అగ్ని మహా పురాణము

310 - అథ త్వరీతామంత్రాది

 ఆగ్ని రువాచః

ఆపరాం త్వరితావిద్యాం వక్ష్యేఽహం భుక్తిముక్తిదామ్

 పురేవ జ్రాకులే దేవీం రజోభిల్లిభితేయజేత్.

పద్మగర్భే దిగ్విదిక్షు చాష్టావజ్రాణి వీథికామ్

ద్వారకోబోప శోభాచ లిఖేచ్ఛీఘ్రం స్మ రేన్నరః.

అష్టాదశ భుజాం సింహే వామజంఘా ప్రతిష్ఠితా

దక్షిణాద్వి గుణాతస్యాః పాదపీఠే సమర్పితా.

నాగభూషాం వజ్రకుండే ఖడ్గం చక్రం గదాం క్రమాత్

శూలం శరం తథా శక్తిం వరదం దక్షిణైః కరైః .

ధనుఃపాశం శరం ఘంటాం తర్జనీం శంఖమంకుశమ్

ఆభయంచ తథా వజ్రం వామ వార్శ్వే ధృతాయుధమ్.

పూజనాచ్ఛత్రునాశః స్యాద్రాష్ట్రం జయతిలీలయా

దీర్ఘాయూ రాష్ట్రభూతిః స్యాద్ధివ్యాదివ్యాది సిద్దిఖాక్ . 

ఆగ్ని దేవుడు పలికెను. భుక్తి ముక్తి ప్రదమగు మరియొక త్వరితా విద్యను చెప్పెదను. ధూళిచే నిర్మించ బడినదియు, వజ్ర చిహ్నముచే ఆవరింపబడినదియగు భూపుర మండలమున త్వరితా దేవిని పూజించవలయును. ఆ మండలములో యోగ పీఠము పై కమలమును నిర్మించి మండలము యొక్క పూర్వాది దిక్కులండను విదిక్కులందును వజ్ర చిహ్న మును, మండలములోపల వీథి ద్వారము, శోభ, ఉపశోథ వాటిని రచించవలెను. దాని లోపల త్వరితా దేవిని భావన చేయవలయును, ఆమెకు పదునెనిమిది భుజము ఉండును. ఎడమకాలు సింహము వీపు పైనను కుడికాలు దానికి రెట్టింపు ఆకారముతో పాదపీఠములందును ఉంచబడి యుండును, అమే (సర్ప) నాగమయ అలంకారములతో అలం కరింపబడి యుండును, కుడివై నవున్న హస్తములలో క్రమముగ వజ్ర - దండ - ఖడ్గ - చక్ర - గదా  శూల - బాణ - శక్తి - వరద ముద్రలు, ఎడమ ప్రక్కన వున్న చేతులలో ధనుః - పాశ - శర - ఘంటా - తర్జనీ - శంఖ - అంకుశ అభయ ముద్ర వజ్రాయుధములును ధరించి యుండును. ఆ దేవుని పూజించుటచే శత్రువులు నశింతురు. అవలీలగా రాష్ట్రమును జయించగలుగును. దీరా యుర్దాయవంతుడై రాష్ట్రైశ్వర్యమును పొందును. దివ్యసిద్దులను ఆదివ్య సిద్ధులను కూడ పొందును. - తలయనగా సప్తపాతాళములు కాలము, ఆగ్ని సకల భువనములు, అంతకుడు యని అర్థము, ఓంకారముచే పరమేశ్వరుడు మొదలు బ్రహ్మాండములన్నియు ప్రతి పాదింపబడుమ. తన మంత్రము యొక్క ఆద్యక్షరమగు ఓం కారముచే తల పర్యంతము దేవి తోయము శీఘ్రముగ త్రిప్పును. అందుచే ఆమెకు "తోతలత్వరితా" యని పేరు.

తలేతి సప్తపాతాలాః కాలాగ్ని భువనాం తకాః

ఓంకారాది స్వరారభ్య యావద్భ్రహ్మాండ వాచకమ్.

ఓంకారాద్బ్రామయేత్తోయం తోతలా త్వరితా తతః

తకారాద్బ్రామయేత్తోయం తోతలాత్వరిలా తతః

ప్రస్తావం సంప్రవక్ష్యామి స్వరవర్గం లిఖేద్బువి.

