అగ్ని మహా పురాణము

85 - అథ ప్రతిష్ఠాకలాశోధనమ్.

ఈశ్వర ఉవాచః-

తత్వయోరథ సస్థానం కుర్యాచ్ఛుద్ధవిశుద్దయోః

హ్రస్వ దీర్ఘప్రయోగేణ నాదనాదా న సజ్గినా.

ఓం హాం హ్రూం హాం ఆపేజోవాయురాకాశం తన్మాత్రేంద్రియబుద్ధయః.

గుణత్రయమహఙ్కారశ్చతుర్వింశః పుమానితి.

ప్రతిహాయాం నివిష్టాని తత్త్వాన్యేతాని భావయేత్

పఞ్చవింశతి సంఖ్యాదిఖాదియానాక్షరాణి చ.

పఞ్చశదధికా షష్టిర్భువనై సుల్యసంజితాః

తావ న్త ఏవ రుద్రాశ్చ విజేయా స్తత్ర తద్యథా.

అమరేశ  ప్రభావశ్చ నై మిషః పుష్కరోపి చ

తథాపాదిశ్చ దణిశ్చభావభూతిరథాష్టమః.

నకురీశో హరిశ్చంద్ర శ్రీ శైలో దశమః స్మృతః

అన్వీశోథాతి కేశశ్చ మహాకాలోధ మధ్యమః.

కేదారో భైరవశ్చైవ ద్వితీయాష్టకమీరితమ్

తతో గయాకురు మేతఖరానాదిక నాది కే.

విమలాశ్చాట్టహాసశ్చ మ హేంద్రో భీమ ఏవ చ

వస్వాపదం రుద్రకోటిర వియుక్తో మహాబలః.

గోకర్ణో భద్రకర్ణశ్చ స్వర్ణాక్షః స్థాణు రేవ చ

అజేశ్చైవ సర్వజ్ఞో భాస్వరః సూదనాన్తరః.

సుబాహుర్మత్తరూ పే చ విశాలో జటిల స్తథా

రౌద్రోథ పిజ్గలాక్షశ్చ కాలరంష్ట్రీ భవేత్తతః.

విదురర్చైవ ఘోరశ్చ ప్రాజాపత్యో హుతాశనః

కామరూ పే తథా కాలః కర్ణేపధ భయానకః.

మతజ్గః పిజ్గలశ్చైవ హరో వై ధాతృసంజ్ఞకః

శజ్కకర్ణో విధానశ్చ శ్రీకణ్ఠశ్చంద్రశేఖరః.

సహైతేన చ పర్యన్తః కథ్యంథేథ పదాన్యపి

ఈశ్వరుడు చెప్పెను : శాంతము, నాదాంతకము అను హ్రస్వదీర్ఘముల ప్రయోగముచే శుద్ధ - ఆశుద్ధకళల సంధానము చేయవలెను. “ఓం హాం ప్రాం హ్రీం హాం” అనునది సంధానమంత్రము. పిమ్మట ప్రతిష్టాకళలో నున్న జలతేజో - వాయు-ఆకాశ - పంచతన్మాత్ర - దశేంద్రియ - బుద్ధి- గుణత్రయ - అహంకార - పురుషులను ఇరువదియైదు తత్వములను, 'క' మొదలు 'య' వరకును ఉన్న ఇరువదియెదు అక్షరములను చింతన చేయవలెను. ప్రతిష్టాకళలో ఏబదియారు భువనము లున్నవి. వాటిలో అవే పేరులు గల రుద్రుని ఆంతమంది ఉన్నారు. వారి పేర్లు ఈ విధముగనున్నవి. అమరేశ -ప్రభాస-నైమిష - పుష్కర - ఆషాఢ - డిండి - భావభూతి - లకులీశులు (ఇది మొదటి అష్టకము), హరిశ్చంద్ర - శ్రీ శైల - జల్ప - ఆమ్రతకేశ్వర – మహాకాల మధ్యమ - కేదార - భైరవులు (ద్వితీయాష్టకము), గయా - కురుక్షేత్ర - సాల - కనఖల - విమల - ఆట్టహాస - మహేంద్ర - భీములు (తృతీయాష్టకము), వస్త్రపద - రుద్రకోటి - ఆవిముక్త-మహాలయ - గోకర్ణ - భధ్రకర్ణ - స్వర్ణాక్ష - స్థాణువులు (చతార్థాష్టకము), అజేశ - సర్వజ్ఞభాస్వర - తదనంతర - సుబాహు - మంత్రరూపి - విశాల - జటిల - రౌద్రులు (ఐదవ అష్టకము), పింగలాక్ష - కాలదంష్ట్రా - విధుర - మోత - ప్రాజాపత్య , హుతాశన - కాలరూపి - కాలకర్ణులు (ఆరవ అష్టకము). భయానక - పతంగ - పింగల - హర - ధాతృ - శంకుకర్ణ - శ్రీకంఠ - చంద్రమౌలు (ఏడవ అష్టకము) ఈ ఏబది యారుగురు రుద్రులు ఏబదియారు భువనములలో వ్యాపించియున్నారు. ఇపుడు ముప్పది రెండు పదములు చెప్పబడుచున్నవి.

