అగ్ని మహా పురాణము

372 - అథ యమనియమాః

ఆగ్ని రువాచః

సంసార తాప ము క్త్యర్థం వక్ష్యామ్యష్టాంగ యోగకమ్

బ్రహ్మప్రకాశకం జ్ఞానం యోగ స్తత్రైకచి త్తతా.

చిత్తవృత్తినిరోధశ్చ జీవబ్రహ్మాత్మనోపరః

ఆహింసాసత్యమయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ.

యమాః పంచస్మృతా విప్రనియమాద్బు క్రిము క్తిదాః

శౌచం సంతోష తపసీ స్వాధ్యాయేశ్వర పూజనే.

భూతాపీడాహ్య హింసాస్యా దహింసా ధర్మ ఉత్తమః

యథా గజపదేన్యాని పదాని పథగామినామ్.

ఏవం సర్వమహింసాయాం ధర్మార్ధ మభిధీయతే

ఉద్వేగం జననం హింసా సంతాపక రణం తథా.

రుక్కృతిః శోణితకృతి వైశున్యకరణం తథా

తస్యాతి నిషేధశ్చ మర్మోద్ఘాటన మేవచ.

సుఖాపహ్నుతి సంరోధోవధోదశ విధా చసా

యద్భూతహితమత్యన్తం వచః సత్యస్యలక్షణమ్.

సత్యం బ్రూయా త్ప్రి యం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్

ప్రియంచ నానృతం బ్రూయాదేషధర్మః సనాతనః.

మైథునస్య పరిత్యాగో బ్రహ్మచర్యం తదష్టదా

 స్మరణం కీర్తనం కేలిః ప్రేక్షణం గుహ్యభాషణమ్.

సంకల్పోఽద్యవ సాయశ్చ క్రియా నిర్వృతి రేవచ

ఏతన్మైథున మష్టాంగం ప్రవదంతి మనీషిణ.

బ్రహ్మచర్యం క్రియామూల మన్యథా విఫలాః క్రియాః

వసిష్ఠశ్చంద్రమాః శుక్రో దేవాచార్యః పితామహః.

తపోవృద్దా వయోవృద్ధాస్తేఽపి స్త్రీభిర్విమోహితాః

గౌడీ వైష్టీ చ మాధ్వీచ విజ్ఞేయా త్రివిధాసురా.

చతుర్థి స్త్రీసురా జ్ఞేయాయయేదం మోహితం జగత్

మాద్యతి ప్రమదాం దృష్ట్వా సురాం పీత్వాతు మాద్యతి.

యస్మాద్దృష్ట మదానారీ తస్మాత్తాం నావలోక యేత్

యద్వాతద్వా పర ద్రవ్య మపహృత్య బలాన్నరః.

అవశ్యం యాతి తిర్యక్వం జగ్ద్వా చై వా హుతం హవిః

కౌపీ సాచ్ఛాదన హసః కంఠాం శీతనివారిణీమ్.

పాడు కే చాపిగృణీయాతుర్యాన్నా న్యన్యసంగ్రహమ్

దేహస్థితి నిమి త్తస్య వస్త్రాదేః స్యాత్పరి గ్రహః.

శరీరం ధర్మ సంయుక్తం రక్షణీయం ప్రయత్నతః

శౌచంతు ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం తథా.

మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావ శుద్ధేరథాంతరమ్

ఉభ యేన శుచిర్యస్తు సశుచిర్నేతరః శుచిః.

