అగ్ని మహా పురాణము

348 - అథై కాక్షరకోశః

అగ్ని రువాచః

ఏకాక్షరాభి ధానంచ మాతృకాన్తం వదామితే

అవిష్ణుః ప్రతి షేధః స్యాదాపితా మహవాక్యయోః.

సీమాయామవ్యయమ ఆభ వేత్సం క్రోధపీడయోః

ఇ కామేరతి లక్ష్మ్యోరీ ఉ: శివే రక్షకాద్య ఊ:.

ఋశబ్ద్ర చాదితీ ఋస్యాత్తే వై దితౌ గుహే

ఏదేవీ ఐయోగినీ స్యాదో బ్రహ్మాజౌ మహేశ్వరః.

అం కామః అః ప్రశ స్తః స్యాత్కోబ్రహ్మాదౌకు కుత్సితే

ఖం శూన్యేంద్రియం ఖం గోగందర్వేద వినాయకే.

గంగీతే గోగాయనేస్యాద్ఘో ఘంటాకింకిణీ ముఖే

తోడనే జశ్చవిషయేస్పృహాయాం చైవ భైరవే.

చోదుర్జనే నిర్మలే చశ్చేదే జిర్ణయనే తథా

జం గీతేఝః ప్రశస్తే స్యాద్భలేఞోగాయనే చటః.

ఠశ్చంద్రమండలే శూన్యే శివేచోద్బంధనేమతః

డశ్చరుద్రే ధ్వనౌత్రాసే ఢక్కాయాంఢో ధ్వనౌమతః.

ణో నిష్కర్షే నిశ్చయే చ తశ్చౌరే క్రోడపుచ్చ కే

భక్షణే థశ్చేదనే దో ధారణే శోభ నేమతః.

దోధాతరిచ ధూస్తూరే నో వృన్ద సుగతే తథా

ప ఉపవనే విఖ్యాత: ఫశ్చ ఝంఝానిలే మతః.

పుః పూత్కారే నిష్ఫలేచ బిః పక్ష్మీబంచతార కే

మా శ్రీర్మానం చ మాతాస్యాద్యా గేయోయాతృవీరణే.

రోవహ్నౌ బలశక్రేచ లోవిధాతరి ఈ రితః

విశ్లేషణేవో వరుణే శయనే శశ్చశం సుఖే.

షః శ్రేష్ఠే సః పరోక్షేచసాలక్ష్మీః సంక చేమతః

ధారణే హ స్తథారుద్రేక్షః క్షత్రే చాక్ష రేమతః.

క్షోనృసిం హే హరౌతద్వత్క్షేత్ర పాలక యోరపి

మంత్రఏకాక్షరో దేవో భుక్తిముక్తి ప్రదాయకః .

క్షౌం హయశిర సేనమః సర్వ విద్యాప్రదోమనుః

ఆకారాద్యా స్తథా మంత్రా మాతృకామంత్ర ఉత్తమః.

ఏక పద్మేఽర్చయే దేతాన్నవ దుర్గాశ్చ పూజయేత్

భగవతీ కాత్యాయనీ కౌశికీ చాథ చండికా.

ప్రచండా సురనాయికా ఉగ్రా పార్వతీ దుర్గయా

ఓం చండికాయై విద్మహే భగవత్యై ధీమహి,

తన్నో దుర్గా ప్రచోదయాత్.

క్రమాది తుషడంగంస్యాద్గణో గురుర్గురుః క్రమాత్.

ఆజితా పరాజితాచాథ జయాచ విజయా తతః

కాత్యాయనీ భద్రకాళీ మంగలాసిద్ధి రేవతీ.

సిద్దాది బటుకాః పూజ్యా హేతుకశ్చ కపాలికః

ఏకపాదో భీమరూపో దిక్పాలాన్మధ్యతో నవ.

హ్రీం దుర్గే దుర్గే రక్షణి స్వాహా మంత్రార్థ సిద్ధయే

గౌరీ పూజ్యాచ ధర్మాద్యాః స్కందాద్యాః శ క్తయాయజేత్ .

