అగ్ని మహా పురాణము

55 - అథ పిణ్డికా లక్షణమ్.

శ్రీ భగవానువాచః-

అతఃషరప్ర వక్ష్యామి ప్రతిమానాం తు పిణ్డికామ్

 దై ర్ఘ్యేణ ప్రతిమాతుల్యా తదర్దేనతు విస్తృతా.

ఉచ్ఛితాయామతోర్ణేన సువిస్తారార్ధ భాగతః

తృతీయేన తుజాతుల్యాం తత్తా భాగేణ మేఖలామ్.

ఖాతంచ తత్సమాజంతు కిట్చిదుత్తరతో సతమ్

విస్తార స్య చతురేన ప్రణాలస్య వినిర్గమమ్.

మమమూలస్య విస్తార మ గే కుర్యాత్త దర్ధత.

విస్తారస్య తృతీయేన తోయమార్గంతు కారయేత్

పిండికార్ధేన వాతుల్యం దైర్ఘ్యమీశ స్య కీర్తితమ్

బిశంషా తుల్య దీర్ఘం చజ్ఞాత్వా సూత్రం ప్రకల్పయేత్ .

హయగ్రీవుడు చే.ప్పెను : బ్రహ్మదేవా! నే నివుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెడను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగ ముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంకముండవలెను. దాని మూడవవంతుచే మేఖల నిర్మింపవలెను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత మేఖల కొలతతో తుల్యముగా నుండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవవంతుతో జలము జైటకు పోవుటకై ప్రణాలము నిర్మించవలెను. మూలభాగమున దానివిస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయినకొలది సగమువలేను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవవంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమపొడవెంతయో అంతే. ఉండవలెనని చెప్పబడినది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగ ముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.

ఉచ్ఛ్రాయం పూర్వవతుర్వాద్బాగ షోడ శసంఖ్యయా

ఆధః షట్కం ద్విభాగంతు కణ్ఠే కుర్యాత్తి గకమ్.

శేషాస్థ్వే కైకశః కార్యాఃప్రతిష్ణా నిర్గమ స్తథా

పట్టికాపిండికా చేయం సామాన్య ప్రతిమాసు చ.

 ప్రాసాద ద్వార మానేన, ప్రతిమాధారముచ్యతే.

గజవ్యాలకసంయుక్తా ప్రభాస్యాత తిమాస్తు చ.

పిండి కాపి యథా శోభం కర్తవ్యాస తతం హరేః

సర్వేషా మేత దేవానాం విష్ణూక్తమానముచ్యతే.

దేవీనామపి సర్వాసాం లక్ష్మ్యుక్తం మానముచ్యతే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పిండికాది లక్షణం నామ పఞ్చచ పఞ్చాక తమోధ్యాయః.

వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశ భాగసంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిది భాగము. క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీని పైన నున్న మూడుభాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్కదానిని ప్రతిష్ట, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలేను. ఇది ప్రతిమపిండికలు సామాన్య లక్షణము. ప్రాసాదద్వార దైర్ఘ్యవిస్తారములనుపట్టి ప్రతిమాగృహద్వారముండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. శ్రీహరియొక్క పిండికను గూడ యథోచిత శోభాసంపన్న ముగ నుండునట్లు చేయవలెను. అన్ని దేవ ప్రతిమల ప్రమాణము విష్ణు  ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె నుండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీప్రతిమను చెప్పిన విధముననే ఉండవలెను.

శ్రీ అగ్నిమహాపురాణము నందు పిండికాది లక్షణమను ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.