ధన్వన్తరిరువాచః-
రసాది లక్షణం వక్ష్యే భేషజానాం గుణంశృణు ।
రసవీర్య విపాకజ్ఞో నృపాదీన్రక్షయేన్నరః.
రసాః స్వాద్వమ్లలవణాః సోమజాః పరికీర్తితాః ।
కటుతిక్త కషాయాణి తథాగ్నే యామహాభుజ.
త్రిథా విపాకో ద్రవ్యస్య కట్వమ్లలవణాత్మకః ।
ద్విధావీర్యం సముద్దిష్టముష్ణం శీతం తథైవ చ.
ఆనిర్దేశ్య ప్రభావశ్చ ఓషధీనాం ద్విజోత్తమ ।
మధురశ్చ కషాయశ్చ తిక్తశ్చైవ తథారసః.
శీతవీర్యాః సముద్ధిష్టాః శేషాస్తూష్ణాః ప్రకీర్తితాః ।
గుడూచీ తత్ర తిక్తాపి భవత్యుష్ణాతి వీర్యతః.
ఉష్ణాకషాయాపి తథా పథ్యా భవతి మానద ।
మధురోఽపి తథా మాంస ఉష్ణఏవ ప్రకీర్తితః.
లవణో మధురశ్చైవ విపాక మధురౌ స్మృతౌ ।
అమ్లాష్ణశ్చ తథా ప్రోక్తః శేషాః కటువిపాకినః.
వీర్యపాకే విపర్యస్త ప్రభావాత్తత్ర నిశ్చయః ।
మధురోఽపి కటుః పాకే యచ్చ క్షౌద్రం ప్రకీర్తితమ్.
క్వాథయేత్షో డశగుణం పిబేద్ద్రవ్యాచ్చతుర్గుణమ్ ।
కల్పనైషా కషాయస్యయత్ర నోక్తో విధిర్భవేత్.
కషాయంతు భవేత్తోయం స్నేహపాకే చతుర్గుణమ్ ।
ద్రవ్యతుల్యం సముద్ధృత్య ద్రవ్యేస్నేహం క్షిపేద్బుధః.
తాపత్ప్రమాణం ద్రవ్యస్య స్నేహపాదం తతః క్షిపేత్ ।
తోయవర్జంతు యద్ధ్రవ్యం సేహద్రవ్యంతథా భవేత్.
సంవర్తితౌషధః పాకః స్నేహానాం పరికీర్తితః ।
తత్తుల్యతాతు లేహ్యస్య తథా భవతి సుశ్రుత.
స్వచ్ఛమల్పౌషధం క్వాథం కషాయం చోక్తవద్భవేత్ ।
ఆక్షం చూర్ణస్య నిర్దిష్టం కషాయస్య చతుష్పలమ్.
మధ్యమైషా స్మృతామాత్రా నాస్తి మాత్రా వికల్పనా ।
వయః కాలం బలం వహ్నిం దేశం ద్రవ్యం రుజంతథా.
సమవేక్ష్య మహాభాగ మాత్రాయాః కల్పనా భవేత్ ।
సౌమ్యాస్తత్రరసాః ప్రాయో విజ్ఞేయాధాతువర్ధనాః.
