అగ్ని మహా పురాణము

226 -  అథ సామాద్యుపాయకథనమ్

పుష్కర ఉవాచః

 స్వమేవ కర్మదై వాఖ్యం విద్ధి దేహాంతరార్జితమ్

 తస్మాత్పౌరుషమే వేహ శ్రేష్ఠమాహుర్మనీషిణః.

 ప్రతికూలత తతాదైవం పౌరుషేణ విహన్యతే

సాత్త్వికాత్కర్మణః పూర్వాత్సిద్ధిః స్యాత్పౌరుషంవివా.

పౌరుషం దైవసమ్పత్త్యా కాలేఫలతిభార్గవ

దైవం పురుష కారశ్చ ద్వయం పుంసః ఫలావహమ్.

 కృషేర్వృష్టి సమాయోగాత్కాలేస్యుః ఫలసిద్ధయః

సదర్మం పౌరుషం కుర్యాన్నాలసో నచ దేవవాన్.

 సామాదిభిరుపాయైస్తు సర్వేసిధ్యంత్యుపక్రమాః

 సామ చోప ప్రదానంచ భేదదండౌ తథాపరౌ.

మాయో పేక్సేంద్రజాలం చ హ్యుపాయాః నప్తతాంచ్ఛృణు

 ద్వివిధం కథితం సామతథ్యం చాతథ్యమేవచ.

తత్రాప్యతథ్యం సాధూనామాక్రోశాయైవ జాయతే

మహాకులీనా హ్యృజవో ధర్మ నిత్యా జితేంద్రియాః. 

సామసాధ్యా ఆతథైశ్చ గృహ్యన్ తే రాక్షసా అపి

 తథా తదుపరాణాం కృతానాం చైవ వర్ణనమ్.

 పరస్పరం తుయే ద్విష్టాః క్రుద్దభీతావమానితాః

తేదం భేదం ప్రయుంజీత పరమందర్శయేద్బయమ్.

 ఆత్మీయాం దర్శయేదాశాం యేనదోషేణ బిభ్యతి

పరాస్తేనెవ తే భేద్యా రక్షోవైజ్ఞాతి భేదకః.

 సామంత కోపో బాహ్యస్తు మంత్రామాతాత్మజాదికః

ఆంతఃకోపం చోపశామ్యం కుర్వఞ్చత్రోశ్చతంజయేత్.

పుష్కరుడు పలికెను : పరశురామా ! మనుష్యుడు పూర్వము తాను ఇతర శరీరముతో చేసిన కర్మకే దైవమని పేరు. అందుచే బుద్ధిమంతుడు పురుషకారమే శ్రేష్టమైనదని తెలిసికొనవలెను. దై వము ప్రతికూలముగా నున్న చో పురుష కార ముచే దానిని అనుకూలము చేసికొనవచ్చును పూర్వము చేసిన సాత్త్విక కర్మల ఫలితముగా ఈనాడు, పురుష కార మేమియులే కన్నను సిద్ది లభించును. భృగునందనా ! పురుషకారమే దైవసాహాయ్యముతో తగు సమయమునందు ఫలమిచ్చు చుండును. దైవ పురుషకారములు రెండును. మానవునకు ఫలమునిచ్చును. పురుషకారముచే వ్యవసాయము చేయగా వర్ష యోగమం వచ్చినపుడు సమయానుసారము ఫలము లభించు ఆందుచే కర్మానుష్టానము చేయుచు పురుషకారమునందు కూడ ప్రవర్తించవలెను, గాని కేవలము దైవమునే నమ్ముకొని కూర్చుండ కూడదు. సామాద్యుపాయములతో ప్రారంభించిన సర్వకార్యములును సిద్ధించును. సామము, దానము, భేదము, దండము, మాయ ఉపేక్ష, ఇంద్రజాలము అని ఏడు ఉపాయములు. వాటి స్వరూపమును గూర్చి వినుము. తథ్యము, ఆతథ్యము అని సామము రెండు విధములు. అతథ్య సామము పురుషులకు అపకీర్తి కరము; ఉత్తమవంశ సుజాతులు, సరస్వభావులు, ధర్మపరాయణులు, జితేంద్రియులు అయిన పురుమలు సామమునకు లొంగుదురు. ఆతథసామముచే రాక్షసులను కూడ లొంగదీసి కొనవచ్చును. వారుచేసిన ఉపకారములను వర్ణించుటయే వారిని వశముచేసికొమటకు మంచి ఉపాయము. పరస్పరద్వేషవంతులై, కుపితుడై , భయభీతులై, ఆవమావితులై ఉన్న వారి విషయమున భేదమును ప్రయోగించవలెను. వారికి ఇంకను భయము కలుగునట్లు చేయవలెను. తమవైపునుండి వారికి ఆశ చూపించి, ఏదోషముచే వారు ఇతరుల నుండి భయపడుదురో దానిని ప్రకటించి వారిలో భేదము పట్టించవలెను. శత్రుకుటుంబమానంద భేదమును పుట్టించువారిని రక్షించవలెను. సామంతులకోపము మంత్రి-పుత్రాదుల కోపము ఆంతరకోపము. అందుచే ముందుగా అంతకోపమును శమింపచేసి, పిదవ రాహ్యకోపమన తొలగింప ప్రయత్నించవలెను.

