నారద ఉవాచః-
సామాన్యపూజాం విష్ణ్వాదేర్వక్ష్యే మన్రాంశ్చ సర్వదాన్।
సమస్త పరివారాయ అచ్యుతాయ నమో యజేత్.
నారదుడు పలికెను. విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను సకల పరివార సమేతు డైన ఆబ్యుతునికి నమస్కరించి పూజించవలెను.
ధాత్రే విధాత్రే గఙ్ఞాయ యమునాయ నిధీ తథా।
ద్వార శ్రియం వాస్తునరం శక్తిం కూర్మమనన కమ్.
పృధ్వీం ధర్మకం జ్ఞానం వైరాగ్యైశ్వర్యమేవ చ।
ఆధర్మాదీన్ కనాలపద్మ కేసర కర్షికాః.
ఋగ్వేదాద్యం కృతాద్యం చ సత్ర్వాద్యరాదిమణ్డలమ్ ।
విమలోత్కర్షిణీ జ్ఞానాక్రియాయోగా చ లా యజేత్.
ప్రహ్వే సత్యా తథేశాచానుగ్రహాఒమలమూర్తి కా।
దుర్గాం గిరం గణం త్రం వాసుదేవాదికం యజేత్.
హృదయం చ శిర శ్బూడాం వర్మ నేత్రమథాస్త్రహమ్।
శజ్ఖం చక్రం గదాం పద్మం శ్రీవత్సం కౌస్తుభం యజేత్.
వనమాలాం శియం పుష్టిం గరుడు గురుమర్చయేత్ ।
ఇంద్రమగ్నిం యమం రక్ష జలం వాయుం ధనేశ్వరమ్.
ఈశానం తమజం చాస్త్రం వాహనం కుము దాదికమ్।
విష్వక్సేనం మణ్డలాదౌ శిద్దిః పూజాదినా భవేత్.
విష్ణుపూజాంగముగ ద్వార దక్షిణ భాగమున ధాతను, విధాతను, వామభాగమున గంగను యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తు పురుమని, శక్తిని, కూర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్య మును, ఐశ్వర్యమును, ఆధర్మాదులను, పద్మభావన చేసి దాని కందము ను, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్యభాగము ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సల్వాగుణ ములను, సూర్యాచి మండలములను పూజిచ వలెను. విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను. ప్రహ్వ, సత్య, ఈశ , అను గ్రహి, అమలమూర్తి యగు దుర్గ, గిరే), గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను. హృదయమును, శిరస్సును, కేశ శిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును. చక్రమును గదను. పద్మమును, శ్రీవత్సమును. కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని పుషిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, ఆగ్ని ని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను. అస్త్రమును, వాహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింపవలేను. ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును.
శివపూజాథ సామున్యా పూర్వం నందిన మర్చయేత్।
మహా కాలం యజేద్గజ్ఞాం యమునాం చ గణాదికమ్.
గిరం శ్రియం గురుం వాస్తుం శ క్త్వాదీన్ ధర్మకాదికమ్।
ఇపుడు సానూన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గిర్దేవిని, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శ క్త్యాదులను, ధర్మాదులను పూజించ వలెను.
వామా జ్యేష్టా తథా రౌద్రీ కాలీ కలవికరిణీ,
బలవిక రిణీ చాపి బలప్రమధినీ క్రమాత్।
సర్వభూతదయనీ చ తథా మనోన్మనీ శివా.
వామ, జ్యేష్ట, రౌద్రి, కాలి, క ల వికరిణి, బలవిక రిణి, బలప్రమథని, నర్వభూతద మని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శకులను పూజింపవలెను.
హాంహూంహాం శివమూర్త యే సాజవస్త్రం శివం యజేత్ ।
హౌం శివాయ హౌమిత్యాది హామీశానవక్త్రకమ్.
హ్రీం గౌరీం గం గణః శక్రముఖాస్చణ్ణహృదాదికాః ।
క్రమాత్సూర్యార్చనే మంత్రా దణ్డిపూజ్యశ్చ పిజ్జలః.
“హాం, హూం. హాం శివమూర్తయే నమః” ఆరు మంత్రముతో ఆయా అవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. “హౌం శివాయ హో,” అని శివుని, 'సం' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. “హీం” అను బీజాక్షరముతో గౌరిని. “గం' అను బీజాక్షరముతో గణమును గణాధిపతిని పూజింప వలైను. ఇంద్రుడు మొదలగు వారిని చండునీ, హృదయము మొదలగు వాటిని క మముగ పూజించవలెను. ఇపుడు సూర్యార్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను.
ఉచ్చైశ్రవాశ్చారుణశ్చ ప్రభూతం విమలం యజేత్ ।
సోమసన్గ్యా ఒవసుణం స్కన్దాద్యం మధ్యతో యజేత్.
ఉచ్చైః శ్రవస్సును, ఆరుణుని పూజించి ప్రభూతుని, విదులు.ని, సోముని, సంధ్యలను,వర సుఖుని, నందాదులను మధ్యయందు పూజింపవలెను.
దీప్తా సూక్ష్మా జయా భద్రా విభూతిర్విమలా తథా!
ఆమోఘా విద్యుతా చైవ పూజ్యాథో సర్వతోముఖీ.
దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, వీభూతి, విమలా, ఆ మోమా, విద్యుతా, సర్వతోముఖీ అను నవశ క్తులను పూజింప వలెను.
ఆర్కాసనం హి హం ఖం ఖం సోల్కాయేతి చ మూర్తి కామ్ ।
హ్రం హ్రీం సః సూర్యాయ నమ ఆం నమో హృదయాయ చ.
