కార్యా వా చంద్రహవహ్న్యర్కపవిత్రం శివవద్దృది ।
ఏకైకం నిజమూర్తౌ వా పుస్తకే గురు కే గణే.
అన్ని దేవతామార్తలకును ఉపయోగించు నాల్గవ విధమగు పవిత్రకము ఆ దేవతామూర్తి తో కాని, దాని పిండితో గాని సమముగా నుండును. దీనికి “గంగావతారకము” అని పేరు. దీనిని సద్యోజాతమంత్రముతో బాగుగా శుభ్రము చేసి, వామదేవమంత్రముతో గ్రంథి వేసి, అఘోర మంత్రముతో శుద్ధి చేసి, తత్పురుష మంత్రముతో రక్తచందనము, కుంకు మము పూయవలెను. లేదా కస్తూరి, గోరోచనము, కర్పూరము, పసుపు, గైరికము మొదలగునవి కలిపి చేసిన రంగు పూయవలెను. పది గ్రంథులు కాని, ఎన్ని తంతువులు లున్న వో అన్ని గ్రంథులు కాని వేయవలెను. ఒక గ్రంథినుండి మరొక గ్రంథి దగ్గరకు ఒక అంగుళము గాని, రెండు ఆంగళము గాని, నాలుగు అంగుళములు గాని దూర వండ వలెను. అందముగా ఉండు విధమున దూర ముంచవలెను. ప్రకృతి, పౌరుషి, వీర, ఆపతాజిత, జయ, విజయ, సదాశివ, మనోన్మని, సర్వతోముఖి అనువారు పది గ్రంథుల అదిష్టానదేవతలు, పది కంటే ఎక్కువ గ్రంథులు కూడ అందముగా వేయవలెను. పవిత్రకము చంద్రమండల - అగ్ని మండల - సూర్యమండలములతో కూడి యున్నట్లు భావన చేయుచు, ఆది సాక్షాత్తు శివునితోతుల్య మైన దని భావించుచు హృదయమునందు ధరించవలెను. శివరూపునిగా భావించిన తనకుమ, పుస్తకమునకును, గురుగణమునకును ఒక్కొక్క పవిత్రకమును సమర్పించవలెను.
స్యాదేకై కం తథా ద్వార దిక్పాలకాలకారిషు ।
హస్తాది నవహస్తానం లిజ్గానాం స్యాత్పవిత్రకమ్.
అష్టావింశతితో వృద్దం దశభిర్దశభిః క్రమాత్ ।
ద్వ్యజ్గులాభ్య నరా స్తత్ర క్రమాదీకాజులా నరాః.
గ్రందయో మానమ ప్యేషాం లిఙవిస్తారసంమితమ్ ।
స ప్రమ్యాం వా త్రయోదశ్యాం కృతనిత్యక్రియః శుచిః.
భూషయేత్పుష్పవస్తాద్యైః సాయా హ్నే యాగమస్థిరమ్ ।
కృత్వా నైమిత్తికీం సత్యౌం విశేషేణ చ తర్పణమ్.
పరిగృ హేతే భూభాగే పవితే సూర్యమర్చయేత్ ।
ఆచమ్య సక లీకృత్య ప్రణవాక్యక రో గురుః.
ద్వారాణ శ్రేణ సంప్రోక్ష్య పూర్వాదిక్రమతో ర్చయేత్ ।
హం శాస్త్రిక ద్వారాయ తథా విద్యాకలాత్మన్.
నివృత్తిక ద్వారాయ ప్రతిష్ఠాఖ్యకలాత్మనే ।
తచ్ఛాఖయోః ప్రతిద్వారాం ద్వౌ ద్వౌ ద్వారాధిపౌ యజేత్.
నందినే మహాకాలాయ భృజ్గిణేథ గణాయ చ ।
వృషభాయ చ స్కందాయ దేవ్యై చణ్డాయ చ క్రమాత్.
