అగ్ని రువాచః
వంశోఽన్వ వాయో గోత్రం స్యాత్కులాన్యభి జనాన్వయౌ ।
మంత వ్యాఖ్యాశృదాచార్య ఆధష్టాత్వధ్వ రేవ్రతి.
యష్టాచ యజమానః స్యాజ్జ్ఞాత్వారంర ఉపక్రమః ।
సతీర్థ్యాశ్చెక గురవః సభ్యాః సామాజికస్తథా.
సభాసదః సభాస్తారా ఋత్విజో యాజకాశ్చతే ।
అర్ద్వర్యద్గాతృహోతారో యజుః సామర్గ్విదః క్రమాత్.
చపాలో యూపకటకః సమే స్థండిల చత్వరే ।
ఆమీక్షాసా శ్రుతోణ్ణేయో క్షీరే స్యాద్దధియోగత.
పృషదాజ్యం సదధ్యాజ్యే పరమాన్నంతు పాయసమ్ ।
ఉపాకృతః పశురసౌ యోభి మంత్య్రక్రతౌహతః.
పరంపరాకం శమనం ప్రోక్షణంచ వధార్థకమ్ ।
పూజాసమస్యాఽప చితిః సపర్యార్చార్హణా సమాః.
వరివస్యాతు శుశ్రూషా పరిచర్యాప్యుపాసకమ్ ।
నియమోవ్రతమస్త్రీతచ్చోపవాసాది పుణ్యకమ్.
ముఖ్యః స్యాత్ప్రథమః కల్పోఽను కల్పస్తుతతోఽధమః ।
కల్పేవిధిక్రమౌజ్ఞేయౌ వివేకః పృథగాత్మతా.
సంస్కార పూర్వం గ్రహణం స్యాదుపాకరణం శ్రుతేః ।
భిక్షుః పరివ్రాట్ కర్మన్దీ పారాశర్యపిమస్కరి.
ఋషయః సత్యవచన స్నాతకశ్చాప్లుతోవ్రతీ ।
యే నిర్జితేన్ద్రియగ్రామాయతినో యతయశ్చతే.
శరీశసాధనాపేక్షం నిత్యం యత్కర్మ యద్యమః ।
నియమస్తు సయత్కర్మ నిత్యమాగత్తుసాధనమ్ ॥
స్వాద్బ్రహ్మ భూయం బ్రహ్మత్వం బ్రహ్మసాయుజ్యమిత్యపి.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయ బ్రహ్మవర్గవర్ణనంనామ పంచషష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.
అగ్ని దేవుడు పలికెను. వంక - అన్వపాయ - గోత్ర - కుల - ఆభజన - అన్వయ = వంకము. మంతవ్యా ఖ్యానము చేయువాడు ఆచార్యుడు. యజ్ఞమునందు వ్రతదీక్ష గ్రహించిన వాడు ఆదేష్ట. యష్టా - యజ మానః = పర్యా. ఉపక్రమః = తెలిసి చేసిన ప్రారంభము; సతీర్థ్యా - ఒక గురువు కలవారు, సభ్యాః - సామాజికాకి - సభాసదః - సభా స్తారాః = పర్యా. ఋత్విజః - యాజకః = పర్యా, అధ్వర్యుః = యజుర్వేదము తెలిసిన ఋత్విక్. ఉద్గారా = సామవేదము తెలిసిన ఋత్విక్. హోలా = ఋగ్వేదము తెలిసిన ఋత్విక్, చశా: = యూప స్తంభము నందలి కటకము. స్థండిలం . చత్వరం = పర్యా. ఆమిడా = కాచిన పాలు తోడు బెట్టగా దానినుండి వచ్చిన నీరు; పెరుగు కలిపిన నేయ్యి పృషదాజ్యమ్, పరమాన్నం - పాయసం = పర్యా. యజ్ఞమునందు అభిమంత్రించి చంపబడిన పశువు “ఉపాకృతము. పరంపరా - శమన - ప్రోక్షణ = యజ్ఞ పశు వధము. పూజాసమస్యా - అపచితిః . సపర్యా - అర ణా = పర్యా. వరివస్యా - శుశ్రూష - పరిచర్యా - ఉపాచనమ్ = సేవ; నియమ-వ్రతమ్ = పర్యా. పుణ్య కమ్ = ఉపవాసాది వ్రతము; ప్రధానమైనది ముఖ్యకల్పము. ఆధమమైనది అనుకల్పము కల్ప విధిః - క్రమశి = పర్యా. వివేకః = వేర్వేరు చేసి గ్రహించుట. ఉపాకరణమ్ = సంస్కార పూర్వకముగ వేదమును గ్రహించుట. భిక్షు , పరివ్రాట్ - కర్మండన్ - పారాశ రిన్ - మస్క రిన్ = సన్యాసి; సత్యవాక్కు కలవారు ఋషులు. వేదాధ్యయన వ్రతమును సమాప్తి చేసిన వాడు స్నాతకుడు- యతిన్ - యతి = ఇంద్రియములను వశమ లో వుంచుకొన వాడు; శరీర సాధ్యమగు నిత్యకర్మకు “యమము” అని పేరు. అప్పుడప్పుడు చేయు ఆత్వకర్మ నియమము. బ్రహ్మభూయమ్-బ్రహ్మత్వమ్- బ్రహ్మసాయుజ్యమ్ = పర్యా.
ఆగ్ని మహాపురాణము బ్రహ్మవర్గ వర్ణనమను మూడువందల అరువదిఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 366 of the Agni Purāṇa is as follows:
The vocabulary pertaining to Kṣatriyas, Vaiśyas, and Śūdras is catalogued. Kṣatriya terminology covers the hierarchy of rulership: rājanya (royal clansman), cakravarti (universal emperor), maṇḍaleśvara (regional overlord), and their ministers, spies, and court functionaries. The military vocabulary is particularly rich: the units of the army from the individual soldier (patti) through the gulma, gaṇa, vāhinī, camū, anīkinī, and up to the full akṣauhiṇī (the complete army of 21,870 chariots, 21,870 elephants, 65,610 cavalry, and 109,350 infantry) are named and quantified. The chapter then lists the weapons of war and the Vaiśya and Śūdra occupational vocabulary covering trade, agriculture, and service, completing the four-varṇa lexical survey.