ఉపాయ శ్రేష్ఠం దానం స్యాద్ధానాదుభయలోక బాక్

నసోఽస్తి నామదానేన వశగో యో న జాయతే.

 దాన వానేవ శక్నోతి సంహతాన్బేడితుం పరాన్

 త్రయాసాధ్యం సాధయేత్తం దండేనచ కృతేనచ.

 దండే సర్వం స్థితం దండో నాశయేద్దుష్ప్రణీకృతః

అదండ్యాన్దండ యన్న శ్యేద్దండ్యాన్రాజాప్యదండయన్.

దేవదైత్వోరగనరాఃసిద్దా భూతాః పతత్రిణః

 ఉత్క్ర మేయుః స్వమర్యాదాం యదిదండాన్న పాలయేత్.  యస్మాదదాన్తాన్దమయత్యదండ్యాన్దండ యత్యపి

దమనాద్దమ్నాచ్చైవ తస్మాద్దండం విదుర్భుదాః.

 తేజసాదుర్నిరీక్స్యోహి రాజాభాస్కరవత్తతః

లోకప్రసాదం గచ్ఛేత్తు దర్శనాచ్చంద్రవ త్తత.

 జగద్వ్యాప్నోతివై చారై రతోరాజా సమీరణః

దోషనిగ్రహకారిత్వాద్రాజా వైవస్వతః ప్రభుః.

యదాదహతి దుర్బుద్ధిం తదాభవతిపావకః

యదాదానం ద్విజాతిభ్యో దద్యాత్తస్మాద్దనేశ్వరః.

ధనధారాప్రవర్షిత్వాద్దేవాదౌ వరుణః స్మృతః

క్షమయా ధారయంల్లోకాన్పార్థివః పార్థివోభవేత్.

ఉత్సాహమంత్రశక్త్యాద్యై రక్షే ద్యస్మాద్దరి స్తతః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సామాద్యపాయోనామ షడ్వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః

అన్ని ఉపాయములలో దానము శ్రేష్టమైనది. దానముచే ఇహపరములు రెండింటియందును ఫలములభించును. దానముకు లొంగని వారెవరునలేరు. దానము చేయువాడు పరస్పరము కలిసియున్న వారిలోకూడ భేదమును కలిగించును సామదాన భేదమ లచే సిద్ధించనికార్యములనుదండముచే సిద్ధింపచేసికొనవలెను. దండమునందే సర్వమును ఉన్నది. కాని దండమను అనుచితరీతిలో ప్రయోగించినచో అది ఆత్మవినాశ హేతువగును. దండింపతగని వానినిడండించువాడును, దండింపతగినవానిని దండించనివాడును అయిన రాజు వినాశముపొందును. రాజు దండముద్వారా అందరిని రక్షించ కున్నచో దేవతలు, దైత్యులు, సాగులు, మనుష్యులు, సిద్దులు, భూతములు, పక్షులు-అందరును తమతమమర్యాదలను ఉల్లంఘింతురు. కురులను అణచివేసి, దండనీయులను శిక్షించును గానదీనికి దండమని పేరు. రాజు ఇతరులు చూడజాలని విధమున తేజస్సుతో ప్రకాశించునపుడు అతడు సూర్యుని వంటివాడు. దర్శనమాత్రముచే ఆనందమును కలిగించునపుడు అతడు చంద్రునివంటివాడు. గూఢచారులద్వారా ప్రపంచకము నందంతటను వ్యాపించియుండుటచే ఇతడు పోయుతుల్యుడు. దోషములను చూచి దండించుటచే ఇతడు యమధర్మరాజసమానుడు. కుటిలబుద్ధిగల దుష్టులను చూచి దండించునుగాన అతడు సాక్షాత్తు ఆగ్ని దేవుడు. బ్రాహ్మణులకు దానములిచ్చునపుడు ధనాధి పతియైన కుబేరుడు. దేవతాదులనుద్దేశించి హవిస్సు, ఘృతము మొదలగు వాటిని ధారగావిడచును గాన వరుణుడు. ఓర్పుతో ఈ జగత్తునంతను ధరించునుగాన పృథ్వీరూపుడు. ప్రభుమంత్రోత్సాహశక్తులతో అందరిని పాలించునుగాన సాక్షాత్తు శ్రీమహా విష్ణుస్వరూపుడు.

ఆగ్ని మహాపురాణమునందు సామాద్యుపాయకథనమను రెండువందల ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.