ద్వారపాల - దిక్పాల - కలశాదులపై గూడ ఒక్కొక్క పవిత్రకము ఉంచవలెను. శివలింగములకు అర్పించు పవిత్రకము పొటవు ఒక హస్తము మొదలు తొమ్మిది హస్తముల వరకును ఉండును. ఒక హస్తము పొడవైన పవిత్ర కము నందు ఇరువది ఎనిమిది గ్రంథు లుండును. పిమ్మట క్రమముగ పదేసి గ్రంథులు పెంచవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల పవిత్రకము నందు నూట ఎనిమిది గ్రంథు లుండును. ఈ గ్రంథుల మధ్య వ్యవధానము ఒకటి రెండేసి అంగుళము లుండును. వీటి మానము కూడ లింగ విస్తారమును బట్టి యుండును. ఉపాసకుడు సప్తమీదివసమున గాని, త్రయోదశీ దివసమున గాని, నిత్యకర్మాదులు ముగించుకొని సాయంకాలమున పుష్ప వస్త్రాదులతో యాగ గృహమును ఆలంక రించవలెను. నైమిత్తిక సంధ్యోపాసన చేసి, విశేషతీర్పణములు చేసి, పిమ్మట పూజార్థమై నిశ్చితమైన పవిత్రభూమి భాగమునందు సూర్యుని పూజించవలెను. ఆచార్యుడు, ఆచమనము, సకలీకరణము పూర్తి చేసి ప్రణవోచ్చారణ పూర్వక మగ ఆర్ఘ్య పాత్రమును హస్తమున గ్రహించి, అస్త్రతంత్రము (ఫట్) ఉచ్చరించుచు క్రమముగ పూర్వాదిదిక్కులందున్న ద్వారములను ప్రోక్షించి హజించవలెను. “హాం” నీకలద్వారాయ నమః, హాం విద్యాకలాద్వారాయ నమః, హాం నివృత్తి కలద్వారాయ నమః, హాం ప్రతిష్టాక లాద్వారాయ నమః” అను మంత్రములతో పూర్వాది దిగ్జ్వరముల పూజ చేయవలెను. ప్రతిద్వార మునకును కుడి - ఎడమ ప్రక్కలనున్న ఇద్దరిద్దరు ద్వారాపాలకులను పూజించవలెన. తూర్పున.
పూజించి, పూర్వాదిదిక్కులందు ఇంద్రాదిదిక్పాలకులను, మండపమధ్యభాగమున బ్రహ్మను విష్ణుశివాదులను పూజించవలెను. కలశపృష్ఠభాగమును అనుసరించి యున్న వర్ధినిని చక్కగ హ స్తమునందు గ్రహించి, మంత్రజ్ఞుడగు గురువు, శివుని ఆజ్ఞను వినిపించవలెను. ప్రదక్షిణక్రమమున తూర్పునుండి ఈశాన్యము వరకును అవిచ్చిన్న జలధార విడచుచు మూల మంత్రము నుచ్చరించవలెను. యజ్ఞమండపరక్షకొరకై శస్త్రరూప మగు వర్గనిని నాల్టుప్రక్కల త్రిప్పవలేను. ముందుగ కలశను స్థాపించి, దాని వామభాగ మున, వస్త్రము కోరకై వర్ధని స్థాపించవలెను. ఉత్తమము, స్థిరముఅగు ఆసనముపై నున్న కలశముపై శివుని, ప్రణవము పై ఉన్న వర్ధని పై శిపుని - ఆయుధములను పూజించవలెను. లింగముద్రచే ఆ రెండింటిని కలిపి భగలింగసంయోగమును కల్పింపవలెను.కలశముపై జ్ఞానరూప మగు ఖడ్గమను సమర్పించి మూల మంత్రజపము చేయవలెను. ఆ జపములో దశాంశ హోమము చేసి వర్గనిలో రక్షను ఘోషించవలెను. వాయవ్యమున గణేశ పూజ చేసి, పంచామృతాదులతో శివునకు స్నానము చేయించి, పూర్వము చెప్పిన విధమున పూజ చేసి, కుండమునందు అగ్నిరూపు డగు శివుని పూజించవలెను. యధావిధిగ చరువు వంచి, సంపాతాహుతివిధానముచే దానిని శోధించి, పిమ్మట శివుడు, ఆగ్ని, ఆత్మ (తాను) అను ముగ్గురు అధికారుల కై చిన్న గరిటెతో ఆ చరువును మూడు భాగములు చేసి, శివ. ఆగ్ని కుండమునందు సమర్చించి, తన భాగమును సురక్షితముగ ఉంచుకొనవలెను.
శరేణ వర్మణాం దేయం పూర్వతో ధంతధావనమ్ ।
తస్మాద్ఘోర శిఖాభ్యాం వా దక్ష్మిడే పశ్చిమం మృదమ్.
సద్యోజాతేన చ హృదా చోత్తరే వామనీకృతమ్ ।
జలంవామేన శిరసా ఈ గన్గాన్వితం జలమ్.
పజ్చగవ్యం పలాశాదిపుటకం వై సమగ్రతః ।
ఈశాన్యాం కుసుమం దద్యా దాగ్నేయ్యాం దిశి రోచనామ్.
అగురుం నైరృతాశాయాం వాయవ్యాం చ చతుఃసమమ్ ।
హోమద్రవ్యాణి సర్వాణి సద్యోజాతైః కుశైః సహ.
దడ్డాక సూత్రకౌపీన భిక్షాపాత్రాణి రూపిణే ।
కజ్జలం కుజ్కుమం తైలం శలాకాం కేశశోధినమ్.
తామ్బూలం దర్పణం దద్యాదుత్తరే రోచనామపి ।
ఆసనం పాదు కే పాత్రం యోగపట్టాతపత్రకమ్.
