అగ్ని మహా పురాణము

71 - అథ గణేశపూజావిధిః.

ఈశ్వర ఉవాచః

గణపూజాం ప్రవక్ష్యామి నిర్విఘ్న మఖిలార్డదామ్

గణాయ స్వాహా హృదయ మేకదంష్ట్రాయ వై శిరః.

గజకర్ణినే చ శిఖా గజవ క్రాయ వర్మ చ

మహోదరాయ స్వద న్తహస్తాయా క్షితథాస్త్రకమ్.

గణో గురుః పాదుకా చ శక్తాననౌ చ ధర్మకః

ముఖ్యాస్థిమజ్జాలం చాధ శ్చర్ద్వ చ్ఛదనమర్చయేత్ .

పద్మకర్ణిక బీజం చ జ్వలినీం నన్దయార్చయేత్

సూర్యేశా కామరూపా చ ఉదయా కామవర్తినీ.

సత్యా చ విఘ్న నాశా చ ఆసనం గన్షమృత్తి కా

యం శోషో రం చ దహనం ప్లవో లం వం తథామృతమ్.

లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్.

గణపతిర్గణాధిపో గణేశో గణనాయకః

గణ క్రీడో వక్ర తుణ్ణి ఏకదంష్ట్రా మహోదరః.

గజవక్తో లమ్బకుక్ష్మిర్వీకటో విఘ్న నాశనః

ధూమ్రవర్ణో మ హేంద్రాద్యాః పూజ్యాగణపతేః స్మృతాః .

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే వినాయకపూజాకథనం నామైకసప్తతితమోధ్యాయః.

 ఈశ్వరుడు పలికెను;- విఘ్న వినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను, ఇది సకలాభీష్టములను ఇచ్చును. “గణంజయాయస్వాహా హృదయాయనమః; ఏకదంష్ట్రాయ హుం ఫట్ శిర సే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయై నమః, గజవ డ్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చజ్ఞాయ నమః నేత్రాభ్యాం నమః, సుదణ్ణహస్తాయ నమః అసాయనము” అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్యకమలమండలము పెదళములందు, క్రిందిదళములందును గణ - గురు - గురుపాదుకా - శ క్తి - అనంత - ధర్మమును, పూజించి, కమలకర్ణికమీద బీజమును పూజింపవలెను. తీవ్ర, జ్వాలినీ, నంద భోగదా, కామరూపిణీ, ఉగ్రా - తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అను తొమ్మిది పీఠశ క్తులను పూజించ వలేను. పిమ్మట చందన చూర్ణమును ఆసనముగ సమర్పించవలెను. 'యం' అనునది శోషక వాయుబీజము, 'రం' అగ్ని బీజము. ‘లం’ పృథివీబీజము, 'వం' అమృతబీజము, “ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తః ప్రచోదయాత్” అనునది గణేశ గాయత్రీ మంత్రము, గణపతి - గణాధిప - గణేశ . గణనాయక . గణక్రీడ - వక్రతుండ . ఏకదంష్ట్ర - మహోదర - గజవక్త - లంబోదర - వికట - విఘ్న నాశన - ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతిపూజాంగముగ పూజించవలెను.

శ్రీ అగ్ని మహాపురాణమునందు గణపతిపూజావిధికథనమను డెబ్బది యొకటవ అధ్యాయము సమాప్తము.