అగ్ని మహా పురాణము

315 - అథ స్తంభనాది మంత్రాః

అగ్ని రువాచః

 స్తంభనం మోహనం వశ్యం విద్వేషోచ్చాట నంవదే

విష వ్యాధి మరోగంచ మారణం శమనం పునః.

భూర్జేకూర్మం సమాలిఖ్య తాడనేన షడంగులమ్

ముఖపాద చను ష్కేషుతతో మంత్రంన్య సేద్ ద్విజః.

చతుష్పాదేషు క్రీంకారం హ్రీంకారం ముఖమధ్యతః

గర్భేవిద్యాం తతోలిఖ్య సాధకం పృష్ఠతోలిఖేత్.

మాలామంత్రైస్తు సం వేష్ట్య ఇష్టకోపరి సంన్య సేత్

పిధాయ కూర్మపృష్ఠేన కరాలే నాభిసంపఠేత్.

మహాకూర్మం పూజయిత్వా పాదప్రోక్షస్తు నిక్ష పేత్

తాడయేద్వామ పాదేనస్మృత్వా శత్రుంచ సప్తధా.

తతః సంజాయతే శత్రోః స్తంభనం ముఖరాగతః

            అగ్నిదేవుడు పలికెను. ఇపుడు స్తంభనమోహన వశీకరణ, విద్వేషణ ఉచ్చాటన ప్రయోగములను విష వ్యాధి ఆరోగ్య మారణ కమన ప్రయోగములను చేప్పెదను. భూర్జ పత్రము పై ఆరు అంగుళముల కూర్మ చక్రమును తాడన ముతో వ్రాయవలెను. దాని వణఖ ముఖము నందును, పాదము లందును మంత్ర న్యాసము చేయవలెను. పాదములందు క్రీం, ముఖమునందు హీం, గర్భ స్థానమున త్వరితా విద్యను వ్రాసి పృష్ఠ భాగమువ సాధ్య నామము వ్రాయవలెను, మాలామంత్రములతో వేష్టితముచేసి ఆయంత్రమును ఇటుక పై స్థాపించి దానిని కప్పి కూర్మ పీఠము నందున్న కరాళ మంత్ర ముతో అభిమంత్రించవలెను. మహా కూర్మమును పూజించి శత్రువునుద్దేశించి చర్మోదకమును చిమ్మి శత్రువును స్మరించుచు వానిని ఏడు పర్యాయము ఎడమ పాదముతో తన్న వలెను. అపుడు శత్రువునకు ముఖ భాగ స్తంభనము కలుగును.

కృత్వాతు భైరవం రూపం మాలామంత్రం సమాలిఖేత్ .

ఓం శత్రుముఖ స్తంభనీ కామరూపా ఆరీడకరీ హ్రీం ఫేం

ఫేత్కారిణీ మమ శత్రూణాం దేవదత్తానాం ముఖం స్తంభయ స్తంభయ మమ సర్వవిద్వేషిణాం ముఖ స్తంభనం కురు కురు ఓం హ్రూం ఫేం ఫేత్కారిణి స్వాహా.

ఫట్ హేతుంచ సమాలిఖ్య తజ్జపాన్తం మహాబలమ్

వామేనైవ నగం శూలం సంలిఖేద్దక్షిణేకరే.

లిఖేన్మంత్ర మఘోరస్య సంగ్రామే స్తంభయేదరీన్

ఓం నమో భగవత్యై భగమాలిని విస్ఫుర విస్ఫుర సృన్ద స్పన్ద నిత్య క్లిన్నే

ద్రవ ద్రవ హూంసః క్రీంకారాక్షరే స్వాహా

 అనేన తిలకం కృత్వా రాజాదీనాం వశీకరమ్.

గర్ధభస్య రజోగృహ్య కుసుమం సూతకస్య చ.

నారీరజః క్షిపేద్రాత్రౌ శయ్యాదౌ ద్వేషకృద్భవేత్

గోఖురంచ తథాశృంగ మశ్వస్యచ ఖురంతథా.

శిరః సర్పస్య సంక్షిప్తం గృహేషచ్చాటనం భవేత్

కరవీర శిఫాపీతా సంసిద్దార్థా చ మారణే.

వ్యాల చుంచ్చున్దరీ రక్తం కరవీరం తదర్ధకృత్

సరటం షట్ పదం చాపి తథా కర్కట వృశ్చికమ్.