వ్యాపిన్ ఓం అనురూప ఓం ప్రమథ ఓం తేజః ఓం జ్యోతిః ఓం పురుష ఓం

అగ్నే ఓం అధోమ ఓం అభస్మ ఓం అనాది ఓం నానా ఓం ధూధూ ఓం

భూః ఓం భువః ఓం స్వః, అనిధన, నిధనోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్,

మహేశ్వర, మహాదేవ, సద్భావేశ్వర, మహాతేజః, యోగాధిపతయే

ముఞ్చ ప్రథమ సర్వ సర్వేతి ద్వాత్రింశత్ పదాని

బీజధావే త్రయో మంత్రాః వామదేవః శివః శిఖా.

గాందారీ చ సుషుమ్నా చ నాఢ్యా ద్వౌ మారుతా తథా

సమానోదాననామానౌ రసనాషాయురిన్స్టియే.

రసస్తు విషయో రూపశబ్దస్పర్శం రసా గుణాః

మణలం వర్తులం తచ్చ పుణ్డరీ కాజ్కితం సీతమ్.

స్వప్నావస్థా ప్రతిష్టాయాం కారణం గరుడధ్వజమ్

ప్రతిష్టా నకృతం సర్వం సఞ్చి న్య భువనాదికమ్,

సూత్రం దేహే స్వమ శ్రేణ ప్రవి శ్యైనాం వియోజయేత్

ఓం హాం భీం హాం ప్రతిష్టాకలాపాశాయ ఓం ఫట్

స్వాహా నైనానేనైవ పూర కేణాజ్కుశముద్రయా సమాకర్షేత్.

తతః ఓం హ్రాం హ్రూం హ్రాం ప్రతిష్టాకలాపాశాయ హూంఫడి

త్యనేన సంహారముద్రయా కుంభ కేన హృదయాదధోనాడీసూత్రా

దాదాయ ఓం హ్రాం హ్రూం హ్రాం హాం ప్రతిష్టాత లాపాశాయ నమః

ఇత్యనేనోద్భవముద్రయా రేచకేన కుమ్భే సమారోపయేత్.

తతో హాం హ్రీం ప్రతిష్ఠక లాపాశాయ నమ ఇతనేనార్చయిత్వా

సంపూజ్య స్వాహా నే నాహుతీనాం త్రయేణ సన్నిధాయ తతః

 హాం విష్ణవే నమ ఇతి విష్ణుమావాహ్య, సంపూజ్య, సంతర్ప్య,

విష్ణో రవాధికారేస్మిన్ ముముకుం దీక్షయామ్యహమ్.

భావ్యం త్యయానుకూలేన విష్ణుం విజ్ఞాపయేదితి.

త్యాపీన్, ఆరూపిన్, ప్రథమ, తేజః, జ్యోతి, అరూప, పురుష, అగ్నే, ఆధూమ, అభస్మన్, ఆనాదే, వానానానా, ధూధూధూధూ, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, అనిధన, నిధన, నిధవోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్, మహేశ్వర, మహదేవ, సద్భావ, ఈశ్వర, మహాతేజః, యోగాధిపతే, ముంచ, ప్రమథసర్వ, సర్వసర్వ అనునవి ముప్పదిమూడు పదములు. రెండు బీజములు, వాసుదేవ-శిరస్- శిఖలను మూడు ముత్రములు. గాంధారీసుషుమ్నా నాడులు, సమానోదానము లను రెండు ప్రాణవాయువులు, రసనాపాయువు లను రెండు ఇంద్రియములు. రసమను విషయము; రూప శబ్ద స్పర్శర సము లను నాలుగు గుణములు, కమలాంకిత మైన అర్థచంద్రాకర శ్వేతమండలము, సుషుప్త్యవస్థ, ప్రతిషారణభూతు డైన విష్ణువుఈ విధముగ భువనాది సకల తత్త్వములను ప్రతిష్టలోపల భావన చేసి, ప్రతిష్ఠకళామంత్రముతో శిష్యశరీరమున ప్రవేశించి నట్లు భావన చేసి, దానిని ఆ కళాశమునుండి విముక్తుని చేయవలెను. ఓం హం హీం హాం ప్రతిష్టాకలాపాశాయ హుం ఫట్ స్వాహా అను మంత్రముతో, పూరక ప్రాణాయామాంకుశ ముద్రలతో కళాపాళాకరణము చేయవలెను. పిమ్మట “ఓం హూం హాం హీం హాం హూం ప్రతిష్టాకలాపాశాయ హుం ఫట్” అను మంత్రముతో, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో హృదయము క్రింద సాడిసూత్రము గ్రహించి, “ఓం హూం హీం హాం ప్రతిష్ఠాకలాపాశాయ నమః” అనుమంత్రముతో, ఉదృవముద్రా రేచక ప్రాణాయామములతో కుండమునందు ఉంచవలెను. పిదప “ఓం హం హాం హీం హాం ప్రతిష్టి కాలా ద్వారాయ నమః” అను మంత్రముతో అర్ఘ్య మిచ్చి, పూజించి, స్వాహావితమంత్రముతో మూడేసి హోమములు చేసి, సంతర్పణ సంవిధాపనములు చేయవలెను. “ఓం హం విష్ణవే నమః” అను మంత్రముతో విష్ణువును ఆవాహన చేసి, హజాతర్పణములు చేసి “ఓ విష్ణ!  నీ ఆధికారమునందు ముముకు వగు శిష్యునకు దీక్ష ఇచ్చుచున్నాను. నీవు అనుకూలుడ వగుము” అని ప్రార్థించవలేను.

