ఈశ్వర ఉవాచః
ప్రతిష్ఠాం సంప్రవక్ష్యామి క్రమాత్ సంక్షేపతో గుహ ।
పీఠం శ క్తిం శివో లిజ్గం తద్యోగః సా శివాణుచిః.
ప్రతిష్టాయాః పఞ్చభేదా స్తేషాం రూపం వదామి తే ।
యత్ర బ్రహ్మ శిలాయోగః సా ప్రతిష్ణా విశేషతః.
స్థాపనం తు యథా యోగం పీఠఏవ నివేశనమ్ ।
ప్రతిష్టాభిన్న పీఠస్య స్థిత స్థాపనముచ్యతే.
ఉత్తాపనం చ సా ప్రోక్తా లిజ్గోద్ధారపురస్స రా ।
యస్యాంతు లిజ్గమారోప్య సంస్కారః క్రియతే బుధైః.
ఆస్థాపనం తదుద్దిష్టం ద్విధా విష్ణ్వాదిక స్య చ ।
ఆసు సర్వాసు చైతన్యం నీయుఞ్జత పరం శివమ్.
యదాధారాదిభేదేన ప్రాసాదేష్వపీ పఞ్చధా ।
పరీక్షామథ మేదిన్యాః కుర్యాత్ప్రాసాదకామ్యయా.
శుక్లోజ్యగన్దా రక్తా చ రక్త గన్దా సుగన్దినీ ।
పీతా కృష్ణా సురాగన్దా విప్రాదీనాం మహక్రమాత్.
పూర్వేశోత్తరే సర్వత్ర పూర్వాచైషాం విశిష్యతే ।
ఆఖాతే హాస్తి కే యస్యాః పూర్ణే మృదధికే భవేత్.
ఉత్తమాం తాం మహీం విద్యాత్తోయాద్యైర్వా సముక్షితామ్ ।
ఆస్థ్యడ్గారాదిభిర్దుష్టా మత్యన్తం శోధయేద్గురుః.
నగరగ్రామదుర్గార్థం గృహప్రాసాదకారణమ్ ।
ఖననైర్గో కులావాసైః కరణైర్వా ముహుర్ముహుః.
మణ్ణపే ద్వారపూజాది మనతృ ప్త్యవసానకమ్ ।
కర్మ నిర్వర్య ఘోరాస్త్రం సహస్రం విధినా యజేత్.
సమీకృత్యోసలిప్తాయాం భూమౌ సంశోధయేద్ధిశః ।
స్వర్ణదధ్యక్షతై రేఖాః ప్రకుర్వీత ప్రదక్షిణమ్.
మధ్యాదీశానకోష్టస్థే పూర్ణకుమ్భే శివం యజేత్ ।
వాస్తుమభ్యర్బ్య తత్తోయైః సిఞ్చెత్కుద్ధాలకోడికమ్.
బాహ్యే రక్షోగణానిష్ట్వా విథినాదిగ్బలిం క్షిపేత్ ।
భూమిం సంసిచ్య సంస్నా ప్యకుద్దాలాద్యం ప్రపూజయేత్.
