శ్రీ భగవానువాచః
జీర్ణోద్దారవిధిం వక్క్ష్యే భూషితాం స్నపయే ద్గురుః ।
అచలాం విన్య సేధే హే అతిజీర్ణం పరిత్యజేత్.
వ్యజ్ఞాం భగ్నం చ శై లాఠ్యాం న్య సేదన్యాం చ పూర్వవత్ ।
సంహారవిధినా తత్ర తత్త్వాన్ సంహృత్య దేశికః
సహస్రం నారసిం హేన హుత్వా తాముద్ద రేద్దురుః ।
దార వీం దాహయేదాద్వహ్నౌ శైలజాం ప్రక్ష పేజ్జలే.
ధాతుజాం రత్న జాం వాపి అగాధే వా జలేమ్బుదౌ ।
యానమారోప్య జీర్ణా జం భాద్య వస్తాదినా నయేత్ .
వాది తైః ప్రక్ష పేత్తాయే గురవే దక్షిణాం దదేత్ ।
యత్ప్రమాణా చ యద్ధావ్యా తన్మానాం స్థాపయేద్దినే.
కూపవాపీత డాగాదేర్జీర్ణోద్ధారే మహాఫలమ్ ।
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జీర్ణోద్ధార విధాన కథనం నామ సప్త షష్టితమోధ్యాయః.
హయగ్రీవుడు చెప్పెను - ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చేప్పెదను. ఆచార్యుడు మూర్తి కి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగ విహీనము, భగ్నమైనది, శిలామాతావశిష్టమైనది, అగు పతిమను పరిత్యజించవలెను. దీని స్థానమునందు వెనుకటి వలెనే నవీనమైన స్థిరమూర్తి ని స్థాపింపవలేను. ఆచార్యుడు భూతశుద్ధిక రణములో చెప్పిన విధమున, సంహారవిధిచే సకల తత్త్వముల సంహారము చేయవలెను, నృసింహ మంతముతో వేయి హోమములు చేసి మూర్తి ని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తి నచో జలములో విడువలెను. ధాతుమయమూర్తి గాని, రత్న మయమూర్తి గాని ఐనచో సముదములో అగాధ జలములో పడవేయవలెను. జీర్ణపతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాద్యములతో తీసికొని వెళ్ళి నీటిలో విడువ వలెను పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. ఆదివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణము కలదో అదే దవ్యముతో, అంతే ప్రమాణము గల మూర్తి ని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప - వాపీ - తడాగాదుల ఉద్గారము చేయుటచే గొప్ప ఫలము లభించును.
శ్రీ అగ్ని మహాపురాణమునందు జీర్ణోద్ధార విధి కథనమను అరువది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 67 of the Agni Purāṇa is as follows:
This chapter addresses the ritually sensitive subject of replacing or renovating a divine image that has been damaged, worn, broken, or rendered defective over time. The saṃhāra-vidhi — the withdrawal of the deity's presence from the old image before its disposal — is described as a reverse pratiṣṭhā: the ācārya draws the deity's presence back through the sūtra into the kalaśa, from where it is held in suspension during the renovation period. The disposal of old images is specified according to material: wooden images are to be consigned to fire, stone images immersed in flowing water or the ocean, and metal images cast into the sea. The principle that it is the divine presence rather than the physical material that is sacred — and that presence can be transferred — is affirmed. The replacement image must be installed on the same tithi and nakṣatra as the original, and the deity's presence transferred back with full pratiṣṭhā rites.