అగ్ని మహా పురాణము

267 - అథ మహేశ్వరస్నానలక్షకోటి హోమాదయః

పుష్కర ఉవాచః

 స్నానం మహేశ్వరం వక్ష్యే రాజాదేర్ణయవర్ధనమ్

 దానవేంద్రాయ బలయే యజ్ఞగా దోశనాఃపురా.

 భాస్కరేఽనుదితే పీఠే ప్రాతః సంస్నాపయేద్వటైః

 ఓం నమోభగవతే రుద్రాయచ బలాయచ.

పాండరోచిత భస్మా నులిప్త గాత్రాయ

 తద్యథా జయజయసర్వాన్ శత్రూన్ మూక స్య

 కలహ విగ్రహ వివాదేషు భంజయ.

ఓం మథమథ సర్వపథకాన్ యోఽసౌయుగాంత కాలే

దీధక్షతి ఇమాంపూజాం రౌద్రమతిః సహస్రాంశుః

 శుక్లః సతేరక్షతు జీవితమ్.

సంవర్తకాగ్ని తుల్యశ్చ త్రిపురా న కరః శివః

సర్వదేవమయః సోఽపీతవరక్షతు జీవితమ్.

 లిఖి లిఖి ఖిలిస్వాహా

  ఏవం స్నాతస్తుమం తేణ జుహుయా త్తిల తండులమ్.

 పంచామృతై స్తు సంస్నాప్య పూజయేచ్చూల పాణినమ్

స్నానానన్వాని పశ్యామి సర్వదా విజయాయతే.

స్నానం ఘృతేన కథితమాయుష్య వర్ధనంపరమ్

గోమయేన చ లక్ష్మీః స్యాథోమూ త్రేణాఘ మర్ద నమ్.

 క్షి రేణ బలబుద్ధిః స్వాద్దధ్నా లక్ష్మీ వివర్ధనమ్ :

కుశోద కేన పాపాన్తః పంచగవ్యేన సర్వధాక్.

 శతమూలేన సర్వా ప్తిర్గోశృంగోదకతోఽఘజిత్

పలాశ బిల్వకమల కుశ స్నానంతు సర్వదమ్.

వచాహరిద్రేద్వేము న్తం స్నానం రక్షోహణం పరమ్

పుష్కరుడు పలికెను. రాజాదులకు జయమునిచ్చు మాహేశ్వర స్నానాదుల గూర్చి చెప్పెదను. పూర్వము శుక్రాచార్యుడు దీనిని దానవేంద్రుడగు బలికి చెప్పెను. ప్రాతః కాలము, సూర్యోదయమునకు పూర్వము యాచార్యుడు రాజును భద్రపీఠము పై కూర్చుండ బెట్టి “జయ, జయసర్వాన్ శత్రూన్” మొదలు “లిఖి, ఖిలిస్వాహా” వర కునుఉన్న మూలోక మంత్రమును చెప్పుచు స్నానమును చేయించవలెను. ఈ విధముగ స్నానము చేసిన పిమ్మట తండుల హోమము చేసి త్రిశూలధారియగు శివునకు పంచామృత స్నానము చేయించి పూజ చేయవలయును.

ఆయుష్యంచ యశస్యంచ ధర్మమేధావివర్ధనమ్.

 హైమాద్భిశైవ మాంగల్యం రూప్యతా మ్రోదకై స్తథా

రత్నోదకై స్తు విజయః సౌభాగ్యం సర్వంగంధ కై ,

 పలాద్భిశ్చతథారోగ్యం ధ్యాద్భిః పరమాం శ్రియమ్

తిలసిద్దార్థ కైర్లక్ష్మీః సౌభాగ్యం చ ప్రియంగుణా. 

పద్మోత్సలకదంబైశ్చ శ్రీర్బలం బలాద్రు మోదకైః

విష్ణుపాదోదకస్నానం సర్వస్నా నేభ్య ఉత్తమమ్.