పరమేశ్వరుడు చెప్పెను. స్కందా! నేనిపుడు. సంక్షేపముగ క్రమమున ప్రతిష్టను గూర్చి చెప్పెదను పీఠము శక్తి లింగము శివుడు, ఈ రెండింటి యోగము వలన శివసంబంధి మంత్రములచే ప్రతిష్ఠ చేయబడును, ప్రతిష్టలో ‘ప్రతిష్ట’ మొడలగు ఐదు భేదము లున్నది. వాటిని గూర్చి చెప్పెదను. బ్రహ్మ శిలా యోగమున్నప్పుడు విశేషరూపమున చేసిన స్థాపవము ‘ప్రతిష్ఠ’. పీఠముపైననే వీలును బట్టి ఆర్చా విగ్రహమును స్థాపించినచో ఆది స్థాపనము. ప్రతిష్టాలిన్నమగు స్థాపనమునకు స్థిరస్థాపన మని పేరు. ఆధార పూర్వకముగ చేయు లింగ స్థాపనము ఉతాపనము లింగమును స్థాపించి విద్వాంసులు దానికి సంస్కారము చేసినచో అది ఆస్థాపవము. ఇవి శివ ప్రతిష్ఠకు సంబంధించిన ఐదు భేదములు విష్ణ్వాది ప్రతిష్ఠ “ఆస్థానము” ‘ఉత్థానము’ అని రెండు విధములు. ఈ అన్ని ప్రతిష్టలందును. చైతన్య రూపుడగు పరమశివుని నియోజనము చేయవలెను. పదాధ్వాది భేదములచే ప్రాసాదములలో కూడ ఐదు విధములగు ప్రతిష్ట చెప్పబడినది. ప్రాసాదము కొరకై భూపరీక్ష చేయవలెను. మట్టి రంగు తెల్లగా ఉండి మృతసుగంధము గల భూమి బ్రాహ్మణులకు శ్రేష్టము. ఇట్లే వరసగ క్షత్రియులకు ఎఱ్రగా, రక్త గంధము కల మట్టి, వైశ్యులకు పచ్చని, సుగంధము గల మట్టి, శూద్రులకు నల్లని సురాగంధము గల మట్టి గల భూములు శ్రేష్టమైనవి. తూర్పునందును, ఈశాన్యమునందును, లేదా అన్ని దిక్కు లందును పల్లముగా నుండి, మధ్య ఎత్తుగానున్న భూమి ప్రశస్తమైనది. ఒక చేతిలోతు త్రవ్వి తీసిన మట్టిలో ఆగోతిని పూడ్చివేయగా మట్టి మిగిలి పోయినచో ఆ భూమి ఉత్తమమైనది. లేదా జలాదులతో దానిని పరీక్షించవలెను. ఎముకలు బొగ్గులు మొదలగు వాటిచే దూషితమగు భూమిని త్రవ్వుట, ఆవులు మొదలగు వాటిని అచట కట్టుట, చాలసార్లు దున్నుట మొదలగు వాటిచే బాగుగా శోధనము చేయవలెను. నగర - గ్రామ - దుర్గ – గృహ- ప్రాసాదాదుం నిర్మాణము కొరకు భూమిని పై విధముగ శోధన చేయవలెను. ద్వారపూజ మొదలు మంత్రతర్పణ పర్యంతమగు సంపూర్ణ కర్మను మండపమునందు చేసి, విధి పూర్వకముగ ఘోరాస్త్రసహస్రయాగము చేయవలెను. సమముచేసి, అలికిన నేలపై దిక్సాధనము చేయవలెను. సువర్ణ - అక్షత - దధులతో ప్రదక్షిణక్రమమున రేఖలు గీయవలెను. మధ్య భాగమునుండి ఈశానకోక్షమునందున్న, జల పూర్ణకలశమునందు శివుని పూజించవలెను. పిదప వాస్తుపూజ చేసి ఆ కలశలోని జలముతో గునపము మొదలగు వాటిని తడపవలేను. మండపము వెలుపల విధి పూర్వకముగ రాక్షసగ్రహాది పూజచేసి దిక్కులందు బిలు లివ్వవలెను.
పూజాం కుమ్భే సమాహృత్య ప్రాప్తే లగ్నే ఒగ్నికోష్ఠ కే।
కుద్దాలేనాభిషి క్తేన మధ్వ క్తేన తు ఖానయేత్.
నైరృత్యాం క్షిపయేనృత్స్నాం ఖాతే కుమ్భజలం క్షిపేత్ ।
అన్యం వస్త్రయుగచ్ఛన్నం కుమ్భం స్కన్దే ద్వి జన్మనః.
నిధాయ గీతవాద్యాది బ్రహ్మ మోషసమాకులమ్ ।
పురస్య పూర్వసీమాన్తం నయేద్యావదదభీప్సితమ్.
అథ తత్ర క్షణం స్థిత్వా భ్రామయేత్పరితః పురమ్ ।
సిఞ్చన్సీమాన్తచిహ్నాని యావదీశానగోచరమ్.
