ఈశ్వర ఉవాచః-
నగరగ్రామదుర్గాద్యా గృహప్రాసాదవృద్దయే ।
ఏకాశీతిపదైర్వాస్తుం పూజయేత్సిద్ధయే ధ్రువమ్.
ప్రొగాస్యా దశధా నాడ్యస్తాం . నామాని చ బ్రువే ।
శాస్త్రి యశోవతీ కాస్తా విశాలో ప్రాణవాహినీ.
సతీ వసుమతీ నన్హా సుభద్రాథ మనోరమా।
ఉత్తరాద్యా దశాన్యాశ్చ ఏకాశీత్ర్యంఘికారికా.
హరిణీ సుప్రభా లక్ష్మీ ర్విభూతిర్విమలా ప్రియా ।
జయా జ్వాలా విశోకా చ సృ్మతా సత్ర చ పాదతః.
ఈళాద్యష్టాష్టకం దికు యజేదీశ్వం ధనజ్జయమ్।
శక్ర మర్కం తథా సత్యం భృశం వ్యోమ చ పూర్వతః.
హవ్యవాహం చ పూషాణం: వితథం భౌమమేవ చ ।
కృతా శ్రమథ గన్గర్వం భృజం మృగం చ దక్షిణే.
పితరం ద్వారపాలం చ సుగ్రీవం పుష్పద నకమ్ ।
వరుణం దైత్యశోషా చ యజ్మాణం పశ్చిమే సదా.
రోగాహిముఖ్యై భల్లాటకి సౌభాగ్యమదితిర్దితిః ।
నవానపదగో బ్రహ్మా పూజ్యోఒరే చ షడంఘిపాః:
బ్రహ్మేశాస్తరకోష్ఠస్థమాపాఖ్యంతు పదద్వయే ।
తదధశ్చాపవత్సాఖ్యం కేన్గాన్గరేషు షట్పదే.
మరీచికాగ్నిమధ్యే తు సవితా ద్విపదస్థితః ।
సావిత్రో తదధో ద్వ్యంశే వివస్వాన్షట్పదే త్వధః.
పితృ బ్రహ్మా న్తరే విష్ణుమిన్దుమిక్దం త్వధో జయమ్।
వరుణబ్రహ్మణోర్మధ్యే మిత్రాఖ్యం షట్పదే-యజేత్.
రోగబ్రహ్మా స్తరే నిత్యం ద్విపజ్చరుద్రదాసకమ్ ।
తదధో ద్వంఘిగం యక్ష్మ షట్ సౌమ్యేషు ధరాధరమ్.
చరకం స్కన్దవిటపం విదారీం పూతనాం క్రమాత్ ।
జమ్భం పాపం పిలిపిచ్ఛం యజేదీశాదిబాహ్యతః.
పరమేశ్వరుడు పలికెను. నగర గ్రామ దుర్గాదులలో గృహప్రాసాదవృద్ధికై ఎనుబదియొక్క పదముల వాస్తు మండలము నిర్మించి, దానిపై తప్పక వాస్తుదేవతాపూజ చేయవలెను. పూర్వాభిముఖము. లగు పది రేఖలు పది నాడులకు ప్రతీకములు. యవతి, కాంతా, విశాలా ప్రాణవాహినీ, సతీ, వసుమతీ, నందా, సుభద్రా, మనోరమా అనునవి: ఆ నాడుల పేర్లు, ఉత్తరాభిముఖముగ ప్రవహించు ఇంకను పది నాడులు కూడ ఉన్నవి. వాటిచే తొమ్మిది పదములు ఎనుబదియొక - పదములుగ విఠణింపబడును. హరిణీ, సుప్రభా, లక్ష్మీ, విభూతి, విమలా, ప్రియా, ఇయా, జ్వాలా, విశోకా అని వాటి పేర్లు. సత్ర పాతము చేయగా రేఖామయములగు నాడులు అభివ్య క్తములై చింతనబిషయములగును. ఈvది దేవతలు ఎనమండుగురు చొప్పున అష్టకము లగును , ఆ అష్టకమును నాలుగు దిక్కులందును పూజించవలెను.