అగ్ని మహా పురాణము

186 - అథ దశమీవ్రతాని.

అగ్ని రువాచః-

                   దశమీవ్రతకం వక్ష్యేధర్మకామాదిదాయకమ్

దశమ్యా మేకభక్తాశీ సమాప్తి దశ ధేనుదః.

 దిశశ్చ కాఞ్చానీర్దద్యాద్ర్బహ్మణాధిపతిర్భవేత్.

 ఇత్యాదిమహాపురాణ ఆగ్నే యే దశమీవ్రత నిరూపణం నామ షడశీత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని పలికెను: ధర్మకామాదిప్రద మగు దశమీవ్రతమును చెప్పెదను. దశమినాడు ఒక్కపూట మాత్రమే భోజనము చేసి సమాప్తి యందు పది ధేనువులను దానము చేసి పది బంగారు నాణెములను దక్షిణ ఇచ్చువాడు బ్రాహ్మణాధిపతి యగును.

అగ్ని మహాపురాణమునందు దశమీవ్రతనిరూపణ మను నూట ఎనుబది యారవ అధ్యాయము సమాప్తము.