అర్ఘ్యదానమిదం ప్రోక్తం తత్ర కుమ్బపరిభ్రమాత్ ।
ఇత్తం పరిగ్రహం భూమేః కుర్వీత త దన న్తరమ్.
కర్కరా న్తం జలా న్తం వా శల్యదోషజిమాంనయా ।
ఖానయేద్భూకుమారీం చేద్విధినా శల్యముద్ద రేత్.
అకచటతప యశహాన్మానవత్రృక్షరాణి తు!
అగ్నేర్ధ్వజాదిపతితాః స్వస్థానే శల్య మాఖ్యాన్తి.
కర్తుశ్చాఃవికాలే జాతీయాతత్పమాణతః ।
పశ్వాదీనాం ప్రవేశేన కీర్తనైర్విరుతైర్దిశః.
మాతృకామష్టవర్గాడ్యా ఫలకే భువి వా లిఖేత్।
శల్యజ్ఞానం వర్గవర్జా పూర్వాదీశాన్తతః క్రమాత్.
అవర్గే చైవ లోహంతు కవర్గెఒడ్గారమగ్నితః ।
చవర్గే భస్మ దక్షే స్యాట్ట వర్గెఒస్థి చ నైరృతే.
తవర్గే చేష్టకాబా ప్యే కపాలం చ పవర్గ కే ।
యవర్గే శవకీటాది శవర్గే లోహమాదిశేత్.
హవర్గే రజతం తద్వజ్జవర్గాచ్చానర్థకానపి.
కలశపై పూజచేసి లగ్నము వచ్చిన పిమ్మట అగ్నికోణమునండలి కోష్ఠమునందు మొదట తడిపిన మధులిప్తమగు గునపముతో భూమి త్రవ్వి మట్టి నైరృతి దిక్కునందు వేయవలెను. తవ్విన గోతిలో కలశములోని ఉదకము పోయవలెను పిదప భూమితడిపి గునపము మొదలైన వాటిని తడిపి, వాటి హజ చేయవలెను. పిదప ఈ మరొక కలశమును. రెండు వస్త్రములతో ఆచ్చాదించి బ్రాహ్మణుని కంఠముపై నుంచి, వాద్య - వేద ఘోషలతో నగరము తూర్పు సరిహద్దువరకు ఎంత వరకు ఇష్టమో అంతదూరము వెళ్ళి, అచట క్షణకాలము పాటు ఆగి, అచటినుండి నగరము నాల్గు దిక్కులందును ప్రదక్షిణ క్రమమున తిరుగుచు ఈశాన్యము వరకును ఆ కలశమును త్రిప్పవలెను. ఆ పనితో పాటు సీమాంత చిహ్నములను తడుపు చుండవలెను. ఈ విధముగ రుద్రకలశమును నగరము నాల్గువైపుల త్రిప్పి భూపరిగ్రహము చేయవలెను. దీనికి అర్ఘ్య దాన క్రియయని పేరు, పిదప శల్యదోషనివారణార్థమై రాళ్ళు లేదా నీరు వచ్చే వరకును భూమి త్రవ్వవలెను. ఎముకలు మొదలై నవి కనబడినచో వాటిని త్రవ్వించి తొలగించవలెను. లగ్న సమయమున ఎవ్వడై న ప్రశ్న వేయగా ఆతని ముఖము నుండి అ క చ ట త ప స హ అను వర్గములకు చెందిన అక్షరములు బయల్వెడలినచో, ఆ దిక్కులందు శల్యము లుండు నని సూచింపబడుచున్నది. పక్షులు మొదలగునవి వాలినచో అచట శల్యములున్నవని సూచింపబడుచున్నది. కర్త కు ఏ అంగమునందు వికారముండునో తత్సదృశ మగు శల్యమున్నదని నిశ్చయించవలేను, పశ్యాదిప్రవేశము వాటి ఆరపు, పక్షిరవము మొదలగు వాటిచే శల్యములున్న దిక్కు సూచింపబడును. ఒక పట్టిక పై గాని, భూమి మీద గాని అకారాద్యష్ట వర్గయుక్తమగు మాతృకావర్ణములను వ్రాయవలెను. వర్గాను సారము క్రమముగ తూర్పునుండి ఈశాన్యము వరకు నున్న దిక్కులందు శల్యమున్నట్లు తెలియవలెను. అవర్గమైనచో తూర్పున ఇనుము ఉండును. కవర్గమైనచో ఆగ్నేయమున బొగ్గు ఉండును. చవర్గమైనచో దక్షిణమునందు భస్మము ట వర్గమైనచో నైరృతియందు ఎముకలును ఉండును. తవర్గ మైనచో పశ్చిమమున ఇటుకలు, పవర్గమైనచో వాయవ్యమున పెంకులు, యవర్గమైనచో ఉత్తరమున శవములు కీటకము మొదలగునవి సవర్గమైనచో ఈశాన్యమునందు ఇనుము ఉండును. హవర్గమైనచో వెండి, క్షవర్గయుక్త దిగ్భాగమున ఆ దిక్కునందే అనర్థకరము లగు వస్తువు లుండును.