ఈ. మున-జయశక్ర-ఆర్క-సత్య-భృశ-వ్యోమదేవతలను. (అష్టకమును) వాస్తుమండలము మీద పూర్వదిక్కున పూజించవలెను. అగ్ని-పూషన్-వితథ-సోమ-కృతాంత-గంధర్వ-భృంగ -మృగులను దేవలాష్టకమును దక్షిణమున నున్న పదములందు పూజించవలెను. పితృ, ద్వారపాల, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, దైత్య, శోష,యక్ష్మ లను ఆష్టకమును పశ్చిమపదము లందు పూజించవలెను. రోగ, అప్పా, ముఖ్య, భల్లాట, సోమ, శైల, ఆదితి, దితు లను దేవతాష్టకమును ఉత్తరమున నున్న పదములపై పూజించవలెను. వాస్తుమండలము మధ్య నున్న తొమ్మిది పదములపై బ్రహ్మయు, ఇరువదినాలుగు పదముల పై, ఆరేసి పదములపై అధికారము గల దేవతలను పూజించవలెను. బ్రహ్మకును, ఈశనకును మధ్య నున్న కోష్టకములం దున్న పదములపై ఆపదేవతను క్రింది రెండు పదములపై ఆపవత్సుని పూజించవలెను. దాని తరువాత నున్న ఆరు పదములపై మరీచిని పూజించవలెను. మరీచికిని, అగ్ని కిని మధ్యనున్న రెండు పదములపై సవిత ఉండును. వాటి క్రింద నున్న రెండు పదములపై సావిత్రుడు ఉండును. దాని క్రింద ఆరు పదములపై వివస్వంతు డుండును. పితృ దేవతలకును బ్రహ్మ! కును మధ్య నున్న రెండు పదములపై విష్ణువు, ఇంద్రుడును ఉందురు. క్రింది రెండు పదముందు ఇంద్రుడును, జము డుమ ఉందురు. వారిని పూజించవలెను. వరుణనకును, బ్రహ్మకును మధ్యనున్న ఆరు పదముల పై మిత్రదేవతను పూజించ వలెను. రోగమునకును, బ్రహ్మ కును శుధ్యనున్న రెండు పదముల పై రుద్ర-రుద్రదాసులను, క్రింది రెండు పదములందు యక్ష్మను పూజించవలెను. మండలము బైటి ఈశావాది కోణముందు క్రమముగా చరకీ-స్కంద-విదారీ-వికట-పూతనా జంత-పాపా-పిలిపిచ్చ లను బాలగ్రహములను పూజించవలెను.
ఏకాతిపదం వేశ్మ మణ్డపశ్చ శతాంఘికః ।
పూర్వవద్దేవతాః పూజ్యా బ్రహ్మా తు షోడశాంశ కే.
మరిచ్చి వివస్వాంశ్చ మిత్రం పృథ్వీధర స్తథా ।
దశ కౌష్టస్థితా దీక్షకు త్వన్యే వేదికోణగాః.
చైత్యమాతా తథోశాగ్నీ మృగాళ్యె పితరౌ తథా ।
పాపయన్మానితాదేవాః సర్వే సార్థాంశ కే స్థితాః.
యల్పాద్యౌకః ప్రవక్ష్యామి సండే పేణ క్రమాధుహ ।
సదిగ్వింశతిక రైధైర్ఘ్యాదష్టావింశతి విస్తరాత్.
శివాయః శివాఖ్యశ్చ రుద్రహీనః సదోథయోః ।
రుద్రద్విగుణితానాహాః పృథుజ్జిభిర్వినాత్రిభిః.
స్వాధృహద్విగుణం దైత్తిథిభిశ్చిత విస్తరాత్।
సావిత్రః సాలయః కుడ్యా స్తథా త్రింశాంశతః పృథక్.
కుడ్యపృథూపజం మోచ్చాత్కుడ్యం తు త్రిగుణోచ్ఛయమ్।
కుడ్యసూత్రనమా పృథ్వీ వీథిబేదాదమేకదా.
కదే తుల్యం చ వీధీభిర్ద్వారవీథీ వినాగ్రతః।
శ్రీజయం వృష్ణతో హీనం భద్రోఒరం పార్శ్వయోర్వినా.
