అగ్ని మహా పురాణము

82 - అథ సంస్కార దీక్షావిధిః.

ఈశ్వర ఉవాచః

వక్ష్యే సంస్కారదీక్షాయ విధానం శృణు షణ్ముఖ

ఆవాహయేన్మ హేశస్య వహ్ని స్థస్య శిరో హృది.

సం క్లిష్టా తౌ సమభ్యర్చ సంతర్ప్య హృదయాత్మనా

తయోః సన్నిధయే దద్యా తేనై వాహుతిపశ్చికమ్.

కుసుమేనాస్త్రలిప్తేన తాడయేత్రం హృదా శిశుమ్

ప్రస్ఫురత్తారకాకారం చైతన్యం తత్ర భావయేత్.

శ్రీ ప్రవిశ్య తత్ర హుంకారము కం రేచకయోగతః

సంహారిణ్యా తదాకృష్య పూర కేణ హృది న్య నేత్.

తతో వాగీశ్వరీయోనౌ ముద్రయోద్భవసంజ్ఞయా

హృత్సముటిత మ శ్రేణ రేచ కేన విన్ని పేత్.

ఓం హాం హాం అత్మనే నమః

జాజ్వల్యమానే నిర్దూమే జుహుయాదిష్టసిద్దయే

ఆప్రవృద్దే సధూమే తు హోమే వహ్నౌ న సిద్దతి.

స్నిగ ప్రదక్షిణావర్తః సుగన్దిః శస్యతేనలః

విపరీతః స్ఫులిజీ చ భూమిస్పర్శః ప్రశస్యతే. 

ఇత్యేవమాదిభిశ్చి హ్నై ర్హత్యా శిష్యస్య కల్మషమ్

పాపభక్షణహోమేన ద ద్వా తం భవాత్మనా.

ద్విజత్వాపాదనార్థాయ తథా రుద్రాంశ భావనే

ఆహార బీజసంశుడౌ గర్భాధానాయ సంస్థితౌ.

సీమంతే జన్మతో నామకరణాయ చ హోమయేత్

శతాని పఞ్చ మూలేన నౌషడాదిదశాంశ తః.

ఈశ్వరుడు పలికెను– కుమారస్వామీ! ఇపుడు సంస్కార దీక్షావిధిని గూర్చి చెప్పెదను. అగ్నియందున్న శివుని అర్ధనారీశ్వరరూపమును తన హృదయమునందు ఆవాహన చేయవలెను. శివుడును, పార్వతియు ఒకే శరీర మున కలిసియున్నారు. ఆని భావన చేసి పూజించి, హృదయమంతముచే, తర్పింపచేయవలెను. వారి సాంనిధ్యమును కోరుచు హృదయమంతముతో ఐదు హోమములు చేయవలెను. అస్త్రమంతముచే పుష్పమును అభిమంత్రించి, దానితో శిష్యుని హృదయమున తాడవము చేయవలెను. వానిలో నక్షత్రాకారమున ప్రకాశించున్న జీవుని భావించవలెను. హుంకారయుక్త రేచక పాణాయామముతో శిష్య హృదయమునందు ప్రవేశించి నట్లు భావన చేసి, సంహారిణీ ముదతో ఆ జీవుని అచటినుండి లాగి, పూరక పాణాయాయముచే తన హృదయమున-స్థాపించుకొనవలెను. ఉద్భవముదను ప్రదర్శించుచు, హృత్సం పుటితమగు ఆత్మముద్రను ఉచ్చరించుచు, రేచక పాణాయామ సాహాయ్యముచే దానిని వాగీశ్వరీదేవి యోనియం దుంచి నట్లు భావన చేయవలెను. “హాం హాం హామాత్మనే నమః” అనునది ఆత్మమంత్రము. బాగుగా ప్రజ్వలించుచున్న, ధూమ రహిత మైన అగ్నిలో అభీష్టసిద్ది కొరకై హోమము చేయవలెను. ధూమయుక్తమై, ప్రజ్వలించని అగ్నిలో చేసిన హోమము సఫలము కాజాలదు. అగ్ని జ్వాలలు దక్షిణావర్తములై ప్రసరించినను ఉత్తమ మగు గంధము వచ్చుచున్నను, అగ్ని చాల తేజోవంతముగ కనబడినను, ఆది శ్రేష్టము. ఇందుకు విపరీతముగ, ఆగ్నినుండి నిప్పునేరసులు ఎగురుచున్నను, అగ్ని జ్వాల భూమిని స్పృశించుచున్నను ఉత్తమముకాదు. ఈ గుర్తులచే శిష్యుని పాపమును గుర్తించి అగ్నిలో హోమము చేయ వలెను. లేదా పాపభక్షణహోమములచే ఆ పాపమును భస్మము చేయవలెను. శిష్యునకు నూతన విధమున ద్విజత్వము సిద్దించుటకుమ, రుధాంశభావనకును, ఆహార బీజశుద్ధి నిమిత్తమును, గర్భాదాన - గర్భస్థితి - శీమంతోన్నయన - జాతకర్మ - నామకరణములకొరకును, వేరు వేరుగా, మూల మంత్రముతో, ఐదేసి వందల ఆహుతుల నీయవలెను. చూడా కర్మాదులకొరకే దశమాంశ హోమములు చేయవలెను.