ప్రజ్ఞాజ్ఞానా క్రియా వాచా వాగీశీ జ్వాలినీ తథా

కామినీ కామ మాలాచ ఇంద్రాద్యాః శ క్తిపూజనమ్.

ఓం గం స్వాహా మూలమంత్రోయం గంవా గణపతయేనమః

షడంగో రక్తశుక్లశ్చ దంతాక్షర పరశూత్కటః.

సమోదకోఽథ గంధాదిగంధోల్కాయేతి చక్రమాత్

గజో మహాగణ పతిర్మహోల్క: పూజ్యఏవచ.

కూష్మాండాయ ఏకదంత త్రిపురా న్తకాయ శ్యామదంత

వికట హర హాసాయ లంబనాసాననాయ పద్మ దంష్ట్రాయ

మే ఘోల్కాయ ధూమోల్కాయ వక్రతుండాయ విఘ్నేశ్వరాయ

వికటోత్కటాయ గజేంద్ర గమనాయ భుజగేంద్ర హారాయ

శశాంక ధరాయ గణాధిపతయే స్వాహా.

ఏతైర్మనుభిః స్వాహాన్తైః పూజ్యః తిలహోమాది నార్థభాక్

కాద్యైర్వా (రా) బీజసంయు క్తైస్తైరాద్యైశ్చ నమోఽన్తకైః.

 మంత్రాః వృథక్పృథగ్వాను ద్విరేఫద్విర్ముఖాక్షిణః

కాత్యాయనం స్కన్ద ఆహయ త్తద్వ్యాకరణం వదే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఏకాక్షర కోశ నిరూపణం నామాష్టచత్వారింశ దధిక త్రిశతతమోఽధ్యాయః. 

