అగ్ని మహా పురాణము

57 - అథ కుంభాధి వాసవిధి

శ్రీ భగవానువాచః-

భూమేః పరిగ్రహం కుర్యాత్తి పేద్వీపాంశ్చ సర్వపాన్

 నారసిం హేన రక్షో నోక్షయేత్ప్చఞ్చ గవ్యతః.

భూమిం ఘటేతు సంపూజ్య సరత్నే సాంగకం హరిమ్

అస్త్రమ శ్రేణకరకం తత్ర చాష్టశతం యజేత్.

అచ్చిన్న ధారయా సీజన్ వీహీన్ సంస్కృత్యధారయేత్

ప్రదక్షిణం పరిభ్రామ్య కలశం వికిరోపరి.

సవస్తే కల భూయః పూజయేద చ్యుతం శ్రియమ్

యోగేయోగేతిమ నేనః న్య సేచ్చయ్యాంతు మణలే.

 కుశోపరి తూలికాచ శయ్యాయాం దిగ్విదికుచ

విద్యాధి పాన్  యజేద్విష్ణుం మధువాతంత్రివిక్రమమ్.

వామనం దిక్షువాయ్వాదౌ శ్రీధరర చహృషీవకమ్

పద్మనాభం దామోదర మేశాన్యాం స్నానమణ పే.

అభ్యర్య పశ్చాదై శాన్యాం చతుషమే సవేదికం

స్నానమజ్ఞ ప కేసర్వద్రవ్యాణ్యానీయ నిక్షి పేత్.

స్నానకుమ్భేషు కుంభాంస్తాంశ్చతుర్ధిష్వధి వాసయేత్

కలశాః స్థాపనీయాస్తు అభి షేకార్థ మాదరాత్.

వడోదుమ్బర కాశ్వత్థాంశ్చమ్పకా శోక శ్రీద్రుమాన్

 పలాశార్జున ప్లక్షాంస్తు కదంబబకులామకాన్.

పల్లవాంస్తు సమానీయ పూర్వరమే వినిష్ సేత్

పద్మకంరోచనాం దూర్వం దర్భ పిల్లగాల మేవచ.

జాతీపుష్పం కుగ్గపుష్పం చన్దనం రక్తచన్దనమ్

సిద్దార్థం తగరం చైవ తణ్డులందక్షిణే న్యసేత్

సువర్ణం రజతంచైవ కూలద్వయచువాదం తథా

సద్యః సముద్రగామిన్యా విశేషాజ్ఞాహ్నవీ మృదమ్.

గోమయం చయవాఞ్జా తీం స్తిలాంశ్చైవా పరేన్య సేత్

హయగ్రీవుడు చెప్పెను: దేవతాప్రతిష్టా పూజల కొరకై గ్రహించిన భూమి పై నార సింహ మంత్రము చదువుచు రాక్షసులను తొలగించు అక్షతలు, ఆవాలు, పంచగవ్యములు చల్లవలెను. రత్నయుక్తమగు కలశ పై అంగ దేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను, ఆస్త్ర మరభ్రతముతో నూటఎనిమిది పాత్రలను పూజింపవలెను. . అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశను ప్రదక్షిణాక్రమమున త్రిప్పి చిమ్మిన అన్నము పై ఉంచవలెను. కలశకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. “యోగే-యోగే ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్థాపింపవలెను. స్నాన మండపమున కుశ లీపై శయ్యదాని పై పరుపు పరిచి, దిక్కుల యందును. “ఏదిక్కుల యందును విద్యాధిపతులను (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను.” పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణ-మధు సూదన-త్రివిక్రమ-వామనులను, ఆగ్నేయాది “విదిక్కులందు క్రమముగ శ్రీధరహృషీ కేశ -పద్మనాభ దామోదరులను పూజింవ వలేను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశ లలో స్నానమునకు ఉపయోగించు” అన్ని శ్రవ్యమలను ఉంచవలెను: ఆ కలశములను నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నిమిత్తమై ఏర్పరచిన ఆ కలశలను చాల గౌరవభావముతో ఉంచవలెను.  తూర్పున నున్న కలశ పై వట - ఉదుంబర అశ్వత్త-చంపక-అశోక బిల్వ-పలాశ అర్జున-ప్లక్ష కదంబవకుల-చూతపల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కునందున్న కలశలో కమల రోచనా దూర్వాదర్భ-జాతీపుష్ప-కుంద-చందన-రక్త చందన శీర్దార్థ- తగర- తండులములను ఉంచవలెను. పెళ్చిన డిక్కునందున్న కలశలో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందలి మట్టి, విశేషమగు గంగావృత్త, గోమయము, యవలు, వరిబియ్యమం ఉంచవలెను.

విష్ణూపర్నీం శ్యామలతాం భృంగరాజం శతావరీమ్.

 సహదేవీంవచాం సైంహీం, ఐలాంవ్యాఘ్రం సలక్ష్మణాష్

ఐశాన్యామప కుమ్భేమంగలాన్వినివేశయేత్.

వల్మీకమృత్తికాం స ప్రస్థానోతా మపరే న్యసేత్

జాహ్నవీవాలుకాం తోయం విన్య స్వేదపరే ఘటే.

వరాహవృష నాగేన్ద విషాజోద్ధృతమృత్తికామ్

మృత్తికాం పద్మమూలస్య కుశస్త్య, త్వపరే న్యసేత్.

