కుమార ఉవాచః
ఉణాదయోఽభి ధాస్యన్తే ప్రత్యయా రాతుతః పరే ।
ఉణికారుశ్చ శిల్పీస్యాజ్ఞాయుర్మాయుశ్చ పిత్తకం ।
గోమూయురాయు ర్వే దేషు బహులం స్యురణాదయః ।
ఆయుః స్యాదుశ్చ హేత్వాద్యాః కిరీశారుర్దాస్య శూకకః.
కృక వాకుః కుక్కుటః స్యాదురుర్బరామరు స్త ।
శయుశ్చా జగరోజ్ఞేయ నరురాయుధ ముచ్యతే.
స్వరుర్వజ్రం త్రపుసీస మసారం ఫల్గురీరితమ్ ।
గృద్నశ్చక్రని కిరచి మందిరం తిమిరం తమః.
ఇలచి సలిలం వారి కల్యాణం బాండలస్మృతమ్ ।
బుధో విద్వాన్క్వసౌ స్వాచ్చ శిబిరం గుప్తసంస్థితిః.
ఓతుర్భి డాలశ్చ తుని అభిధానాదుణాదయః ।
కర్ణః కామీచ గృహ భూర్వాస్తు జై వాతృకః స్మృతః.
అనడ్వాన్వ హతేర్దినీః స్యాజ్ఞాతౌ జీవార్ణ వౌషధమ్ ।
నౌవహ్నిరినని హరిణః మృగః కామీచ భాజనమ్.
కంబోజో భాజనం భాండే సరండశ్చ చతుష్పదః ।
తరు రేరండః సంఘాతో వరూడః సామనిర్బరమ్.
స్ఫారం ప్రభూతం స్యాన్నంత ప్రత్యయే చీలవల్కలమ్ ।
కాతరో భారరుగ్రస్తు ప్రచండో జవసోతృణమ్.
జగచ్చైవ తు భూర్లోకో కృశామ జ్యోతిరర్కశః।
వర్వరః కుటిలో ధూర్తశ్చతరంచ చతుష్పథమ్.
చీవరం భిక్షు ప్రావృతిరాదిత్యో మిత్ర ఈరితః ।
పుత్రః సూనుః పితాతాతః పృదాకుర్వ్యాఘ్ర వృశ్చి కే.
గర్తోఽవటోథ భరతోనటోఽపరేఽప్యుణాదయః.
ఇతి ఆదిమహాపురాణే ఆగ్నేయే ఉగాది సిద్దరూప నిరూపణం సామ
సప్తపంచాశ దధిక త్రిశతతమోఽధ్యాయః.
కుమారస్వామి చెప్పెను. ఇపుడు ధాతువు కంటే పరముగ వచ్చు ఉణాది ప్రత్యయములను గూర్చి చెప్పెదను. ఉణ్ . కారుః= శిల్పి జాయుః. మాయుః = పిత్తము. అట్లే గోమాయువు ఆయువు మొదలగునవి. ఉణాదులు బహుళ ముగ వచ్చును. ఆయుఃస్వాదువు హేతువు మొదలగునవి ఉడాది ప్రత్యయ సిద్ధములు. కింజార=వరిముల్లు. కృతవాకు=కోడి. గురు=భర్త. మరుః శయివు= అజగరము. సరుః=ఆయుధము. స్వరః = వజ్రము. త్రపు= సీసము. ఫల్గు = సార రహితము. క్రన్ ప్రత్యయము చేర్చగా గృధ్ర: నిష్పన్న మగును. కిరచ్ - మందిరమ్ తిమిరమ్ (చీకటి). ఇలచ్ - సలి లమ్ = (నీరు). బండిలమ్=కల్యాణము. క్వన్ ప్రత్యయము చేర్చగా విద్వాన్ = బుధుడు. శిబిరమ్=రహస్యమైన నివాస స్థానము. తుస్ - హోతుః=పిల్లి, ఉణాదులు అభిధానమును బట్టి వచ్చుచుండును. కర్ణః = చెవి. మరియు కాముడు వాస్తు= గృహ భూమి. జై వాతృక,=చంద్రుడు. మహ - డిన్ - చేర్చగా అనడ్వాన్. జీవాతు=జీవన ఔషధము. వహ్ ధాతువుకు ని ప్రత్యయము చేర్చగా వహ్నిః. ఇకన్ - హరిణః=మృగము మరియు కాముకుడు. పాత్రము, కంబోజు=పాత్రము. సరండబాండము, చతుష్పదము. హేరండు=వృక్షము. వరండ=సామవేదము. సొరం= అత్యధికము, క్రన్ పత్య యము చేర్చగా చీరము సిద్ధీంచును. వల్కలము; ఫారుః = పిరికివాడు. ప్రచండః= గురుడు. జనసమ్ = తృణము. ఇగత్ = భూలోకమా. కృశానుః = అగ్ని, సూర్యుడు. వర్వరః= కుటిలుడు, ధూర్తుడు. చత్వరమ్ = చతుష్పదము. చీవరమ్ = బిక్షువులుకప్పకొనువస్త్రము. మిత్ర= సూర్యుడు. పుత్రః = కుమారుడు. పితా = తండ్రి. పృదాకు: = వ్యాఘ్రము వృశ్చికము. గర్తః= గొయ్యి. భరతః = నటుడు. ఇంకను ఉణాదులున్నవి.
ఆగ్ని మహా పురాణమున ఉడాది సిద్ద రూప నిరూపణ మను మూడు వందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 358 of the Agni Purāṇa is as follows:
The ten lakāras (verbal tense-mood categories) are enumerated with their semantic uses: laṭ (present), laṅ (imperfect/past), liṭ (perfect), luṭ (periphrastic future), lṛṭ (simple future), leṭ (Vedic subjunctive), loṭ (imperative), liṅ (optative/potential), luṅ (aorist), and lṛṅ (conditional). The nine parasmaipada and nine ātmanepada tiṅ endings in the three persons and three numbers for each lakāra are presented. Complete conjugation paradigms for the paradigm verb bhū (to be) and edh (to grow) are worked through. The formations for causative (ṇic-pratyaya), desiderative (san-pratyaya), and intensive/frequentative (yaṅ-pratyaya) verbal stems, which combine with these same endings, are also described.