ప్రోక్షాత్మభిః కరాపూరై రష్టా జ్గుల మృదన్త రైః ।
పాదోనం ఖాతమాపూర్య సజలైర్ముద్ధ రాహతైః ।
లిప్తాం సమప్లవాం తత్ర కారయిత్వా భువం గురుః.
సామాన్యార్ఘ్యకరో యాయాన్మణ్డపం వశ్యమాణకమ్ !
తోరణద్వాః పతినిష్ట్వా ప్రత్యగ్ద్వారేణ సంవి శేత్.
కుర్యాత్తత్రాత్మ శుద్ద్వాది కుణ్డమణ్డపసంస్కృతిమ్ ।
కలశం వర్ధనీస క్తం లోకపాలశివార్చనమ్.
ఆగ్నేర్జనన పూజాది సర్వం పూర్వవదాచరేత్ ।
యజమానాన్వితో యాయాచ్ఛిలానాం స్నానమణ్డపమ్.
శిలాః ప్రాసాదలిజ్ఞస్య పాదా ధర్మాది సంజ్ఞకాః ।
అష్టాజ్గులోచ్ఛ్రితాః శస్తాశ్చతురస్రాః కరాయతాః.
పాషాణానాం శిలాః కార్యా ఇష్టకానాం తదర్గతః ।
ప్రాసాదే స్మ శిలాః శైల ఇష్టకా ఇష్టకామయే.
ఆజ్కితా నవవక్తాద్యైఃపజ్కజై కి పజ్కజాజితాః ।
నన్హాభద్రాజయారిక్తా పూర్ణాఖ్యా పఞ్చమీ మతా.
ఆసాం పద్మో మహాపద్మః శంభోథ మకరస్తథా।
సముద్ర శ్చేతి ప్ఛఞ్చామీ నిధికుమ్బాక్రమాదధ.
నన్దా భద్రా జయా పూర్ణా ఆజితా చాపరాజితా ।
విజయా మఖ్తలాఖ్యా చ ధరణి నవమీ శిలా.
సుభద్రశ్చ విభద్రక సునన్దః పుష్పన న్డకః ।
జయోథ విజయశ్చైవ కుమ్భః పూర్ణనథోత్తరః.
నవానాం తు యథాసంఖ్యం నీధికుమ్బా అమీ నవ.
