అగ్ని మహా పురాణము

326 - అథ గౌర్యాదిపూజా

ఈశ్వర ఉవాచః-

 సౌభాగ్యాదేరుమాపూజాం వక్ష్యేఽహం భుక్తిము క్తిదమ్

మంత్రధ్యానం మండలంచ ముద్రాం హోమాది సాధనమ్.

 చిత్రభానుం శివం కాలం మహాశ క్తి సమన్వితమ్

ఇడాద్యం పరతోద్ధృత్య సదేవః సవికారణమ్.

ద్వితీయం ద్వారకాక్రాంతం గౌరీప్రీతి పదాన్వితమ్

 చతుర్థ్యన్తం ప్రకర్తవ్యం గౌర్యావై మూలవాచకమ్.

 ఓం హ్రీం సః శాం గౌర్యై నమః

తత్రార్ణత్రితయే నైవ జాతియుక్తం షడంగులమ్

ఆసనం ప్రణవేనైవ మూర్తింవై హృదయేనతు.

ఉదకంచ తథాకాలం శివబీజం సముద్ధరేత్

ప్రాణం దీర్ఘ స్వరాక్రాంతం షడంగం జాతిసంయుతమ్.

 ఆసనం ప్రణవే నాత్రమూ ర్తిన్యాసం హృదాచరేత్

యామలం కథితం వత్స ఏకవీరం వదామ్యథ.

 హ్యాపకం సృష్టిసంయుక్తం వహ్నిమాయా కృశానుభిః

 శివశక్తిమయం బీజం హృదయాది వివర్జితమ్.

 గౌరీం యజేద్ధేమ రూప్యాంకాష్ఠజాం శైలజాదికామ్

పంచపిండాం తథాఽవ్యక్తాం కోణే మధ్యేతు పంచమమ్.

లలితా సుభ గాగౌ రీ క్షోభణీ చాగ్నితః క్రమాత్

 వామాజ్యేష్ఠా క్రియాజ్ఞానా వృత్తేపూర్వాదితో యజేత్.

 సపీఠే వామభాగేతు శివస్వావ్యక్త రూపకమ్

 వ్యక్తాద్వినేత్రా త్ర్యక్షరా శుద్ధావాశంకరాన్వితా.

పీఠ పద్మద్వయం తారాద్విభుజావా చతుర్భుజా

సింహస్థావా వృకస్థావా ఆష్టాష్టాదశ సత్కరా.

స్రగక్షసూత్ర కలికా గలకోత్పల పిండికా

శరంధనుర్వా సవ్యేన పాణినాన్యతమం వహత్.

వామేన పుస్తతాంబూల దండా భయకమండలమ్

 గణేశ దర్పణేష్వాసాందద్యా దేకై కశః క్రమాత్.  

