్ర్పతిష్ఠా క్రియతే నరైః

గర్భసూత్రంతునిస్సార్య ప్రాసాదస్యాగ్రతో గురుః.

అష్టషోడశవిం శాస్త్రం, మజ్ఞపం బాధ మాధికమ్

స్నానార్థం కలశార్థంచ యాగద్రవ్యర్థ మర్ధతః.

త్రిభాగేణార్థ భాగేన వేదింకుర్యాత్తు శోభనమ్

కలశైర్ఘటికాభిశ్చ విలానాద్యైశ్చ భూషయేత్.

పఞ్చగవ్యేన సంప్రోక్ష్య సర్వద్రవ్యాణి ధారయేత్

ఆలజ్కృతో గురుర్విష్ణుం ధ్యాత్వాత్మానం ప్రపూజయేత్.

హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మదేవా, ఇపుడు ఐదు ప్రతిష్టాంగములను చెప్పెదను. ప్రతిమ పురుషునికి ప్రతీకయైనచో పిండిక ప్రకృతికి ప్రతీకము. లేదా ప్రతిమనారాయణస్వరూపము, పిండిక లక్ష్మీస్వరూపము. ఈ రెండింటి యోగమునే ప్రతిష్ట అందురు. అందుచే ఆయా ఫలములు కోరువారు ఆయాదేవతల ప్రతిష్ట చేయుదురు. ఆచార్యుడుదేవాలయము ఎదుట గర్భసూత్రము తొలగించి ఎనిమిది, లేదా పదునారు లేదా ఇరువది హస్తముల మండపము నిర్మింపవలెను. ఎనిమిదిహ స్తముల మండపము 'నిమ్నము', పదునారు హస్తములది 'మధ్యమము', ఇరువదిహ స్తుంది 'ఉత్తమము'. మండపములో సగము భాగమును దేవతాస్నానమునకు కలశస్థాపనకొరకు, యాగమునకు సంబంధించిన ద్రవ్యములను ఉంచుటకును కేటాయించవలెను. మిగిలిన సగ ముమండపములో, లేదా మూడవవంతు మండపములో సుందరమైన వేది ఏర్పరుపవలెను. దానిని పెద్ద పెద్ద కలశ లతోడను, చిన్న చిన్న కలశ లతోడను, చాందనీలు మొదలైన వాటితోడను అలంకరింపవలెను. మండపములోపల పంచగవ్యములుచల్లి, శుద్ధిచేసి, అచట సామగ్రియంతయు ఉంచవలెను. పిమ్మట ఆచార్యుడు వస్త్రమాలాద్యలంకృతుడై , విష్ణువును ధ్యానించి పూజింపవలెను.

అజ్గుశీయ ప్రభృతిభిర్మూర్తి పాన్వలయాదిభిః

కుణ్డేకుణ్డే స్థాపయేచ్చ మూర్తి పాం స్తస్ర పారగాన్ .

 చతుష్కోణే చార్ధకోణే వర్తులే పద్మ సన్ని భే

పూర్వాదౌ తోరణార్థంతు పిప్పలో దుమ్బరౌ వట.

ప్లక్షః సుశోభనం పూర్వం సుభద్రం దశతోరణమ్

సుకర్మాణం సుహోత్రంచ ఆ ప్యేసౌమ్యే సముచ్ఛయమ్.

పఞ్చహ స్తంతు సంస్థాప్య సోనాపృథివీతి పూజయేత్

తోరణ సమృమూలేతు కలశాన్మంగలజ్కురాన్.

ప్రదద్యాదు పరిష్టాచ్చ కుర్యాచ్చక్రం సుదర్శనమ్

పఞ్చహస్త ప్రమాణంతు ధ్వజం కుర్యాద్విచక్షణః.

వై వుల్యం చాస్య కుర్వీత షోడశాబ్దుల సంమితమ్

సప్తహస్తోచ్చితం దాస్య కుర్యాద్ద ఇం సురోత్తమ.

అరుణోగ్ని నిభ శ్చైవ కృష్ణః శుక్లోథపీతక

రక్తవర్ణ స్తథా శ్వేతశ్చైవం వర్ణాదికం క్రమాత్.

ఉంగరములు మొదలగు ఆభరణములిచ్చి, ప్రార్థించి మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి వారిని చతుర ప్రముఖు, ఆర్ధచంద్రాకారములు, గోలాకారములు, లేదా పద్మ సదృశములుగ కుండములపై కూర్చుండ పెట్టవలెను. పూర్వాష్టి దిక్కులతోరణములకు ఆశ్వత్థ - ఉదుంబర - వట - ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పుద్వారమునకు ‘సుశోభన’ మని పేరు. దక్షిణద్వారము 'సుభద్రము', పశ్చిమద్వారము 'సుకర్మ' ఉత్తర ద్వారము - 'సుహోత్రము'. ఆ తోరణ స్తంభములన్నియు ఐదుహస్తము ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి “స్యోనా” పృథవీన్ అనే మంత్రముచే పూజించవలెను. తోరణ స్తంభము మూభాగములందు మంగళకరమైన చూత పల్లవ - యవాంకురాచ్యంకురములున్న కలశలు స్థాపింపవలెను. తోరణ స్తంభము పైన సుదర్శనచక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజముకూడ స్థాపింపవలెను. దీని వెడల్పు పదునారు అంగుళములుండవలెను. ఓ సురశ్రేష్టా! ఆ ధ్వజదండము ఏడుహస్తము: ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై ఆరుణవర్ణము, అగ్ని (యాత్ర వర్ణము), కృష్ణ-శుక్ల-పీత-రక్త - శ్వేత వర్ణములు ఉండవలెను.