ఆగ్ని దేవుడు పలికెను. సంసార తాపము తొలగుటకు అష్టాంగ యోగ ములు చేప్పెదను బ్రహ్మను సాక్షాత్క రింప చేయునది జ్ఞానము. ఏకాగ్ర చిత్తత్వము యోగము చిత్తవృత్తులను నిరోధించుట కూడ యోగము. జీవాత్మయందును, పరమాత్మయందును, చిత్తమును స్థాపించుట ఉత్తమయోగము. అహింసా సత్య, అస్తేయు బ్రహ్మచర్య, అపరి గ్రహములు ఐదు యమనులు. యనుములు కూడ ఐదు భుక్తిముక్తి ప్రదముల శాచ, సంతోష - తపస్ - స్వాధ్వాయ, ఈశ్వర పూజనములు నియమములు. ప్రాణులకు పీడ కల్గించకుండుట అహింస, ఇది ఉత్తమ ధర్మము. మార్గమున నడుచు అందరి అడుగును ఏనుగు అడుగులో ఇమిడిపోయినట్లు అన్ని ధర్మములును అహింసలో ఇమిడిపోవును ఇతరులకు. ఉద్వేగ మును కల్గించుట సంతాపము కల్గించుట రోగము కల్గించుట వాని శరీర మ మండి రక్తము బయటకు వచ్చువట్లు చేయుట, చాడీలు చెప్పుట, ఇతరుల హితమునకు అడ్డుతగులుట, వారి రహస్యములను బయట పెట్టుట, వారికి సుఖము లేకుండ చేయుట ఆకారణముగ బంధించుట, చంపుట అని హింస పది విధములు. అట్లు చేయకుండుట అహింస, ప్రాణులకు ఆత్వంతపాతమైన వాక్కు సత్యము. సత్యము పలుక వలెను. ప్రియము పలుక వలెను. సత్యమైనను అప్రియము చెప్పరాదు. (ప్రియమైనను ఆపత్యము చెప్పరాదు. ఇది సనాతన ధర్మము, మైథునమున పరిత్యజించుట బ్రహ్మ చర్యము - స్మరణము, కీర్తనము, పిహరించుట, చూచుట, రహస్యముగా మాటలాడుట పొందవలెనన, సంకల్పము అందుకు ప్రయత్నము ఆడి సిద్దించుట అని మైథునము ఎనిమిది విధములు. బ్రహ్మచర్యము సమస్త క్రియలకును మూలము. అదీలేని క్రియలు వ్యర్థము. వయోవృద్ధులు తపోవృద్ధులు యైన వశిష్టుడు, చంద్రుడు, దేవాచార్యుడైన, గురుడు, శుక్రుడు, పితామహుడు కూడ శ్రీలచే మోహింపబడిరి. సుర బెల్లముతో చేసినది పిండితో చేసినది. మధువుతో చేసినది అని, మూడు విధములు. ఈ జగత్తు వంతను మోహింపచేయు స్త్రీ యనుసుర నాలుగవది. స్త్రీని చూచి మత్తుచెందును. సురను త్రాగిన తరువాతనే మత్తుచేందుకు ఈ విధముగ చూచినంత మాత్రమునకే మత్తునిచ్చు స్త్రీని చూడకూడదు. పరద్రవ్యము ఏమాత్రమైనను, బలాత్కారముగ అపహరించిన వాడును, హోమము చేయుహవిస్సును తిన్న వాడును తప్పక తిర్యగ్ జంతువై పుట్టును. కౌపీనమును ఆచ్చాదిచు టకు వస్త్రమును శిత నివారణార్థమై బొంతను పాదుకలను సంగ్రహించుకొనవలెను. మరి దేవిని సంగ్రహించకూడదు. దేహ స్థితి నిమిత్తమగు వస్త్రాదులను పరిగ్రహించవచ్చును. శరము ధర్మ యుక్తముగ ప్రయత్న పూర్వకముగ రక్షింపదగినది. శాచము బాహ్యము అభ్యంతరమని రెండు విధములు. మృత్ జలములతో చేయు శాచము బాహ్యము. భావశుద్ధి ఆంతరము. ఈ రెండు విధముల శౌచమున్న వాడే శుచియైన వాడు, ఇతరుడు కాడు.

యథాకథం చిత్ప్రాప్త్యాచ సంతోషస్తుష్టిరుచ్యతే

మనసశ్చేంద్రియాణాంచ ఐకాగ్య్రం తప ఉచ్యతే.

