అగ్ని మహా పురాణము

252 - పునః ధనుర్వేదః

 అగ్ని రువాచః

బ్రాన్తముద్బ్రాన్త మావిద్ద మాప్లుతం విప్లుతం స్మృతమ్

సంపాతం సముదీర్ణం చ శ్యేన పాతమథా కులమ్.

ఉద్దూతమవ ధూతం చ సవ్యం దక్షిణ మేవచ

ఆనాలక్షిత విస్పోటౌ కరాలేంద్ర మహాసభౌ.

 వికరాల నిపాతౌ చ విభీషణ భయానకౌ

సమగ్రార్ద తృతీయాంశ పాదపాదార్ధ వారిజాః.

ప్రత్యాలీడ మదాలీఢం వరాహం లులితం తథా

 ఇతి ద్వాత్రింశతో జ్ఞేయో ఖడ్గచర్మ విధిరణే.

పరావృత్తమపా వృత్తం గృహీతం లఘుసంజ్ఞితమ్

ఊర్ధ్వం క్షిప్తమధః క్షిప్తం సందారిత విదారితమ్.

శ్యేనపాతం గజ (జా) పాతం గ్రాహగ్రాహ్యంత థైవచ

ఏవమేకా దశవిధా జ్ఞేయాః పాశ విదారణాః.

 ఋజ్వాయతం విశాలంచ తిర్యగ్బ్రామిత మేవచ

పంచకర్మ వినిర్దిష్టం వ్యస్తేపాశే మహాత్మభిః.

ఛేదనం భేదనం పాతో భ్రమణం శయనం తథా

వికర్తనం కర్తనం చ చక్ర కర్మేద మేవచ .

 ఆస్ఫోటః క్షేడనం భేదస్త్రాసాన్ దోలితకౌ తథా

శూల కర్మాణి జానీహి షష్ఠమాఘాత సంజ్ఞితమ్.

దృషిఘాతం భుజాఘాతం పార్శ్వఘాతం ద్విజోత్తమ

ఋజుపక్షేషుణాప్రాప్తం తోమరస్య ప్రకీర్తితమ్.

ఆగ్ని దేవుడు చెప్పేను : వసిష్ఠా! భ్రాంత ఉద్ర్భాంత-ఆవిద్ద-ఆప్లుత-విప్లుత-సంపాత సముదీర్ణ-శ్యనపాత-ఆకుల-ఉద్దూత-అవధూత-సవ్య-దక్షిణ-అనాలక్షిత-విస్ఫోట-కరాలేంద్ర-మహాసఖ-వికరాల-నిపాత-విభీషణ- భయానక సమగ్ర-అర్థ-తృతీయాంశ-పాద-పాదార్ధ-వారిజ- ప్రత్యాలిడ-ఆలీడ-వరాహ - లులితములు అనునవి యుద్ధరంగమున చూపు కత్తిడాలతో యుద్ధము చేయునపుడు చూపు ఇరువది రెండు చలనశ్రమములు. వీటిని తెలుసుకొనవలెను. పాశమును విసరుటలో పరావృత్త - అపావృత్త - గృహీత - లఘు - ఊర్ధ్వజిప్త - అధః ప్త - విధారిత - శ్యేనపాత - గజపాత - గ్రాహ్య గ్రాహ్యములు అను పదునొకండు ప్రకారములున్నవి. వ్య స్తపాశమున మహాత్ములు, ఋజు - ఆయత - విశాల - తిర్యక్ థామితములను ఐదుకర్మలు చెప్పిరి. దన - భేదన - పాత - భ్రమణ - శమన - వికర్తన - క ర్తనములను ఏడును చక్ర కర్మలు. ఆస్ఫోట- క్ష్వేడన - భేద - క్రాస - ఆందోలిత - ఆఘాతములను ఆరును శూల కర్మలు. ద్విజోత్తమా! దృష్టిఘాత - భుజఘాత - పార్శ్వమాత - ఋజుపాత - పక్షపాత - ఇషుపాతమలనునవి తోమరకార్యములు.

ఆహతం విప్రః గోమూత్ర ప్రభూతం కమలాసనమ్

నతోర్ధ్వగాత్రం నమితం వామ దక్షిణ మేవచ.

 ఆవృత్తంచ పరా వృత్తం పాదోద్దూత మవప్లుతమ్

హంసమర్ధం విమర్దంచ గదా కర్మ ప్రకీర్తితమ్.       

