అగ్ని మహా పురాణము

53 - అథ లిజ్గాది లక్షణమ్ :

 శ్రీ భగవానువాచః-

లిజ్గాది లక్షణం వన్యే కమలోద్భవ తచ్ఛృణు

 దైర్ఘ్యార్ధం వసుభిర్భక్త్వా త్యక్త్వా భాగత్రయం తతః.

విష్కమం భూతభాగైస్తు చతుర సంతు కారయేత్

ఆ యామం మూర్తీభిర్భక్త్వా ఏక ద్వితిక్రమాన్న్య సేత్.

బ్రహ్మ విష్ణుశివాం  శేషు వర్ధ మానోఒయ ముచ్యతే

చతురస్రేఒస్య కర్ణారం గుహ్యకోణేషు లాఞ్చాయేత్.

 అష్టాగ్రం వైష్ణవం భాగం సిధ్యత్యేవన సంశయః

షోడశాస్రం తతః కుర్యాద్ద్వాత్రింశాస్రం తతః పునః.

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి, వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, రెండు, మూడు ఆను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిడి; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి “వర్గమాన భాగము” అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను.

చతుఃషష్ట్యసకం కృత్వా వర్తులం సాధయేత్తతః

కర్తయేదథ లిజ్గస్య శిరో వై దేశికోత్తమః.

విస్తారమథ లిజ్గస్య అష్టధా సంవిభాజయేత్

భాగార్ధార్ధంతు సంత్యజ్య ఛత్రాకారం శిరోభవేత్.

త్రిములాగేషు సదృశ ఆయామో యస్య విస్తరః

తద్ద్విభాగసమం లీజ్గం నర్వ కామఫలప్రదమ్.

దైర్ఘ్యస్యతు చతుర్థన విష్కంభం దేవ పూజితే

సర్వేషా మేన లిజ్గనాం లక్షణం శృణుసామ్పతమ్.

పిమ్మట ఆరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్టుడైన ఆచార్యుడు లింగము, శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పడును. మూడు భాగము లందును. పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభీష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే విష్కంభము ఏర్పడును.. ఇపుడు అన్ని లింగముఆ లక్షణములను వినుము.

మధ్య సూత్రం సమాసాద్య బ్రహ్మరుద్రా న్తకం బుధః

షోడశాబ్దుల లిజస్య షడ్భాగై ర్భాజితో యథా.

తదై యమన సూత్రాభ్యాం మానమ నరముచ్యతే

యవాష్టముత్తరే కార్యం శేషాణాం యవహానితః.

అర్చా భాగం ప్రాధాకృత్వా త్వర్ధ మేకం పరిత్యజేత్

అష్టధా తద్ద్వయం కృత్వా ఊర్ధ్వభాగత్రయం త్యజేత్ .

ఊర్ధ్వంచ పశ్చిమద్భాగాద్రా మ్య రేఖాంప్రలమ్బయేత్

భాగమేకం పరిత్యజ్య సజ్జమం కారయే త్రయోః.

ఏ తత్సాధారణం ప్రోక్తం లిజ్గానాం లక్షణం మయా

సత్వసాధారణం వక్ష్యే పిణ్డికాం తన్ని బోధమే.

పండితుడు పదునారు అంగుళముల లింగమునకు మధ్య బ్రహ్మరుద్ర భాగములకు సమీపమున నున్న సూత్రము తీసికొని దానిని ఆరు భాగములుగ విభజింపవలెను. వేయమన - సూత్రముల సాహాయ్యముతో నిశ్చయింపబడిన ఈ పరి మాణమునకు ‘ఆంతరము' అని పేరు. అన్నింటి కంటే ఉత్తరము నందున్న లింగమును ఎనిమిది యవలు పెద్దదిగా ఉండునట్లు చేయవలెను. మిగిలిన లింగములను ఒక్కొక్క యవ తగ్గునట్లు చేయవలెను. పైన చెప్పిన లింగము క్రింది ప్రదేశమును మూడు భాగములుగ విభజించి పై భాగము నౌక దానిని విడచి వేయవలెమ. మిగిలిన రెండు భాగములను ఎనిమిది భాగములుగ విభజించి పై మూడు భాగములను విడచి వేయవలెను. ఐదవ భాగము పై భాగము నుండి తిరుగుచున్న ఓక దీర్ఘ రేఖ గీయవలెను. ఒక భాగమును విడచి, మధ్యయందు ఆ రెండు రేఖలను కలపవలేను. ఇది లింగముల సాధారణ లక్షణము. ఇపుడు పిండిక యొక్క సర్వసాధారణ లక్షణమును చెప్పెదను; వినుము.

బ్రహ్మ భాగప్రవేశంచ జ్ఞాత్వా లిజ్ఞస్య చోచ్చయమ్

న్య సేద్ర్బహ్మ శిలాం విద్వాన్సమ్యక్కర్మశిలోపరి.

తథా సముచ్ఛయం జ్ఞాత్వా పిజ్జికాం ప్రవిభాజయేత్

ద్విభాగముచ్ఛితం పీఠం విస్తారే లిజ్ఞసం మితమ్

 త్రిభాగం మధ్యతః ఖాతం కృత్వాపీఠం విభాజయేత్

స్వమానార్ధ త్రిథా గేణబాహుల్యం పరికల్పయేత్ .

బాహుల్యస్య త్రిభా గేణ మేఖలామథ కల్పయేత్

ఖాతంస్యాన్మేఖలా తుల్యం క్రమాన్ని మ్నంతు కారయేత్.

మేఖలా షోడశాంశేన ఖాతంవాతత్పమాణతః

ఉచ్చాయం తస్యపీఠ స్య లింగాకారం తు కారయేత్.

భూమౌ ప్రవిష్టమేకం తు భాగేనై కేన పిజ్జికా

కణం భాగై త్రిభిః కార్యం భాగేనై కేన పట్టికా.

చోర్ధ్వపట్టం తు ఏకాంశాః శేషపట్టికా

భాగం భాగం ప్రవిష్టంతు యావత్కణం పునః పునః.

నిర్గమం భాగమేకం తు యావద్వై శేషపట్టికా

ప్రణవస్య త్రిభాగేణ నిర్గమస్తు త్రిథాగతః.

మూలేఒజుల్యగ్రవిస్తార మగైత్ర్యం న చార్దతః.

ఈషన్ని మ్నంతు కుర్వీత ఖాతంతచోత్తరేణవై.

పిణ్డికాసహితం లిజ్గమేతత్సాధారణం స్మృతమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే లిజ్గాది లక్షణం నామ త్రిపఞ్చాశత్తమోధ్యాయః.

బ్రహ్మ భాగమునందు లింగము ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్తాపనముచేసి, దాని పైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిడిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో ఆది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసి దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే బాహల్యమును ఏర్పరుపవలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను. దీనికి “విక రాజము” అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో పిండిక నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించ వలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువై పు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము.

ఆగ్నిపురాణమునందు లింగాది లక్షణమను ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.