అగ్ని మహా పురాణము

200 - అథ దీపదానవ్రతమ్

అగ్ని రువాచః-

దీపదానవ్రతం వక్ష్యే భుక్తిముక్తి ప్రదాయకమ్

దేవద్విజాతిక గృహే దీపదోబ్దం స సర్వభాక్.

చతుర్మాసం విష్ణులోకే కార్తికే స్వర్గలోక్యపి

దీపదానాత్పరం నా స్తి న భూతం న భవిష్యతి.

దీ పేనాయుష్యచక్షుష్మార్గీపాల్లక్ష్మీసుతా దీకమ్

సౌభాగ్యం దీపదః ప్రాప్య స్వర్గలో కే మహీయతే.

విదర్భరాజదుహితా లలితా దీపదాత్మభాక్

చారుధర్మక్ష్మీపపత్నీ శతభార్యాధికాభవత్.

దదౌ దీపసహస్రం సా విష్ణోరాయతనే సతీ

పృష్టి సా దీపమాహాత్మ్యం సపత్నీయ్య ఉవాచ హ.

లలితోవాచః-

సౌవీర రాజస్య పురా మైత్రేయోభూత్పురోహితః

తేన చాయతనం విష్ణోః కారితం దేవికాతటే.

కార్తికే దీపక నేన దత్త సం పేరితో మయా

వక్షప్రానేన నశ్యన్యా మార్జారస్య తదా భయాత్. 

నిర్వాణవాన్ ప్రదీప్లో భూద్వర్త్యా మూషికయా తదా

మృతా రాజాత్మజా జాతా రాజపత్నీ శతాధికా.

అసజ్కల్పితమప్యస్య ప్రేరణం యత్కృతం మయా

విష్ణ్వాయతనదీపస్య తస్వేదం భుజ్యతే ఫలమ్.

జాతిస్మరా హ్యతో దీపాన యచ్ఛామి త్వహర్నిశమ్

ఏకాదశ్యాం దీపదో వై విమానే దివి మోదతే.

            అగ్ని దేవుడు పలికెను : ఇపుడు భుక్తిముక్తిప్రద మగు “దీపదాన వ్రతమును” గూర్చి చెప్పెదను. దేవాలయము నందు గాని, బ్రాహ్మణగృహమునందు గాని ఒక సంవత్సరము దీపదానము చేయువాడు సకలకామములను పొందును. చాతుర్మాస్యమునందు దీపదానము చేయువాడు విష్ణులోకమునకును, కార్తి కమున దీపదానము చేయువాడు స్వర్గమునకు పోవును. దీపదానమును మించిన వత మేదియు పూర్వము లేకుండెను, ఇపుడు లేదు, ఉండబోదు. దీపదానముచే ఆ యుర్దాయము, నేత జ్యోతియు లభించును. ధనపుత్రాదిపాప్తి కలుగును. దీపదానము చేయువాడు సౌభాగ్యవంతుడై స్వర్గమున దేవతలచే పూజింపబడును. విదర్భరాజకుమారి యగు లలిత దీపదానపుణ్యము చేతనే చిరుధర్మమహారాజుకు భార్యయై ఆతని నూర్గురు రాణులలో ప్రముఖు లైనది. ఆ పతివ్రత ఓక పర్యాయము విష్ణ్వాలయమున సహస్రదీపముల దానము చేసెను. ఆమె సవతులు దీపదానమాహాత్మ్యమును గూర్చి ప్రశ్నించగా ఆమె ఇట్లు చెప్పెను. లలిత చెప్పెను : పూర్వము సౌవీరరాజువద్ద మైత్రేయు డను పురోహితు డుండెను. అతడు దేవికానదీతీరమున శ్రీమహావిష్ణువునకు ఆయము కట్టించేను. కార్తికమాసమున అతడు దీపదానము చేసెను. పిల్లికి భయపడి పారిపోవుచున్న ఒక ఆడుఎలుక అకస్మాత్తుగ, తవ ముఖాగముతో ఆ దీపపు వత్తిని పైకి త్రోసెను. అట్లు చేయుటచే ఆరిపోవుటకు సిద్దముగానున్న దీపము ప్రజ్వలించెను. మరణానంతరము ఆ ఆడుఎలుక యే రాజకుమారిగ జన్మించి రాజధర్ముని నూర్గురు, రాణులలో ప్రధానురా లైనది. ఈ విధముగ ఆనుకొనకుండగనే నేను విష్ణ్వాలయమునందలి దీపపు వత్తి ని ఎగసనత్రోయుటచే కలిగిన పుణ్యమునకు నలమును అనుభవించుచున్నాను. దీనివలననే నాకు పూర్వజన్మస్మృతికూడ లభించినది. అందుచే నేను సదా దీపదానము చేయుచున్నాను. ఏకాదశినాడు దీపదానము చేసినవాడు స్వర్గమున విమానారూఢుడై ఆనందించుచుండును.

