అగ్ని మహా పురాణము

196 - అథ నక్షత్రవ్రతాని

 అగ్నిరువాచః-

                      నక్షత్రవ్రతకం వక్ష్యే బే హరిః పూజితోఒరధః

నక్షత్రపురుషం బాదౌ చైత్రమాసే హరి యజేత్.

మూలే పాదౌ యజేజజే రోహిణీన్వర్ఛయేద్ధరిమ్

జానునీ దాశ్వినియోగే హ్యాషాడాసూరుసంజ్ఞకే.

మేడ్రం పూర్వోత్తరా స్వేవ కటిం వై కృత్తికాసు చ

పార్శ్వే భాద్రపదాభ్యాం తు కుక్షిండ వై రేవతీమ చ.

స్తనే చై వానురాధాసు ధనిష్ఠాసు చ పృష్టకమ్

భుజౌ పూజ్యొ విశాఖాసు పునర్వస్వజులీర్యజేత్.

ఆశ్లేషాసు నఖాన్ పూజ్య కణం జ్యేష్ఠాసు పూజయేత్

 శ్రోత్రే విష్ణోశ్చ శ్రవణే ముఖే పుష్యే హరీర్యజేత్.

యజెర్స్వాతీమ దన్తాగ్రమాస్యం వారుణతోత్చయేత్

మఘాసు నాసాం నయనే మృగశీర్ష లలాటకమ్.

 చిత్రా శార్దాసు కచానబ్ధా నే స్వర్ణకం హరిమ్

గుడఫూల్లే ఘట్కేభ్యర్చః శయ్యాగోర్డాదిదక్షిణాః.

నక్షత్రపురుషో విష్ణుః పూజనీయః శీవాత్మకః

కామ్భవాయనీయవ్ర క్రున్మాసభే పూజయెద్ధరిమ్.

కార్తికే కృత్తికాయాం చ మృగశీర్ష మృగాస్య కే     

                    నామభిః కేశవాద్యైస్తు అచ్యుతాయ నమో పి వా.

                     కార్తికే కృత్తికాభేహ్ని  మాననక్షత్రగం హరిం

కామ్భవాయనీయవ్రతకం కరిష్యే భుక్తిముక్తిదమ్.

కేశవాదిమహామూర్తిమచ్యుతం సర్వదాయకమ్

 ఆవాహయామ్యహం దేవమాయురారోగ్యవృద్ధిదమ్.

కార్తికాదౌ సకొసారమన్న మాసచతుష్టయమ్

ఫాల్గునేదే చ కృసరమాషాడాదౌ చ పాయసమ్.

దేవాయ బ్రాహ్మణేభ్యశ్చ నక్తం నైవేద్యమాశయేత్

పశ్చిగవ్యజలే స్నాత స్తస్యైవ పాశనాచ్చుచిః.

అర్వాగ్విసర్జనార్ద్రవ్యం నైవేద్యం సర్వముచ్యతే

విసర్జితే జగన్నోదే నిర్మాల్యం భవతి క్షణాత్.

నమోనమస్తేచ్యుత మే క్షయోస్తు పాపస్య వృద్ధిం సము వేతు పుణ్యమ్

ఐశ్వర్వవిత్తాది సదాక్షయం మే క్షయం చ మా సస్యతీరభ్యువెతు.

యథాచ్యుత స్త్వం పరతః పరస్తార బ్రహ్మ భూతః, పరతః పరాత్మన్ .

తథాచ్యుతే త్వర కురు వఞ్చతం మే వయా కృరం పోవహారాప్రమేయ.

అచ్యుతాన్త న గోవిన్ద ప్రసీద యదభీప్సితమ్

అక్షయం మామమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ.

సప్తవర్షాణి సంపూజ్య భుక్తిముక్తిమవాప్నుయాత్

అన న్తంవ్రతమాఖ్యాన్యే నక్షతవ్రత కేర్థదమ్.

మార్గశీరే మృగశిరే గోమూత్రాశీ యజేద్దరిమ్

అనన్తం సర్వకామామనన్తో భగవాన్ ఫలమ్.

దధాత్యన స్తం చ పున స్తదేవాన్యత్ర జన్మని

అన న్తపుణ్యోపచయం కరోత్యేతన్మహావ్రతమ్.

యథాభిలషితప్రాప్తిం కరోత్యక్షయమేవ చ

పాదాది పూజ్య న క్తే తు భుజియా తైలవర్ణితమ్.

మృతేనాన న్తముద్దిశ్య హోమో మాన చతుష్టయమ్

చైత్రాదౌ శాలినా హోమః పయసా శ్రావణాదిషు.