ధన్వంతరి పలికెను. ఇపుడు ఓషధి రసాదుల లక్షణములు చెప్పెదను వివము. ఓషధుల రసవీర్య విపాకములు తెలిసిన వైద్యుడే రాజాదులను రక్షించగలడు. మధుర, అమ్ల, లవణరసములు, చంద్రుని నుండి పుట్టినవి. కటుతిక్త కషాయరసములు, అగ్నినుండి పుట్టినవి. ద్రవ్యవిపాకము కటు ఆమ్ల లవణరూపమున మూడు విధముల నుండును. శీతము, ఉష్ణము, ఆని, వీర్యము రెండు విధములు. ఓద్విజోత్తమా ! ఓషధుని ప్రభావము చెప్ప శక్యముగానిది. మధుర తిక్తకషాయ రసములు శీతవీర్యములు. మిగిలిన రసములు ఉష్ణవీర్యములు కానిగుడూచి తికమైనను అత్యంతవీర్య ప్రదమగుటచే ఉష్ణ వీర్యము. అట్లే కషాయరసముక లదైనను పథ్య ఉష్ణవీర్యము జటామాంసి మధుర రసయుక్తయైనను ఉష్ణ వీర్యములవణ మధురములు విపాకమున మధుర ములని చెప్పబడినవి. ఆన్లైన్ల విపాకము కూడ మధురము మిగిలిన రసముల విపాకములు కటువులు, విశేష వీర్యయుక్త ద్రవ్యము విపాకమునందు విపరీత ఫలముకూడ ఇచ్చును. అనుటలో సందేహము లేదు. ఎట్లనగా తేనె మధుర మైనను విపాకమున కటువు అగునని చెప్పబడినది. ఒక ద్రవ్యమునకు పదు నారు రెట్లు నీరు పోసి, ఆద్రవ్యమునకు నాలు రెట్లు జలము మిగులునట్లు కాచి ఆక్వాథమును త్రాగ వలెను. ఇది క్వాథ నిర్మాణ పద్దతి క్వాథవిధి చెప్పని చోట్ల ఈ పద్దతిని యనుసరించవలేను. స్నేహ (తైలఘ్నతాది) పాకమునందు స్నేహమునకు నాలుగు రెట్లు కషాయముగాని, సమప్రమాణమగు, తైల క్వాథములుగావి చేర్చవలెను. తైలములో వేసిన ఓషధులు ఉడికి చల్లారిన పిమ్మ ఓ చేతితో నలిపినపుడు వత్తివలే అయినచో అపుడు తెలపరిపాకము వచ్చినట్లు గ్రహించవలేను. లేహ్యము లందుకూడ ఇడ్లీ సమాన ప్రమాణములు గల పదార్థ ములు వేయవలయును. నిర్మలము. అల్పౌషధియుక్తమగు క్వాథము ఉత్తమము, చూర్ణము ఒక ఆక్షము, క్వాథము నాలుగు పలములు ఇది సాధారణ మాత్రం మాత్ర విషయమున ఒక నిశ్చిత ప్రమాణములేదు. రోగి యొక్క వయోబల అగ్ని దేశ కాలద్రవ్యములను బట్టి రోగ స్వభావమును బట్టి వేర్వేరు ప్రమాణములు నిర్ణయించవలెను. సౌమ్యరసములు సాధారణముగ ధాతువర్ధకములు.
మధురాస్తు విశేషేణ విజ్ఞేయా ధాతువర్దనాః ।
దోషాణాం చైవ ధాతూనాం ద్రవ్యం సమగుణం తుయత్.
తదేవ వృద్ధయేజ్ఞేయం విపరీతం క్షయావహమ్ ।
ఉపక్రమ త్రయం ప్రోక్తం దేహేఽస్మిన్మనుజోత్తమ.
ఆహారో మైథునం నిద్రతేషు యత్నః సదా భవేత్ ।
ఆసేవ నాత్సేవ నాచ్చ అత్యంతం నాశమాప్నుయాత్.
క్షయస్య బృంహణం కార్యం స్థూలదేహస్య కర్షణమ్ ।
రక్షణం మధ్యకాయస్య దేహ భేదాస్త్రయో మతాః.
ఉపక్రమద్వయం ప్రోక్తం తర్పణం వాప్యతర్పణమ్ ।
పాతాశీ చ మితాశీ చ జీర్ణాశీ చ తథాభవేత్.
ఓషధీనాం పంచవిధా తథా భవతి కల్పనా ।
రసః కల్కః శృతః శీతః పాంటశ్చమనుజోత్తమ.
