అగ్ని మహా పురాణము

42 - అథ ప్రాసాదలక్షణమ్.

 హయగ్రీవ ఉవాచః

ప్రాసాదం సంప్రవక్ష్యామి సర్వసాధారణం శృణు

చతురస్త్రీకృతం క్షేత్రం భజేత్షోడశధా బుధః.

మధ్యేతస్య చతుర్బిస్తు కుర్యాదాయ సమన్వితమ్

ద్వాదశై వతు భాగాంశ్చ భీత్యర్థం పరికల్పయేత్ .

                       జం మోచ్ఛాయస్తు కర్తవ్యశ్చతుర్భాగేణచాయతః

జంఘాయాద్విగుణోచ్ఛాయం మజ్జర్యాః కల్ప యేద్బుధః.

తుర్యభాగేన మజ్జూర్యాః కార్యః సమకదక్షిణః

తన్మాననిర్గమః కార్య ఉభయోః పార్శ్వయోః సమః.

 శిఖరేణ సమం కార్యమగ్రే జగతి విస్తరమ్

 ద్విగుణేనాపి కర్తవ్యం యథాశోభానురూపత.

 విస్తారాన్మజ్ఞపస్యా గ్రే గర్భసూత్రద్వయేన తు

దైర్ఘ్యాత్పాదాధికం కుర్యాన్మధ్య సమైర్వి భూషితమ్.

ప్రాసాదగర్భమానం తు కుర్వీత ముఖమజ్ఞపమ్

ఏకాశీతి పదై ర్వాస్తుం పశ్చాన్మ పమారభేల్.

 శుకాన్వా ర విన్యాసే పాదా న్తస్థాన్ యజేత్ సురాన్

 తథాప్రాకారవిన్యానే యజేద్ద్వాత్రింశదనగాన్.

సర్వసాధారణం చై తత్ప్రాసాదస్యచలక్షణమ్

మానేన ప్రతీమాయా వా ప్రాసాదమపరం శృణు.

హయగ్రీవుడు పలికెను - ఇప్పుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పెదను, వినుము. దేవాలయ మును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదువారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు  భాగములతో, ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి. మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను, శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెమ, శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయ పరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వముందును ఉన్న మార్గముల (ద్వారము) కొలత ఈ కొలతను బట్టియే ఉండ వలెను. ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖర ముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖతము కంటే రెట్టింపు ఉండునట్లు కూడ చేయ వచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భ సూత్రమునకు రెట్టింపు ఉండవలెమ. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభముల మర్చి ఆందముగా ఉండు నట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భ ప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్క పదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను.

మొదట ద్వారన్యాసము దగ్గర నున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకార విన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానాను సారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము.

ప్రతిమాయాః ప్రమాణేన కర్తవ్యా పిణ్డికా శుభా

గర్భస్తు పిణ్డికార్ధేన గర్భమానాస్త భిత్తయః.

 భి తైరాయామ మానేన ఉత్సేధం తు ప్రకల్పయేత్

భిత్త్యు చాయాత్తు ద్విగుణం శిఖరం కల్పయేద్బుధః.

శిఖరస్యతు తుర్యేణ భ్రమణం పరికల్పయేత్

శిఖరస్య చతుర్థన అగ్రతో ముఖమణ్ణపమ్.

 ఆష్టమాం శేన గర్భస్యరథకానాంతునిర్గమః

వరిధేర్గుణభాగేన రథకాం స్తత్ర కల్పయేత్.

 తతృతీయేన వాకుర్యాద్రథకానాం తు నిర్గమః

వామత్రయం స్థాపనీయం రథకత్రితమే సదా.

ప్రతిమ ఎంత పెద్దది ఉండునో, అంత పెద్ద ఆందమైన పిండి నిర్మింపవలెను. పిండిలో సగము ప్రమాణము గల గర్బమును నిర్మించి, గర్బమానాను సారముగ గోడలు పెట్టవలెను. గోడల ఎత్తు వాటి వెడల్పును అనుసరించి ఉండవలెను. విద్వాంసుడు శిఖరము ఎత్తు గోడ ఎత్తుకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తున ఆలయమునకు పరిక్రమ ఏర్పరుపవలెను. ఆలయము ముందున్న ముఖ మండపము గూడ అదే ఎత్తుతో నిర్మింపవరెను. గర్భము ఎనిమిదవ వంతు ప్రమాణముండు నట్లు రథకములు బైటకు వచ్చు మార్గము నిర్మింపవలెను. లేదా పరిధి మూడ వభాగమును అనుసరించి రథకములను (చిన్ని రథములను) నిర్మింపవలెను. వాటి మూడవ వంతు ప్రమాణమున రథ నిర్గ మద్వార మేర్పరుపవలెను. మూడు రథకముల పై సర్వదా మూడు వామములను స్థాపింపవలెను.