ఆగ్ని దేవుడు పలికెను. ఏకాక్షర కోశమును, మాతృకా నామములు, మంత్రములు చెప్పెదను. - ఆ = విష్ణువు, ని షేరము. ఆ=బ్రహ్మ, సీమా అర్థమున ఇది అవ్యయము. వాక్యము నందు కూడ ఉపయోగించబడును. క్రోధము పీడ ఆని కూడ అర్థము. ఇ=మన్మథుడు. ఈ-రతి, లక్ష్మీ. ఉ= శివుడు. ఊ=రక్షకాదులు. ఋ=శబ్దము, ఋ= ఆదితి. గణ=దితి, కుమారస్వామి. ఏ= దేవి. ఐ=యోగినీ. ఓ=బ్రహ్మ. ఔ= మహేశ్వరుడు. అం= మన్మ థుడు. ఆ:=ప్రశస్తము. ఖ=బ్రహ్మాదులు. కు=కుత్సితమం, ఖ= శూన్యము, ఇంద్రియము, గ = గంధర్వుడు, వివాయకడు (న. పు. గీతము) ఘ-ఘంట, కింకిణీ మొదలగునవి, లాతనము కూడ దీని అర్థము; జ= విషయము, స్పృహ, భైరవుడు, చ = దుర్జనుడు, నిర్మలము;ఛ= ఛేదన ము;జి =వివేకము; జ=గీతము; రు=ప్రశ స్తము; =బలము; ట= గానము; ఠ=చంద్రమండలము, శూన్యము, శివుడు, ఉరిపోసుకొనుట; డ = డుద్రుడు, ధ్వని, త్రాసము, ఢ=ఢక్కా, ఢక్కా ధ్వని, ఐ= నిష్కర్షము, నిశ్చయము తతస్కరుడు, వరాహ వుచ్చము. థ = భక్షణము. ద-భేదనము , ధారణము, శోభనము. ధ=బ్రహ్మ, తుత్తూరము. న= సమూహము బుద్ధుడు. పక్ష్ఉపవనము. ఫ=రంరవాతము. పు=పూర్కారము, నిష్ఫలము. బి-పక్షి భజవక్షత్రము. మాలక్ష్మి, మానము, మాత. యజ్ఞయాగము, యాత, ఈ రణ వృక్షము ర= అగ్ని, ఐకము, ఇందుకు. ల= విధాతా. వ= విశ్లేషణము, వరుణుడు. శ= శయనము, సుఖము, ష= శ్రేష్టము. స= పరోక్షము. సా–లక్ష్మి. స=(నపు) కేశము. హ—ధారము, రుద్రుడు. క్షస్ షేత్రము, అక్షరము, నృసింహుడు, హరి, క్షత్రజాతి, పాలకుడు. ఏకాక్షర మంత్రము. దేవతా రూపము, భుక్తి ముక్తి ప్రదము. "క్షాం హయ శిరసే నమః'. ఇది అన్ని విద్యలను ఇచ్చు మంత్రము; అకారాది అక్షర నవకము మంత్రములే. వీటికి ఉత్తమ మాతృకా మంత్రములని పేరు. వీటిని ఒక కమల దళమున స్థాపించి పూజించవలేను. వీటి పై భగవతి, కాత్యా యని, కౌశికి, చండక, ప్రచండ, సురనాయిక, ఉగ్రపార్వతి, దుర్గలు అను నవ దుర్గలను పూజించవలెను. ఓం చండికాయై విద్మహే, భగవత్యై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత. ఇది దుర్గా మంత్రము. షడంగాది క్రమమున పూజించవలెను. అజిత, అపరాజిత, జయ, విజయ, కాత్యాయనీ, భద్రకాళి, మంగళ సిద్ధి, రేవతి, సిద్ధాదివటుక. ఏక పాద, భీమరూప, హేతుక, కపాలికలను పూజించవలెను. మధ్యభాగమున తొమ్మండుగురు దిక్పాలకులను పూజించవలెను. మంతసిద్ధి కొరకై హీందుర్గే దగ్గే రక్షణిస్వాహా ఆనుమంత్రము జపించవలేను. గౌరీ పూజ చేసి ధర్మాదులను స్కందాదులను, శక్తులను పూజించవలెను. ప్రజ్ఞా, జానా, క్రీయ, వాచా, వాగీశి, జ్వాలినీ. వామ, జ్యేష్ఠా, రౌద్ర, గౌరి, హి, దేవతలను పూజించి పురస్సరా దేవిని "హీం సహ మహాగౌరి రుద్ర దై తేస్వాహా" ఆనుమంత్రముతో పూజించి మహాగౌరి జ్ఞాన శక్తి, క్రియా క్తి. సుభగా, లలిత, కామినీ, కామమాలా ఇంద్రాది శ క్తుల పూజ కూడ ఏకాక్షర మంత్రముతో చేయవలెను. ఓం, గం, స్వాహా. ఇది గణపతి మూల మంత్రము లేదా గంగణ పతయే నమః ఆనుమంత్రమతో కూడ పూజ చేయవచ్చును. రక్త శుక్ల దంత, నేత, పరుశు ఉత్కట, మోద ఇవి షడంగములు, “గంధోల్కాయ” ఇల్యది క్రమమున గ్రంధాదులు సమర్పిం చవలెను. గజ మహా గణపతి మహోల్క పూజ కూడ చేయవలెను. “కూష్మాండాయ” మొదలు గణాధి పతయే స్వాహా వరకు నున్న మూలో క్త మంత్రములకు కకారాది ఏకాక్షర బీజములు ముందు చేర్చి ఆంతమున “నమః స్వాహా” శబ్దములు ప్రయోగించి వినియోగించవలెను. తిల హోమము చేసి దేవతా పూజ చేయవలెను. ద్విరేఫ ద్విర్ముఖ, ద్వ శాది మంత్రములు వేర్వేరుగా వుండ వచ్చును. ఇపుడు స్కందుడు కాత్యాయమనకు చెప్పిన వ్యాకరణము చెప్పెదను. 

ఆగ్ని మహా పురాణమున ఏకాక్షర కోశ నిరూపణమున మూడు వందల నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.