చూర్ణీకృత్యక్షి పేత్తైలే తదభ్యంగశ్చ కుష్ఠకృత్

            భైరవ మూర్తి వ్రాసి దాని నలు వైపుల “ఓం శత్రు ముఖ మొదలు, స్వాహా, వర కును వున్న మూలో క్త మంత్రమును వ్రాయవలెను. పిదప వట్ యనియు ప్రయోగోద్దేశ్యమును వ్రాసి ఆమంత్రమును జపించుచు, భైరవుని వామహస్తమున న మును దక్షిణ హస్తమున శూలమును వ్రాసి ఆ మోర మంత్రమును వ్రాయవలెను. దీని వలన యుద్ధమునందు శత్రువులు స్తంభితులగుదురు. “ఓంనమో భగవత్యై మొడలు స్వాహా వర కుమ వున్న మూలోక పుత్ర మును జపించుచు గోరోజనాదికముతో తిలకము ధరిం. నచో మానవుడు సమస్త జగత్తును మోహింపచేయును. “ఓం, ఫేం మొదలు స్వాహా వరకును వున్న మూలోక మంత్రముతో తిలకము ధరించినవాడు రాజాదులను వశము చేసుకొనుము. గర్గభధూళి తీసుకుని శవముపై వేసిన పువ్వులు శ్రీరజోయుక్త వస్త్రఖండము తీసుకొని రాత్రి శత్రువు శయ్యాదులపై విసరి నచో స్వజన విద్వేషము కలుగును. ఆవుడెక్క కొమ్మ గుర్రపుడెక్క, సర్ప శిరస్సు వాటిని నూరి కలిపి శత్రువు ఇంటిపై వేసినచో వారి ఉచ్చాటనము కలుగును. పచ్చని కరవీర శివ, మారణ ప్రయోగము నందు ఉపయుక్తమైనది. సర్పము, రక్తము, చుంచు రక్తము కరవీర బీజము, మారణ సాథకములు. చచ్చిన తొండ తుమ్మెద పీత, తేలు, వీటిని చూర్ణము చేసి తైలములో వేసి ఆ తైలమును శరీర మనకు పూసినచో కుష్టరోగము కలుగును.

ఓం నవగ్రహాయ సర్వ శత్రూన్మమసాధయఽసాధయ

మారయ మారయ ఆసోం ఆసోం మం ఋం చుం ఓం శంవాం కీం ఓం స్వాహా

అనేనార్క శతైరర్చ్య శ్మశానే తునిధాపయేత్.

భూర్జేవా ప్రతిమాయాంవా మారణాయ రిపోర్గ్రహాః

ఓ కుంజరీ బ్రహ్మాణీ ఓం మంజరీ మాహేశ్వరీ

ఓం వేతాళీ కౌమారీ ఓంకాలీ వైష్ణవీ ఓం అఘోరా

వారాహీ ఓం వేతాలీ ఇంద్రాణీ ఊర్వశీ ఓం వేలాళీ

చండికా ఓం జయానీ యక్షిణీ

నవమాతరో హేమమ శత్రుం గృహ్ణత.

గృహ్ణత భూర్జేనామ రిపోర్లిఖ్య శ్మశానే పూజితే మ్రియేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్తంభన మంత్ర నిరూపణం నామ పంచదశాధిక త్రిశతతమోఽధ్యాయః.

“ఓం నవగ్రహాయ” మొదలు స్వాహా వరకుమ వున్న మూలోక్త మంత్రమును భూర్ణ పత్రము పై కాని నవగ్రహ ప్రతిమపై గాని వ్రాసి నూరు జిల్లేడు పూవులతో పూజించి ఆ యంత్రమున శ్మశానమున పొతినచో గ్రహములు శత్రువును నశింపచేయుము. ఓం కుంజరీ" మొదలు గృష్ణత వరకునువున్న మూలోక్త మంత్రమును భూర్ణ పత్రము పై వ్రాసి శత్రు పదస్థానమున శత్రునామము వ్రాసి శ్మశానమునందు ఆయంత్రమును పూజించినచో శత్రువు నశించును.

ఆగ్ని మహాపురాణముచే స్తంభన మంత్ర నిరూపణమను మూడువందల పది హేనవ అధ్యాయమ సమాప్తము.