ఒక్కొక్క హస్తము పొడవు గల తొమ్మిది శిలాఖండములను ప్రోక్షించి, వాటిని ఎనిమిదేసి అంగుళము లోపల మట్టి లోపల పాతవలెను. పైన నారుపోసి ముద్గరముతో కొట్టవలెను. ఆ రాళ్ళుమూడు వంతుల పొడవు నేలలో దిగిన పిమ్మట, గొయ్యి పూడ్చి, అలికి, అచటి భూమిని చదును చేయవలెను. గురువు సొమాన్యార్ఘ్యమును చేత ధరించి, చెప్పబోవు మండపము వైపు వెళ్ళవలెను. మండపద్వారమున ద్వారపాలకపూజ చేసి పశ్చిమద్వారమునుండి లోనికి ప్రవేశించవలెను. అచట ఆత్మశుద్ది కుండమండపాది సంస్కారము చేయవలెను. కలశ వర్గన్యాదిస్థాపన చేసి లోకపాలులను, శివుని పూజించవలెను. అగ్ని ననపూజనాదు లన్నియు వెనుకటి వలెనే చేయవలెను. పిమ్మట గురువు యజమానునితో కలిసి శిలల స్నాన మండపమునకు వెళ్ళవలెను. ధర్మాదిసంజ్ఞితము లగు నాలుగు ప్రాసాదలింగ శిల లున్నవి. వాటి ఎత్తు ఎనిమిది అంగుళము లున్నచో మంచిది. చతురస్రములుగను ఒక హస్తము పొడ వుండు నట్లును ప్రస్తరశిలలు నిర్మించవలెను. ఇటుకల ప్రమాణము శిలాప్రమాణములో సగ ముండవలెను. ప్రాసాదమునందు శిలలను, ఇటుకలతో కట్టు ఆలయములలో ఇటుకలు ఉపయోగించవలెను. వాటి తొమ్మిది శిలలను లేదా ఇటుక లను వజ్రాదిచిహ్నములతో చిహ్నితములు చేయవలెను. లేదా ఐదు శిలలను కమలచిహ్నముతో చిహ్నితము చేయవలెను. ఆలయ నిర్మాణము ఈ అంకిత, శిలతోడనే ప్రారంభించవలెను. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనునవి ఐదు శిలల పేర్లు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, సముద్రము అనునవి ఐదు నిధి కుంభములు. నంద, భద్ర, జయ, పూర్ణ, అజిత, అపరాజిత, విజయ, మంగళ, ధరణీ అనునవి తొమ్మిది శిలల పేర్లు. సుశద్ర, విభద్ర, సునంద, పుష్పదంత, జయ, విజయ, కుంభ, పూర్వ, ఉత్తరములు ఈ తొమ్మిదింటి నిదికలశములు.
ఆసనం ప్రథమం దల్వా తాడ్యోల్లిఖ్య శరణునా.
సర్వసామవి శేషేణ తనుత్రేణావగుణ్ఠనమ్ ।
మృద్భిర్గోమయగోమూత్రకషాయైరస్థవారిణా.
ఆస్త్రేణ హూంఫడ న్తేన మలస్నానం సమాచరేత్।
విధినా పఞ్చగవ్యేన స్నానం పఞ్చామృతేన చ.
గన్టతోయాన రం కుర్యాన్ని జనామాజితాణునా ।
ఫలరత్న సువర్ణానాం గోశృంగ సలిలైస్తతః.
చన్దనేన సమాలభ్య వరాచ్ఛాదయేచ్ఛిలామ్ ।
స్వర్ణోత్తమాసనం దత్వా నీత్వా యాగం ప్రదక్షిణామ్.
శయ్యాయాం కుశతల్పే వా హృదయేన నివేశయేత్ ।
సంపూజ్య న్యస్య బుద్ధ్యాది ధరాస్తం తత్త్వసంచయమ్.
త్రిఖణ్డవ్యాపకం తత్త్వత్రయం చానుక్రమాన్న సేత్ ।
బుద్ధ్యాదౌ చిత్రపర్యన్తే చినా తన్మాత్రకావదౌ.
తన్మాత్రాదౌ రాన్తే చ శివవిద్యాత్మనాం స్థితిః ।
తత్త్వాన్ని నిజమశ్రేణ తత్త్వోశాంశ్చ హృదార్చయేత్.
స్థానేషు పుష్పమాలాది చిహ్ని తేషు యథాక్రమమ్ ।
ఓం హూం శివతత్త్వాయ నమః.
ఓం హూం శివతత్త్వాధిపతయే నమః .
ఓం హాం విద్యాతత్త్వాయ నమః.