 కరాలమవఘాతంచ దంశోపప్లుత మేవచ

క్షిప్తహస్తం స్థితం శూన్యం పరశోస్తు వినిర్థిశేత్.

 తాడనం ఛేదనం విప్ర తథా చూర్ణన మేవ చ

ముద్గరస్య తు కర్మాణి తథా ప్లవన మాతనమ్.

 సంశ్రాన్ తమథ విశ్రాంతం గోవిసర్గం సుదుర్ధరమ్

 భిందిపాలస్య కర్మాణి లగుడస్య చ తాన్యపి.

అంత్యం మధ్యం పరావృత్తం నిదేశాంతం ద్విజోత్తమ

 వజ్రస్యైతాని కర్మాణి పట్టిశస్య చ తాన్యపి.

 హరణం ఛేదనం ఘాతో భేదనం మ్రక్షణం తథా

కృపాణకర్మ నిర్ధిష్టం పాతనం స్పోటనం తథా.

 త్రాసనం రక్షణం ఘాతో బలోద్దరణమాయతమ్

క్షేపణీ కర్మ నిర్దిష్టం యంత్రకర్మైతదేవతు.

 సంత్యాగమవదంశశ్చ వరాహోద్ధూతకం తథా

హస్తావహ స్తమాలీన మేక హస్తావహ స్తకే.

 ద్విహ స్తబాహుపాశేచ కటిరోచిత కోద్గతే

ఉరోలలాట ఘాతే చ భుజా విధమనం తథా.

కరోద్దూతం విమానంచ పాదాహతి విపాదికమ్

గాత్ర సంశ్లేషణం శాంతం తథా గాత్ర విపర్యయః.

 ఊర్ద్వప్రహారం ఘాతంచ గోమూత్రం సవ్యదక్షిణే

 పారకం తారకం దండం కబరీబంధమాకులమ్.

 తిర్యగ్బంధమపామార్గం భీమవేగం సుదర్శనమ్

సింహాక్రాంతం గజాక్రాంతం గర్దభాక్రాంత మేవచ.

గదా కర్మాణి జానీయాన్ని యుద్ధస్యాథ కర్మ చ

విప్రశ్రేష్ఠా! ఆహత - విహృత - ప్రభూత - కమలాసన - నతోర్ధ్వగాత్ర - నమిత - వామడక్షిణ – ఆవృత్త - పరావృత్త - పాదోద్ధూత - ఆవప్లుత - హంసమర్ధ - విమర్ధములు గదా కర్మలు. కరాల. అవఘాత దంపప్లుతడి ప్రహస్త స్థిత శూన్యములు పర శుకర్మలు. తాడన-భేదన చూర్ణన-ప్లవవ-ఘాతనములు ముద్గర కర్మలు. సంశ్రాంత - విశ్రాంత గోవిసర్గ-సుదుర్ధరములు భిందిపాల-రిగుడముల కర్మలు. అంత్య-మధ్య-పరావృత్త-నిదేశాంతములు వజ్ర పట్టిశముల కర్మలు. హరణ-ఛేదన- ఘాత- భేదన-రక్షణ-పాతన-స్ఫోటనములు కృపాణకర్మలు. త్రాసన-రక్షణ-ఘాత-బలోద్ధరణ ఆయకములు క్షేపణీకర్మలు; యంత్రకర్మలు కూడ ఇవియే. సత్యాంగ- అవదంశ-వరాహోద్ధూతక-హస్తావహ స్త-అలీన ఏకహ స్తువహస్తక-ద్విహ స్తబాహుపాళ -కటిరేచితక -ఉద్ధత-ఉరోమాత-లలాటమాత- భుజావిధమన- కరోద్ధూత - విమాన - పాదౌహతి - విపాదిక - గాత్రసంశ్లేషణ - శాంత - గాత్రవిపర్యయ - ఊర్ధ్వప్రహార - ఘాత - గోమూత్ర - సవ్య -దక్షిణ - పారక - తారక - దండ - కబరీబంధ - ఆకుల – తిర్యగ్బంధ-ఆపామార్గ - భీమవేగ - సుదర్శన - సింహా క్రాంత - గజాక్రాంత - గర్గభాక్రాంతములు గదాయుద్ధ చలనములని తెలియ వలెను. ఇపుడు మల్లయుద్ద గతులను చెప్పెదను.

ఆకర్షణం వికర్షంచ బాహూ నాం మూలమేవచ.

