అగ్ని మహా పురాణము

165 - అథ నానాధర్మనీరూపణమ్

ఆగ్ని రువాచః-

ధ్యేయ ఆత్మా స్థితో యోనీ హృదయే దీపవత్ర్పభుః

 ఆనన్య విషయం కృత్వా మనోబుద్ధిస్మృతిశ్రియమ్.

శ్రాద్ధం తు ధ్యాయినే దేయం గవ్యం దధి ఘృతం పయః

ప్రియంగవో మసూరశ్చ వార్తాకు కోద్రవో స హి..

 సైంహి కేయో యదా సూర్యం గ్రసతే పర్వసన్టీషు

హస్తి చ్ఛాయా తు సా జ్ఞేయా శ్రాద్దదానాది కేఒక్షయా.

వైతే చైవ యదా సోమో హంసే చైవ క రే స్థితే

తిథిర్వైవస్వతీ నామ సా ఛాయా కుడ్డురస్య తు.

అగ్నౌకరణ శేషం తు న దద్యాద్వైశ్వదైవికే

 అగ్న్యభావే తు విప్రస్య హస్తే దద్యాత్తు దక్షిణే.

న శ్రీదుష్యతి జారేణ న విప్రో, వేదకర్మణా

 బలాత్కారోపభుక్తా చేద్వైహ స్తగతాపి వా.

సన్యజేద్దూషితాం నారీమృతుకాలేన శుధ్యతి

పూర్వం శ్రియః సురై ర్భుక్తాః సోమగన్షర్వవహ్ని భిః.

 భుజ్జతే మానుషాః పశ్చాన్నైతా దుష్య ని కేన చిత్

అసవర్ణేన యో గర్భః శ్రీణాం యోనౌ నిషిచ్యతే.

అశుద్దా తు భవేన్నారీ యావచ్ఛల్యం నమ్చుతి

నిఃసృతే తు తతః శల్యే రజసా శుద్ద్యతే తతః.

అగ్నిదేవుడు చెప్పెను : సర్వశక్తు డైన ఏపరమాత్మ హృదయమునందు దీపము వలె ప్రకాశించుచున్నాడో ఆ పరమాత్మను అన్యవిషయముల సంబంధము లేని మనో బుద్ధి-స్మృతులతో ధ్యానించవలెను. ఆట్లు ధ్యానము చేయు బ్రాహ్మణునకే ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగు పదార్థములను శ్రాద్దమ నిమిత్తము దానము చేయవలెను. ప్రియంగు మసూరము, వంకాయ, కొజ్జలు మాత్రము వడ్డించగూడరు. పర్వసంధులందు రాహువు సూర్యుని గ్రసించునపుడు అది “హ స్తిచ్చాయాయోగము.” అపుడు చేసిన శ్రాద్ధకర్మయు, శుభకర్మలును అక్షయ్యము లగును. చంద్రుడు మఘా-హస్త నక్షత్రములం దున్న పుడు ఆది “వైవస్వతీతిథి” ఆది కూడ “హ స్తిచ్చాయాయోగ మే”. బలివైశ్వదేవము చేయగా మిగిలిన అన్నము బలి వైశ్వదేవమండలమునందు ఉంచరాదు. అగ్ని లేనిచో దానిని బ్రాహ్మణుని కుడి చేతిలో హోమము చేయవలెను. వేదోక్తకర్మ చేయకపోవుటచే బ్రాహ్మణుడును, వ్యభిచారి పురుషునిచే శ్రీయు దూషితులు కారు. బలాత్కారముచే భోగింప బడిన స్త్రీని, శత్రువులకు వశ మైన స్త్రీని ఋకుకాలపర్యంతము పరిత్యజించవలెను. ఋతుదర్శనానంతరము ఆమె శుద్ధురా లగును. స్త్రీలు ముందుగ సోముడు, గంధర్వుడు, వహ్ని అను దేవతలచేత అనుభవింపబడుదురు. మనుష్యులు వీరిని తరువాత అనభవింతురు. ఆందుచే వీరు ఎవని చేతను దూషింపబడరు. అసవర్ణుడై నవానిచే శ్రీయోనియందు గర్భము ఉంచబడినచో ఆ స్త్రీ గర్భము లోపల నున్నంతవరకును ఆశుద్ధురాలు. ఆ గర్భము బైటకు వెడలినతరువాత రజస్సుచే శుద్ధురా లగును.