తీర్ధపర్వ తమృద్భిశ్చ యుక్త మద్యపరే న్య సేత్

నాగ కేసర పుష్పంచ కాశ్మీరమపరే న్య సేత్.

 చన్దనాగు రుక ర్పూరైః పుష్పంచై వాపరే న్యసేత్

 వైదూర్యం విద్రుమం ముక్తాం స్ఫటికం వజ్రమేవచ.

ఉత్తర దిక్కునందున్న కలశ లో విష్ణువర్ణి, జోలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంటా, బల, వ్యాఘ్, లక్ష్మణ అను ఓషధులనుంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశలో మాంగలిక వస్తువుల నుంచవలెను. అగ్ని కోణము నందును. రెండవ కలశలో ఏడు స్థానముల నుండి గ్రహింపబడిన మట్టి, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశ లో గంగ ఇసుకను, గంగా జలమును ఉంచవలేను, వాయవ్య కోణము నందున్న మరొక కలశము నందు సూకర. వృషభ-గజముల దంతముల చేతను కొమ్ముల చేతను పెకలించిన మట్టిని, పద్మము మొదట్లో నున్న మట్టిని, ఇతర కలశము నందు దర్భల మొదట్లో నున్న మట్టిని ఉంచవలెను. మరొక కలశము నందు పర్వత మృత్తికతో కూడిన జలము ఉంచవలేను. మరొక కలశము నందు నాగ కేసర పుష్ప కేసరముల నుంచవలెను. మరొక కలశము నందు చందనము, అగురు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైదూర్య-విద్రుమముక్త-స్ఫటిక -వజముల నుంచవలెను,

 ఏతాన్యేకత్ర నిక్షిప్య స్థాపయేద్దేవ సత్తమమ్

నదీనద తడాగానాం సలిలై రపరే న్యనేత్.

ఏకాశీతిపదే చాన్యాన్మణ్ణ పే కలశాన్న్యసేత్

గందోదకాద్యైః సంపూర్ణ ఞ్చ్రీ సూక్తేనాభి మ శ్రయేత్ .

యవాన్సిద్ధార్థ కంగవ కుశాగ్రం చాక్ష తాంస్తథా

తిలాన్ ఫలం తథా. పుష్పమర్ద్యార్థం పూర్వతో న్య సేల్.

పద్మం శ్యామలతాం దూర్వాం విష్ణుపర్ణీం కుళాంస్తథా

విద్యార్థం దక్షిణేభాగే మధుపర్కంతు పశ్చిమే.

కకోలకం లవంగంచ తథా జాతీఫలం శుభమ్

ఉత్తరేహ్యా చమనీయ మణై దూర్వాశతాన్వితమ్.

 పాత్రం నీరాజనార్థంచ తథోద్వర్తన మానిలే

గన్ధ పుష్పాన్వితం పాత్రమైన్యాం పాత్ర కేన్య సేత్,

సురామాంసీం చామలకం సహదేవీం విశాదికమ్

పుష్టిదీపాన్న సే దష్టా న్యసేన్నీ రాజనాయచ.

శంఖం చక్రంచ శ్రీవత్సం కులిశంపజ్క్జ జాదికమ్,

హేమాదిపాత్రే కృత్వాతు నానావర్ణాది పుష్పకమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కుంభాధి వాసో నామ సప్తపఞ్చాశత్తమోధ్యాయః.

వీటివన్నింటిని ఒక కలశ లో నుంచి, దానిపై ఇష్టదేవతను స్థాపింపవలెను. ఇతర కలశ యందు, నదులు, కొండ కాలువలు, చెరువులు వీటి నీటితో కూడిన జలము మంచవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపము నందు ఇతర కలకలను స్థాపింపవలెను. ఈ కలశలను గంధోదకాదులతో నింపవలెను, వాటినన్నిటిని శ్రీ సూక్తముతో అభిమంత్రించ వలెను. ఒక పాత్రలో, అర్ఘ్యము కొరకై, ఆవాలు, గంధము, కుశాగ్రములు, అక్షతలు, ఫలములు, పుష్పములు ఉంచి తూర్పున ఉంచవలెను. కమలములను, శ్యామాలతను, దూర్వాదలములను, విష్ణుక్రాంతను, కుశములను, పాద్యముకొరకై దక్షిణము నందుంచవలెను. మధుపర్కము పశ్చిమము నందుంచవలెను. క్కల లవంగ జాతీఫలములను ఆచమనీయార్థమై ఉత్తరమునందుంచవలెను. దూర్వాక్షతలతో కూడిన ఒక పాత్రను నీరాజనమునకై ఆగ్నేయము నందుంచవలెను. ఉద్వర్తనపాత్రను చ్యాంకనందును, ఈశాన్యమున. గంధపిష్టపాత్రను ఉంచవలెమ, కలశ లో సురామాంసి, ఉసిరికాయ, సహదేవి, పసుపు వెదలైనవి చేయవలెను. నీరాజనము కొరకై, అరువది ఎనిమిది దీపములుంచవలెను, శంఖము, చక్రము, శ్రీవత్సము, వజ్రము, కమలములు, మొదలైన వివిధ వర్ణముల గల పుష్పము సువర్ణాది. పాత్రలలో సమకూర్చుకొనవలెను.

అగ్ని మహాపురాణము నందు కుంభాధివానమను ఎనుబది ఏడవ ఆధ్యాయము సమాప్తము.