“హం” “అం” “ఖం” అను బీజాక్షరముల చే ఆరాసనము ను “స్కో యనమః అని మూర్తి ని “హాం హీం సః సూర్యాయ నమః” అని సూర్యుని, “ఆం నమో హృదయాయ” అని హృదయ మును పూజింపవలెను.
అర్కాయ శిర సే తద్వతగ్నేశాసురవాయుగాన్।
భూర్భువఃన్వర్ జ్వాలిని శిఖా హుం కవచమ్ స్మృతమ్.
భాం నేత్రం హస్త ధాదాస్త్రం రాజ్ఞి శక్తి శ్చ నిష్కథా।
సోమో జ్గారకోథ జీవః శుక్ర శనిః క్రమాత్.
రాహు కేతు స్తేజశ్చజ్ఞః సం షేపాదథ పూజనమ్ ।
ఆసనం మూర్త యో మూలం హృదాద్యం పరిచారక
విష్ణ్వాసనం విష్ణుమూర్తే రాం శ్రీం శ్రీం శ్రీధరో హరిః ।
హీం సర్వమూర్తి మనోయమితి త్రైలోక్యమోహనః.
క్లీం హృషీ కేశ హూం విష్ణుః సర్వైర్దీర్ఘైర్హృదాదికమ్ ।
సమస్తైః పఇ్చమీ పూజా సజ్గ్రామాదౌ జయాదిదా
“ఓం ఆర్కాయా నమః అని శిరస్సును పూజించవలెను. అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్టించి యున్న సూర్యుని పూజింపవలెను. “భూః “ “భువః స్వః జ్వాలనై శిఖాయెన మః అని శిఖయు. “హు” అని కవచ మును “భాం” అని నేతములను, హః, అని ఆరాసమును పూజించవలెను. రాజీయను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగు ఛాయా దేవిని పూజించవలెను. పిమ్మట సోమ - అంగారక - బుధ, గురు - శుక్ర - శని - రాహు - కేతువులను, తేజశ్చండుని పూజించవలెను. పిమ్మట సం షేపముగ పూజ చెప్పబడు చున్నది. ఆసనము, మార్తులు, మూలము, హృదయాదులు. పరిచార కులు. వీరి పూజ చేయవలెను. విష్ణ్వాసనమును పూజించవలెను. విష్ణువు యొక్క మూరి నీ పూజింపవలెను. “రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః” అనే మంత్రము. “పాం” అనునది సర్వ మూర్తులకు సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. “క్లీం” హృషీ హేళాయ నమః” “హూం విష్ణవే నమః” అను మంత్రము లుచ్చరించవలెను అని ధీర స్వరముల చే హృదయాదిక మును పూజించవలెను ఈ పంచమ పూజ యుద్ధాదు లలో జయము నిచ్చును.
చక్రం గదాం క్రమాచ్చజ్ఖం ముసలం ఖడ్గశార్షకమ్ ।
పాశాఙ్కుశా చ శ్రీవత్సం కౌస్తుభం వనమాలయా.
శ్రీం శ్రీర్మహాలక్ష్మీ స్తార్క్ష్యో గురురినాదయోర్చనమ్ ।
చక్ర - గదా - శంఖ - ముసల - ఖడ్గ - శార్ణ - పాత - అంకుశ - శ్రీవత్స - కౌస్తుభ - వనమాలలను పూజించవలెను. “శ్రీం” అను బీజాక్షర ముతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్యుని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను.
సరస్వత్యాసనం మూర్తిం రౌం హ్రీం దేవీ సరస్వతీ.
హృదాద్యా లక్ష్మీర్మేధా చ కలా తుష్టిశ్చ పుష్టి కా।
గౌరీ ప్రభావతీ దుర్గా గణో గురుశ్చ క్షేత్రపః
సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలేను. “రౌం హీం దేవ్యై సరస్వత్యై నమః” అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి, దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు - వీరినందరిని పూజించవలెను.
తథా గం గణపతయే చ హ్రీం గౌర్యై చ శ్రీం శ్రీయే।
హ్రీం త్వరితాయై ఐం క్లీం సౌం త్రిపురా చతుర్ధ్యనా నమోన కాః.
ప్రణవాద్యాశ్చ నామాద్యమక్షరం బిందుసంయుతమ్ ।
ఓం యుతా వా సర్వమన్తః పూజనాజ్ఞవతః స్మృతాః.
“గం గణపతయే నమః” “ హీం గౌర్యై నమః”, శ్రీం శ్రియై నమః”, “హీం త్వరితాయై నమః”, “ఏం క్లీం సౌం త్రిపురాయై నమః” అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలేను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను “ఓం” కారముతో ప్రారంభింపవలేను.
హోమాత్రి లఘృతాద్యైశ్చ ధర్మకామార్థ మోక్షదాః
పూజా మన్రాన్ పరేడ్యస్తు భుక్త భోగో దీవం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే విష్ణ్వాదిదేవసామాన్యపూజాకథనం నామ
ఏకవింశతిత మోధ్యాయః.
ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్దకామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగముల నన్ని యు అనుభవించి స్వర్గమునకు వెళ్ళను.
అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణమను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 21 of the Agni Purāṇa is as follows:
The twenty-first chapter describes the ritual procedure for the Indradhvaja festival — the erection and worship of a banner pole consecrated to Indra, the king of the gods. The choice of the pole's wood species (typically a śāla or khadira tree), its measurements, the mantras for felling and consecrating the wood, and the proper site for erection are detailed. The pole is identified with the cosmic axis (skambha), and its raising is a re-enactment of Indra's victory over Vṛtra and the restoration of cosmic order. Offerings of various foods, flowers, and incense to Indra and the eight dikpāla-s are prescribed. The festival's timing in the month of Bhādra is specified, and the merit accruing to the host and community — prosperity, protection from drought, and abundance — is celebrated.