అగ్ని మహా పురాణము

87 - అథ నిర్వాణదీక్షాయాం శాంతిశోధనమ్.

ఈశ్వర ఉవాచః-

సన్దద్యాదధానా విద్యాం శాస్త్రి సార్థం యథావిధి

శాస్తా తత్త్వద్వయం లీనం థానేశ్వర సదాశివౌ.

హకారశ్చ క్షకారశ్చ ద్యౌ వద్దే పరికీర్తితా

రుద్రాః సమాననామానో భువనై కి సహ తద్యధా.

ప్రభవ సమయః ముద్రో విమలః శివ ఇత్యపి

ఘనౌ నిరిజ్ఞానాకారో స్వశినౌ దీప్తి కారణా.

 త్రిదశేశ్వర నామా చ త్రిదశః కాలసంజ్ఞకః

స్మూమ్బుజేశ్వర శ్చేతి రుద్రాః శాన్తో ప్రతిష్ఠితా

విర్వాణాధీశాయాం శాస్త్రిశోధనమ్ వ్యోమవాపినే

వ్యోమవ్యాప్యరూపాయ సర్వవ్యాపినే శివాయ

అనస్తాయ అనాథాయ అనాశ్రితాయ ధ్రువాయ

శాశ్వతాయ యోగపీఠసంస్థితాయ నిత్యయోగినే

ధ్యానాహారాయేతి ద్వాదశ పదాని పురుషః

కవచౌ మన్రో బిజీ బినూపకారకౌ

అల్పముషాయసా నాఢ్యా వాయూ కృరరకూర్మ.

ఇన్స్టియే త్వక్కరారస్యాః స్పర్శస్తు విషయో మత

గుణె స్పర్శనినాదౌ ద్వా వేకః కారణమీశ్వరః.

తుర్యావనేతి శా నిస్టం సంభావ్య భువనాదికమ్

విదద్యాత్తాడనం భేదం ప్రవేశం చ వియోజనమ్. 

ఆకృష్య గ్రహణం కుర్యాచ్చా నేర్వదనసూత్రతః

ఆత్మ న్యారోప్య సంగృహ్య కలాం కుణే నివేశయేత్.

ఈశ తవాధికారేస్మిన్ ముముకుం దీక్షయామ్యహమ్

భావ్యం త్వయానుకూలేన కుర్యాద్విజ్ఞాపనామితి.

ఆవాహనాదికం పిత్రోః శిష్యస్య తాడనాదికమ్,

 విధాయాదాయ చైతన్యం విధినాత్మని యోజయేత్.

పూర్వవతితృసంయోగం భావయిత్వోద్భవాఖ్యయా

హృత్సముటాత్మ బీజేన దేవిగరే నియోజయేత్ .

దేహోత్పత్తా హృదా పజ్చ శిరసా జన్మ హేతవే

శిఖయావాధికారాయ భోగాయ కవచాణునా.

లయాయ శస్త్రమంత్రేణ స్రోతః శుద్ధౌ శివేన చ

తత్త్వశుద్ధౌ హృదా హ్యేవం గర్భాదానాది పూర్వవత్.