ఈశాన్యామీశమ స్తోణ గద్యాదీశాన తుష్టయే ।
పూర్వస్యాం చరుకం సాజ్యం దద్యాద్ధన్గాదికం నవే.
పవిత్రాణి సమాదాయ ప్రోక్షితాన్య క్యవారిడా ।
సంహితామ స్తో పూతాని నీల్వా పావక సన్నిధిమ్.
కృష్ణాజినాదినాచ్ఛాద్య సృరన్సంవత్సరాత్మకమ్ ।
సాక్షిణం సర్వకృత్యానాం గోప్తారం శివమవ్యయమ్.
స్వేతి తిప్రయోగేణ మనసంహితయా పునః
శోధమేచ్చ పవిత్రాణి వారాణా మేకవింశతిమ్.
గృహాది వేష్టయేత్సూత్రార్ధనాద్యం రవయే దత్ ।
పూజితాయ సమాచమ్య కృతన్యాసః కృతార్యకః.
నన్ద్యాదిభ్యోఒథ గన్టౌఖ్యం వాస్తోశ్చాథ ప్రవిశ్య చ ।
శ స్త్రేభ్యో లోకపాలేభ్యః స్వనామ్నా శివకుమ్భ కే.
తత్పురుషమంత్రమునకు ‘హుం’ చేర్చి ఉచ్చరించుచు తూర్పున ఇష్టదేవతకు దంతధావనమును సమర్పింపవలేను. అ ఘోరమంత్రమునకు “పషట్లో చేర్చి ఉచ్చరించుచు ఉత్తరమున ఉసిరికాయ సమర్పించవలెను. వామదేవమంత్రమునకు “సాహో” చేర్చి ఉచ్చరించుచు జలము నివేదించవలెను. ఈశానమంత్రముతో ఈశాన్యమునందు సుగంధితజలమును సమర్పింపవలేను. పంచగవ్యములు, పలాశ ములు మొదలగువాటి దొన్నె లు అన్ని దిక్కులందును ఉంచవలెను. ఈశాన్య మున పుష్పములు, ఆగ్నేయమున గోరోచనము, నైరృతియందు అగురు, వాయవ్యమున చతుఃసమమును (రెండు పాళ్లు కస్తూరి, నాల్గు పాళ్లు చందనము, మూడు పాళ్లు కుకుమము, మూడు పాళ్లు కర్పూరము కలిపి చేసిన గంధద్రవ్యము చతుః సమము) సమర్పించవలెను. లేతాకులతో కూడ సమ స్తహోమద్రవ్యములను సమర్పింపవలెను. దకము, అక్షసూత్రము, కౌపీనము, భిక్షాపాత్రము కూడ దేవతావిగ్రహమునకు సమర్పించవలేను. కాటుక, కుంకుమము, సుగంధతైలము, కేశములను
స్వరూపుడగు అగ్ని కిని, దిక్కులలో నివసించువారికిని. దిక్పాలకులకును, భూతగణములకును మాతృగణములకును, ఏకాదశ రుద్రులకును, క్షేత్రపాలాదులకును, వారి నామమంత్రముకు “నమ- స్వాహా చేర్చి ఆహుతి రూపమున సమర్పించవలెను. పిమ్మట ఈ దేవతల చతుర్వంతనామములకు “అయం బలి” అను పదములు చేర్చి బలి సమర్పింపవలెను. పూర్వాది దిక్కులంత దిగ్గజాదులకును, దిక్పాలకులకును, క్షేత్రపాలునకును, ఆగ్ని కిని బలి సమర్పించవలెను. పిమ్మట పూర్ణాహుతి. వ్యాహృతి హోమములు చేసి ఆగ్ని దేవుని ఆవరుద్ధుని చేయవలెను.
తత ఓమగ్నయే స్వాహా సోమాయ చైవ హి ।
ఓ మగ్నేషోమాభ్యాం స్వాహాగ్నయే స్విష్టకృతే తథా.
ఇత్యాహుతిచతుష్కం తు దత్వా కుర్వాత్తు యోజనామ్ ।
వహ్ని కుణార్చితం దేవం మడ్డలాధ్యర్చితే శివే.
నాడీసనానరూ పేణ విధినా యోజయే తతః ।
వంశాదిపాత్రే విన్యస్య అస్త్రం చ హృదయం తతః.
అధిరోప్య పవిత్రాణి కలాభిర్వాథ మ శ్రయేత్ ।
షడజం బ్రహ్మ మూలై ర్వా హృద్వర్మాస్త్రం తు యోజయేత్.
విధాయ సూతైః సంవేష్ట్య పూజయిత్వాజ్ఞసంభవై ।
రవార్థం జగదీశాయ భ క్తినమః సమర్పయేత్..
