ఆగ్ని రువాచః-
దివసవ్రతకం వక్ష్యే హ్యాదౌ ధేనువ్రతం వదే ।
యశ్చోభయముఖీం దద్యాతృభూతకనకాన్వితామ్.
దినం పయోవ్రత స్తి క్షేత్స యాతి పరమం పదమ్।
త్ర్యహం పయోవ్రతం కృత్వా కాళ్చానం కల్పపాదపమ్.
దత్త్వా బ్రహ్మపదం యాతి కల్పవృక్షవ్రతం స్మృతమ్ ।
దద్యాద్వింశత్పలాదూర్ధ్వం మహీం కృత్వా తు కాఇ్చనీమ్.
దినం పయోవ్రత స్త్రీ ఘేదుద్రగః స్యాద్దివావతీ ।
పక్షే పడే త్రిరాత్రం తు భ కేనై కేన యః క్ష పేత్.
విపులం ధనమాప్నోతి త్రిరాత్ర వ్రతకృద్దీనమ్ ।
మా నే మాసే త్రిరాత్రాశీ హ్యేక భ క్రీ గణేశ తామ్.
యశ్రిరాత్ర వ్రతం కుర్యాత్సముద్దిశ్య జనార్ధనమ్ ।
కులానాం శతమాదాయ స యాతి భవనం హరేః.
నవమ్యాం చ సితే పడే నరో మార్గశిరస్యథ ।
ప్రారభేత త్రిరాత్రాణాం వ్రతం తు విధివద్ర్వతీ.
ఓం నమో వాసుదేవాయ సహస్రం వా శతం జపేత్ ।
అష్టమ్యా మేక భక్తాశీ దీనత్రయముపావ సేల్.
ద్వాదశ్యాం పూజయే ద్విష్ణుం కార్తికే కారయే ద్ర్వతమ్ ।
విప్రాన్ సంభోజ్య వస్త్రాణి శయనాన్యాసనాని చ.
ఛత్రోపవీతపాత్రాణి దదేత్సంప్రార్థయేద్ద్విజాన్ ।
వతేజస్మిన్ దుష్కరే చాపి వికలం యదభూన్మ మ.
భవద్భిస్తదనుజ్ఞాతం పరిపూర్ణం భవత్వితి ।
భుక్తభోగో వ్రజేద్విష్ణుం త్రిరాత్ర వ్రతకవతీ.
కార్తిక వ్రతకం వణ్యే భుక్తిముక్తి ప్రదాయకమ్ ।
దశమ్యాం పశ్చిగద్యాశీ ఏకాద్యముపోషితః.
కార్తికస్య సితేభ్యర్చ్య విష్ణుం దేవవిమానగః ।
చైత్ర త్రిరాత్రం నక్తాశీ హ్యజాప్చప్రదః సుఖీ.
త్రిరాత్రం పయసః పానముపవాసపరస్త్ర్యహంయహమ్ ।
షష్ట్యాది కార్తికే శుక్లే కృచ్ఛో మా హేన్ద ఉచ్యతే.
పథ్చారాత్రం పయః పీత్వా దధ్యాహారో హ్యుపోషితః ।
ఏకాదశ్యాం కార్తికే తు కృచ్ఛోఒయం భాస్కరోఒర్థదః.
యవాగూం యావకం శాకం దధి క్షీరం మృతం జలమ్ ।
పఞ్చమ్యాది సితే పక్షే కృచ్ఛ సా స్తపనః స్మృతః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయ దివసవ్రతాని నామ సప్తనవత్యధిక శతతమోధ్యాయః.