రసశ్చ పీడకో జ్ఞేయః కల్క ఆలోడితాద్భవేత్ ।
క్వథితశ్చ శ్రుతోజ్ఞేయః శీతః పర్యుషితో నిశామ్.
సద్యోఽభి శృతపూతం యత్తత్ఫాంట మభిధీయతే ।
కరణానాం శతం చైవ షష్టిశ్ చైవాధికాస్మృతా.
యోవేత్తి సహ్యజేయః స్యాత్సంబంధే బాహు శౌండికః !
ఆహారశుద్ధిరగ్న్యర్ధ మగ్నిమూలం బలంనృణామ్.
ససింధుత్రిఫలాం చాద్యాత్సురాజ్ఞ్యాజ్యాభి వర్ణదామ్ ।
జాం గలంచ రసం సింధుయుక్తం దధిపయః కణామ్.
రసాధికం నమం కుర్యాన్నరో వాతాధికోఽపివా ।
నిదాఘే మర్ధనం ప్రోక్తం శిశిరేచ సమం బహు.
వసన్తే మధ్యమం జ్ఞేయం నిదాఘే మర్దనోల్బణమ్ ।
త్వచంతు ప్రథమం మజ్గర్ధ్య మంచ తదనంతరమ్.
స్నాయురుధిరదేహేమ ఆస్థిచాతీవ మాంసలమ్ ।
స్కంధౌ బాహూతథై వేహ తథా జంఘేసజానునీ.
అరివన్మర్ధ యేత్ప్రాజ్ఞో జత్రువక్షశ్చ పూర్వవత్ ।
అంగసంధిషు సర్వేషు నిష్పీడ్య బహులం తథా.
ప్రసారయేదంగ నందీన్నచ క్షేపేణ చాక్రమాత్ ।
నాజీర్ణేతు శ్రమం కుర్యాన్న భుక్త్వాపితవాన్నరః.
దినస్యతు చతుర్భాగ ఊర్ధ్వంతు ప్రహరార్ధకే ।
వ్యాయామం నైవ కర్తవ్యం స్నానాచ్చీతాంబునా సకృత్.
వార్యుష్ణం చశ్రమం జహ్యాద్ధృదా శ్వాసం నధారయేత్ ।
వ్యాయామశ్చ కఫం హన్యాద్వాతం హన్యాచ్చ మర్దనమ్.
స్నానం పిత్తాదికం హన్యాత్తస్యాన్తే చాతపాః ప్రియాః ।
ఆతపక్లేశ కర్మాదౌ క్షేమవ్యాయామినోనరాః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రసాదిలక్షణం నామైకాశీత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
విశేషించి మధుర రసములు ధాతువర్ధకములు. దోషధాతు ద్రవ్యములు, సమాన గుణయుక్తములైనచో శరీర వృద్ధి కల్గించును. విపరీతమైనచో క్షయకారక ములు. ఓ నరశ్రేష్టా! ఈ శరీరమునకు ఆహారము మైథునము, నిద్ర ఆను మూడు ఉపస్థంబములు వున్నవి. వీది విషయమున ప్రయత్న శీలుడై వుండవలెను. వీటిని పూర్తిగా సేవింపకున్నను, ఎక్కువ సేవించినను, శరీరము క్షీణించును. కృశించిన శరీరమును పోషించవలయును. స్థూలశరీరమును తగ్గించ వలయును. మధ్యశరీరమును రక్షించు కొనవలెను. మొదటి రెండు ఉపక్రమములకు తర్పణము, అతర్పణము యని రెండు భేదములు. మానవుడు హితమైన దానిని తినవలెను. మితమైన దానిని తినవలెను మొదట తిన్నది జీర్ణమైన పిమ్మట తివవలెను. ఓ నరశ్రేష్ఠా! రసము కల్కము, క్వాథము శీతకషాయములు, ఫాంటముయని ఓషధి నిర్మాణము ఐదు విధములు. ఓషధులను పిండుటచే రసము, మథించుటచే కల్కము, మరగ బెట్టుటచే క్వాథము, రాత్రి యంతయు నీటిలో వుంచుటచే శీత కపాయము, నీటిలో వేసి తాత్కాలికముగ వేడి చేయుటచే ఫాంటము తయారగుమ. చికిత్సకు నూట అరువది సాధములున్నవి. ఇవన్నీ యు తెలిసిన వైద్యుడు