య ఆత్మవ్యతిరే కేణ ద్వితీయం నాత్ర వశ్యతి

బ్రహ్మభూతః స ఏవేహ యోగీ చాత్మరతోమలః.

 విషయేన్టియసంయో గాల్కే చిద్యోగం వద ని వై

ధర్మో ధర్మ బుద్ధ్యా తు గృహీత సైరపడ్డితైః.

 ఆత్మనో మనసశ్చైవ సంయోగం చ తథాపరే

వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రప్లే పరమాత్మని.

 ఏకీకృత్య విముచేత బనాద్యోగోయము త్తమః

కుటుమ్బైః పశ్చాభిర్గామ షష్ణస్తత్ర మహత్తరః.

 చేవాసురమను ష్యైర్వా సజేతుం నైవ శక్యతే

 బహిర్ముఖాని సర్వాణి కృత్వా చాభిముఖాని వై.

 మన సేవేన్దియ గ్రామం మనశ్చాత్మని యోజయేత్

సర్వభావవినిర్ముకః క్షేత్రజ్ఞం బ్రహ్మణి న్య సేత్.

 ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషోన్యో గస్థవిస్తర

యన్నా స్త్రీ సర్వలోకస్య తద సీతి నిరుధ్యతే.

 కశ్యమానం తథా న్యస్య హృదయేనావతిష్ఠతే

అసం వేడ్యం హి తద్బహ్మ కు పూరీశ్రీసుఖం యథా.

అయోగినై వ జానాతి జాత్యశో హి ఘటం యథా

సన్న్యసనం ద్విజం దృష్ట్వా స్థానాచ్చలతి భాస్కరః.

 ఏష చే మణలం భిత్త్వా పరం బ్రహ్మాధిగచ్ఛతి

 ఉపవాస వ్రతం చైవ స్నానం తీర్థం ఫలం తపః.

 ద్వీజసమ్పాదనం చైవ సంపన్నం తస్య తత్ఫలమ్

 ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామః పరం తపః

సావిత్ర్యాస్తు పరం నాస్తి పావనం పరమం స్మృతమ్

ధ్యానేన సదృశం నా స్త్రీ శోధనం పాపకర్మణామ్.

శ్వపాకేష్వపి భుజానో ధ్యానేన హి విశుధ్యతి

ఆత్మా ధ్యాతా మనో ధ్యానం ధ్యేయో విష్ణుః ఫలం హరిః.

అక్షయాయ యః శ్రాద్దే పంక్తి పావనపావనః

ఆత్మకంటే భిన్న మైస రెండవ వస్తువును చూడని వాడే బ్రహ్మభూతుడైన, ఆత్మరతు డైన నిర్మలుడైన యోగి. విషయములతో ఇంద్రియముల సంయోగ మే యోగ మని కొండ రందురు. ఆపండితు లైన వారు అధర్మమును ధర్మ మని సంగ్రహించుచున్నారు. ఆత్మ మనఃసంయోగము యోగ మని మరి కొంద రంగురు, మనస్సును వృత్తి హీనముగ చేసి, క్షేత్రజు డైన పరమాత్మునియందు ఏకము చేసి, బంధవిముక్తు డగును. ఇది ఉత్తమ మైన యోగము. ఐదు ఇంద్రియములనెడు కుటుంబములతో గ్రామ మేర్పడినది. అందు ఆరవ దగు మనస్సు చాల శ్రేష్టమైనది. ఆ మనస్సు దేవాసురమనుష్యులచేత గూడ జయింప శక్యము కానిది. బహిర్ముఖము లగు ఆన్ని ఇ:ద్రియమణలను అంతర్ముఖములుగ చేసి, మనస్సునందు నిలపవలెను. మనస్సును ఆత్మయందు నిలుపవలేను. సర్వభావశూన్యు డగు జీవుని బ్రహ్మయందు నిలుపవలేను. ఇదియేసము; ఇదియే ధ్యాసము. ఇంక ఏమి చెప్పినను గ్రంథవిస్తర మే. సకలలోకుల దృష్టిలో ఏది లేదో ఆది (బ్రహ్మ) ఉన్న డని చెప్పి తద్భిన్నము ని షేధింపబడు చున్నది. ఈ విధముగా చెప్పిన విషయము ఇతరుని హృదయమునందు నిలువదు. బాలికకు శ్రీసుఖము ఎట్లు అనుభవగోచరము కాదో అట్లే ఆ బ్రహ్మ తేయశ క్యము కాదు. పుట్టుకతో గ్రుడ్డి వాడు ఘటమనగా ఏదో ఎట్లు తెలుసుకొసజాలడో అట్లే యోగి కాని వాడు బ్రహ్మను తెలుసుకో జాలరు. బ్రాహ్మణుడు సన్యసించుట జూచి ఈతడు నామండమును భేదించుకొని పర బ్రహ్మను పొంగును అని భాస్కరుడు చలించును. సంన్యాసికి ఉపవాసవ్రతము, స్నానము, తీర్థము, ఫలము, తపస్సు, డ్వేజసంపానము ఇవన్నియు జ్ఞానికి జ్ఞానవల ఈపమాన సంపన్నము లగును. ఏకాక్షర (ఓంకార) రూప మైనది. ప్రాణాయామమే గొప్ప తపస్సు. సావిత్రికంటే పర మపావనమం మరొకటి గేదు. పాపకర్మలమ శశింపచేయుటకు ధ్యానసదృశో మైనది మాకటి లేదు. శ్వపాచలశ్రీమదగ్ని మహాపురాణమా ఇంటి భోజనము చేసినవారు కూడ ధ్యానముచే శుద్దుడగును. ఆత్మ ధ్యానము చేయువాడు. మనస్సుధ్యాన సాధనము. ధ్యానింపదగినవాడు విష్ణువు. ఫలము కూడ ఎష్ణువే. శ్రాద్ధ ముసుగు పం కీపావను తెన యతి అక్షయఫలము నిచ్చును.

