అగ్ని మహా పురాణము

44 - అథవాసుదేవాది ప్రతిమలక్షణాని.

 భగవానువాచః-

వాసుదేవాది ప్రతిమాలక్షణం ప్రవదామితే

ప్రాసాద స్యోత్తరే పూర్వముఖేవా చోత్తరాననామ్.

సంస్థాప్య పూజ్యచ బలిం దత్త్వా మధ్యసూత్రకమ్

శిలాం శిల్పీతు నవధా విభజ్యనవ మేంశ కే.

సూర్యేభ కే శిలాయాంతు భాగం స్వాజ్ఞులముచ్యతే

ద్వ్యంగులం గోలకం నామ్నా కలానేత్రం తదుచ్యతే.

భాగమేకం త్రిధా భక్త్వా పార్షిభాగం ప్రకల్పయేత్!

భాగమేకం తథా జానౌ గ్రీవాయాం భాగమేవచ.

  ముకుటం తాలమాత్రం స్యాత్తాలమాత్రం తథాముఖమ్

తాలేనై కేన కణంతు తాలేనహృదయం తథా.

నాభిమేడ్రా నరంతాలం ద్వితాలావూరుకౌతథా

తాలద్వయేన జంఘస్యాత్సూత్రాణి శృణు సామ్పతమ్.

కార్యంసూత్రద్వయం పాదే జంఘామద్యే తథాపరమ్

జానౌసూత్రద్వయం కార్యమూరుమధ్యేతథాపరమ్.

మేడే తథాపరం కార్యం కట్యాంసూత్రం తథాపరమ్

మేఖలాబన్ల సిద్ద్యర్థం నాభ్యాం చైవాపరంతథా.

హృదయేచ తథాకార్యం కణే సూత్రద్వయం తథా

 లలాటే చాపరంకార్యం మస్తకే చ తథాపరమ్.

ముకుటోపరి కర్తవ్యం సూత్రమేకం విచక్షణైః

సూత్రాణ్యూర్ధ్వం ప్రదేయాని సప్తైవ కమలోద్భవ.

హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము , చేప్పెదను విము. ఆలయమున పూర్వాభి: ముఖముగ గాని, , ఉత్తరాభి ముఖముగ్మగాని, శిలనుంచి, దానికి పూజచేసి, శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగ ములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము ఆతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళములు “గోలకము” దీనికి “కాలనేత్ర” మని కూడ పేరు. పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలుకొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించి ఉంచుకోనవలెను. ముకుటము నకు ఒక జానేడు, ముఖమునకు ఒక జానేడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచ వలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జోనలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళ పై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను. లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశ ముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలేను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచ వలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగించవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటము పై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.

కశాత్రికా న్తరేణె వ షట్ సూత్రాణి ప్రదాపయేత్

మధ్యసూత్రం తుసస్త్యజ్య సూత్రాడ్యేవ నివేదయేత్.

లలాటం నాసికావ క్రం కర్తవ్యం చతురజ్ఞులమ్

గ్రీవా కర్ణాతు కర్తవ్యావాయామా చ్చతుర జ్ఞులె.

ద్వ్యజులే హను కే కార్యే విస్తారాచ్చిబుకంతథా

అష్టాఱులం లలాటంతు విస్తారేణప్రకీర్తితమ్.

 పరేణద్వ్యఱులేశ జే కర్తవ్యావలకాన్వితా

చతుర జ్ఞుల మాఖ్యాతమ నరం కర్ణనేత్రః .

 ద్వ్యఙులో పృథుకౌ కర్ణా కర్ణాపాణార్ధపఇమే

భూసమేన తుసూత్రేణ కర్ణ గ్రోతః ప్రకీర్తితమ్.

విద్దం షడజ్గులం కర్ణమవిద్దం చతురజులమ్

చిబు కేన సమం విద్ధ మవిద్దంవా షడజ్గులమ్.