సర్వదా విజయమునిచ్చు ఇతర విధములగు స్నానములను చేప్పేదను, ఘృతస్నానము ఆయుర్వర్ధక ము. గోమయస్నానము లక్ష్మీప్రదము. గోమూత్రస్నానము పాపనాశ కము. క్షీరస్నానము బలవృద్ధికరము, దధ్ని నము లక్ష్మీవర్గకము. కుశోదక ముతో స్నానము పాపములను నశింపచేయును. పంచగవ్యస్నానముచే సర్వకామములును లభించును. శృంగోదక స్నానము పాపవినాశ కము. పలాశ , బిల్వ, కమల, - కుశ , స్నానము సర్వకామ్య ప్రదము. వచ, రెండు విధముల పసుపు, ముస్త కలిపిన నీటితో స్నానము రాక్షసవినాశ కము, ఆయుర్వృద్ధి యశస్సు ధర్మము, మేధ కూడ దీనిచే లభించును. సువర్లోకములతో స్నానము మంగళకరము. రజతతామ్ర జల స్నానములు కూడ మంగళ కరము రత్నమిశ్ర జలముతో స్నానము విజయమును, సర్వగంధమిశ్రిత జలముతో స్నానము సౌభాగ్యమును. ఫలో దక స్నానము, ఆరోగ్యమును, ఉసిరికాయల జలముతో స్నానము లక్ష్మిని ఇచ్చును. తిల శ్వేత స్వపములు కలిపిన జలముచే లడ్మియు, ప్రియంగు జలస్నానముచే సౌభాగ్యము, పద్మఉత్పల కదంబ మిశ్ర జలస్నానములచే లక్ష్మియు బలావృక్ష జలస్నానముచే బలము లభించును. విష్ణుచరణోదక స్నానము అన్ని స్నానముల కంటెను శేషమైనది.

ఏకాకీ ఏక కామాయేత్యేకోర్కం విధివచ్చ రేత్

 ఆక్రందయతి సూక్తేన ప్రబధ్నీ యాన్మణింకరే.

కుష్టపాఠావచాశుంఠీ శంఖలోహాదికోమణిః

 సర్వేషామేవ కామానామీశ్వరో భగవాన్ హరిః.

 తస్య సంపూజనాదేవ సర్వాన్కామాన్సమశ్నుతే

 స్నాపయిత్వా మృతక్షి రైః పూజయిత్వా చ పిత్తహా.

పంచముద్దబలిందత్వా అతిసారాత్ప్ర ముచ్యతే

 పంచగ వ్యేన సంస్నా ప్య వాతవ్యాధిం వినాశ యేత్. 

ద్వి స్నేహస్న పనా చ్ఛ్లే ష్మరోగతో రాతిపూజయా

మృతం తె లం తథా షోద్రం స్నానంతు త్రిరసంపరమ్.

 స్నానం ఘృతాంబు ద్వి స్నేహం సమలం ఘృతజై లకమ్

 క్షౌద్రమీనురనం క్షీరంస్నానం త్రిమధురం స్మృతమ్.

 ఘృతముర సం తైలం ఔద్రంచ త్రిర సంశ్రియే.

  అను లేపస్రా శుక్లస్తు కర్పూరోశీరచందనై .

చందనాగురు కర్పూర మృగదర్పైః సకుంకుమైః

పంచానులేపనం విష్ణోః సర్వకామఫలప్రదమ్.

త్రిసుగంధం చ కర్పూరం తథా చందన కుంకుమైః

మృగదర్పం సకర్పూరం మలయం సర్వకామదమ్.

 జాతీఫలం సక ర్పూరం చందనంచ త్రిశీతకమ్

 పీతానీ శుక్లవర్ణాని తథా శుక్లా నిభార్గవ.

 కృష్ణాని చైవరక్తాని పంచవర్ణాని నిర్ధి శత్

 ఉత్పలం పద్మ జాతీ చ త్రిశీతం హరిపూజనే.