శిఖరార్థంహి సూత్రాణి చత్వారివినిపాతయేత్

శుక నాసోర్ద్వతః సూత్రం తిర్యగ్భూతం నిపాతయేత్.

 శిఖర స్యార్థ భాగస్థం సింహం తత్రలు కారయేత్

శుక నాసాం స్థిరీకృత్య మధ్యసన్గా నిధాపయేత్.

ఆపరేచ తథా పార్శ్వే తద్వత్సూత్రం నిధాపయేత్

తదూర్ధ్వం తుభ వేద్వేదీ సకణాసన సారకమ్.

స్కఛభగ్నం నకర్తవ్యం వికరాలం తథై వచ

ఊర్ద్వంచ వేదికామానాత్కలశం పరికల్పయేత్.

 విస్తారార్ద్విగుణం ద్వారం కర్తవ్యం తు సుశోభనమ్

ఉదుమ్బరౌ తదూర్ధ్వం చ న నేచ్ఛాఖాం సుమజ్ఞలైః.

ద్వారస్య త్యుచతుర్థాం కార్యొచణ ప్రచణ్ణికా

విష్వక్సేనో వత్పదజ్జా శాఖార్గోదుమరే శ్రియమ్

దిగ్గజైః స్నా ప్యమానాం తాం ఘటైః సాబ్దాం సరూపికామ్

 ప్రాసాదస్య చతుర్థాం ప్రాకార స్యోచ్ఛయోభవేత్.

ప్రాసాదాత్పాదహీనస్తు గోపురసోచయో భవేత్

పణహస్తస్య దేవస్య ఏకహస్తాలు పీఠికా.

 గారుడంమణపం చాగ్రే ఏకం భౌమాదిదామచ

కుర్యాద్రి ప్రతిమాయాం తు దికుచాష్ట్రాసు చోపరి.

 పూర్వేవరాహం దషేచ నృసింహం శ్రీధరం జలే

ఉత్తరేతు హయగ్రీవ మాగ్నేయ్యాం జామదగ్న్యకమ్.

నైరృత్యాం రామకం వాయా వామనం వాసుదేవకమ్

ఈ ప్రాసాదరచనా దేయావస్వరకాదిభిః

ద్వారస్య చాష్టమాద్యంశం త్వక్త్వానదోషభాక్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రాసాదలక్షణం నామ ద్విచత్వారింశోధ్యాయః.

శిఖరము కొరకు నాలుగు సూత్ర పాతములు చేయవలెను. భకనాస పైనుండి సూత్రము ఆడ్డముగా పడవేయ వలెను. శిఖరము సగ ము భాగమున సింహ ప్రతిమను నిర్మింపవలెమ. శుక నాస్త పై సూత్రము స్థిరముగానుంచి దానిని మధ్యసం ధివరకును తీసికొనివెళ్ళవలెను. రెండవ పార్శ్యమునందు గూడ ఈ విధముగానే సూత్రపాతము చేయవలెను శుకనాసపై వేసి నిర్మించి, దానిపై అమలసారమను పేరుగల, కంఠముతో కూడిన కలశము నిర్మింపవలెను. అదీ వికరాలముగ ఉండగూడదు. వేదిమానము ఉన్నంతవరకునే కలశను నిర్మింపవలెను. ఆలయద్వారము వెడల్పు ఎంత ఉండునో దానికి రెట్టింపు ఎత్తు ఉండవలెను. ద్వారము చాల అందముగా శోభాసంపన్న ముగా ఉండునట్లు నిర్మింపవలెను. ద్వారముల పై భాగమున సుందరములును, మంగళకరములును ఆగు వస్తువులతోపాటు రెండు ఉదుంబర శాఖలు నిర్మింపవలెను.

           ద్వారము నాల్గవ భాగమున చండుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వార పాలకుల మూర్తులను నిర్మింపవలెను ఉదుంబరశాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీవిగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించు చుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవవంతు ఉంచవలెను. ఆలయ గోపురముఎత్తు ఆలయము ఎత్తుకంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము ఐదు హస్త ముల విగ్రహమైన చోదాని పీఠిక ఒక హస్త ముండవలెను.

             విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములును నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహ మునకు చుట్టు, ఎనిమిదివై పులందును విష్ణుప్రతిమకంటే రెట్టింపు ప్రమాణముగల ఆవతారమూర్తులను నిర్మింపవలెను తూర్పున వరాహము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయువ్యమున వామనుడు, ఈశానమున వానుదేవుడు వీరిమూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము ఆష్టమాద్యంశలు తప్ప కలుగు వేధచేదోష మేమి మును ఉండదు.

అగ్ని మహాపురాణమునందు ప్రాసాదలక్షణమను నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.