శిధిలీభూతబగ్ధస్య శక్తావుత్కర్షణం చ యత్

 ఆత్మనో రుద్రపుతత్వే గర్భాధానం తదుచ్యతే.

స్వాతన్యాత్మ గుణవ్య క్రిరిహ ప్రంసవనం మతమ్

మాయాత్మనోర్వివే కేన జ్ఞానం సీమ క్షవర్ధనమ్.

శివాదిత త్వశుద్దేస్తు స్వీకారో జననం మతమ్

బోధనం యచ్ఛివత్వేన శివత్వాక్రస్య నో మతమ్.

సంహారముదాయాత్మానం స్థుర ద్వహ్ని కణోపమమ్

విదధాత సమాదాయ నిజే హృదయపజజే.

తతః కుమ్భకయోగేన మూలమ గ్రముదీరయేత్

కర్యాత్సమవశీభావం తదా చ శివయోర్హృది.

బ్రహ్మాదికారణత్యాగ క్రమాద్రేచకయోగతః

నీతా శివా శ్రమాత్మానమాదాయోద్భవముద్రయా.

 హృత్సంపుటితమ శ్రేణ రేచ కేన విధానవిత్

శిష్యస్య హృదయాంభోజకర్ణికాయాం వినిషి పేత్.

పూజాం శివస్య వ హ్నేశ్చ గురుః కుర్యాత్తదోచితామ్

ప్రశాతం చాత్మనే శిష్యం సమయాజ్రావయే తథా.

దేవం న నిర్ణేచ్ఛాస్త్రాణి నిర్మాల్యాది న ల జయేత్

శివాగ్ని గురుపూజా చ కర్తవ్యా జీవితావధి.

బాలబాలిక వృద్ధస్త్రీ భోగ భుగ్వ్యాధితాత్మ నామ్

యథాశ క్తి దగీతార్థం సమర్థస్య సమగ్రకమ్.