తతో వాగీశ్వరీం దేవీం వాగీశ మపి పూర్వవత్.

 ఆవాహ్యాభ్యర్చ్య సన్తర్ష్య శిష్యం వక్షసి తాడయేత్

ఓం హోం హోం హం ఫట్

ప్రవి శేదపలనేనైవ చైతన్యం విభజే త్తతః.

శస్త్రేణ పాశసంయుక్తం జ్యేష్టయాజ్కుశముద్రయా

ఓం హాం హం హోం హ్రూం ఫట్ స్వాహా నేన హృదాకృష్య తేనైవ పుడితాత్మనా.

గృహీత్వా తు నమోఒ నేన నిజాత్మని నియోజయేత్

ఓం హాం హం హోం ఆత్మనే నమః

పూర్వవతిపితృసంయోగం భావయిత్వోద్భవాఖ్యయా.

వామయా తదనేనైవ దేవీగరే వినిక్షి పేత్

 ఓం హం హం హాం ఆత్మనే నమః

దేహోత్పత్తా హృదా ప్యాకం శిరసా జన్మనా తథా.

శిఖయా వాధికారాయ భోగాయ కవచాణునా

తత్త్వశుద్దా హృదా హ్యేవం గర్భాధానాయ పూర్వవత్.

శిరసా పాశ శైథివ్యే నిష్కృత్యైవం శతం జపేత్

ఏవం పాశ వియోగే2పి తతః శస్త్రాత్మజ ప్రయా.

ఛిన్ద్యాద శ్రేణ కర్తర్యా కలాబీజకతా యథా

ఓం హీం ప్రతిష్ఠకలాపాళాయ హః ఫట్

విసృజ్య వర్తులీకృత్య పాశమ శ్రేణ పూర్వవత్.

మృతపూర్ణే స్రువే దత్త్వా కలా స్త్రేడైవ హోమయేత్

ఆస్త్రేణ జుహుయాత్పఞ్చ పాశాజ్కుశనివృత్తయే.

ప్రాయశ్చిత్తని షేధార్థం దద్యాదష్టాహుతీ స్తతః 

ఓం హః ఆస్రాయ హుం ఫట్

హృదావాహ్య హృషీ కేశం కృత్వా పూజనతర్పణే.

పూర్వో క్షవిధిగా కుర్యాదధికారసమర్పణమ్

ఓం హాం రసశుక్లం గృహాణ స్వాహా

నిశ్శేషదగ్గపాశస్య పదస్య హరే త్వయా.

న స్థేయం బనక త్వేన శివాజ్ఞాం శ్రావయేదితి

తతో విసృజ్య గోవిన్దం విద్యాత్మానం నియోజ్య చ.

రాహుముక్తార్ధదృశ్యన చన్హబిమ్బన సన్ని భమ్

సంహారముద్రయా స్వస్థం విధాయోద్భవముద్రయా.

సూత్ర సంయోజ్య విన్యస్య తోయబిన్దుం యధా పురా

విసృజ్య పితరౌ వహ్నే  పూజితా కుసుమాదిభిః.

గర్యాత్పూర్ణాం విధానేన ప్రతిష్టాపి విశోదితా.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నిర్వాణదీక్షాయాం ప్రతిష్టాక లాసం శోధన విధిర్నామ పఞ్చశీతితమోధ్యాయః.