ఆరూఢ నైష్ఠికం ధర్మం యస్తు ప్రచ్యవతే ద్విజః.

ప్రాయశ్చిత్తం న పశ్యామి యేన శుద్యేత్స ఆత్మహా

యే చ ప్రవజితాః పత్యాం యా చైషాం బీజసంతతిః.

బిన్గులా నామ చణాలా జాయనే నాత్ర సంశయః

శతకో మియతే గృఢః శ్వాసౌ ద్వాదశికిస్త థా.

భాసో వింశతివర్షాణి సూక రో దశ భిస్త థా

ఆపుష్పో విఫలో వృకో జాయతే కజ్జికావృతః.

తతో దావాగ్ని దగ్గస్తు స్థాణుర్భవతి సానుగః

తతో వర్షశ తాన్యష్టా ద్వే చ తిషత్యచేతను.

పూర్ణే వర్ష సహసే తు జాయతే బ్రహ్మరాక్షసః

 ప్లవేన లభతే మోక్షం కులస్యోత్పాదనేన.

యోగమేవ ని షేవేత నాన్యం మన మఘాపహమ్.

ఇత్యాది పురాణే ఆగ్నేయే నానాధర్మో నామ పఞ్చషష్ట్యధిక శతతమోధ్యాయః.

నైష్ఠికధర్మమును (సంన్యాసాశ్రమమును) అధిరోహించి అచటినుండి పతితు డైన ఆత్మఘాతుకు డైన బ్రాహ్మణు నకు శుద్ధిని కలిగించు ప్రాయశ్చిత్తము లేదు. ఈ విధముగా ఆరూఢపతితులైన సంన్యసించినవారును, వారి భార్యయందు జనించిన సంతతియు, బిందులు లను చంశాలులుగా జనిఁతురు. సంశయము లేదు. అట్టి సంన్యాసి నూరు వత్సరముల ఆయుర్దాయము గల గృధ్రముగా పుట్టి మరణించును. పిదప పండ్రెండు సంవత్సరముల ఆయుపు గు శునకముగాను, పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువు గల భాసపక్షిగాను, పది సంవత్సరములు సూకరముగాను, పినప పుష్పఫలరహిత మగు ముండ్ల చెట్టుగాను ఉండును. పిదప దావాగ్ని దగ్గుడై తన సహచరులతో గూడ డగును. పిదప వేయి సంవత్సరములు చైతన్యరహితుడుగు పడియుండును. వర్షసహస్రము నిండిన పిదప బ్రహ్మ రాక్షసుడగును. తారకమగు యోగ ము చేతగాని, కులమును నశింపచేయు: చేతగాని మోక్షమును పొందును. అందుచే యోగహనే సేవించవలేను. పాపవినాశక మగు ఏ యితర మంత్రమును సేవించినను ప్రయోజనము లేదు.

ఆగ్ని మహా పురాణమునందు నానాధర్మవర్ణనమను నూట అరువదియైనన ఆధ్యాయము సమాప్తము.