పరమేశ్వరుడు చెప్పెను. భుక్తి ముక్తి ప్రదమును సౌభాగ్యాది దాయకమును అగు ఉమా పూజను చెప్పెదను. మంతధ్యాన మండల ముద్రా హోమాది సాధనములను కూడ చెప్పెదను. “గౌరీమూర్తయే నమః” యిది గౌరీ దేవి వాచక మూల మంత్రము. “ఓం హ్రీం సః శాం గౌర్యై నమః” వీనిలో మూడక్షరముతో “నమః” ఆదులు చేర్చి షడంగన్యాసము చేయవలెను. ప్రణవముచేత ఆసనమును, హృదయ మంత్రముచే మూర్తిని కల్పించవలెను. కాల బీజ శివ బీజముల ఉద్దా రము చేయవలెను. దీర్ఘ స్వరాక్రాంత ప్రాణముతో (యాం యీం మొదలు) జాతి యుక్త షడన్యాసము చేయవలెను. ప్రణవ ముతో ఆసనన్యాసము హృదయ మంత్రముతో మూర్తి న్యాసము చేయవలెను. ఇంతవరకు యామల మంత్రము చెప్పితిని. ఇపుడు ఏక వీరమును చెప్పెదము. అగ్ని మాయాకుళానువులతో సృష్టిన్యాస యుక్త మగు వ్యాపక న్యాసము చేయవలెను. శివ శక్తి మయ బీజములు హృదయాదులందు వర్ణితములు. బంగారము, వెండి, శిల మొదలైన వాటితో గౌరీ ప్రతిమ చేసి పూజించవలెను. లేదా పంచ పిండ ప్రతిమ చేయవలెను. నలు వైపుల ఆవ్యక ప్రతిమయు, మధ్యమున వ్యక ప్రతిమయు వుంచవలెను. ఆవరణ దేవతా రూపమున క్రమముగా లలితాది శక్తులను పూజించవలెను. మొదట వృత్తాకార మగు అష్ట దళ కమలము ఏర్పరచి ఆగ్నేయాది దళము లందు క్రమముగ, లలితా, సుభగా, గౌరి క్షోభణీలన, పూర్వాది దళము లందు వామాజ్యేష్ణా, క్రియా, జ్ఞానాలను, పీఠ యుక్త వామ భాగము నందు శివుని అవ్యక్త రూపమును పూజించవలెను. దేవి వ్యక్త రూపమున రెండు లేదా మూడు నేత్రము లుండును. ఆమెను శుద్ద రూపుడగు శివునితో కలిపి పూజించవలెను. ఆ దేవి రెండు పీఠము లందు లేదా రెండు పద్మము లందు కూర్చుండును. ఆమెకు రెండు నాలుగు ఎనిమిది లేదా పదునెనుమిది భు జము లుండును. సింహము పై గాని, తోడేలు పై కాని కూర్చుండును. కుడి ప్రక్కన వున్న తొమ్మిది హస్తములలో స్రక్. అక్ష సూత్రకలికా, ముండ, ఉత్పల, పిండికా, బాణ, చాపములు వుండును. వామ హస్తము లందు పుస్తక తాంబూల దండ అభయ కమండలు గణేశ దర్పణ బాణ చాపము లుండును.

వ్యక్తావ్యక్తాఽథ వాకార్యా పద్మముద్రాస్మృతాసనే

లింగముద్రా శివస్యోక్తా ముద్రోచావాహానీ ద్వయోః.

 శక్తిముద్రాతు యోన్యాఖ్యా చతురస్రంతు మండలమ్

 చతురస్రం త్రిపత్రాబ్జం మధ్యకోష్ట చతుష్టయే.

 త్యశ్రోర్ధ్వే చార్ధచంద్రస్తు ద్విపదం ద్విగుణం క్రమాత్

ద్విగుణం ద్వారకంఠంతు ద్విగుణాదుపకంఠతః.

 ద్వారత్రయం త్రయందిక్షు ఆథవాభద్ర కే యజేత్

స్థండిలే వాథ సంస్థాప్య పంచ గవ్యామృతాదినా.

 రక్తపుష్పాణి దేయాని పూజయిత్వా హ్యుదజ్ ముఖః

 శతం హుత్వామృతాజ్యంచ పూర్ణాదః సర్వసిద్ధిదాక్.

బలిందత్త్వా కుమారీశ్చ తిస్రోవాచాష్ట భోజయేత్

నైవేద్యంశివ భక్తేషు దద్యాన్న స్వయమాచరేత్.

 కన్యార్థీ లభతే కన్యామపుత్రః పుత్రమాప్నుయాత్

దుర్బగాచైవ సౌభాగ్యం రాజారాజ్యం జయంరణే.

 అష్టల క్షైశ్చ వాక్సిద్ధిర్దేవాద్యా వశమాప్నుయుః

 న నివేద్యన చాశ్నీ యాద్వాజమహస్తేన చార్చయేత్.