గ్రీవా విపరి వర్తంచ పృష్ఠభంగం సుదారుణమ్

పర్యాసన విపర్యాసౌ పశుమార మజావికమ్.

పాద ప్రహారమాస్ఫోటం కటిరేచితకం తథా

గాత్రా శ్లేషం స్కంధగతం మహీవ్యాజన మేవచ.

 ఉరోలలాటమౌతంచ విస్పష్టకరణం తథా

ఉద్ధూత మవధూతంచ తిర్యజ్ మార్గగతం తథా.

గజస్కంధ మవ క్షేపమపరాజ్ ముఖమేవచ

దేవమార్గ మధోమార్గమమార్గ గమనాకులమ్.

యష్టితమవక్షేపో వసుధాదారణం తథా

జానుబంధం భుజాబంధం గాత్రబంధం సుదారుణమ్.

 విపృష్ఠం సోదకం శుభ్రం భుజావేష్టిత మేవచ

సన్న ద్ధైః సంయుగేఖావ్యం సశస్త్రైస్తైర్గ జాదిభిః.

 వరాంకుశధరౌ చోభౌఏకగ్రీవాగతోఽపరః

స్కంధగౌ ద్వౌచ ధానుష్కో ద్వౌచ ఖడ్గ ధరౌగజే

 రథే రణే గజేచైవ తురంగాణాం త్రయం భవేత్

 ధనుష్కాణాం త్రయం ప్రోక్తం రక్షార్థే తుర గస్యచ.

 ధన్వినో రక్షణార్థాయ చర్మిణంతు నియోజయేత్

స్వమంత్రైః శస్త్రమభ్యర్చ్య శాస్త్రం త్రైలోక్య మోహనమ్.

యోయుద్దేయాతి స జయేదరీన్సమ్పాలయేద్ ధ్రువమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయ ద్విపంచాశదధిక ద్విశతత మోఽధ్యాయః.

ఆకర్షణ - వికర్షణ - బాహుమూల - గ్రీవా పరివర్తన - సుదారుణ పృష్ఠ - భంగ - పర్యాసన – వివర్యాసన-పశుమార - ఆజావిక - పాద ప్రహార - ఆస్ఫోట - కటి రేచితక - గాత్రాశ్లేష - స్కంధగత - మహీవ్యాజన- ఉరోలలాట ఘాత - విస్పష్టకరణ - ఉర్దూత - అవధూత - తిర్య జ్మార్గగత - గజస్కంధ - అవక్షేప - ఆపరాజ్ముఖ - దేవమార్గ ఆధోమార్గ - ఆమార్గ గమనాకుల - యష్టిఘాక - అవక్షేప - వసుధారణ - జానుబంధ - భుజాబంధ - సుదారుణగాత్ర బంధ - విపృష్ఠ - సోదక - శ్వథ - భుజావేష్టితములు (మల్లయుద్ధగతులు) కవచము ధరించి, అస్త్రశస్త్ర సంపన్నుడైన, గజాది వాహనారూఢుడై యుద్ధరంగమున ప్రవేశించవలెను. ఏనుగు మీద, ఇద్దరు మావంటి వాండ్రు ఉత్తమమైన ఆంకు శములు ధరించి ఉండవలెను. వారిలో ఒకడు. మెడమీదను రెండవ వాడు భుజముమీదను కూర్చుండవలెను. వీరు కాక ఇద్దరు ధనుర్గనుర్ధరులు, ఇద్దరు ఖడ్గధారులు కూడ ఏనుగుపై కూర్చుండవలెను. ఒక్కొక్క రథమును, గజమును రక్షించుటకు ముగ్గురేసి ఆశ్వికులుండవలెను. అశ్వమును రక్షించుటకై ధనుర్ధరులేన ముగ్గురేసి కాలి బంటులు ఉండవలెను. ధనుర్ధరుల రక్షణము నిమిత్తము కత్తిడాలు ధరించిన యోధులను నియమించవలెను. ఒక్కొక్క ఆయుధమును దానికి సంబంధించిన మంత్రముతో పూజించి, "త్రైలోక్యమోహన కవచము" పఠించి, యుద్ధరంగమునందు ప్రవేశించువాడు శత్రువులపై విజయము పొంది, భూతలమును రక్షించును.

అగ్ని మహాపురాణమునందు ధనుర్వేదకథనమను రెండు వందల ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.