 తాలువర్గః కవర్గః స్యాత్తృతీయా జిహ్వతాలుకః 

చతుర్థస్తాలు జిహ్వాగ్రో జిహ్వాదంతస్తు పంచమః.

 షష్ఠోష్ఠ పుటసంపన్నో మిశ్ర వర్గస్తు సప్తమః

ఊష్మాణః స్యాచ్ఛ వర్గస్తు ఉద్ద రేచ్చ మనుంతతః.

షష్ఠస్వర సమారూఢ మూష్మణా న్తంస బిందుకమ్

 తాలువర్గ ద్వితీయం తు స్వరై కాదశ యోజితమ్.

 జిహ్వాతాలు సమాయోగః ప్రథమం కేవలం భవేత్

తదేవ చ ద్వితీయన్తు ఆధస్తాద్విని యోజయేత్.

ఏకాదశ స్వరై ర్యుక్తం ప్రథమం తాలువర్గతః

ఊష్మాణస్య ద్వితీయంతు ఆధస్తాద్ దృశ్య యోజయేత్.

 షోడశ స్వర సంయుక్త మూష్మాణస్య ద్వితీయకమ్

జిహ్వాదంత సమయోగే ప్రథమం యోజయే దధః.

 మిశ్రవర్గాద్ద్వితీయంతు ఆధస్తాత్పున రేవతు

చతుర్ధస్వరసంభిన్నం తాలువర్గాది నంయుతమ్.

 ఊష్మణశ్చ ద్వితీయంతు ఆధస్తాద్వినియోజయేత్

స్వరై కాదశ భిన్నంతు ఊష్మణాన్తం సబిందుకమ్.

 పంచస్వర సమారూఢం ఓష్ఠసంపుట యోగతః

ద్వీతీయమక్షరం చాన్యజ్జిహ్వాగ్రే తాలుయోగతః.

ప్రథమం పంచ మేయోజ్యం స్వరార్ధేనోద్ధృతా ఇమే

ఓంకారాద్యా నమోఽన్తాశ్చ జపేత్స్వాహాగ్ని కార్యకే.

ఇపుడు, త్వరితా మంత్ర ప్రస్తారమును చెప్పెదను, భూతలము పై సర్వ సముదాయమున ప్రాయవలయును, కవర్గమునకు సాంకేతిక నామము స్వరవర్గ మొదటిది, తాలువర్గము రెండవది. మూడవది జిహ్వతాలుక వర్గము నాల్గవది తాలు జిహ్వాగ్ర వర్గము ఐదవది జిహ్వా దంతక వర్గము ఆరవది ఓష్ఠ పుటసంపన్నము. ఏడవడి మిత్ర వర్గము ఎనిమిదవది ఊష్మవర్గము. ఈ వర్గములు అక్షరముల నుండి మంత్రోద్దారము చేయవలెను. ఆరవస్వరమైన "ఊ" కారముపై ఊష్మవర్గ ద్వితీయారమైన "హ" కారము బిందు సంయు క్తము చేయవలెను. (హూం) తాలువర్గ తృతీయా క్షరమగుఖ కారమును పదకొండవ స్వరమగు ఏకారముతో కూర్చవలెను. (ఖే) జిహ్వాతాలు సమాయోగము యొక్క మొదటి అక్షరమగు "చ" కారము దాని క్రింద ఆదేవర్గము యొస ద్వితీయాక్షరమగు "ఛ" కారము పదకొండవ స్వరమగు ఏ కారముతో కలుపవలేను. (చ్ఛ్యే) తాలు వర్గ ప్రథమాక్షరమగు 'క'కార మును దాని క్రింద ఊష్మవర్గ ద్వితీయార మగు షకారము చేర్చి పదునారవస్వమగు ఆతో కలుపవల యను. (క్షః) ఊష్మవర్గ తృతీయాక్షరమగు సకారమునకు క్రింద జిహ్వా దంతసమాయోగ ప్రథమాక్షర మగు తకారము చేర్చి దాని క్రింద మిశ్రవర్గ ద్వితీయాక్షరమగు రకారము కలుపవలెను. పిదప నాల్గవ స్వరమగు ఈకారము చేర్చవలెను. (స్త్రీ) తాలువర్గ ప్రథమాక్షరమగు కకారమునకు క్రింద ఊష్మవర్గ ద్వితీయాక్షరమగు షకార మును చేర్చి పండ్రెండవ స్వరమగు ఏకారమును కలుపవలెను. (క్షే) పిదప ఊష్మ వర్గ అంత్యాక్షరమగు హకార మునకు ఆనుస్వార ము చేర్చి ఐదవస్వరమును కలుపవలెను. (హూం) ఓష్ఠ సంపుట యోగము నుండి రెండవ ఆక్షర మగు పకారమునకు జిహ్వాగ్ర తాలు యోగమునుండి ఠకారమును పంచమమగు నకారముగా మార్చి కలుపవలెను. స్వర ఆర్ధవ్యంజనముతో ఉద్ధృతములగు ఈ ఆక్షరములుతో తలాత్వరితాముత్రము. దీని, ఆదియందు ఓం కారమును ఆుతమునందు నమును చేర్చిన మంత్రమును జపము చేయవలయును. హోమమునందు మాత్రము నమః తొలగించి స్వాహా చేర్చవలేను, అనగా ఓం హ ఖే.చ్చ్యే-క్షః-స్త్రీ ,క్షే హూం-ఫట్ నమః ఆనువది జపమంత్రము. నమః బదులు స్వాహా చేర్చిన హోమ మంత్రము 