ఓం హాం విద్యాతత్త్వాధిపాయ నమః.
విష్ణవే నమః. ఓం హాం ఆత్మతత్త్వాయ నమః.
ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే బ్రహ్మణే నమః.
క్షమాగ్నియజమానార్కజలవాతేస్తుఖాని చ.
ప్రతితత్వం న్య సేద ష్టా మూ ర్తీకి ప్రతిశిలాం శిలామ్ ।
శర్వం పశుపతిం చోగ్రం రుద్రం భవమథేశ్వరమ్.
మహాదేవం చ భీమం చ మూర్తి శాంశ్చ యథాక్రమా త్ .
ఓం ధరామూర్తయే నమః.
ఓం ధరాధిపతయేనమః .
ఇత్యాదిమక్రాన్లోకపాలాన్యథానంఖ్యం నిజాణభిః
విన్యస్య పూజయేత్కుమాం స్తన్మ నైర్వా నిజాణుభిః ।
ఇంద్రాదీనాం తు బీజాని వ క్ష మాణక్రమేణ తు.
లూం రూం శూం షూం వూం యూం సూం హూం మం ఇతి ఉక్రో నవలాపక్ష శిలా పశ్బిపదా తథా.
ప్రతినిత్యం న్య సేన్మూర్తిః సృష్ట్యా పశ్చిధరాదికాః.
బ్రహ్మా విష్ణుస్తథారుద్ర ఈశ్వరశ్చ సదాశివః ।
ఏతే చ పఞ్చమూ ర్తీకా యష్టవ్యాస్తాసు పూర్వవ త్.
ఓం పృథివీమూర్తయే నమః . ఓం పృథివీమూర్త్యధిపతయే బ్రహ్మణే నమః. ఇత్యాదిమంత్రాః.
ప్రణవమయాసనము నిచ్చి ఆశ్రమంత్రముచే తాడనోల్లేఖనాదులు చేసిన పిదప ఈ శిలల నన్నింటిని సామాన్య రూపమున కవచమంత్రముచే ఆచ్చాదించవలెను. అస్త్రమంత్రము చివర “హుం ఫట్' చేర్చి దానిని ఉచ్చరించుచు మట్టి గోమయము, గోమూత్రము, కషాయములు, గంధయుక్త జలము-వీటితో మలస్నానము చేయించవలెను. పిమ్మట పంచగవ్య పంచామృతములతో యథావిధిగ స్నానము చేయించవలెను. గంధోదకముతో స్నానము చేయించిన పిదప స్వీయనామాంకిత మంత్రముతో శిలను ఫలరత్న -సువర్ణ-గోశృంగ-చందనములతో పూసి, వస్త్రముతో ఆచ్ఛాదించవలెను. స్వర్ణోత మగు ఆసన మిచ్చి, యాగమండప పరిక్రమణము చేసి ఆ శిలను తీసికొని పోయి హృదయ మంత్రముతో శయ్య పై గాని, కుకాస్త రణముపై గాని పరుండబెట్టవలేను. అచట పూజించి, బుద్ధినుండి పృథివివ రకును ఉన్న తత్వముల న్యాసము చేసి త్రిఖండ వ్యావక తత్త్వత్రయమును ఆ శిలలపై క్రమమున న్యాసము చేయవలెను. బుద్ధినుండి చిత్తమువరకు, చిత్తములోపల మాతృ కల వరకు, తన్మాత్రలు మొదలు పృథివి వరకును శివతత్త్వ-విద్యాత త్వ.ఆత్మతత్త్వము లున్నవి. పుష్పమాలాది చిహ్నత స్థానములపై క్రమముగా మూడు తత్వములను, తదీయమంత్రములతోను తత్వేతలను హృదయమంత్రముతోను పూజించే వలెను. ఓం హూం శివతత్త్వాయ నమః, ఓం హం శివతత్త్వాధిపాయ రుద్రాయ నమః, ఓం విద్యాతత్త్వాయ నమః, ఓం హాం విద్యాతత్త్వాధిపాయ విష్ణవే నమః, ఓం హాం ఆత్మతత్త్వాయ నమః, ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే బ్రహ్మణే నమః అనునవి పూజోపయుక్తమంత్రములు. ప్రతితత్త్వమునందును, ప్రతిశిల యందును భూ-అగ్ని-యజమాన-సూర్య.