కుముదః కుముదాక్షశ్చ పుణ్డరీ కోఽ వామనః

శజ్కుకర్ణః సర్వనేత్రః సుముఖ సు ప్రతిష్ఠితః.

పూజ్యాః కోటిగుణై ర్యుక్తాః పూర్వాద్యా ధ్వజదేవతాః

జలాడక సుపూరాస్తు పక్వబి మోపమా ఘటాః.

అష్టావింశాధిక శతం కాలమణ్డన వర్జితాః

సహిరణ్యా వస్త్ర కణాః సోదకాస్తోరణాద్బహిః.

ఘటాకిస్థాప్యాశ్చ పూర్వారౌ వేదికాయాశ్చ కోణగాః

చతురః స్థాపయేత్కుమానాజి ఘతిచ మ వ్రత.

కుంభే ష్వా వాహ్య శక్రాదీన్ పూర్వాదౌ పూజయేత్కమాత్

ఇంద్రాగచ్ఛ దేవరాజ వజ్రహస్త గజస్థిత.

పూర్వద్వారం చ మేరక్ష దేవై సహనమోస్తుతే

త్రాతార మిశోమ శ్రేణ ఆర్చ యిత్వాయజేద్బుధః.

ఆగచ్ఛా గ్నే శ క్తియుక్త భాగస్థ బలసంయుత

రకాగ్నేయీందిశం దేవైః పూజాంగృష్ణ నమోస్తుతే.

అగ్ని ర్మూర్దేతి మ శ్రేణ యజేదా అగ్న యేనమః

మహిషస్థ యమాగచ్ఛ దణ్ణ హస్తమహాబల.

రక్షత్వం దక్షిణద్వారం వైవస్వత నమోస్తుతే

వైవస్వతం సంగమన మిత్యనేన యజేద్యమమ్.

నైరృతాగచ్చ ఖడ్గాడ్య జలవాహనసం యుత

ఇదమర్ష్య మిదం పాద్యం రక్షత్వం నైరృతీం దిశమ్.

ఏషతే నైరృతమ శ్రేణ యజేదర్ఘ్యాది భిర్నరః

మక రారూఢ వరుణ పాశహ స్తమహాబల.

అగచ్ఛ పశ్చిమద్వారంరక్ష రక్ష నమోస్తుతే

ఉరుంహి రాజావరుణ యజేదర్ఘ్యాది భిర్గురుః.

పూర్వాది దిక్కులలోనున్న - ధ్వజముపై కుముద.కుముదా పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర.సుముఖసుప్రతిష్టితులను దేవతలను పూజింపవలెను... వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూట ఇరువది ఎనిమిది కలకలను నాలుగు కేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెన్లు. వీటి ఆన్నింటికి కంఠభాగమునందు. వస్త్రములుకట్టి. వాటిలో సువర్ణము. ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను.  వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవలెను. మొదట నాలుగు కలశమును పూర్వాది దిక్కులు- నాల్గింటియందు “ఆణిమ కలశమ్” ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను. ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను ఆవాహనచేసి పూజింపవలెను. “ఐరావతము పై వక్కి, హస్తమున వజము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతర దేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వేరమునుశ్రీమదగ్ని మహాపురాణము రక్షింపుము. దేవతాసమేతుడవైన నీకు నమస్కారము అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవాహనచేసి, “త్రాతారమిస్త్రమ్” ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను. ఆమేషమునెక్కి, శ క్తిని ధరించియున్న బలిశాలివైన ఓ ఆగ్న దేవా! దేవతలతో కూడవచ్చి, 'ఈ' ఆగ్నేయదిక్కును రక్షింపుమా. పా పూజ గ్రహింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించుచు ఆగ్ని ని ఆవాహనముచేసి, “అగ్నిర్మూరా” లేదా “అగ్ని యే నమః” అను మంత్రముచే పూజింపవలెను. “మహిషారూఢుడవై దండము ధరించియున్న, మహాబలశాలియైన సూర్యపుత్రా! యమదేవా! నీవు వచ్చి దక్షిణద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించి యముని ఆవాహనముచేసి, వైవస్వతం సంగమనమ్, ఇత్యాది మంత్రముచే పూజింపవలెను. “భలపాహన సంపన్నుడవైన, ఖడ్గధారియైన ఓ నిరృతీ! రమ్ము. ఈ అర్ఘ్యపాద్యములను గ్రహింపుము; నైరృతిదిక్కును రక్షించుము” అని ప్రార్థించువనిరృతిని ఆవాహనము చేసి ఊపషతే నిరృతే ఇత్యాది మంత్రముచే ఆర్యాద్యుపచారములనిచ్చి, పూజింపవలెను.. “మకరమును” ఎక్కినవాడా! పాకధారీ! మహాబలశాలియైనఓ వరుణదేవా! రమ్ము! పశ్చిమద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించుచు వరుణుని ఆవాహనముచేసి ఉరుంహి రాజావరుణః ఇత్యాది మంత్రమంతో ఆచార్యుడు వరుణదేవతకు ఆర్ఘ్యము సమర్పించి పూజింపవలెను.