ఆగ్ని దేవుడు చేప్పెను : ఇపుడు దివసములకు సంబంధించిన వ్రతములు చేప్పెదను. మొదట ధేనువ్రతమును గూర్చి చెప్పెదను. సువర్ణరాశితో కూడ ఉభయముఖగోదానము చేసి ఒక దినమున పయోవ్రతము చేయువాడు పరమపదమును పొందును. స్వర్ణమయ కల్పవృక్షదానము చేసి మూడు దినములు పయోవ్రతము చేయు వాడు బ్రహ్మపదమును పొందును. దీనికి కల్పవృక్ష వ్రత మని పేరు. పది పలములకంటే అధిక మగు స్వర్ణముతో పృథివి నిర్మించి దానము చేసి రెండు దినములు పయోవ్రతము చేయవలెను. దినమునందు మాత్రము వ్రతమవలంబించువాడు రుద్రలోకమును చేరును. ప్రతిపక్షమునందును మూడు రాత్రులు ఏక భుక్త వ్రతము చేయువాడును, పగలు నిరాహారుడై త్రిరాత్రవ్రతము చేయువాడును అధిక మగు ధనము పొందును. ప్రతిమాసమునందును మూడు ఏకభుక్త నక్షతములు చేయువాడు గణపతిసాయుజ్యమును పొందును. జనార్దనుని ఉద్దేశించి త్రిరాత్రవ్రత మాచరించువాడు తన నూరు కులములతో వైకుంఠముచేరును. మార్గశీర్ష శుక్ల నవమినుండి త్రిరాత్రవ్రత ప్రారంభము చేయవలెను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును వేయి పర్యాయములు, లేదా నూరు పర్యాయములు జపము చేయవలెను. అష్టమినాడు ఏక భుక్త వ్రతము, నవమీ - దశమీ - ఏకాదశులందు ఉపవాసము చేయ వలెను. ద్వాదశినాడు శ్రీ మహా విష్ణువును పూజించవలెను. ఈ వ్రతము కార్తిక మాసమందు చేయవలెను. వ్రతసమాప్తి యందు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి వస్త్ర - శయ్యా - ఆసన - ఛత్ర - యజ్ఞోపవీత - పాత్రల దానము చేయవలెను. దానసమయమున బ్రాహ్మణులలో ఇట్లు చెప్పలేను. దుష్కర మగు ఈ వ్రతమునాచరించు నపుడు నావలన కలిగిన లోపములు అన్నియు మీ అనుగ్రహముచే తొలగి పోవుగాక. ఈ తిరాతవతము చేయువాడు. ఇహలోకమున బోగము లనుభవించి మరణానంతరము శ్రీమహావిష్ణుసాంనిధ్యమును పొందును. ఇపుడు భుక్తిముక్తిద మగు కార్తిక వ్రతమును గూర్చి చెప్పెదను. దశమినాడు పంచగవ్యపాశన చేసి ఏకాదశినాడు ఉపవాసముండవలెను. ఈ వ్రతమునందు కార్తీక శుక్ల ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించినవాడు విమానము పై సంచరించు దేవత అగును. చైతమున ఆలాతవత మాచరించి, రాతి మాతము భోజనము చేయువాడు వతసమాప్తి యందు ఐదు మేకలు దానము చేసినచో సుఖవంతు డగును. కార్తిక శుక్ల షష్టి మొదలు మూడు దినములు పాలు మాతము తాగి తరువాత, మూడు దినములు ఉపవాసము చేసినచో దానికి మా హేంద్ర కృచ మని పేరు. కార్తిక శుక్లైకాదశినాడు ప్రారంభించి పాంచరాతవతము చేయవలెను. మొదటి దినమున క్షీరము, రెండవ దినమున పెరుగు తీసికొని మూడవ దినమునుండి మూడు నాళ్ళు ఉపవాసము చేయవలెను. ఇది “భాస్కరకృచము” శుక్ల పంచమినుండి ప్రారంభించి ఆరు దినములు వరుసగ యవలగంజి, శాకములు, పెరుగు, క్షీరము, నెయ్యి, జలము, ఆహారముగా గ్రహించవలెను. దీనికి “సాంతపస కృచ్ఛ్రము” అని పేరు.
ఆగ్ని మహా పురాణమునంద దివసవ్రతవర్ణన మును నూట తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 197 of the Agni Purāṇa is as follows:
Vratas distinguished primarily by their duration in days are described. The Dhenu-vrata—one day of payo-vrata (milk-only diet) combined with go-dāna—leads directly to the paramapada. The Kalpa-vṛkṣa-vrata requires three days of payo-vrata and the gifting of a golden wish-fulfilling tree (kalpa-vṛkṣa) to a brāhmaṇa, earning the performer Brahma-loka for one hundred lineages. The Tri-rātra-vrata for Janārdana across three days yields Vaikuṇṭha along with liberation for one hundred genealogical lines. A four-day Kārtika sequence—daśamī pañcagavya, ekādaśī upavāsa, dvādaśī Viṣṇu-pūjā—is specified. Three types of kṛcchra-penance named Mahendra-kṛcchra, Bhāskara-kṛcchra, and Sāntapasa-kṛcchra are defined in terms of their daily dietary discipline.