పిమ్మట వాగీశ్వరీ వాగీశ్వరులను వెనుకటివలెనే ఆవాహన చేసి పూజనతర్పణమాలు చేసి, శిష్యుని వక్షమున తాడనము చేయవలెను. “ఓం హం హం హ హూం ఫట్” అనునది తాడనమంత్రము. ఈ మంత్రముతోడనే శిష్యుని. హృదయమున ప్రవేశించి పాశబద్ధ మగు ఆతని చైనత్యమును. అస్త్రమంత్ర-జ్యేష్ఠాంకుశముద్రలతో పాశ విముక్తము చేయ వలెను; ఎట్లనగా “ఓం హం హం హః ఫట్” ఈ మంత్రమునకే “స్వాహా” చేర్చి తత్సంప్రటిత మైన మంత్రముతో జీవ చైతన్యము ఆకర్షించి, నమస్కారాంత మగు “ఓం హ్రాం హాం హాం ఆత్మనే నమః” అను అత్మమంత్రముతో తన ఆత్మతో “కలపవలెను. పిదప, ఆ జీవచైతన్యము పితృసంయుక్త మను భావన చేసి, దానిని వామా ఉద్భవముద్రతో దేవీగర్భము నందు స్థాపించవలెను. ఆ సమయమున “ఓం హం హం హామాత్మనే నమః” అను మంత్రము పఠించవలెను. దేవోత్పత్తి కొరకై (హృదయమంత్రముతో ఐదు హోమములును, జీవాత్మస్థితికొర తై శిరోమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అధికార ప్రాప్తికొరకు శిఖామంత్రముతోను, భోగ సిద్ధికొరకు కవచమంత్రముతోను, లయకొరకు అస్త్రమంత్రముతోను, గ్రోత సిద్దికొరకు శివమంత్రముతోను తత్త్వశుద్దికొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. పిమ్మట వెనుకటి వలె గర్భాదానాది సంస్కారములు చేసి, పాళశైథిల్య-ప్రాయశ్చిత్తములకొరకు శిరోమంత్రముతో నూరు హోమములు చేయ వలెను. మలశక్తి నివారణముకొరకై స్వాహాంతమగు ఆశ్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. ఈ విధముగ పాశములు తొలగిన పిమ్మట అస్త్రమంత్రమును ఏడుపర్యాయములు జపించి, “ఓం హీం ప్రతిష్ఠాకలాపాశాయ హూం ఫట్” అను కలాబీజయుక్తమగు అస్త్రమంత్రరూపఖడ్గముతో కలాపాశమును ఛేదించవలెను. పాఠశ స్త్రముతో ఆ పాశమును నలిపి, వర్తులాకారము చేసి, వెనుక టివలెనే ఘృతపూర్ణ మగు స్రువమునందుంచి, దానిని కలాశ స్రముతో హోమము చేయవలెను. పిమ్మట పాశాంకుర నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు హోమములు చేసి ప్రాయశ్చిత్త నివారణార్థమై మరల ఎనిమిది హోమములు చేయవలెను. “ఓం హః అస్త్రాయ హూం ఫట్” అనునది హోమమున కుపయోగించు అస్త్రమంత్రము.

హృదయమంత్రముచే విష్ణువును ఆవాహనచేసి, పూజనతర్పణాద్యనంతరము “ఓం హాం విష్ణో రసం శుల్కం గృహాణ స్వాహా” అను మంత్రముతో ఆధికార సమర్పణము చేయవలెను. పిదప ఈ విధముగ శివాజ్ఞ వినిపింపవలెను. “ఓ విష్ణూ! ఈ పశువు పాశములు పూర్తిగా దగ్ధ మైనవి. ఇక నీవు వీనికి బంధనకారకుడవు కాకూడదు.” పిదప రౌద్రీనాడితో విష్ణువును విసర్జించి రాహుముక్త మైన ఆర్థభాగము గల చంద్రమండలముతో సమానమైన ఆత్మను నియుక్తము చేయ వలెను. సంహార ముద్రతో దానిని తనలోనుండి, ఉద్భవముద్రతో దానిని సూత్రముతో కలుపవలెను. పిదపవెనుకటివెలెనే, జలబిందుసదృశ మగు ఆ ఆత్మను శిష్యుని శిరముపై ఉంచవలెను. దీనివలన ఆతనికి ఆప్యాయనము కలుగును. పిదప పుష్పాదులతో ఆగ్ని యొక్క మాతాపితరులను పూజించి, విసర్జనము చేసి, విధిపూర్తి కొరకై యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఈయలేలెను. ఇట్లు చేయుటచే ప్రతిష్టాకళ కూడ శోధితమగును.

అగ్ని మహాపురాణమునందు, నిర్వాణదీక్షలో ప్రతిష్టాకళా సంశోధనవిధి యను ఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.