ఓం హీం, హ్రూం, హ్రః హృదయం హం హ శ్చేతి శిరః

హ్రీం జ్వలజ్వల శిఖాస్యాత్కవచం హులుద్వయమ్

హ్రీం శ్రీం క్షూం నేత్రత్రయాయ విద్వానేత్రం ప్రకీర్తితమ్

క్షైం హం క్షాం హూం ఫడస్త్రాయ గుహ్యాంగాని పురాన్య సేత్

త్వరితాంగాని వక్ష్యామి విద్యాంగాని శృణుష్వ మే

ఆదిద్వి హృదయం ప్రోక్తం త్రిచతుః శిర ఇష్యతే.

పంచషష్ఠ శిఖా ప్రోక్తా కవచం సప్తమాష్టమమ్

లారకంతు భవేన్నేత్రం నవార్ధాక్షర లక్షణమ్.

 తోతలేతి సమాఖ్యాతా వజ్రతుండే తతోభ వేత్

ఖఖహూందశ బీజాస్యాద్వజ్ర తుండేంద్ర దూతికా.

 ఖేచరీ జ్వాలినీ జ్వాలేఖఖేతి జ్వాలి దశ

వర్చశరవి భీషణీ ఖఖేతి చశ బర్వపి.

ఛఛేదని కరాలిని ఖఖేతి చక రాల్యపి

వక్షః శ్రవద్రవప్లవనీ ఖఖదూతీ ప్లవంగ్యపి.

స్త్రీ కాలకారే ధునని శాస్త్రి వసనవేగికా

క్షేప క్షేకపిలో హంసక పిలా నామదూతికా.

హూంతేజోవతి రౌద్రీచ మాతంగీ రౌద్ర దూతికా

పుటేపు టే ఖఖఖడ్గే ఫట్ బ్రహ్మక దూతికా.

వేతాలిని దశార్ణాః స్యుస్త్యజాన్యహి పలాలవత్

 హృదాదిక న్యాసాదౌ స్యాన్మధ్యే నేత్రేన్య సేత్సుధీః.