మాందతా భూద్యుద్వా దనన్తవ్రతకాత్పుతః

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నక్షత్రవతానినామణ్ణవత్యధిక శతత మెధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను : ఇపుడ నక్షతవ్రతములను గూర్చి చెప్పేదను, నక్షత విశేషములందు పూజ చేయుటచే శ్రీమహావిష్ణువు సకలాభీష్టములను తీర్చును. ప్రప్రధమముగ, నక్షతపురుషుడైన శ్రీమహావిష్ణవును చైత్రమాసమునందు పూజించవలెను. మూలనక్షత్రమునందు శ్రీమహావిష్ణవ చరణకి మలములను, రోహిణీనక్షతమున మోకాళ్ళను, పూర్వాషాడో త్తరాషాఢలందు ఊరుద్వయమును, పూర్వఫల్గున్యుత్ర రవనులయందు మేడ్రమును, కృత్తికయందు కటిపడేశముమ, పూర్వాభాద్రోత్తరాభాదలయందు పార్శ్వములను రేవతియందు కక్షిని, అనూరాధయందు స్తనద్వయమును ధనిష్ఠయందు పృష్టభాగమును, విశాఖయందు భుజద్వయమును, పునర్వసువునందు వేళ్ళను పూజించవలెను. ఆశ్లేషయందు సఖములను, జ్యేష్ఠయందు కంఠమును, శ్రవణమునందు కర్ణములను, పుష్యమియందువదనమండలమును, స్వాతియందు దంతాగములను శతభిషమునందు ముఖమును, మమయందు నాసికను, మృగశిరయందు వేతములను, చిత్తయందు లలాటములు, ఆర్ధ్ర యందు కేశ సమూహమను పూజించవలెను. సంవత్సరాంతమున బెల్లమునింపిన కలశ పై శ్రీమహాష్ణువు స్వర్ణమూర్తి ని పూజించి బాహ్మణునకు దక్షిణాసహితముగ శయ్య, గోవు, ధనము మొదలగునవి  దానము  చేయవలెను. సర్వపూజనీయుడగు నక్షత్రపురుషుడైన శ్రీమహావిష్ణువునకును, శివునకును భేదము లేదు. అందు శాంభవాయనీయవత మాచరించువాడు కృత్తికా సంబద్ధ మగు కార్తికమాసమునందును, మృగశిర నక్షతసంబద్ధ మగు మార్గశీర్షమాసమునందును కేశవాది నామములతోడను, అచ్యుతాయ నమః ఇత్యాదినావములతోడను శ్రీమహావిష్ణువును పూజించవలెమ, “నేను కార్తిక మాసముయొక్క కృత్తికాసంబద్ధ పూర్ణిమనాడు మాసమనందను, నక్షతమునందునుఉన్న శ్రీహరిని పూజింతును. భుక్తి ముక్తి పద మగు శాంభవనీయవత మాచరింతును” అని సంకల్పించవలెను. “కేశవాదిమూర్తులతో ఉన్నవాడును, ఆయురారోగ్యవృద్ధికలిగించువాడును అగు అచ్యుతుని ఆవాహనము చేయుచున్నాను” అని ఆవాహనము చేయవలెను. కార్తికమునుండి మాఘమువరకు నాల్గు మాసములు అన్నదానము చేయవలెను. ఫాల్గునమునండి ఆషాఢమువరకు మద్గాన్నము ఆషాడమనుండి అశ్వయుజమువరకు పాయసము దానము చేయవలెను. రాత్రియందు శ్రీమహావిష్ణువునకును బ్రాహ్మణునకును నైవేద్యము సమర్పించవలెను. పంచగవ్య జలవతో స్నానము చేసి, దానిని త్రాగుటచే పవిత్రుడగును. ఉద్వాసన చెప్పుటకు పూర్వము దేవునకు సమర్పించిన దంతయు నైవేద్యము; ఉద్వాసనచేప్పగానే ఆది ఆంతయు నిర్మాల్యమగును. “అచ్యుతా! నీకు నమస్కారము. నమస్కారము. నా పాపములు నశించి పుణ్యము వృద్ధిపొందు గాక ! నా ఐశ్వర్యాదులు సదా అక్షయ్యము లగుగాక. నా సంతాన పరంపర విచ్ఛిన్నము కాకుండుగాక. పరాత్పరా! పరమేశ్వరా! నీవుపరాత్పరుడవై బ్రహ్మవై నీ మర్యాదనుండి ఎన్నడును ఏ విధముగ ద్యుతుడవుకావో అట్లే వా మనోవాంఛిత కార్యమును సఫలము చేయుము. ఓ పాపవినాశకా! నేను చేసిన పాపములు తొలగింపుము. అచ్యుతా! అనంతా! గోవిందా! ఆపవేయస్వరూపా! పుషోత్తమా! నన్ననుగ్రహించి వా కభీష్టములైన పధార్థములను ఆశ్రయములుగ చేయుము”. అని ప్రార్థించవలెను. ఈ విధముగ్ ఏడు సంవత్సరములు శ్రీహరిని పూజించినవాడు భోగ మోక్షములను పొందును. ఈ నక్షతవ్రత సందర్భమున సకలాభీష్టపదమగు ఆనంతవ్రతమును గూర్చి చెప్పెదను. మార్గశీర్ష మాసమునందు మృగశిర నక్షత్రము వచ్చినపుడు గోమూత్రప్రాశనము చేసి శ్రీహరిని పూజించవలెను. ఆ అనంతుడు సకలకామప్రదాత; అనంతఫలముల నిచ్చువాడు ఈ వ్రతము చేయువానికి రాబోవు జన్మలో కూడ అనంతపుణ్యఫలమునిచ్చును. ఈ మహావ్రతమువలన అనంతమహా పుణ్యము లభించును. ఇది అభిలషిత వస్తువుల నిచ్చు వాటిని అక్షయములుగ చేయును. అనంతుని చరణ కమలాదిపూజ చేసి రాత్రి తై లరహిత మగు భోజనము చేయవలెను. అనంతుని ఉద్దేశించి మార్గశీర్షమునుండి ఫాల్గునమువరకు మృతమును, చైత్రమునుండి ఆషాఢమువరకు బియ్యము. శ్రావణము నుండి కార్తికమువరకు క్షీరమును హోమము చేయవలెను. ఈ అనంతవ్రత మాచరించుట చేతనే యువనాశ్వునకు నుంధాత ఆను పుత్రుడు జనించెను.

అగ్ని మహాపురాణమునందు నక్షత్రవ్రతవర్ణన మను నూట తొంబది యారవ అధ్యాయము సమాప్తము.