ఆరు సూత్రములను మూడు కక్షల అంతరముచే ఉంచవలెను. మరల మధ్య సూత్రమును విడిచివేసి కేవల సూత్రములను మాత్రమే ఉపయోగింపవలెను. లలాట - నాసికా - ముఖముల విస్తారము నాలుగు అంగుళములుండవలెను. కంఠ విస్తారము చెవుల విస్తారము కూడ నాలుగు అంగుళములే ఉండవలెను. రెండు ప్రక్కల చెక్కిళ్లు రెండేసి అంగుళ ముల వెడల్పు ఉండవలెను. బుగ్గ కూడ రెండు అంగుళము లుండవలెను. పూర్తి విస్తారము ఆరు అంగుళములుండవలెను. లలాట విస్తారము ఎనిమిది అంగుళములుండవలెను. రెండు ప్రక్కల శంఖ ప్రదేశములు రెండేసి అంగుళముల విస్తారము కలిగియుండి వాటిపై వెండ్రుకలు కూడ ఉండవలెను. చెవులకు నేత్రములకు మధ్య నాలుగు అంగుళముల వ్యవధానముండ వలెను. చెవులు పృథుకములు రెండేసి అంగుళములు నిర్మింపవలెను, కనుబొమ్మలకు సమావ సూత్రముననున్న భాగము నకు “కర్ణ శ్రోతస్సు” అని పేరు. గుచ్చివ (కుట్టిన) చెవులు ఆరు అంగుళములు, కుట్టనివి నాలుగు అంగుళములు ఉండ వలెను. లేదా కుట్టివ, చెవులై నను కుట్టనిచెవులైనను, బుగ్గతో సమానముగ ఆరు అంగుళములు ఉండవలెను.

గంధపాత్రం తథావర్తం శష్కులీం కల్పయే త్తథా

అజులే నాధరః కార్య స్తస్యార్ధనోత్తరాధరః.

ఆర్ధాఱులం తథా నేత్రం వంతు. చతురజ్ఞులమ్

ఆయా మేన తు వైపుల్యాత్సార్ధ మణుల ముచ్యతే.

అవ్యాత్తమేవం స్యాద్వం వ్యా తంత్ర్యఙులముచ్యతే

నాసావంశ సముదాయం మూలేత్వేకోజులం మతమ్.

ఉచాయాద్వ్యజ్ఞులం చాగ్రే కరవీరోపమాస్మృతా

ఆ నరం చక్షుషోః కార్యం చతుర జ్ఞుల మానతః.

ద్వ్యజ్ఞులం ఛాక్షికోణంచ ద్వ్యజ్ఞులం చాక్షరం తయోః

తారానేత్రత్రిభాగేణ దృక్తారాపశ్చిమాంశికా.

త్ర్యజ్ఞులం నేత్రవిస్తారం ద్రోణీచార్గాజులమతా

తతమాడాట్రువోర్లేఖా భువొచైవ సమేమతే.

భ్రూమధ్యంద్వజ్ఞులం కార్యం భ్రూదైర్ఘ్యం చతురజ్గులమ్

గంధ పాత్రము, ఆ వర్తము, శమ్కిలి (చెవి రంధ్రము) కూడ నిర్మింపవలెను. క్రింది పెదవి ఒక అంగు లము, పై పెదవి అర అంగుళము ఉండ వలెను. నేత్రవిస్తారము అర అంగుళము, ముఖ విస్తారము వాలుగు అంగుళములు ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని ఆకారము కరవీరకుసుమమువలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల ఆవ కాశ ముండవలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంక రేండు అంగుళముల వ్యవధానముండును. నేత్రములోని మూడవ వంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళ ములు, ద్రోణి అర అంగుళము ఉండవలెను. కను బొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కను బొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళ ములు ఉండవలెను.

షట్త్రింశదజ్జులాయామం మస్తకస్యతువేష్టనమ్.

మూ ర్తీనాం కేశవాదీవాం ద్వాత్రింశ ద్వేష్టనం భవేత్

పక్చానేత్రాత్వరోగ్రీవా విస్తారాద్వేష్టనం పునః.

త్రిగుణం తు భవేదూర్ధ్వం విస్తృతాష్ట్రాజులం పునః

గ్రీవాత్రిగుణమాయామంగ్రీవావతో నరం భవేత్.

స్కస్థావష్టాఱులో కార్యో త్రిక లావంసకౌ శుభౌ

సప్త నేత్రాస్మృతా బాహూ ప్రజాహూ షోడశాజ్గులౌ.

త్రికలే విస్తృతా బాహూ ప్రబాహూ చాపి తత్సమౌ

బాహుదజ్జార్వతో జేయః పరిణాహః కలానవ.