ఈ విధముగ శిధిల మైన బంధనము గల జీవాత్మలో కలుగు శక్యుత్కరమే రుద్రపుత్రుడు ఆగుటకు నిమత్త మగుటచే గర్భాధాన మని చెప్పబడును. వానిలో స్వతంత్రముగ ఆత్మ గుణములు ఆవిర్భవించుటయే పుంసవనము. మాయ వేరు, ఆత్మ వేరు అను జ్ఞానము కలుగుటయే సీమంతోన్నయనము. శివాదశుద్ద సద్వస్తుస్వీకారమే జన్మ. ‘నేను శివుడను’ అను జ్ఞాన ముదయించుటయే శివత్వయోగ్యు డగు శిష్యునకు నామకరణము ప్రకాశించుచున్న అగ్నికణము వలె ఉన్న జీవాత్మను, సంహారముద్రచే తీసి తన హృదయ కమలమునం దుంచుకొనవలెను. పిమ్మట కుంభక ప్రాణాయామముతో మూలమంత్రోచ్చారణము చేయుచు హృదయమునందు శివశక్తులను కలుపవలెను. క్రమముగా బ్రహ్మాదికారణములను పరిత్యజించుచు, రేచకముచే జీవాత్మను శివుని దగ్గరకు తీసికొనిపోయి, మరల ఉద్భవ ముద్రచే వెనుకకు తీసికొనివచ్చి, వెనుక చెప్పిన హృత్సంపుటిలాత్మమంత్రముతో, రేచకప్రాణాయామము చేయుచు, విధానము నెరిగిన గురువు శిష్యుని హృదయకమల కర్ణి కయందు ఆ జీవాత్మను స్థాపించవలెను. పిమ్మట గురువు తల్కాలోచితముగ శివాగ్నుల పూజ చేసి, శిష్యునిచే తనకు నమస్కారము చేయించుకొని, ఆతనికి సమయాచారోపదేశము చేయవలెను. “నీవేన్నడును ఇష్టదేవతా (శివ) నిందగాని, శైవశాస్త్రనిందగాని చేయరాదు. శివనిత్మాల్యాదులను దాటకూడదు. జీవితాం తము వరకును శివ-అగ్ని గురువుల పూజ చేయవలెను. బాలకులకు, మూడులకు, వృద్ధులకు, స్త్రీలకు, గమున కోరు వారికని (అన్నార్డులకును), రోగులకును యథాశక్తి ధనాదిదానము చేయవలెను. సమర్థులైనవారు సర్వమును దానము చేయ వలె నని నియమము చెప్పబడినది.

భూతాజ్గాని జటాభస్మదణ్డకౌపీనసంయమాన్

ఈశానాద్యైర్హృదాద్యైర్వా పరిజప్య యధాక్రమాత్.

స్వాహా సంహితామ నౌ పాత్రేష్వారోప్య పూర్వవత్

సంపాదితం ద్రుతం హుత్వా స్థణ్డి వేశాయ దర్శయేత్ .

రక్షణాయ రటాధస్తాడారోప్య క్షణమాత్రకమ్

శిరస్యాజ్ఞాం సమాదాయ దదీత ప్రతినే గురుః.

ఏవం సమయదీక్షాయాం విశిష్టాయాం విశేషతః

వహ్ని హోమాగమజ్ఞానయోగ్య సంజాయతే శిశుః.

ఇత్యాదిమహాతురాణే ఆగ్నేయే సంస్కారదీక్షావిధిర్నా మద్వ్యశీతితమోఽధ్యాయః.

వ్రతాంగము లైన ఆటా-భస్మ-దండ-కౌపీనాదులను, సంయమపోషకమ లను అత్యవస్తువులను, ఈశానాది నామములచే గాని, లేదా వాటి ప్రారంభమున “నము' చేర్చి నామమంత్రములచే గానీ ఆభిమంత్రించి, స్వాహాంతము లగు సంహితామంతములను పఠించుచు పాత్రలలో ఉంచి, వేమకటి వలెనే సంపాతాభిహతమలు (సంస్కార విశేషసంస్కృత ములు) చేసి, స్థండిలీశుడగు శివుని ఎదుట ఉంచవలేను. వీటి రవణము కొరకై క్షణకాలము పాలు కలశము క్రింద ఉంచవలెను. పిమ్మట శివుని ఆజ్ఞ గై కొని వాటిని శిష్యున కీయవలెను. ఈ విధముగ విశిష్టసమయదీవా సంపన్ను డగు శిష్యుడు అగ్నిహోమఆగమజ్ఞానాది యోగ్యత కలవా డగును.

ఆగ్ని మహాపురాణమున సంస్కార దీక్షా విధి యను ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.