గర్బపృథుసమా వీథీ తదళారేన వా క్వచిత్ ।
వీఠ్యర్థనోపవీథ్యాద్యమేక ద్వితీపురాన్వితమ్.
సామాన్యాన్యగృహం వత్యే సర్వేషాం సర్వకామదమ్।
ఏక ట్విత్రిచతుఃశాలమష్టకాలం యథాక్రమాల్.
ఏకం యామ్యే చ సౌమ్యాస్యం ద్వే చేత్పశ్చాత్పురోముఖమ్ ।
చతుఃకాలం తు సామ్ము ఖ్యాత్తయోరిఫ్ఘాన్డముక్తయోః.
శివాస్యమమ్బుపాస్యైష ఇన్షాస్యేయమసూర్యకమ్।
ప్రాక్సౌమ్య ఛే చ దళాఖ్యం ప్రాగ్యామ్యే వాతసంజ్ఞకమ్.
ఆ ప్యేక్గా గృహబల్యాఖ్యం త్రిశూలం తద్వినర్దికృత్।
పూర్వకాలావిహీనం స్యాత్సు క్షేత్రం వృద్ధిదాయకమ్.
యామ్యే హీనే భవేచ్ఛూలీ త్రిశాలం వృద్ధికృత్పరమ్।
యక్షఘ్నం జలహీనౌకః సుతఘ్నం బహుశ త్రుకృత్.
ఎనుబది ఒక్క పదములు గల వాస్తుచక్రము చెప్పబడినది. శతపదమండలము గూడ ఉండును. దానిమీద, కూడ వెనుక టివలెనే దేవతాపూజ చెప్పబడినది. శతపదచక్రమునందు మధ్య నున్న పదునారు పదములపై బ్రహ్మను పూజించవలెను. బ్రహకు పూర్వాదిదిశలం దున్న మరీచి వివస్వత్-మిత్రపృథ్వీధరులును పదేసి పదములపై పూజించపలెను. ఈశాన్యాదిదిక్కులం దున్న దితి. ఈ అగ్ని-పూషన్-పితృపాపయత్మ రోగ దేవతలు ఒకటిన్నర పదముల పై నందురు. స్కందా! ఇపుడు యజ్ఞాదులకై కావలసిన ముడపములను, క్రమముగా, సంక్షేపముగా వర్ణించేదను ముప్పది హస్తముల పొడవు, ఇరువది ఎనిమిది హస్తముల వెడల్పు ఉన్న మండపము శివునకు ఆశ్రయము. పొడవువెడల్పులలో పదకొండు చొప్పున తగ్గించగా, పందొమ్మి 3 హస్తముల పొడవు, పదునేడు హస్తముల వెడల్పు ఉన్న మండపము శివసంజ్ఞకము. ఇరువది రెండు హస్తముల పొడవు, వమనే దు హస్తముల వెడల్పు ఉన్న , మండపమునకు సావిత్రమని పేరు. ఇతర గృహముల విస్తారము ఆంశికముగ నుండును. గోడ ఎత్తు దాని లావైన ఉపజంఘ ఎత్తునకు మూడు రెట్లు ఉండవలెను. గోడకొరకై ఎంత సూత్రమానము నిశ్చితమైనదో అంతయే దాని ఎదుట నుండు భూమి ఉండవలెను. అది వీథభేదముచే అనేక విధములనుండును. భద్రనామక ప్రాసాదమునందు ద్వారవీథి వీథులతో సమానముగనే ఉండవలెను. శ్రీజయ మను ప్రాసాదమునందు ఉండు ద్వారవీథిలో దానియందు వీథిపృష్టభాగ ముండదు. ద్వారవీథిలో వీథిపార్శ్వథాగమును తగ్గించినచో అట్టి ద్వారవీథి కల ప్రాసాదమునకు 'భద్ర'మని పేరు. వీథి విస్తారము గూడ గర్బవిస్తారము వలె నుండవలెను. కొన్ని చోట్ల దాని సగముతోను, లేదా నాల్గవవంతుతో సమానముగా ఉండును. ఉపవీథులను వీథిలో సగము ప్రమాణ ముండు నట్లు నిర్మించవలేను. దానికి ఒకటి లేదా రెండు, లేదా