అగ్ని మహా పురాణము

22 - అథ స్నానవిధిశథనమ్

నారద ఉవాచః-

వక్ష్యే స్నానం క్రియాద్యర్థం నృసిం హేన తు మృత్తి కామ్

గృహిల్వా తాం ద్విధా కృత్వా మలస్వాన మāకయా.

నిమజ్ఞాచమ్య విన్యస్య సిం హేన కృతనక్షకః

విధిస్నానం తతః కుర్యాత్రాణాయామపురస్సరమ్.

నారదుడు పలికెను.

యాగపూజాది క్రియలు చేయుటకు ముందు చే దగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహమంత్రము నచ్చరించుచు మృతికను గ్రహించి, దానిని రెండు భాగములు చేసి ఒక దానిచే మలస్నానము చేయవలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహ మంత్రముచే ద్యానము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామపూర్వకముగా విధి స్నానము చేయవలెను.

హృది ధ్యాయన్ హరిం దేవం మనేణాష్టాక్ష రేణ హి

త్రిధా ప్రాణితలే మృత్వాం దిగ్బన్ధం సింహజప్త తః.

వాసుదేవ ప్రజప్తేన తీర్థం స్కుల్ప్య చాలభేత్

గాత్రం వేదాదిమనైశ్చ సంమార్థ్యారాధ్య మూర్తి గమ్.

స్మృత్వాఘమర్షణం వస్త్రం వరిధాయ సమాచరేత్

విన్యన్య మనెర్నిర్మార్ఘ్య పాణిగ్ధం జలమేవ చ.

 నారాయణేన సంయమ్య పోయుమాఘ్రాయ చోత్సృజేత్

జలం ధ్యాయన్ హరిం పశ్చాద్దత్త్వార్జ్యం ద్వాదశాక్షరమ్,

జపాన్యాన్ భక్తితస్త ర్ప యోగపీఠాధితః క్రమాల్

మన్రోన్ దిక్పాలపర్యనానృషీనితృగణానపి.

మనుష్యాన్సర్వభూతాని స్థావరాన్తన్యధావ నేత్

న్యస్య చాణ్ణని సంహృత్య మన్రాన్యాగగృహం వ్రజేత్

ఏవ మన్యాసు వూజాసు మూలా ద్యైః స్నానమాచరేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే స్నానవిధికథనం నామ ద్వావింశోయః.

అష్టాక్షరమంత్రమును జపించుచు, శ్రీ మహావిష్ణువును హృదయములో ధ్యానించుచు అర చేశి లో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరవాత నృసింహమం తము జంపిచుచు దిగ్బంధము చేయవలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థ మును స్పృశించగలేను. వేదాది మంత్రములచే గాతమును తుడిచికొని మూ రీలో నున్న దేవుని ఆరాధించి, స్మరించుచు, వస్త్రము ధరించి అమ మరణము చేయవలెను (ఆఘమర్షణ మంత్రములను పఠించవలెను). మంత్రములచే విన్యానము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్గనము చేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయామము చేసి, జలమును వాసనచూచి విడిచి పెట్టవలెను. హరిని ధ్యానించుచు ఆ ర్యమునిచ్చి, ద్వాదశాక్షరినీ జపించి, యోగపీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడ తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, ఋషులకును, సితృగణములకును, మనుష్యులకును స్థావరాంతములగు నమ స భూతములకును తర్పణము చేసి, పిమ్మట ఉపవిష్టుడే అంగన్యాసము చేసి, మంత్రోపసంహారము చేసి, యాగ గృహమును ప్రవేశించవలెను. ఇతర పూజల లో ఆ మూలమంత్రాదులచే స్నానము చేయవలెను.

అగ్ని మహావురాణములో స్నానవిధి నిరూపించు ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.