పరమేశ్వరుడు చెప్పెను : పూర్వోక్త విధానముచే విద్యాకళను శాంతికళతో విధిపూర్వకముగ సంధానము చేయ వలెను. అందుకు తొలి హాం హరాం హాం అనునది మంత్రము. శాంతికళలో ఈశ్వరుడు, సదాశివుడు అను రెండు తత్త్వములు ఇమిడియున్నవి. దీని వర్ణములు హకార కారములు. భువనములలో సమాన నామధేయములు గల రుద్రులు వీరు-ప్రభవ-సమయ-ముద్ర విమల. శివ-సన-నిరంజన-ఆంగార సుశిరా-దీ కారణ - త్రిద కేశ్వర-కాలదేవ-సూక్ష్మ-అంబుజే శ్వరు లను పదునాలుగురు రుద్రులు కాంతికళలో ప్రతిష్ణాతులు. “వ్యోమవ్యాపినే, వ్యోమరూపాయ, సర్వవ్యాపినే, శివాయ, అనస్తాయ, ఆనాధాయ, అనాశ్రితాయ, ధ్రువాయ, శాశ్వతాయ, యోగ పీఠసంస్థితాయ, నిత్యయోగినే, ధ్యానాహరాయ అను నవి పండ్రెండు పదములు. పురుష-కవచములు రెండు మంత్రములు. బిందుజకారములు బీజములు. అలంబుష, యశ అనునవి రెండు నాడులు. కృకరాకూర్మములు రెండు ప్రాణవాయుపులు. త్వక్కు, హస్తములు రెండు ఇంద్రియములు. విషయము, స్పర్శ, స్పర్శ శబ్దములు రెండు గుణములు. ఈశ్వరుడు ఏకైక కారణము. దీని అవస్థ తురీయావస్థ. ఈ విధముగ భువనాది సకలతత్వములును శాంతికళలో ఉన్నట్లు భావన చేసి, వెనుకటి వలెనే, తాడన-భేదన-హృదయప్రవేశ చైతన్య వియోజన ఆకర్షణ గ్రహణములు చేయవలెను. పిదప శాంతిముఖసూత్రముచే చైతన్యమును తనలో ఆరోపించుకొని, కళను గ్రహించి, కుండమునందు ఉంచవలెను. పిమ్మట ఈశ్వరని ఈ విధముగ ప్రార్థించవలెను. “ఓపరమేశా! నేను ఈ ముముక్షువునకు నీ అదికారమునందు దీక్ష ఇచ్చుచున్నాను. ఈతనికి అనుకూలుడవుగ నుండుము. మాతాపిత్రా వాహనాది కము, శిష్యవాడనాదికము చేసి, చైతన్యమును గ్రహించి ఆత్మతో యోజనము చేయవలెను. వెనుకటి వలెనే మాతాపితృసం యోగ భావన చేసి, హృదయమంత్రసంపుటితమగు ఆత్మబీజము ఉచ్చరించుచు, ఉద్భవవాడితో ఆ చైతన్యమును దేవీగర్భము నందుంచవలెను. దేహోత్పత్తికొరకు హృదయమంత్ర ముతోను, జన్మకొరకు శిరోమంత్రముతోను, అధికార సిద్ధికొరకు శిఖా మంత్రముతోను, భోగముకొరకు కవచ మంత్రముతోను, లయకొరకు శస్త్రమంత్రముతోను, ప్రోతఃశుద్దికొరకు శివమంత్రము తోను, తత్వశోధనము కొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమము చేయవలెను. గర్భాధానాది సంస్కారములు, గూడ వెనుక టివలెనే చేయవలెను.

వర్మణా పాశ శైథిల్యం నిష్కృత్యైవం శతం జపేత్

మలశ క్తితిరోధానే శ శ్రేణాహుతిపఞ్చకమ్.

ఏవం పాశ వియోగే2పి తతః సప్తాస్త్రజ ప్రయా

భింద్యాదస్త్రేణ కర్తర్యా పాన్ బీజవతా యడా.

ఓం హూం శాస్తికలాపాశాయ హః హుం ఫట్

విసృజ్య వర్తులీకృత్య పాశమ శ్రేణ పూర్వవత్:

ఘృతపూర్ణే స్రువే దత్త్వా కలా గ్రేడై వ హోమయేత్

ఆ శ్రేణ జహుయాతృళ పాళాజ్కురనివృత్తయే.

ప్రాయశ్చిత్తని షేధాయ దద్యాదష్ణాహుతీరథ

ఓం హః అస్త్రాయ హుం ఫట్. హృదేశ్వరం సమావాహ్య కృత్వా పూజనతర్పణే.

నిదధీత విధానేన తస్మై శుల్కసమర్పణమ్

ఓం హా ఈశ్వర బుద్ధ్యహజారే శుల్కం గృ హేణ స్వాహా

నిః శేషదగ్గపాశస్య పర స్యేశ్వర త్వయా.