జల.వాయు. చంద్ర-ఆకాశము లను ఎనిమిది మూర్తుల న్యాసము చేయవలెను. పిదప క్రమముగ శర్వ - పశుపతి - ఉగ్ర - రుద్ర : భవ - ఈశాన. మహాదేవభీమమూర్తుల వ్యాసము చేయవలెను. “ఓం ధరామూర్తయే నమః, ఓం ధరాధిపతయే శర్వాయ నమః ఇత్యాదులు మూర్తి - మూ ర్తీశ్వర మంత్రములు. పిదప అనంతాది లోకపాలులను వారి వారి మంత్రముతో వ్యాసము చేయవలెను. లూం, రూం, యూం, బ్రోం, త్రూం, ఝం, ఝూం, హ్రూం, త్రం అనునవి ఇంద్రాదిలోక పాలబీజములు. ఇది నవశిలాపక్షమున చెప్పబడినది. పంపశిలపక్షమున ప్రత్యేక తత్త్వమయ శిలను స్పృశించి వాటిపై క్రమముగా పృథివ్యాదిమూర్తి న్యాసము చేయవలెను. బ్రహ్మ-విష్ణు-రుద్ర - ఈశ్వర - సదాశివులు ఐదుగురు మూ ర్తీకులు. ఈ ఐదింటిని పైన చెప్పిన ఐదు మూర్తులందును వెనుకటి వలె పూజించవలెను. “ఓం పృథివీమూర్తయే నమః, ఓం పృథివీ మూర్త్యధిపతయే నమః” ఇత్యాదులు పూజోపయుక్తమంత్రములు.
సంపూజ్య కలశాన్ పఞ్చ క్రమేణ నిజనామభిః ।
నిరుందీత విధానేన న్యాసో మధ్యశిలాక్రమాత్.
కుర్యాత్ప్రాకారమ శ్రేణ భూతిదర్బై స్తి లేస్తతః ।
కుణ్డేషు ధారికాం శ క్తిం విన్యస్యాభ్యర్బ్య తర్పయేల్.
తత్త్వతత్త్వాధిపాన్మూ శ్రీర్మూరీశాంశ్చ మృతాదిభిః ।
తతో బ్రహ్మాంశ శుద్ద్యర్థం మూలాజం బ్రహ్మభిః క్రమాత్.
కృత్వా శతాది పూర్ణాస్త్రం ప్రోత్యాః శాన్తజలై ఽశిలా।
పూజచ్చ కుకై స్పృష్ట్వా ప్రతితత్వమనుక్రమాత్.
సాన్నిధ్యమథ నగ్దానం కృత్వా శుద్ధం పునర్న్య సేల్ ।
ఏవం ధాగత్రయే కర్మ గత్వా సమాచరేత్.
ఆం ఈం ఆత్మతత్వ విద్యాతత్త్వాత్యాం నమః ఇతి.
సంస్పృశద్దరమూలాద్యైర్బహ్మాజ్ఞాదిత్రయం క్రమాత్ ।
కుర్యాతత్త్వాను నగ్దానం హ్రస్వదీర్ఘ ప్రయోగతః.
ఓం హాం ఉం విడ్యాతత్వ శివతత్త్వాథ్యాం నమః .
మృతేన మధునా పూర్ణాం సాకుమాన్సరత్న కాన్ ।
పఞ్చగవ్యాక్యసంసికాన్లోకపాలాధిదైవతాన్.
పూజయిత్వా నిజైర్మ నౌః సన్నిధౌ హోమమాచరేత్ ।
శిలానామథ సర్వాసాం సంస్మరేదధిదేవతాః.
విద్యారూపాః కృతస్నానా హేమవర్ణాః శిలామ్బరాః ।
న్యూనాదిదోషమోషార్థం వాస్తుభూమేశ్చ శుద్దయే.
