అగ్ని మహా పురాణము

298 - అథ గోనసాదిచికిత్సా

అగ్ని రువాచః

గోనసాది చికిత్సాంచ వసిష్ఠశృణువచ్మితే

హ్రీం హ్రీం అమలపక్షి స్వాహా

తాంబూలఖాద నాన్మంత్రీ హరేన్మండ లినోవీషమ్.

లశునం రామఠఫలం కుష్ఠాగ్ని వ్యోషకంవి షే

స్నుహిక్షీరం గవ్యఘృతం పక్షం పిత్వాఽహిజేవి షే.

అథరాజిల దష్టేచ పేయాకృష్ణా స సైందవా

ఆజ్యక్షౌ ద్రశకృత్తోయం పురీతత్యా విషాపహమ్.

సకృష్ణా ఖండదుగ్ధాజ్యం పాతవ్యం తేన మాక్షికమ్

వ్యోషం పిచ్చం బిడాలాస్థి నకులాంగరు హైః సమైః.

 చూర్ణి తై ర్మేష దుగ్ధా క్తైరూపః సర్వవిషాపహః

రోమ నిర్గుండికా కోలవర్ణైర్వా లశునం సమమ్.

మునిపత్రైః కృత స్వేదం దష్టం కాంజిక పాచితైః

మాషికాః షోడశ ప్రోక్తారసం కార్పానజం పిబేత్.

 సతైలం మూషికార్తిఘ్నం ఫలినీ కుసుమంతథా

సనాగరగుడం భక్ష్యం తద్విషారోచ కాపహమ్.

చికిత్సా వింశతిర్భూతా లూతావిషహరో గణః

పద్మకం పాటలీకుష్ఠం నతముశీర చందనమ్.

నిర్గుండీ సారివాశేలు లూతార్తం సేచయేజ్జలైః

గుంజా నిర్గుండకం కోల పర్ణం శుంఠీ నిశాద్వయమ్.

కరం జాస్తిచ తత్సంకై ర్వృశ్చి కార్తిహరం శృణు

మంజిష్ఠా చందనం వ్యోష పుష్పం శిరీష కౌముదమ్,

సంయోజ్యా శ్చతురో యోగా లేపాదౌ వృశ్చికాపహః

ఓం నమో భగవతే రుద్రాయ చివి చివి ఛింద ఛింద.

కిరికిరి భింద భింద ఖడ్గేన చ్చేదయచ్చేదయ శూలేన భేదయభేదయ చక్రేణ దారయదారయ ఓం హ్రూంఫట్ .

మంత్రేణ మంత్రితో దేయో గార్ధభాదీన్నికృన్తతి.

త్రిఫలో శీర ముస్తాంబు మాంసీ పద్మకచం దనమ్

అజాక్షీ రేణ పానాదేర్గర్ధ భాదేర్విషం హరేత్.

హారేచ్చిరీష పంచాంగం వ్యోషం శతపదీ విషమ్

స కంధరం శిరీషాస్థి హరేదుందూరజం విషమ్.

వ్యోషం ససర్పిః పిండీత మూలమస్య విషం హరేత్

క్షారవ్యో షవచాహింగు విడంగం సైంధవంనతమ్.

అంబష్ఠాతి బలా కుష్ఠం సర్వకీట విషం హరేత్

యష్టివ్యోష గుడక్షీరయోగః శునో విషాపహః.

ఓం సుభద్రాయైనమః ఓం సుప్రభాయైనమః

యాన్యౌషధాని గృహ్యన్తే విధానేన వినాజనైః.

తేషాం బీజం త్వయా గ్రాహ్యమితి బ్రహ్మాఽబ్రవీచ్చతామ్

తాం ప్రణమ్యోషధీం పశ్చాద్యవాన్ ప్రక్షిప్య ముష్టినా.

 దశ జప్త్వా మంత్రమిదం నమస్కుర్యాత్త దౌషధమ్  

త్వాముద్దరా మ్యూర్ధ్వ నేత్రామనేనై వచ భక్షయేత్.

 నమః పురుష సింహాయ నమోగోపాల కాయచ

ఆత్మనై వాభి జానాతి రణేకృష్ణ పరాజయమ్.

ఏతేన సత్య వా క్యేన ఆగదో మేఽస్తు సిధ్యతు

నమో వై దూర్య మాత్రే తత్ర రక్షరక్షమాం సర్వవిషే భ్యో గౌరిగాంధారి చాండాలి మాతంగిని స్వాహా హరిమాయే

ఔషధాదౌ ప్రయోక్తవ్యో మంత్రోయం స్థావరేవి షే.

భుక్తమాత్రే స్థితే జ్వాలే పద్మం శీతాంబు సేవితమ్

పొయయేత్సఘృతం క్షౌద్రం విషం చేత్తదనంతరమ్.

ఇత్యాది మహా పురాణే ఆగ్నేయే గోనసాది చికిత్సానామాఽష్ట నవత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః.   