మూడు పురము లుండవలెను. ఇపుడు ఇతర మైన సాధారణగృహ ములను గూర్చి చెప్పుచున్నాను. ఆ గృహమును ఆ ఆకారముతో నిర్మించినచో అది సమస్త మైన కోరికలను సఫలమ చేయును. దానిలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, లేదా ఎనిమిది శాలలు ఉండవలెను. ఏక కాలగృహము యొక్క శాల దక్షిణభాగమున నిర్మింపబడును. దాని ద్వారము ఉత్తరము వైపున ఉండును. రెండులను నిర్మించు పక్షమున వాటిని పశ్చిమమునందును, తూర్పునందును నిర్మింపవలెను. వాటి ద్వారములు, ఎదురెదురుగా ఉండవలెను, నాలుగు శాలల గృహమునకు. నాలుగు ద్వారములు, నాలుగు అడుగులు ఉండును గాన అవి సర్వతోముఖముగ నుండును. ఆది గృహ స్వామికి కల్యాణకరము. పశ్చిమము వైపు రెండు శాలండు ద్విశాలాగృహమునకు 'యమసూర్యకము' అని పేరు. తూర్పు, ఉత్తరముల వైపు ళాల లున్నచో ఆ గృహమునకు ‘దండ' మని పేరు. పూర్వదక్షిణముల వైపు రెండు శాల లున్నచో దానికి 'పాతము' అని పేరు. త్రిశాలాగృహమునందు తూర్పువైపు శాల లేనిచో దానికి సు శేషత్రము అని పేరు: 'అది బుద్ధిదా యక ము. దక్షిణమున తప్ప ఇతర దిశలుదు శాల లున్న చో దానికి 'విశాలము' అని పేరు. ఆది కులక్షయకరము. చాల భయదాయకము. పశ్చిమమున శాల లేని విశాలగృహమునకు ‘పక్షమ్నము’ అని పేరు. అది పుత్రహానికరము. అనేక శత్రుకార కము.
ఇంద్రాదిక్రమతో వచ్మి ధ్వజాద్యష్ట గృహాణ్యహమ్ ।
ప్రక్షాళానుగ్రగావాసమగ్నౌ తన్య మహానసమ్.
యామ్యే రసక్రియా శయ్యా ధనుశస్త్రాణి రక్షసి ।
ధనుభుక్త్యము పేళాఖ్యే సమ్యగశౌ చ మారుతే.
సౌమ్యే ధనపూ కుర్యాది కే దీక్షావరాలయమ్ ।
స్వామిహస్తమితం వేశ్మ విస్తారాణామపిజ్జికమ్.
త్రిగుణం హస్తసంయుక్తం కృత్వాష్టాంశైర్ఘృతం।
తథాతచ్ఛేషోఒయం స్థిత స్తేన వాయసాన్తం ధ్వజాదికోమ్.
త్రయః పడాగ్ని వేదేషు రసర్షివసుతో భవేత్ ।
సర్వనాశకరం వేశ్మ మధ్యే చాస్తే చ సంస్థితమ్.
తస్మాచ్చ నవమే భాగే శుభకృన్ని లయో మతః ।
తన్మ ధ్యే మళ్తపః శ క్తః సమో వా ద్విగుణాయత.
ప్రత్యగా ప్యే చేన్గుయమే హట్ట ఏవ గృహావరీ ।
ఏకైక భవనాఖ్యాని ద్విష్టాష్టక, సంఖ్యయా.
ఈశాద్యదితి కాస్తాని ఫలాన్యేషాం యథాక్రమమ్ ।
భయం నారీ చలత్వం చ జయో వృద్ధికి ప్రతాపకః.
కిక్ ధర్మః కలిశ్చ నైస్వం చ ప్రాగ్ద్వారే ష్వష్టసు ధ్రువమ్।
దాహోఒసుఖం సుహృన్నాతో ధననాశో మృతిర్థనమ్.
శిల్పితం తనయః స్యాచ్చ యామ్యద్వారఫలాష్టకమ్ ।
ఆయు ప్రవ్రాజ్యవస్యాని ధనశాన్యర్థ సంశయాః.