ఆగచ్ఛ వాయోసబల ధ్వజహస్త సవాహన

వాయవ్యం రక్ష దేవై స్వం సమరుద్భిర్నమోస్తుతే.

వాత ఇత్యాదిభిశ్చార్చేదోన్న మోవా యవేపివా

ఆగచ్ఛ సోమ సబల గదాహస్త సవాహన.

రక్షత్వముత్తరం ద్వారం సకుబేరనమోస్తుతే

సోమం యజే రాజానమితివా యజీత్సోమాయవై నమః.

ఆగచ్ఛే శాన సబల శూలహస్త వృషస్థిత

యజ్ఞమణ్డ పస్యైశానీం దిశం రక్ష నమోస్తుతే.

ఈశానమ స్యేతి యజే దీశానాయ నమోఽపివా

బ్రహ్మన్నా గచ్ఛ హంసస్థ స్రుక్సువ వ్యగ్రహ స్తక.

సలోకోర్ధ్వాం దిశం రక్ష యజ్ఞస్యాజ నమోస్తుతే

 హిరణ్యగర్భేతి యజేన్నమస్తే బ్రహ్మణేపిచ.

అనన్హాగచ్ఛ చక్రాడ్య కూర్మస్థాపి గణేశ్వర

అధోదిశం రక్షరక్ష అన ర్ణేశ నమోస్తుతే

నమోస్తు సర్పేతి యజేదనంతా యనమోపివా

ఇత్యాది పురాణే ఆగ్నేయే దశ దిక్పతి యాగోనామ షట్పఞ్చాశత్తమోధ్యాయః.

ధ్వజము ధరించిన, మహాబలశాలివైన వాయుదేవా, నీ వాహనమునెక్కి, దేవతలతోను, మరుత్తులతోడనువచ్చి వాయవ్యదిక్కును రక్షించుము; నీకు నమస్కారము”, అని ప్రార్ధించుచు వాయువును ఆవాహనచేసి “వాత ఆవా తు” ఇత్యాది మంత్రముచేతగాని, “ఓం నమో వాయవే - అను మంత్రముచేత గాని 'వాయుదేవుని పూజింపవలేను. “బలవాహనసంపన్నుడవు గదాధారివి ఆగు సోమా! నీవు వచ్చి ఉత్తరద్వారమును రక్షింపుము. కుబేర సహితుడివగు నీకు నమస్కారము” ఆని ప్రార్థించుచు సోమని ఆవాహనముచేసి, సోమం రాజానమ్” ఇత్యాది  మంత్రముచేతగాని, 'ఈసోమాయనమః’ ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను, వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! - నీవు వచ్చి యజ్ఞమండపముయొక్క ఈశాన్యదిక్కును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించి, ఈశానుని ఆవాహనముచేసి “ఈశానమస్య ఇత్యాదిమంత్రమచేతగాని, “ఈశానాయ నమః” అను మత్రమచేతగాని పూజింపవలేను. “హస్తాగ్రములందు స్రుక్ స్రువములను ధరించిన వాడవున, హంసారూఢుడవుమ, జన్మరహితుడవును ఆగు ఓ బ్రహ్మ ఊర్ధ్వ దిక్కును రక్షించుము; నీకు నమస్కారము” అని ప్రార్థించి, బ్రహ్మ దేవుని ఆవాహనముచేసి. “హిరణ్యగరు” ఇడి మంత్రము , చేతగాని “నమస్తే బ్రహ్మణే” ఇత్యాది మంత్రమచేతగాని పూజింపవలెను. “తాబేలు వీపుపై కూర్చున్న వాడా! నాగ గణముల ఆధిపతీ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము అనంతేశ్వరా! నీకు నమస్కారము” ఆని ప్రార్థించుచు” అనంతుని ఆవాహనముచేసి “నమోస్తు సర్వేభ్యః” అను మంత్రముచేగాని, “అనస్తాయనమః” అను మంత్రముచేత గాని పూజింపవలెను.

అగ్ని మహాపురాణమునందు దశ దీక్పతియాగమను ఏబదియారవ అధ్యాయము సమాప్తము.