అగ్ని దేవుడు పలికెను. వశిష్ఠా! ఇపుడు గోనసాది సర్ప విషమునకు చికిత్స చెప్పెడను. పినుము. “ఓహ్రాం హ్రీం, ఆమల పక్షిస్వాహా” అను మంత్రముతో అభిమంత్రించిన తాంబూలమును ఇచ్చుటచే మంత్ర వేత్త మండలి సర్ప విషమను తొలగించను. లశునము రామఠ ఫలము కుష్టము, అగ్ని, వ్యోషకము వీటిని సర్పవిషము నందు త్రాగవలయును, స్నుహీ క్షీరము గోఘృతము పదునైదు దినములు త్రాగవలయును. రాజిల సర్పము కరచినపుడు సైంధవలవణము ఆజ్యమధు గోమయర సములు పురితత్” భక్షించినచో విషము తొలగను. సర్పము కరచిన వాడు కృష్ణఖండము దుగ్ధము, ఆజ్యము, తేనె. వీటిని త్రాగవలెను. త్రికటువులు మయూర పించము పిల్లి, యెముక ముంగిసరోమములు వీళిని సమానభాగములుగ గ్రహించి చూర్ణము చేసి గొఱ్ఱపాలలో తడిపిదాని ధూపమువేసికచో అన్ని విధములగు విషములు నశించను. రోమ నిర్గుండికా, ఆంకోల, పత్రములను సమభాగముల గ్రహించి, వాటి అన్ని టితో సమముగ లగునము చేర్చి వేసిన ధూపము కూడ విషనాళకము. అగస్త్యపత్రములను, గంజిలో ఉడికించి దానితో పాము కరచిన చోట కాచినచో విషము డిగిపోవును. మూషకములు పదహారు విధములు కార్పాస రసమును త్రాగినచో వాటి విషము తొలగును. .ఫలునీ పుష్పములను నాగర గడములతో కలిపి భక్షించినచో విష రోగము పోవును. సాలె పురుగులు ఇరువది విధములై నువి. వాటిని విషమునకు చికిత్స చేయుటకు పద్మక పాటలీ కష్ట ఉశీర, చందన, నత, నిర్గుండి, శారివ, సేలులను ఉపయోగించవలయును. గుంజ నిర్గుండి కంకోల పత్ర శుంఠి, ద్వివిధ హరిద్ర కరంజ వల్కము లను ఉడికించి (సాలె పురుగు) లూత విషముతో బాధపడు వానికి పైన చెప్పిన ఓషధులు కలిపిన నీటిని త్రాగించ వలయును. ఇపుడు వృశ్చిక విషమును తొలగించు చికిత్సను వినుము. మంజిష్ఠా చందన వ్యోష శిరీష, కుముద పుష్పములను, నాలుగు యోగములను కలిపి లేపాడికము చేసినచో వృశిక విష బాధ నశించును. “ఓం నమో భగవతే రుద్రాయ” మొదలు “ఓం హ్రూంఫట్” వరకు వున్న మూరోక్త మంత్రముతో అభిమంత్రించిన ఔషధము మనుమతనికి ఇచ్చినచో గర్దభాది విషము లను తొలగించును. త్రిఫలా ఉశీర, ముస్తా. ఆంబు మాంసి, పద్మక. చందనములను మేక పాలతో కలిపి తాగించినచో గర్గభాది విషము నశించును. శిరీష పంచాంగములు వ్యోషము శత పదీ విషమును నశింప చేయును . కంధరముతో కూడిన శిరీష వృక్షపు బెరడు ఉందూరజ విషమును తొలగించును. వ్యోషమును తగర మూలమును మృతముతో ఉపయోగించినచో “మత్స్యవిషము నశించును. యవ, షార, వ్యోష, వచా, హింగు, విడంగ, సైంధవ - తగర, అంబషా, అతిబలా కుషములు సకల విధకీట విషమ్మును హరించును. యష్ట్రవ్యోషగుడ క్షీరములతో చేసిన యోగము శూనక విషమును తొలగించును. “ఓం సుభద్రాయైనమః” ఓం సుప్రభాయై నమః అనునవి ఓషధులును పైకి తీయువపుడు ఉపయోగించు మంత్రములు. విదానానుసారముగ కాక మానవులు ఏ ఓషధులను గ్రహింతురో వాటి సారమను నీవు తీసుకొనుము యని బ్రహ్మ "సుప్రభా" దేవికి చెప్పెను. అందుచేత ముందుగ సుప్రభాదేవికి నమస్కరించి పిడికిలితో యవలు చల్లి పది పర్యాయములు జపించి' ఓషధికి నమస్కరించి “ఊర్వనేత్రవగు నిన్ను ఉద్దరించుచున్నాను". యని చెప్పుచు ఆ ఓషధిని పైకి లాగి “పురుష సింహుడగు గోపాలునకు నమస్కారము. యుద్ధమునందు తనపరాజయమును గూర్చి శ్రీకృష్ణుడే యెదగును. ఈ సత్యవాక్య ప్రభావముచే నాకు ఈ ఓషధి సిద్ది ప్రదమగు గాక ! యని చెప్పుచు దానిని భక్షించవలయును. సావర విషమునకు ఉపయోగించు ఓషధుల విషయమున "నమోవై దూర్య మాత్రే" మొదలు హరిమాయే" వరకును వున్న మూలో మౌ మంత్రమును జపించవలయును. విషమును భక్షించిన వానిచే ముందుగవమనము చేయించి వాని శరీరము చల్లని జలము తడుపవలయును. పిదప తేనె నెయ్యి త్రాగించి విరేచనము చేయించవలయును.

అగ్ని మహాపురాణమున గోనసాది చికిత్సా కథనమను రెండువందల తొంబది యెనిమిధవ అధ్యాయము సమాప్తము.