న నేయం బన్దక త్వేన శివాజ్ఞాం శ్రావయేదితి

విసృజేదీశ్వరం దేవం రౌద్రాత్మానం నియోజయేత్.

సూత్ర సంయోజయోదేనం శుద్ధయోద్భవముద్రయా

దద్యాన్మూలేన శిష్యస్య శిర స్యమృతబిన్దుకమ్.

విసృజ్య పితరౌ వ హ్నే పూజితా కుసుమాదిభిః

దధ్యాత్పూర్ణాం విధానజో నికి శేషవిధిపూరణీమ్.

ఆస్యామపి విధాతవ్యం పూర్వవత్తాడనాదికమ్

స్వబీజం తు విశేషః స్యాచ్ఛుద్ధిః శాన్తరపీడితా.

ఇత్యాదిమహాపురాణే అగ్నియే నిర్వాణదీక్షాయాం శాంతిశోధనం నామ సప్తాశీతితమోధ్యాయః.

పాశ శైథిల్యముకొరకును. నిష్కృతికొరకును. కవచమంత్రము నూరు సార్లు జపించవలెను. మలశ క్తి తిరో. ధానము కొరకు శస్త్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. పాశ వియోగముకొరకు గూడ ఐదు హోమములు చేయ వలెను. పిమ్మట అస్త్రమంత్రమును ఏడు పర్యాయములు జపించి, బీజయు క్రాస్త్రమంత్ర రూప ఖడ్గముతో (ఓం హౌం శాస్త్రి కలాపాశాయ నమః హాం హరాం ఫట్) పాశ మును ఛేదించవలెను. వెనుకటి వలెనే అస్త్రమంత్రముతో పాశ విమర్ధన వర్తులే కరణములు చేసి నేతితో నింపిన స్రువములో ఉంచి, కలాస్త్రమంత్రముతో దానిని హోమము చేయవలెను. పాశాంకుర, నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు ఆహుతు లిచ్చి ప్రాయశ్చిత్త నివారణార్థమై ఎనిమిది హోమములు చేయవలెను. “ఓం హం? అస్త్రాయ హూం ఫట్” అనునది మంత్రము. హృదయమంత్రముతో ఈశ్వరుని ఆవాహన చేసి పూజతర్ప జాద్యనంతరము “ఓం హాం ఈశ్వర, బుద్ధ్యహఙ్కారౌ శుల్కం గృహాణ స్వాహా” అను మంత్రముతో యథాశాస్త్రముగ శుల్కమును సమర్పించవలెను. పిదప ఈశ్వరునకు శివాజ్ఞ వినిపింపవలెను, “ఈశ్వరా! ఈ పశువు పాశములన్నియు దగ్గములై నవి. ఇక నీవు వీనికి బంధములు కలిగించరాదు.” పిమ్మట ఈశ్వరుని విసర్జించి ఆత్మలో రౌద్రీశ క్తిని చేర్చ వలెను. ఈశ్వరుడు చంద్రునకు తన శిరస్సుపై ఆశ్రయ మిచ్చి నట్లు శిష్యుని జీవాత్మ ను గురువు తన ఆత్మతో సంబం ధింపచేయవలెను. పిదప దానిని శుద్దా-ఉద్భవముద్రతో సూత్రమునందు చేర్చి, అమర బిందు స్వరూప మగు ఆ చైతన్య సూత్రమును, మూలమంత్రముతో, శిష్యుని శిరముపై నుంచవలెను. పిదప ఆగ్ని ని, పితరులను పుష్పాదులతో పూజించి, విసర్జనము చేసి, సమ స్తవిధానసంపూర్తి కొరకై, పూర్ణాహుతి ఇవ్వవలెను. తాడనాదికము వెనుకటివలెనే చేయవలెను. ఈ కళకు సంబంధించిన బీజము నుపయోగించుట యొక్కటియే విశేషము. ఈ విధముగ కాంతిక శుద్ది చెప్పబడినది.

శ్రీ ఆగ్నేయపురాణమునందు నిర్వాణదీక్షలో శాంతికళాశోధన మను ఎనుబది యేడవ అధ్యాయము సమాప్తము.