దీని ఆంగన్యాసము ఈ విధముగ నుండును. ఓం హ్రీం హ్రూం హ్రః హృదయాయనమః, హాం హః శిర సే స్వాహా. హ్రీం జ్వల జ్వల శిఖాయైవ షట్ హులు హులు కవచాయ హుం- హ్రీం శ్రీం క్షూం నేత్ర త్రయాయవౌషట్ ఫట్ యనునది దేవీ నేత్రముగా చెప్పబడినది. క్షాం హ: ఖౌం, హూం . ఫట్ , ఆస్త్రాయ ఫట్ ఇవి గుహ్యంగ మంత్రములు. వీటి ప్యాసము ముందుగా చేయవలయును. త్వరితాంగమలను తరువాత చేప్పెదము. విద్యాంగ ములను వినుము. మొదటి రెండు బీజాక్షరములు హృదయము. తృతీయ చతుర్థాక్షరములు స్థిరము. పంచషష్ఠ అక్షరములు శిఖా మంత్రము, సప్త మాష్టమ వర్ణములు కవచ మంత్రములు. నవమాక్షరము ఆర్ధాక్షర ము తారకము"తో తలే వజ్రతుండే ఖఖ హూం" యను పదియ క్షరములు కలది వజ్ర తుండికా నామకమగు ఇంద్రదూతికా విద్య. ఖేచరి - జ్వాలిని - జ్వాలే ఖఖ అను పది అక్షరములు కలది జ్వాలినీ విద్య వచ్చే శర విభీషణి అభే యనునది దశాక్షర శబరీ విద్య ఛఛేదని, కరాలిని ఖఖ ఇది దగా క్షర కరాలినీ విద్య, క్షః శ్రవ ద్రవ ప్లవని, ఖథే ఇది దశాక్షర ప్లవంగ దూతీవిద్య. "స్త్రీ బలం కలిదొనని శాసి” ఇది దశాక్షర శ్వసన వేగికా విద్య, క్షే పక్షే కపిలే హంస ఇది దశాక్షర కపిలా దూతికావిద్యా. హ్రూం తేజోవతి రౌద్రి మాతంగి" ఇది దశాక్షరౌది దూతికావిద్య. పుటేపుటే బఖ ఖడ్గ వట్ ఇడి దశాక్షర బ్రహ్మ దూతికా విద్య. వైశాల్లో చెప్పబడిన అన్ని మంత్రములును దళాక్షరములు ఇతర మైన వాటినన్నింటిని పొల్లువలె సార హేయము గా భావించి విడిచి చేయవలెను. న్యాసాదుల యందు హృదయాద్యంగములను ఉపయోగించవలెను. నేత్రమును మర్యమునందు న్యాసము చేయవలెను.

పాదాదారభ్య మూర్ధాన్తం శిర ఆరభ్య పాదయోః

అంఘ్రిజానూరు గుహ్యేచ నాభిహృత్కంఠ దేశ తః.

  వజ్ర మండల మూర్ధ్వేచ ఆధోర్ధ్వేచాది బీజతః

సోమరూపం తతో గావం ధారామృత సువర్షిణమ్.

 విశన్తం బ్రహ్మ రంధ్రేణ సాధక స్తు విచిన్తయేత్

మూర్దాస్య కంఠ హృన్నా భౌ గుహ్యోరుజాను పాదయోః.

ఆదిబీజం న్య సేన్మంత్రి తర్జన్యాది పునః పునః

ఊర్ధ్వం సోమమధః పద్మం శరీరం బీజ విగ్రహమ్.

 యోజానాతి నమృత్యుః స్యాత్తస్య నవ్యాధయోజ్వరాః

యజేజ్జ పేత్తాం విన్యస్యధ్యాయేద్దేవీం శతాష్టకమ్.

ముద్రావక్ష్యే ప్రణీతాద్యాః ప్రణీతాః పంచధాస్మృతాః

గ్రథితౌతు కరౌ కృత్వా మధ్యేంఽగుష్ఠా నిపాతయేత్.

తర్జనీం మూర్ధ్ని సంలగ్నాం విన్య సేత్తాం శిరో పరి

ప్రణీతేయం సమాఖ్యాతా హృద్దే శేతాం సమానయేత్.

 ఊర్ధ్వంతు కన్యసామధ్యే న బీజాన్తాం విదుర్ద్విజాః

నియోజ్య తర్జనీ మధ్యేఽనేక లగ్నాం పరస్పరామ్.

జ్యేష్ఠాగ్రం నిక్షి పేన్మధ్యే భేదనీ సా ప్రకీర్తితా

నాభిదేశే తు తాంబద్ధ్వా అంగుష్ఠావుత్ క్షి పేత్తతః.

 కరాలీతు మహాముద్రా హృదయే యోజ్యమంత్రిణః

పునస్తు పూర్వవద్భ్రహ్మా లగ్నాం జ్యేష్ఠాం సముత్ క్షి పేత్.

వక్రతుండా నమాఖ్యాతా వజ్రదే శేతు బంధ యేత్

ఉభాభ్యాం చైవ హస్తాభ్యాం మణిబంధం తు బంధయేత్.

 త్రిణిత్రీణి ప్రసార్యేతి వజ్రముద్రా ప్రకీర్తితా

దండం ఖడ్గం చక్రగదాముద్రా చాకారతః స్మృతా.