అజేయుడగును. అతనికి “బహుశౌండికుడు” అని పేరు. జఠరాగ్నిని సంరక్షించుటకు, వృద్ధిపొందించుటకు శుద్ధము చేయుటకును ఆహార శుద్ధి ఆవశ్యకము. మనుష్యుని బలమునకు అగ్నియే మూలాధారము. ఐలముకొరకై సైంధవ లవణయు క్షత్రిఫలను, కాంతి ప్రదములగు ఉత్తమ పేయములను, దొంగలక సమును సైంధవయుక్తమగు పెరుగును, పాలను పిప్పలిని సేవింపవలయును. ఏ రసములు ఆధికమైపోయినవో వాటిని సామ్యావస్థకు తీసుకొని రావలేను. వాతప్రకృతి కలవాడు గ్రీష్మ ఋతువునందు మర్దనము చేయించుకొనవలెను. శిశిర ఋతువునందును సాధారణముగను. లేక ఆధికముగను, వసంతమునందు మధ్యమంబుగను, గ్రీష్మమునందు విశేష రూపముగను మర్దనము చేయించుకొనవలెను. మొదట చర్మమును అనంతరము మజ్జను మర్దనము చేయించు కొనవలెను. స్నాయు రుధిర పూర్ణము అగు శరీరమును ఆస్తులు చాలా లావుగా వున్నట్లు కనిపించును. భుజములు, బాహువులు, మోకాళ్ళు పిక్కలు కూడ మాంసలములుగా నుండును. బుద్దిమంతుడు !ఈ ఆవయవములను శత్రువును మర్దించినట్లు మర్దించవలెను. మణవలు, వక్షస్థలము వీటిని సాధారణముగా మర్దించవలెను. అవయవ సంధులను మర్దించి వాటిని చాచ వలెను, కాని హఠాత్తుగాను క్రమవిరుద్దముగాను చాచకూడదు. అజీర్ణ సమయమునందును భోజనానంతరము జలపానానంతరము వ్యాయా మము చేయకూడదు. దినమునకు నాల్గుభాగము లుండును. మొదటి జాములో సగము దాటిపోయినచో వ్యాయామము చేయ కూడదు. శీతలజలముతో ఒక పర్యాయము స్నానము చేయవలయును. ఉష్ణ జలము శ్రమను తగ్గించును. శ్వాస నిరో ధము చేయకూడదు. వ్యాయామము, కఫమును తొలగించును. స్నానము పిత్తాధిక్యమును తొలగించును. స్నానానంతరము ఎండను సేవించుట మంచిది. వ్యాయామము చేయువాడు ఎండను ఇతర క్లేశములను సహింపసమర్థుడగును.
అగ్ని మహాపురాణమున రసాదిలక్షణమను రెండువందల యేనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 281 of the Agni Purāṇa is as follows:
The properties of all medicinal substances are classified according to the six rasas: madhura (sweet), amla (sour), lavaṇa (salty), kaṭu (pungent), tikta (bitter), and kaṣāya (astringent). Each rasa's effect on the tridoṣa is described. The three post-digestive tastes (vipāka) — kaṭu, amla, and madhura — and the two vīryas (potencies) — uṣṇa (heating) and śīta (cooling) — are explained. The preparation of kvātha (decoction) at a 1:16 water ratio reduced to 1:4, and the five standard preparations (rasa, kalka, śṛta, śīta, phāṇṭa) are prescribed.