ఆమెకు వ్యక్త మద్రలుగాని, అవ్యక్త ముద్రలు గాని చూపవలెను. ఆసన సమర్పణమున పద్మముద్ర చూపవలెను. శివుని పూజించునపుడు లింగముద్ర చూపవలెను. దీనికే శివ మద్రయని పేరు ఇరువురికి ఆవాహనీముద్ర చూప వలెను. శక్తి ముద్రకు యోనియని పేరు. ఇది చతురస్ర మండలాకారము మధ్యనవున్న నాగు కోష్ఠములలో త్రిదళ కమలములను వ్రాయవలెను. మూడు కోణముల ఊర్ధ్వ భాగమునందు రెండేసి పదములలో ఆర్ధచంద్రుని వ్రాయవలెను. మొదటి దాని కంటే రెండవది రెట్టింపుండ వలెను. రెండేసి పదముల ద్వారకంఠ భాగము, దానికి రెట్టింపు ఉపకంఠము వుండవలెను. ఒకొక్క దిక్కు యందు మూడేసి ద్వారములు వుంచి లేదా సర్వతో భద్రమండలము ఏర్పరచి పూజించవలెను. లేదా వేదిక పై దేవతను స్థాపించి పంచగవ్య పంచామృతాదులతో పూజించవలెను. ఉత్తరాభి ముఖుడై పూజించి రక్త పుష్పములను సమర్పించవలెను. ఆజ్యముతో నూరు హోమములు చేసి పూర్ణాహుతి నిచ్చువాడు సర్వసిద్ధులను పొందును. బలి సమర్పించు ముగ్గురు లేదా ఎనమండుగురు కన్యకలకు భోజనము పెట్టవలెను, పూజా నైవేద్యమున శివభక్తులకు ఇవ్వవలెను. కాని, తాము స్వీకరించరారు. ఇట్లు చేయుటచే కన్య కోరువానికి కన్య లభించును. పుత్రులు లేనివానికి పుత్రులు లభించును. దౌర్భాగ్యవంతురాలు సౌభాగ్యశాలిని యగును. రాజు రణము నందు జయమును రాజ్యమును పొందును. ఎనిమిది లక్షలు జపించుటచే వాక్సిద్ధి కలుగును. దేవతలు వశమగుదురు. ఇష్టదేవతకు నివేదించ కుండగ భోజనము చేయకూడదు. ఎడమ చేతిలో కూడ పూజించవచ్చును. విశేషించి అష్టమీ చతుర్ధ తృతీయ లందు ఆట్లు చేయవలెను.

అష్టమ్యాంచ చతుర్ధశ్యాం తృతీయాయాం విశేషతః

మృత్యుంజయార్చనం వక్ష్యే పూజయేత్కలశో దరే.

హూయమానంచ ప్రణవో మూర్తిరోజుస ఈ దృశమ్

మూలంచ వైషడ న్తేన కుంభముద్రాం ప్రదర్శయేత్.

హోమయేత్ క్షీర దూర్వాజ్య మమృతాంచ పునర్న వామ్

పాయసంచ పురోడాశ మయుతంతు జపన్మనుయ్.

చతుర్ముఖం చతుర్బాహుం ద్వాభ్యాంచ కలశం దధత్

వరదాభయకం ద్వాభ్యాం స్నా యాద్వై కుంభముద్రయా.

ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయురౌషదం మంత్రితం శుభమ్

ఆపమృత్యు హరోధ్యాతః పూజితోఽద్బుతఏవనః.

 ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే గౌర్యాదిపూజావిధాన నిరూపణంనామ షడ్వింశత్యధికత్రిశతతమోఽధ్యాయః.

ఇపుడు మృత్యుంజయ పూజను చెప్పెదను. కలశ ముపై పూజ చేయవలెను. హోమమునందు ప్రణవము మృత్యుం జయుని మూర్తి మూల మంత్రము చెప్పుచు కుంభముద్ర చూపవలెను. క్షీర దూర్వా, ఆజ్య, అమృత, పునర్నవా, పాయస పురోడాశములతో హోమము చేయవలెను. హోమమునకు పూర్వము పదివేలు మంత్ర జపము చేయవలెను. మృత్యుం జయునకు నాలుగు ముఖములు నాలుగు భుజములు వుండును. రెండు హస్తములలో కలశమును రెండు హస్తములలో వరదా భయములను ధరించి యుండము. కుంభముద్రచే మృత్యుంజయునకు స్నానము చేయించవలేను. ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయువులు లభించును. ఈమంత్రముతో అభిమంత్రించిన ఔషధము శుభకరము మృత్యుంజయుని ధ్యానించినను పూజించి నను అపమృత్యువు తొలగును.