 ఆంగుష్ఠేనా క్ర మేత్త్రీణి త్రిశూలం చోర్ధ్వతో భవేత్

ఏకాతు మర్యమోర్ద్వతు శ క్తిరేవ విధీయతే,

 శరంచ వరదం చాపం పాశం భారంచ ఘంటయా

శంఖ మంకుశ మభయం పద్మమష్టచ వింశతిః.

 మోహణీ మోక్షణీ చైవ జ్వాలినీ చామృతాభయా

 ప్రణీతాః పంచముద్రాస్తు పూజాహో మేచ యోజయేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే త్వరితామంత్రాది వర్ణనం నామ దశాధిక త్రిశతత మోఽధ్యాయః.

పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదముల వరకు చరణజాను ఇంజను ఊరు గుహ్య నాథ హృదయములను కంఠ దేశము నుండి ముఖ మండల పర్యంతము పైకిని క్రిందకును అది బీజము నుండి నిర్గతమైనదియు, అమృత ధారను వర్షించునదియు హోమ రూప మగు అకారము బ్రహ్మ రంధ్రము నుండి నాలో ప్రవేశించు చున్నది యని సాధకుడు భావన చేయవలెను. మంత్రోపాసకుడు శిరోముఖ కంఠ హృదయ నాభి గుహ్య ఊరుజాను పాదము లందును తర్జని యందును మాటి మాటికి ఆపి బీజమును న్యాసము చేయవలెను. మత మయ హోమము పైనను బీజాక్షర రూప మగు శరీర కమలము క్రిందను వున్నది యను రహస్యము తెలిసిన వానికి మృత్యు భయము గాని వ్యాధి జఠాదులు గాని వుండవు. న్యాస ధ్యాన పూర్వకముగ ధ్యానము చేసి త్వరితా మంత్రము నూట యెనిమిది పర్యాంగుములు జపించవలెను. ఇపుడు ప్రణీతాది ముద్రలను చెప్పెదను. జీలా ముద్రలు ప్రణీత, సబీజా ప్రణీత, భేకని కరాలి వజ్రతుండ యని ఐదు విధములు. రెండు చేతులు కలిపి అంగుష్ఠములను మధ్య యందుంచి తర్ణ ని పైకి చాపినచో ప్రణీత. దీనిని హృదయ దేశము నందు చూపవలెను. ఈ ముద్ర యందు కనిష్ఠికను పైకి వుండునట్లు చేసి మధ్య యతిడించినచో అది సబీజ తర్జని. మధ్య యందు ఆనా మీకను పరస్పర సంలగ్నము చేసి ఆంగుష్టాగ్ర భాగమును మధ్యయందుంచినచో అది భేదనీ ముద్ర. ఆ ముద్రను నాభి దేశము నందుంచి అంగుష్ఠము నందలి జలమును జల్లవలెను. దీనినే హృదయము నందుంచినచో కరాలి యని మహా మద్ర యగును. మరల బ్రహ్మ లగ్నా జ్యేష్ఠను వెనుకటి వలే పైకి నిలబడునట్లు చేసినచో ఆ వజ్ర తుండ ముద్ర దానిని వజ్ర దేశ పను ఉంచవలెను. రెండు హ సముతో మణి బంధమును బంధించి మూడే వేళ్ళు చాపినచో వజ ముద్ర యగును. వాటి వాటి ఆకారములను అనుసరించి దండ - ఖడ్గ - చక్ర. గదాది ముద్రలు చెప్పబడినవి. అంగుష్ఠముచే ఊర్ధ్వ ముఖములగు మూడు వేళ్ళను ఆక్రమించినచో అది త్రిశూల ముద్ర. మధ్య మాంగుళిని మాత్రమే పైకి నిలిపినచో శక్తి ముద్ర యగును. బాణ . వరద.ధనుష్. పాశ-  భార – ఘంటా - శంఖ - అంకుశ - అభయ పద్మములు పైన చెప్పిన ప్రణీత మొదలగు ముద్రలు కలిపి ఇరువది యెనిమిది మాద్ర లగును. గ్రహణి - మోక్షణి- జ్వాలిని. ఆమృత- ఆభయ - ఈ ఐదును ప్రణీతా ముద్రలు. వీటిని పూజో హోమములందుపయోగించ వలెను.

ఆగ్ని మహావురాణమున త్వరితా మంత్రాది వర్ణన మను మూడు వందల పదవ అధ్యాయము సమాప్తము.