ఆగ్ని రువాచః-
రామాయణమహం వక్ష్యే నార దేనోదితం పురా।
వాల్మీకయే యథా తద్వత్పఠితం భుక్తిము క్తిదమ్.
అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ము క్తియు లభించునో అట్టి రామాయణమును, నారదుడు వాల్మీకికి చెప్పిన విధమున చెప్పెదను.
నారద ఉవాచః -
విష్ణునాభ్యబ్ఖజో బ్రహ్మ మరీచిర్బహ్మణః సుతః ।
మరీచేః కశ్యవ స్తస్మాతూర్యో వైవస్వతో మనుః.
తతస్తస్మాత్తభేష్వాకు స్తస్య వం కకుత్థ్సక ।
కకుత్థస్య రఘు స్తస్మాదజో దశరథ స్తతః.
విష్ణు పు సాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతవికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును ఆతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. అతని వంశమునందు కకుళ్పుడు పుట్టెను. కకుళ్సునకు రఘువు, రఘువునకు ఆజుడు, ఆజునకు దశరథుడును పుట్టెను.
రావణాదేర్వధార్థాయ చతుర్ధాభూత్స్వయం హరిః ।
రాజ్ఞో దశరథాద్రామః కౌసల్యాయాం బభూవ హ.
కై కేయ్యాం భరతః పుత్రః సుమిత్రాయాం చ లక్ష్మణః ।
శత్రుఘ్న ఋష్యశృజ్గేణ తాసు సందత్తపాయసాత్.
ప్రాశితాద్యజ్ఞసంసిద్ధాద్రామాద్యాశ్చ సమాః పితుః ।
శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కె కేయియందు భరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నులుగను జనించెను. ఋష్యశృంగుని సాహాయ్యము చే యజ్ఞమునందు లభించిన పాయసమును కౌసల్యాదుల కియగా, వారు దానిని భుజింపగా, తండ్రితో సమాను లైన రామాదులు జనించిరి. లైన రామాదులు జనించిరి.
యజ్ఞవిఘ్న వినాశాయ విశ్వామిత్రార్థితో నృవః
రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ ।
విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిన్న ములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వా మిత్రునితో పంపెను.
రామో గతోఒస్త్రశస్త్రాణి శిక్షితస్తాడకా నకృత్.
మారీచం మానవాస్త్రేణ మోహితం దూరతోనయత్ ।
సుబాహుం యజహనారం సబలం చావధీద్బలి.
తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందెను. మానవాగ్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న “సుదామని సేనా సహితముగా సంహరించేను.
సిద్దార్థమనివాసీ చ విశ్వామిత్రాదిభిః సహ ।
గతః క్రతుం మైథిలన్య ద్రష్టుం చాపం సహానుజః.
సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై , జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.
శతానన్హనిమిత్తేన విశ్వామిత్రప్రభావతః ।
రామాయ కథితే రాజౌ స మునిః పూజితః క్రతౌ.
శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు. ముని నమేతు డైన రాముని పూజించేను. డైన రాముని పూజించెను.
ధనురాపూరయామాస లీలయా స బభఞ్జ తత్।
వీర్యశుల్కాంచ జనకః సీతాం కన్యాం త్వయోనిజామ్.
దదౌ రామాయ రామోపి పిత్రాదౌ హి సమాగతే ।
ఉపయేమే జానకీం తామూర్మిలాం లక్ష్మణ స్తథా.
శ్రుతకీర్తిం మాణ్డవీం చ కుశధ్వజసుతే తథా ।
జనకస్యానుజన్యైతే శత్రుఘ్న భరతావభౌ.
కన్యే ద్వే ఉవయేమాతే -
రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయానముగా విరచెను. జనకుడు వీర్యమే కులముగా కలదియు, అయోనిజయు ఆగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె లైన మాండవీ శ్రుతకీర్తులను భరత, శత్రఘ్నులును వివాహమాడిరి.
జన కేన సుపూజితః ।
రామోగాత్స వసిష్టాద్యైర్గామదగ్న్యం విజిత్య చ।
అయోధ్యాం భరతో ఒప్యాగాత్పశత్రు ఘ్నో యుధాజితః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే రామాయణే బాలకాణ్డ వర్ణనం నామ పఞ్చమోధ్యాయః.
ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్టాది సమేతుడై పరశురాముని జయించి ఆయోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.
అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పoచమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 5 of the Agni Purāṇa is as follows:
This chapter narrates the celebrated story of Prahlāda, the devoted son of the demon king Hiraṇyakaśipu. Despite enduring numerous torments ordered by his father — poison, fire, thrown from cliffs, drowned in the sea — Prahlāda remained steadfast in his devotion to Bhagavān Viṣṇu. When Hiraṇyakaśipu challenged Prahlāda to show Viṣṇu's presence within a pillar, Bhagavān burst forth as Narasiṃha — half-man, half-lion — at twilight, neither inside nor outside, placed the demon on his thighs, and tore him apart with his claws, satisfying all the conditions of the demon's boon. Prahlāda's unwavering bhakti and the compassionate fury of Narasiṃha are rendered as the supreme demonstration that Bhagavān pervades all things and is the ultimate refuge of the devotee.