అగ్ని మహా పురాణము

106 - అథ నగరాదికవాస్తుకథనమ్

ఈశ్వర ఉవాచః-

నగరాదిక వాస్తుంచ చ వక్ష్యే రాజ్యాదివృద్ధయే

 యోజనం యోజనార్థం వా తదఠం స్థానమాశ్రయేత్.

అభ్యర్చ్య వాస్తునగరం ప్రాకారాద్యం తు కారయేత్

ఈశాదిత్రింశత్పద కే పూర్వద్వారం చ సూర్య కే.

గశర్వాఖ్యం దక్షిణే స్యాద్వారుణ్యే పశ్చిమే తథా

సౌమ్యద్వారం సౌమ్యపదే కార్యా హట్టాస్తు విస్తరాః.

యేనేలాది సుఖం. గచ్ఛేతుర్యాద్ధ్వారం తు షట్కరమ్

భిన్నకర్ణం విభిన్నం చ చన్దార్ధాభం పురం న హి.

వజ్రసూచీముఖం సోషం సకృద్ద్వి త్రిసమాగమమ్

బాపాభం వ జనాగాభం పురారమే హి ళా నికృత్.

 ప్రార్పః విష్ణుహలారాదీన్న త్వా దద్యాదృతిం బలీ

ఆగ్నేయే స్వర్ణహర్మారాన్పురస్య వినివేశయేత్.

దక్షిణే నృత్యవృత్తీనాం వేశ్యాత్రీణాం గృహాణి చ

నటానాం చ క్రికాదీనాం క్రైవర్తాదేశ్చ నైరృతే.

రథానామాయుధానాం చ కృపాణానాం చ వారుణే

శాణికాః కర్మాధికృతా వాయవ్యే పరికర్మిణః.

బ్రాహ్మణా యతయః సిద్ధాః పుణ్యవన స్తథోత్తరే

ఫలాద్యాది విక్రయిణ ఈశానే చ వణిగ్టనా.

పర్వతశ్చ బలాధ్యక్షా ఆగ్నేయే వివిధం బలమ్

స్త్రీణామాదేశినే దకే కాణ్డారాన్నైరృతే న్య సేత్.

పశ్చిమే చ మహామాత్యాన్కోకపాలాంశ్చ కారుకాన్

ఉత్తరే దణ్డనాథాంశ్చ నాయక ద్విజసం కులాద్.

పరమేశ్వరుడు చెప్పెను : కార్తికేయా! రాజ్యాదుల అభివృద్ధికొరకై ఇపుడు నగరవాస్తువును వర్ణించి చేప్పెదను, నగర నిర్మాణముకొరకు, ఒక యోజనము లేదా అర్ధయోజనము, విస్తారము గల భూమిని గ్రహించవలెను. ఈశాదీపదములు. ముప్పదింట సూర్యసం ముఖముగ పూర్వద్వారము, గంధర్వసమీపమున దక్షిణద్వారము, వరుణునిదగ్గర పశ్చిమద్వారము సోముని దగ్గర ఉత్తరద్వారము నిర్మించవలెను,  వగరమున వీథులు వెడల్పుగా ఉండవలెను. నగరద్వారము ఆరు హస్తముని వెడల్పు, ఉండి ఏనుగులు మొదలగునవి సుఖముగా ప్రవేశించుటకు నిర్గమించుటకు వీలుగా ఉండవలెను. నగరము ఛిన్నకర్ణము గాని, భగ్నముగాని, ఆర్ధచంద్రాకారము గాని కాహడదు. వజ్రసూచీముఖనగరము కూడ హితకరము కాదు. ఒకటి రెండు లేదా మూడు. ద్వారములు గల, ధనుస్సు. ఆకారములో ఉన్న వజవాగాభనగర నిర్మించినచో ఆది శాంతిప్రదము. వగరమునకు అగ్నేయమున స్వర్ణకారులును, దక్షిణమున నృత్యోపజీవు లగువారాంగనలును. నైరృతి యందు నట-కుంభకార-కై వస్తాదులును, పశ్చిమమున రథకార-ఆయుధకార ఖడ్గకారులను, వాయువ్యమున మద్యవిక్రేతలు కర్మకారులు, భృత్యులును, ఉత్తరమున బ్రాహ్మణ-యతి-సిద్ధాదిపుణ్యపురుషులును, ఈశాన్యమున ఫలాదులను విక్రయించు. వారును నివసించవలేను. సేనాధ్యక్షుడు తూర్పున ఉండవలెను. వివిధ సైన్యములు ఆగ్నేయమునందును, స్త్రీలకు వివిధ కళలను బోధించు ఆచార్యులు దక్షిణమునందును, ధనుర్ధర సైనికులు నైరృతియందును, పశ్చిమమున మహామాత్యుడు, తోక పాలకులు, కార్మికులును, ఉత్తరమున దండాధికారులు నాయక ద్విజులును నివసించవలేను.

పూర్వతః క్షత్రియా న్క్షేక  వై క్యాష్ఛద్రాంశ్చ పశ్చిమే

దిక్షు వైద్యాన్యాజినశ్చ బలాని చ చతుర్దశమ్.

పూర్వేణ చరలిజ్యాదీఇఛ్మితానాదీని దక్షిణే

పశ్చిమే గోధనాద్యం చ కృషిక ర్త్యం స్తథోత్తరే.