 కుంకుమం రక్తపద్మిని త్రిర క్తం ర కముత్పలమ్

ధూపదీపాదిభిః ప్రార్చ్య విష్ణుం శాంతిర్భవేన్నృణామ్.

చతురస్రక రే కుండే బ్రాహ్మణాశ్చాష్ట షోడశ

లక్షహోమం కోటిహోమం తిలాజ్యయవధాన్యకైః.

 గ్రహానభ్యర్య గాయత్య్రా సర్వశాంతిః క్రమాద్భవేత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మహేశ్వర స్నాన లక్ష కోటిహోమాదికం నామ సప్తషష్ట్యధిక ద్విశత తమోఽధ్యాయః.

ఏ కాకియైన మనుష్యుడు ఒక కోరికతో ఒకే స్నానము చేయవలయును, ఆక్రందయతి ఇత్యాది సూక్తము చెప్పుచు చేతికి మణికట్టవలేను ఈమణి కుష్ణ - పాఠ్యా. - వదా – శుంఠీ - శంఖ - లోహాదులతో చేయబడవలెను. శ్రీ మహావిష్ణువు సర్వకామములకు అధిపతి. ఆతనిని పూజించుటచే సర్వకామములను పొందును. మృతమిశ్ర దుగ్ధ ముతో స్నానము చేయించి విష్ణువును పూజించు వానికి పిత్తరోగము నశించును. పంచముద్ద బలియిచ్చినచో అతిసార రోగము పంచగవ్య స్నానము చేయించినచో పొతవ్యాధి ద్విస్నేహ ద్రవ్యములతో స్నానము చేయించి శ్రద్ధాపూర్వకముగ పూజించు టచే శ్లేష్మరోగములు నశించును మృత - తైల, మధువులతో, చేయించిన స్నానము, “త్రిరస” స్నానము. మృత జలములతో చేయించిన స్నానము, “ద్విస్నేహ” స్నానము మృత, తైల, మిశ్ర జలముతో చేయించిన స్నానము సమలస్నా నము. మధు ఇక్షుర స క్షీరములతో, చేయించిన స్నానము త్రి మధురస్నా నము. మృత, ఇక్షురస, మధు లతో చేయించిన శ్రీరస స్నానము లక్ష్మీప్రదము. కర్పూర, ఉషీర చందనములతో చేసిన అనులేపము “త్రిశుక్లము" చందన ఆగురు, కర్పూర, కస్తూరి కుంకుమములతో చేసిన అనులేపనమును, విష్ణువునకు, సమర్పించినచో యది సర్వ కామ వల ప్రదము. కర్పూరచందన, కుంకుమములతో కాని, కస్తూరి కర్పూర చందనములతో కాని, చేసిన త్రిసుగంధ మనులేపనము సర్వకామప్రదము, జాతివల కర్పూర చందనములుయనునవి "త్రిశీతక మని" చెప్పబడును. పీతవర్ల ములు, శుక్ల వర్ణములు, శుక్లములు, కృష్ణములు, రక్తములు, ఇవి పంచవర్ణములు. విష్ణుపూజకు, ఉత్పలములను, కమ లములను, జాతీపుష్పములను త్రిశీతముకు త్రిశీతమును ఉపయోగించవలెను. కుంకుమ ర క్త కమల రక్తాత్పలములకు “త్రిరక్తము" యని పేరు. ధూపదీపాదులతో మహావిష్ణువుకు పూజ చేసినచో మానవులకు శాంతి లభించును. నాలుగు హస్త ముల చతురస్ర కుండమునందు ఎనమండుగురు లేదా పదునారుగురు బ్రాహ్మణులు తిల, ఆజ్య, తండులములతో లక్షగానీ, కోటిహోమము చేయవలయును. గృహపూజ చేసి గాయత్రిచే హోమము చేసినచో క్రమముగా అన్ని విధముల శాంతి కలగును.

అగ్ని మహాపురాణమున మహేశ్వరస్నాన లక్ష, కోటి, హోమాదికమను రెండువందల ఆరువదియేడవ అధ్యాయము సమాప్తము.