సప్తదశాఱులోమధ్యే కూర్పరోఠేచ షోడశ

కూర్పరస్య భవేన్నాహ త్రిగుణః కమలోద్భవ.

నాహః ప్రబాహుమధ్యేతు షోడశాబ్దుల ఉచ్యతే

అగ్రహ స్తే పరీడాహో ద్వాదశాబ్దుల ఉచ్యతే.

 విస్తారేణ కరతలం కీర్తితంతు షడజ్ఞులమ్

దైర్ఘ్యం సప్రాజ్ఞులం కార్యం మధ్యాపఞ్చాన్గులామతా.

తర్జన్యనామికాచైవ తస్మాదర్గాజులం వినా

కనిష్టాఱుష్ఠ కార్యౌ చతుర జ్ఞులసంమితా.

ద్విపర్వో-జ్ఞుష్ణకః కార్య! శేషాజుల్యత్రి పర్వికాః

సర్వాసాం పర్వహొ ఒర్దేన నఖమానం విధీయతే.

వక్షసో యతమాణం తు జఠరం తతమాణతః

అఙు లైకా భవేన్నా భీ వేధేన చ ప్రమాణత.

తతో మేడ్రా నరం కార్యం తాలమాత్రః ప్రమాణతః

కేశ వాది మూర్తుల శిరస్సు మొత్తము తిరుగుడు ఇరువదియారు లేదా ముప్పది రెండు అంగుళము లుండవలెను. క్రింద కంఠము పది అంగుళములు, దాని తిరుగుడు ముప్పది అంగుళములు. క్రిందినుండి పైకి కంఠ విస్తారము ఎనిమిది అంగుళములు. కంఠమునకును. వక్షస్థలమునకును మధ్యనున్న అవకాశము కంఠముకంటె మూడు రెట్లు విస్తారముతో ఉండవలెను. స్కంథములు ఎనిమిదేసి అంగుళములు, అంసములు మూడేసి అంగుళములు ఉంచవలెను. బాహువులు మోచేయివరకు పదునాలుగేసి అంగుళములు, ప్రజాహువులు (మోచేతి క్రింద) పదునారేసి అంగుళములు, బాహువుల వెడల్పు ఆ రంగుళములు. ప్రబాహువుల వెడల్పు కూడ దీనితో సమానముగా ఉండవలెను. బాహుదండము తిరుగుడు పై నుండి తొమ్మిది కలలు లేదా పదునేడు అంగుళము లుండవలెను. బాహు మధ్యమున కూర్పరము (మోచేయి) ఉండును. కూర్సరము తిరుగుడు పదునాలుగు అంగుళములు, ప్రజాహమధ్యమున దాని విస్తారము పదువారు అంగుళములు, చేతి అగ్ర భాగము విస్తారము పండ్రెండు అంగుళములు. దాని మధ్య అర చేతి విస్తారము ఆరంగుళములు ఆర చేయి వెడల్పు ఏడంగుళములు, మధ్యవేలు పొడవు ఐదు. అంగుళములు, తర్జనీ - ఆనామికల పొడవు, దానికంటే అర అంగుళముశ్రీమదగ్ని మహాపురాణ తక్కువగా ఉండవలెను. కనిష్ఠికా అంగుష్ఠము పొడవు నాలుగు అంగుళము బొటనవ్రేలికి రెండు కణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలేను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభిరంధ్రము ఒక అంగుళముండవలెను. నాభినుండి లింగము వరకు జానెడు దూరముండవలెను.

నాభిమధ్యే పరీణాహో ద్విచత్వారింశ దజ్ఞులకి.

ఆస్తరం స్తనయోః కార్యం తాలమాత్రం ప్రమాణత

చూచు కేయవమానౌతు మడ్డలం ద్విపదం భవేత్.

చతుఃషష్ట్యబ్దులం కార్యం వేష్టనం వక్షసః స్ఫుటమ్

చతుర్ముఖంచ తదధో వేష్టనం పరికీర్తితమ్.

పరిణాహ స్తథాక ట్యాశ్చతుః పజ్ఞ్చదశాబ్దులైః

విస్తారశ్చోరుమూలే తు ప్రోచ్యతే ద్వాదశాబ్దులః.

తస్మారభ్యధిం0 మధ్యేతతో నిమ్న తరం క్రమాత్

విస్తృతాష్ట్రాజులం జానుశ్రిగుణా పరిణాహతః.