తజ్జయః సర్వధర్మేభ్యః సధర్మపర ఉచ్యతే

వాచికం మంత్రజప్యాది మానసం రాగవర్ణనమ్.

శారీరం దేవపూజాది సర్వదంతు త్రిధాతపః

ప్రణవాద్యా స్తతో వేదాః ప్రణవే పర్యవస్థితాః.

వాఙ్మయః ప్రణవః సర్వం తస్మాత్ప్రణవమభ్యసేత్

ఆకారశ్చతథోకారో మకారశ్చార్దమాత్రయా.

తిస్రోమాత్రాస్త్రయో వేదాలోకా భూరాదయో గుణాః

జాగత్స్వప్నః సుషుప్తిశ్చ బ్రహ్మ విష్ణుమహేశ్వరాః.

ప్రద్యుమ్నః శ్రీవాసుదేవః సర్వమోంకారకః క్రమాత్

ఆమాత్రో నష్టమాత్రశ్చ ద్వైతస్యా పగమః శివ.

 ఓంకారో విదితో యేన సమునిర్నే తరోమునిః

చతుర్థీ మాత్రా గాంధారీ ప్రయుక్తా మూర్ద్ని లక్ష్యతే.

తత్తురీయం పరంబ్రహ్మ జ్యోతిర్ధీపో ఘటేయథా

తథా హృత్పద్మ నిలయం ధ్యాయేన్నిత్యం జ పేన్నరః.

ప్రణవో ధనుః శరోహ్యత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే

అప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్.

ఏతదేకాక్షరం బ్రహ్మ ఏతదేకాక్షరం పరమ్

ఏ తదేకాక్షరం జ్ఞాత్వా యోయదిచ్ఛతి తస్యతత్.

ఛందోఽస్య దేవీ గాయత్రీ అంతర్యామీ ఋషిః స్మృతః

దేవతా పరమాత్మాస్య నియోగో భుక్తిముక్తయే.

భూరగ్న్యాత్మనే హృదయం భువః ప్రాజాపత్యాత్మనే

శిరః స్వః సూర్యాత్మనే చ శిఖాకవచ ముచ్యతే.

ఓం భూర్భువః స్వః కవచం సత్యాత్మనే తతో ఽస్త్రకమ్

విన్యస్య పూజయే ద్విష్ణుం జపేద్వై భు క్తిము క్తయే.

జుహుయాచ్చ తిలాజ్యాది సర్వం సంపద్యతేనరే

యస్తు ద్వాదశ సాహస్రం జపమన్వహ మాచరేత్.

 తస్య ద్వాదశ బీర్మాసైః పరం బ్రహ్మ ప్రకాశ తే

ఆణిమాది కోటి జప్యాల్లక్షాత్సార స్వతాదికమ్.

వైదిక స్తాంత్రికో మిశ్రో విష్ణోర్వెత్రివిధోమఖః

 త్రయాణామీప్సితే నైక విధినా హరిమర్చయేత్.

ప్రణమ్య దండవద్భూమౌ నమస్కా రేణ యోఽర్చయేత్

సయాం గతి మవాప్నోతి న తాం క్రతు శతై రపి.

యస్యదేవే పరాభ క్తిర్యథా దేవేతథాగురౌ

 తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యమనియమ నిరూపణం నామ ద్విస ప్తత్యధిక త్రిశతతమోఽధ్యాయః.