పూజతే పుష్పధూపాదైః ధత్త్వాసిద్దార్తపు స్త కే ।
గురోః పాదా న్తకం భక్త్యా దద్యాత్పవిత్రకమ్.
నిర్గత్వ బహిరాచమ్య గోమయే మడ్డలత్రయే ।
పఞ్చగవ్యం చదుం దన్తధావనం చ క్రమాడ్యజేత్.
ఆచాన్తో మంత్రసంబద్ధః కృత సణేత జాగరః ।
స్వ పేద క్షఃస్మరన్నీశం బుభుక్షుర్దర్భసంస్తరే.
అనేనైవ ప్రకా రేణ ముముక్షౌరపి సంవిశేత్ ।
కేవలం భస్మశయ్యాయాం సోపవాసః సమాహితః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే పవిత్రారోహణవిధిర్నామాష్టషష్టితమోఽధ్యాయ.
పిమ్మట “ఓం అగ్నయే స్వాహా” “ఓం సోమాయ స్వాహా “ఓం అగ్నే షోమాభ్యాం స్వాహా “ఓం ఆగ్నయే స్విష్ణకృతే స్వాహా” అను నాలుగు మంత్రములతో నాలుగు ఆహుతు లిచ్చి, తరువాతి పనులను ఏర్పాటుచేసికొనవలెను. అగ్ని కుండములో పూజింపబడిన ఆరాధ్యదేవత యగు శివుని పూజామండలమునందు పూజింపబడిన కలశ స్థశివునితో నాడీసంధాన విధిచే కలిపివేయవలెను. “ఫట్' 'నమః' అని ఉచ్చరించుచు అస్త్రన్యాసహృదయన్యాసములు చేసి పవిత్రముల నన్నింటి వెదురుబుట్ట వంటి పాత్రలో ఉంచవలెను. ఈశానికలాత్మనే నమః”, “విద్యాకలాత్మనే నమః”, “నివృత్తికలాత్మనే నమః”. “ప్రతిష్టాకలాత్మనే నమః”, “శాన్యతీతకళాత్మనే నమః” అను కలామంత్రములతో వాటిని ఆభిమంత్రించవలెను. పిదప ప్రణవమంత్రముతోగాని, మూలమంత్రముతో గాని షడంగన్యాసము చేసి “నమః” “హుం” “ఫట్” ఉచ్చరించుచు వాటిపై క్రమముగ హృదయకవచ_అస్త్రములను సంబంధింపచేసి, వాటినన్నింటిని సూత్రములతో చుట్టబెట్టవలెను. పిదప “నమః” “స్వాహా” “వషట్” ‘హుం' 'వేషట్' ఓవట్' ఆను అంగమంత్రములతో వాటినన్నింటిని పూజించి, భక్తినమ్రుడై, వాటి రక్ష కొరకై , శివునను సమర్పించవలెను. పుష్ప-ధూప దీపాదులతో పూజించబడిన సిద్ధాంతగ్రంథముపై పవిత్రకము సమర్పించి, గురుచరణసమీపము, చేరి ఆయనకు భక్తిపూర్వకముగ పవితకము సమర్పింపవలెను. అచటినుండి బైటకు వచ్చి, ఆచమనము చేసి, గోమయముతో అలికిన మండలత్రయముపై, వరుసగ పంచగవ్యమును, చదువును, దంతధావన మును పూజించవలెను. పిమ్మట ఆచమనము చేసి, మంత్రముచే ఆవృతుడై రక్షణము కల్పించుకొన్న సాధకుడు రాత్రి యంతయు సంగీతముతో జాగరము చేయవలెను. భోగములు కోరువాడు, ఆర్థరాత్రి దాటిన పిమ్మట శివుని స్మరించుచు, కుళాసనముపై నిద్రించవలెను. మోక్షేచ్ఛకలవాడు, ఈ విధముగనే జాగారము చేసి, ఉపవాసపూర్వకముగ ఏకాగ్రచిత్తుడై భస్మకయ్య పై నిద్రించవలెను. భస్మశయ్యపై నిద్రించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధియను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 78 of the Agni Purāṇa is as follows:
The seventy-eighth chapter describes the Pavitrārohaṇa — a major annual ceremony in which a consecrated thread (pavitra), woven from kuśa grass and cotton, is offered to Śiva and his associated deities, to the guru, and to sacred texts. The preparation of the pavitra — the number of knots, the prescribed number of loops, and the associated mantras for the various types (ātma-tattva pavitra, vidyā-tattva pavitra, and śiva-tattva pavitra) — is described in detail. The four types of pavitra distinguished by the number of strands and their ritual purpose are enumerated. The abhivāsana (night-long soaking of the pavitra in sacred substances before offering) and the jāgara (the all-night vigil of devotional song and reading of the Purāṇa-s) that precede the offering day are described as essential preparations.