జజామధ్యేతు విస్తారః సప్తాఱుల ఉదాహృతః

త్రిగుణః పరిధిశ్చాస్య జట్టొగ్రే పళ్చివి స్తరాత్.

త్రిగుణః పరిధిశ్చాస్య పాదౌ తాల ప్రమాణ

ఆయామాదుర్థితా పాదౌ చతురజ్గుల మేవచ.

 గులాత్పూర్వం తు కర్తవ్యం ప్రమాణాచ్చతురజ్గులమ్

ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానేడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలెను. స్తనముల తిరుగుడు రెండు పదములుండవలెను. వక్షస్థలము తిరుగుడు ఆరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాలువేపుల తిరుగుడు లోకువేష్టనము” అని పేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళ ములు. ఊరు మూలముల విస్తారము పుడెండేసి అంగుళములు దాని పైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్య భాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గ వలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్క విస్తారము. మూడు రెట్లుండవలెను. పిక్క మధ్యభాగము విస్తారము ఏడు అంగుళము లుండవలెను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క ఆగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు వాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళము లుండవలెను.

త్రికలం విస్తృతా పాదౌ త్ర్యజులోగుహ్యక  స్మృతః.

పశ్చాజులస్తు నాహోస్య దీర్ఘాతద్వతదేశినీ

అష్టమాష్టాం శతోన్యూనాః శేషాజుల్యః క్రమేణతు.

సపాదాజ్ఞుల ముత్సేధమజుష్ఠస్య ప్రకీర్తితమ్

తదేవ ద్విగుణం కార్యమజుష్ఠస్య నఖం తథా.

అర్ధాజ్ఞులం తథాన్యాసం క్రమాన్న్యూనంతు కారయేత్

ద్వ్యల్దులె వృషణా కార్యో మేడ్రంతు చతురజ్ఞులమ్.

పరిణాహోత్ర కోషాగ్రం కర్తవ్యం చతుర జ్ఞులమ్

షడజ్ఞుల పరీడాహ వృషణె పరికీర్తితా.

ప్రతిమా భూషణాఢ్య స్యాదేతదుద్దేశ లక్షణమ్

అనయైవ దిశాకార్యంలో కే దృష్ట్వాతు లక్షణమ్.

 దక్షిణే తు కరే చక్రమధస్తాత్పద్మ మేవచ

వామే శంఖం గదాధస్తాద్వాసుదేవస్య లక్షణాత్.

 శ్రీపుష్టి చాపికర్తవ్యే పద్మ వీణాకరాన్వితే

ఊరూమాత్రోచితాయామే మాలావిద్యాధరౌ తథా.

ప్రధామణలసంస్థాతో ప్రభాహస్త్యాది భూషణా

పద్మాథం పాదపీఠం తు ప్రతిమా స్వేవమాచరేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే వాసుదేవాది ప్రతిమాలక్షణం నామ చతుశ్చత్వారింశోధ్యాయః

పాదముల విస్తారము ఆరంగుళములు, గుహ్యకము- మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వేళ్ళ మధ్య భాగ విస్తారము: క్రమముగా మొదటి ప్రోలు ఎనిమిదవ భాగము తరువగా ఉండవలెను. బొటన వేలు ఎత్తు ఒకటిన్నర అంగుళము. లుండ వలెను, దీని గోరుప్రమాణమును మిగిలిన వేళ్ళ ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలి గోరు విస్తా రము అర అంగుళము, ఇతర మైన వేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెకొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను, దాని పై భాగము నాలుగు అంగు ళము లుండవలెను. అండకోశముల పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంత మాత్రమేకాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదే విధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్టిలో వుంచుకొని, ప్రతిమ పై ఆలక్షణములను నిర్మింపవలెను. . పైకుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలేను ' ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్న ములు గాన ఆప్రతిమ యందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున, హస్త ముందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించి యున్న పుష్టిదేవిని నిర్మించవలెను. ఈ ప్రతిమల ఎత్తు భగవత్రతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండలములో ఉన్న మాలాధర.విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో ఆలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింది భాగమును (పాదపీఠమును) పద్మాకారమున నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణము లుండునట్లు కూర్చవలెను.

అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిమా లక్షణమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.