లభించిన దానితో ఆనందించుట తుష్టి. మనస్సును, ఇంద్రియము నిను, ఏకాగ్రముగ నుంచుట తపస్సు. ఇంద్రియ మనస్సులను జయించుట అన్నిధర్మముల కంటెను ఉత్తమమైన ధర్మము. మంత్రజపాకము వాచిక తపస్సు. వైరాగ్యమం మానస తపస్సు. దేవపూజాదికము శారీర తపస్సు. ఈత్రివిధ తపస్సు సర్వవః ప్రదము. వేదములు ప్రణవముతో ప్రారంభ మైనవి. ప్రణవమునందే వాటిస్థితి. వాజ్మయమంతయు ప్రణవరూపము. అందువలన ప్రవణవము నభ్యసించ వలెను. ప్రణవ మున ఆకార - ఉకార - అర్ధ మాత్రమకారములున్నవి. ఈ మూడు మాత్రలు మూడు వేదములు మూడు భూరాది లోక ములు మూడు. గుణములని మూడు. జాగత్స్వప్న సుషుప్తి అవస్థలు, బ్రహ్మ విష్ణు, మహేశ్వరులను మూడు మూర్తులు. ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు సర్వము ఓకారమే. “ఓం”కారము ఆమాత్రము లేదా నష్టమాత్రము. ఇది ద్వైతవినాక రూపమగు శివము. ఓంకారము తెలిసినవాడే ముని ఇతరుడు కాడు. ఓంకారము యొక్క నాల్గవ మాత్ర గాంధారి. ఆది ప్రయుక్తమైనపుడు మూర్ధస్థానమున లక్షింపబడను. అదియే తురీయమైన పరబ్రహ్మ జ్యోతి. కటముకోనున్న దీపమువలే, హృత్పద్మమునందున్న ఆజ్యోతిని వరుడు నిత్యము జపించవలెను. ప్రణవమే ధనస్సు. ఆత్మ ప్రాణము. బ్రహ్మ లక్ష్యము సాధకుడు తన్మయుడై ఆపషత్తు డై శరముతో కొట్టినట్లు దానిని కొట్టవలెను. ఈ ఏకాక్షరమే బ్రహ్మ. ఈ యక్షర మే పరతత్త్వము. ఈ ఏకాక్షర బ్రహ్మ తెలిసినవాడు దేనిని కోరునో అది లభించును. ఈ ఓంకారమునకు గాయత్రి ఛందస్సు. ఆంతర్యామి ఋషి. పరమాత్మ దేవతా. భుక్తిముక్తులపై వినియోగించవలెను. “ఓ” భూః ఆగ్న్యాత్మనే హృదయాయనమః” భువః ప్రాజాపత్యాత్మ నే శిర సేస్వాహా” “ఓం స్వః సూర్యాత్మనే, శిఖాయై వషట్” ఓం భూర్భువ స్స్వః” సత్యాత్మనే కవచాయ హుం” ఆనియు తరువాత అస్త్రమును విన్యసించి, విష్ణువును పూజించి, భుక్తిముక్త్యర్థమై తన్నామ జపము చేయ వలయును. తిల ఆజ్యాదు ను హోమము చేయవలెను. సర్వము లభించును. ప్రతీదినము పండేండు వేలు ప్రణవజపము చేయువానికి పన్నెండు మాసములలో పర బ్రహ్మ జ్ఞానోదయము కలుగును. కోటిజపము చేసినచో ఆణిమాదులు సిద్ధించును. లక్షజపముచే సరస్వత్యాదుల అనుగ్రహము కలుగును. వైదికము, తాంత్రికము, మిశ్రము, ఆని విష్ణుపూజ మూడు విద ము. వీటిలో ఇష్టమైన విధిని ఆశ్రయించి విష్ణువును పూజించవలెను. భూమి పై దండమువలే పడి విష్ణువునకు నమస్కరించు టచే కలుగు సద్గతి వందక్రతువులచే గూడ కలదు. ఎవనికి ఆరాధ్య దేవతయందు ఉత్తమ భక్తి యుండునో గురువు యఁదు గూడ ఆరాధ్య దేవత యండువున్నంత భక్తి యుండునో అతనికే ఈ చెప్పిన విషయములు స్పష్టముగ అవగతము అగును.

ఆగ్ని మహాపురాణమున యమనియమ నిరూపణమను మూడు వందల డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.