న్యసేన్లే చ్ఛాంక్చకోణేషు గ్రామాదిషు తథా స్థితమ్

శ్రియం వైశ్రవణం ద్వారి పూర్వౌ తొ పశ్యతాం శ్రియమ్.

దేవాదీనాం పశ్చిమతః పూర్వాస్యాని గృహాణి హి

పూర్వతః పశ్చిమాస్యాని దక్షిణే చోత్తరాననాన్.

నా కేక విష్ణ్వా దిధామాని రణార్థంనగరస్య చ

నిర్దేవతం తు నగరగ్రామదుర్గగృహాదికమ్.

భజ్యతే తప్పాశాచాద్యై రోగాద్యైః పరిభూయతే

నగరాది సదైవం పా జయదం భుక్తిముక్తిదమ్.

పూర్వాయాం శ్రీగృహం ప్రోక్తమాగ్నేయ్యాం వై మహానసమ్

శయనం దక్షిణస్యాం తు నైరృత్యామాయుధాశ్రయమ్.

భోజనం పశ్చిమాయాం తు వాయవ్యాం ధాన్యసంగ్రహః

ఉత్తరే ద్రవ్యసంస్థానమైశాన్యాం దేవతాగృహమ్.

చతుఃశాలం త్రిశాలం వా ద్విశాలం చైక లకమ్

చతుఃశాలాగృహాణాం తు శాలాళిన్దకభేదతః.

శతద్వయం తు జాయనే పళ్చితత్పళ్చితేష్వపి

త్రిశాలాని తు చత్వారి ద్విశాలాని తు పదా.

ఏక కాలాని చత్వారి ఏకాలిన్గాని వచ్మి చ

అష్టావింశత్యలిన్గాని గృహాణి నగరాణి చ.

చతుర్భిః సప్తభిశ్చైవ వళ్చిపశ్చాత దేవ తు

షడలిన్గాని వింతైవ అష్టాభిర్వింశ ఏవ హి.

అష్టాలిన్దం భవేదేవం నగరాదౌ గృహాణి హి.

ఇత్యాదిపురాణే ఆగ్నేయే నగరాధివాస్తు ర్నామ షడధికశతతమోధ్యాయః.

తూర్పున క్షత్రియులను, దతిణమున వైశ్యులను, పశ్చిమమున శూద్రాదులను, విభిన్న దిశలయందు వైద్యులను, అశ్వములను, సైన్యమును నాల్గు దిక్కులందును ఉంచవలెను. తూర్పునందు గూఢచారులను, దక్షిణమున శ్మశానమును, పశ్చిమమున గోధనమును, ఉత్తరమున కర్షకులను ఉంచవలెను. మ్లేచ్చులకు విదిక్కులందు స్థానము  ఏర్పరుపవలెను, లేదా గ్రామములలో నివసింపజేయవలెను, పూర్వద్వారమునందు లక్ష్మీకుబేరుల స్థాపన చేయవలెను. ఆ ఇరువురిని చూచువారికి లక్ష్మీసంవత్తి కలుగును. పశ్చిమమున నిర్మించిన దేవాలయము పూర్వాభిముఖము గాను తూర్పున నిర్మించినది. పశ్చిమాభి ముఖముగాను, దక్షిణమున నిర్మించినది ఉత్తరాభిముఖముగాను ఉండపలెను. నగర రక్షణ కొరకు ఇంద్ర విష్ణ్వాదిదేవతా మందిరములను నిర్మించవలెను. దేవతలు లేని నగర-గ్రామ-దుర్గ.గృహాదులను పిశాచములు అనుభవించును. అవి అనేక రోగములచే పీడింపబడును. పైన చెప్పిన విధమున నిర్మించిన నగరాదికము సదా జయప్రద మై భోగ.మోక్షముల నీచ్చును. వాస్తుభూమికి తూర్పున శృంగారగృహము, ఆగ్నేయమున పాకగృహము, దక్షిణమున శయనగృహము, నైరృతియందు శస్త్రగృహమును, పశ్చిమమునందు భోజనగృహము, వాయవ్యమునందు ధాన్యసంగ్రహము, ఉత్తరమునందు ధనాగారము, ఈశాన్యమునందు దేవతాగృహము నిర్మింపవలెను. నగరమునందు ఏకకాలా-ద్విశాలా-త్రిశాలా.చతుః కాలా గృహములను నిర్మించవలెను. లాభేదమును, ఆలింద (ముంగిలి) భేదమును బట్టి చతుఃకాలాగృహమున రెండు వందల ఏబదియైదు భేదము లుండును. శ్రీలాగృహమునకు నాలుగు, ద్విశాలకు ఐదు, ఏకశాలకు, వాలుగు భేదము లండును. ఇపుడు ఆలిందయుక్తగృహమును గూర్చి చెప్పెడను వినుము: గృహవాస్తువునందును, వగరహస్తువునందును, ఇరువది యెనిమిది ఆలిందము లుండును. నాలుగు అలిందములతోడను, ఏడు ఆలిందములతోడను ఏబదియైదు భేదములును, ఆరు అలీందములతో ఇరువది భేదములును, ఎనిమిది ఆలిందములతోగూడ ఇరువది భేదములును ఏర్పడును. ఈ విధముగ నగ -ఈదులలో ఎనిమిది ఆలిందములు గల వాస్తుపు కూడ ఉండవచ్చును.

ఆగ్ని మహాపురాణమునందు వగరాదివాస్తు వను నూట ఆరవ అధ్యాయము సమాప్తము.