శోషం భోగం చాపత్యం చ జలద్వారఫలాని చ ।
రోగోమదా ర్తిముఖ్యత్వం చార్థాయుః కృశతా మతి.
మానం చ ద్వారతః పూర్వే ఉత్తరస్యాం దిశి క్రమాత్।
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే గృహాదివాస్తుర్నామ పఞ్చాధిక శతతమోధ్యాయః.
ఇపుడు పూర్వాదిదిక్రమమున ధ్వజాదిగృహముల నెనిమిదింటిని గూర్చి చెప్పెదను స్నానగృహ-అనుగ్రహ గృహములను తూర్పునను, వంటయిల్లును ఆగ్నేయమునను, శయ్యా-రసక్రియల గృహమును దక్షిణమునందును, శస్త్ర గృహమును నైరృతియందును, ధనరత్నాదుల కోశాగారమును పశ్చిమమునందును, అన్నగృహము వాయవ్యమునందును, ధనపశ్వాదులను ఉత్తర మునందును, దీక్షాగృహమును ఈశాన్యమునందును నిర్మింపవలెను. గృహస్వామి హస్తముచే కొలవ బడిన గృహపిండము పొడవు వెడల్పుల హస్తమానమును మూడుచే గుణించి ఎనిమిదిచే భాగించవలెను. అట్లు భాగించగా వచ్చిన శేషమును బట్టి ఈ ధ్వజాద్యాయములు ఏర్పడును. దానిని పట్టియే ధ్వజము మొదలు కాకము వరకును ఉన్న ఆయములు తెలియును. రెండు, మూడు, నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది శేషించినచో దానిని బట్టి శుభాశుభఫలము లేర్పడును. గృహాయము మధ్యమము (ఐదవది) కాని, (చివరిది) కాకము గాని అయినచో అట్టి గృహము సర్వనాశకర మగును. అందుచే ఎనిమిది భాగ ములను విడచి, తొమ్మిదవ-భాగమునండు నిర్మించిన గృహము శుభకరము. ఆ నవమభాగమునందే మండపము ఉత్తమముగా భావింపబడుచున్నది. దాని పొడవు వెడల్పులు సమముగా నుండవలెను లేదా వెడల్పుకంటె. పొడవు రెట్టింపు ఉండవలెను. తూర్పునుండి పశ్చిమము వైపునకును, ఉత్తర మునుండి దక్షిణమునకును, బజారునందే గృహపంక్తి కాన వచ్చును. ఒక్కొక్క ఇంటికి, ప్రతిదిక్కునకును ఎనిమిదేసి ద్వారము లుండవచ్చును. ఈ ఎనిమిది.. ద్వారములకును వేరు వేరు -ఫలము లున్నవి. పూర్వదిక్కునం.దున్న ఎనిమిదిద్వారములకును - భయము, స్త్రీ, చాపల్యము, జయము, వృద్ధి, ప్రలో పము, ధర్మము, కలహము, నిర్ధనత ఆనునవి తప్పక జరుగు ఫలములు. దక్షిణదిక్కునం -దున్న ఎనిమిది ద్వారములతో దాహ-దుఃఖ-సుహృన్నాక ధననాళ్ల-మృత్యు-ధనశిల్పజ్ఞాన పుత్రప్రాప్తులు, ఫలము- ఆయుస్సంన్యాస-సస్య-ధన శాంతి-ఆర్థనాళ-శోషణ-భోగ-సంతానప్రాప్తులు పశ్చిమద్వారఫలములు. రోగ...మద-ఆర్తి-ముఖ్య లా అర్థ-ఆయుః-కృశతా- మావములు ఉత్తర ద్వారఫలములు.
అగ్ని మహాపురాణమునందు గృహాది వాస్తు వను నూట ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 105 of the Agni Purāṇa is as follows:
Agni explains the veneration of sacred yantras as geometric embodiments of the deity's śakti and presence. Various yantras for Śrī-Lakṣmī, Durgā, Gāyatrī, and Viṣṇu are described along with the appropriate method of drawing, consecrating, and worshipping them. The worshipper installs the yantra on a purified surface with specific nyāsa-mantras and meditates on the deity within the geometric centre. Regular yantra-pūjā bestows siddhi, protection, and the gradual dissolution of karmic obstacles.