యజేదస్త్రేణ మూర్ధాన్తమహుతీనాం శతం శతమ్ ।
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వాస్తుప్రతిష్ఠాజ్గశిలాన్యాసవిధిర్నామ ద్వినవతితమోధ్యాయః.
ఐదు కలశ లను వాటి నామమంత్రములతో పూజించి స్థాపించవలెను. మధ్య శిలాక్రమమున యథావిధిగా న్యాసము చేసి, విభూతి - కుశ - తిలలతో అస్త్రమంత్రవతో ప్రాకారము ఏర్పరుపవలెను. కుండములందు ఆధారశక్తి స్యాస పూజన ములు చేసి, తత్త్వ - తత్త్వాధిప - మూర్తి - మూర్తీ శ్వరులకు మృతాదులతో తర్పణము చేయవలెను. పిదప బ్రహ్మాత్మ శద్ధి కొరకై - మూలాంగము లైన బ్రహ్మమంత్రముతో క్రమముగ నూరు. నూరు హోమములు చేసి, పూర్ణాహుతి వరకును హోమము చేసిన పిదప శాంతి జలముతో శిలలను ప్రోక్షించి పూజించవలెను కుశలతో స్పృశించి ప్రత్యేక తత్త్వమునందు సాంనిధ్య సంధానములు చేసి పిదప శుద్ధవ్యాసము చేయవలెను. ఈ విధముగ క్రమముగా మూడు భాగములందు కర్మల చేయవలెను, “ఓం ఆం ఈం ఆత్మతత్త్వ విద్యాతత్త్వాభ్యాం నమః” అనునది మంత్రము. కుశ మూలాదులతో క్రమముగ ముగ్గురు తత్వేశాదులను స్పృశించి హ్రస్వదీర్ఘ ప్రయోగ పూర్వకముగ తత్త్వానుసంధానము చేయవలెను. అందును మంత్రము - ఓం హం ఉం విద్యాతత్వ శివతత్త్వాభ్యాం నమః పిదప మృతమధు పూర్ణములును, అగ్రమున పంచగవ్యాభిషిక్త ములును ‘పంచ లోకపాలకులు దేవతలుగా కలదియు అగు పంచకలశ లను, వాటి మంత్రమునిచే పూజించి వాటి సమీపమున హోమము చేయవలెను. పిదప సకల శిలాధి దేవతల ధ్యానము చేయవలెను. “ఆ శిలాధిదేవతలు విద్యా స్వరూపులు స్నానము పూర్తి చేసికొనినారు. వాటి శరీర కాంతి బంగారము వలె దేదీప్యమానముగ నున్నది. ఉజ్జ్వలములగు వస్త్రములు ధరించి ఆలంకృతులై యున్నారు న్యూనతాదిదోష పరిహారార్థమును వాస్తు భూమిశుద్ధి కొరకును ఆశ్రమంత్రముతో పూర్ణాహుతివరకును నూరు నూరు హోమములు చేయవలెను.
శ్రీ అగ్నిమహాపురాణమునందు ప్రతిష్టాంగభూతశిలాన్యాసవిధి వర్ణనమను తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 92 of the Agni Purāṇa is as follows:
The ninety-second chapter presents the ritual procedures for laying the foundation of a sacred building — both the vāstu-pratiṣṭhā (site consecration) and the śilā-nyāsa (placement of foundation stones). Five types of pratiṣṭhā for different classes of structure are distinguished: pratiṣṭhā (standard), sthāpana (establishing), sthira-sthāpana (firmly establishing), utāpana (raising), and āsthāpana (stabilizing). The bhūmi-parīkṣā (soil test) — determining the suitability of the site by the color and smell of soil at different depths, with different soil qualities being appropriate for residences of different varṇa-s — is described. The identification of underground obstructions (śalya) through a letter-code system is explained. Nine or five foundation stones (brahma-śilā) with tattva-mūrti-deva nyāsa inscribed upon them, and the homa sequences for brahma-śuddhi (consecration of the Brahma-point of the site), are specified.