జాయతే దీపహర్తా తు మూకో వా జడ ఏవ చ

 అన్దే తమసి దుష్పారే నర కే పనతే కిల.

విక్రోశమానాంశ్చ సరాగ్యమకింకర ఆహతాన్

విలా వైరలమతాపి కింవోవిలపితే ఆ ఫలమ్.

యదా ప్రమాదిభిః పూర్వమత్య నసము పేక్షితః

జన్తుర్లన్మసహ సేభ్యో హ్యేకస్మిన్ మానుషో యది.

తత్రాప్యతివిమూఢాత్మా కిం భోగాననువధాతి

స్వపాతం విషయస్వాదైః క్రన్దనం తదిహాగతమ్.

భుజ్యతే చ కృతం పూర్వమేతతిం వో న చి స్తితమ్

 పరస్త్రీష కు చాద్యజ్ఞం పీతయే దుఃఖదం హి వః.

ముహూర్తవిషయాస్వాదోఒనేక కోట్యబ్దదుఃఖదః

పరస్త్రీహారి యద్గీతం హా మాతః కిం విలప్యతే.

కోతిభాఠొ హరేరామ్ని జిహ్వయా పరికీర్తితే

వర్తిత్రే లేఒల్పమూల్యేపి యదగ్నిర్లభ్యతే సదా.

దానాక్తైర్హరేర్దీపో హృత స్తద్వోస్తి దుఃఖదమ్

ఇదానీం కిం విలా పేన సహధ్వం యదుపాగతమ్.

అగ్ని రువాచః-

                    లలితో క్తం చ తాకి శ్రుత్వా దీపదానాద్దివం యయుః

తస్మాద్ధీపప్రదానేన వ్రతానామధికం ఫలమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే దీపదానవ్రతం నామ ద్విశతత మోధ్యాయః.

దీపమును హరించినవాడు మూగ వాడు, బుద్ధివిహీనుడు ఆగును చీకటితో నిండిన దా ట శక్యముగాని నరకములో పడును. ఆక్కడ విలపించుచున్న వారిని చూచి యమకింకరుడు ఇట్లు అనును  “ఇక్కడ ఏడిచి ఏమి ప్రయోజనము? మీరు ఏమరచి మీ ధర్మమును ఉపేక్షించినారు. కొన్ని వేల జన్మలలో ప్రాణి మనుష్యుడుగా పుట్టును. అపుడు కూడ మూడబుద్ధి యై భోగాలకొరకు పరుగెత్తును. పూర్వము మీరు అనుభవించిన విషయభోగాల ఫలితంగా ఇక్కడ ఏడ్వవలసి వచ్చినది. చేసిన పాపముల ఫలము ఆనుభవించవలసి ఉండునని మీరు ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? పరభార్యల కుచమర్ధనము మీకు సుఖకరముగ కనబడినది. అదే ఇపుడు మీ కుదుఃఖ హేతు వై నది. పరస్త్రీలను ఆవహరించి మీరు చేసిన కర్మలను గూర్చి నేను చెప్పి ఉన్నాను. ఇపుడు అయ్యో! అమ్మా! అనుచు ఎందుకు ఏడ్చెదరు? శ్రీమహావిష్ణువు నామము నాలుకకు ఏమి భారము? తైలము, వత్తి చాల స్వల్పమూల్యము కలవి. అగ్ని యైతే అంతటను లభించునదే. ఐనను మీరు దీపదానము చేయక విష్ణ్వాలయమునుండి దీపమును హరించితిరి. ఆదియే మీకిపుడు దుఃఖము నిచ్చుచున్నది. విలపించి ఏమి ప్రయోజనము? వచ్చిన యాతనను అనుభవింపుడు”.

అగ్ని దేవుడు చెప్పెను. లలిత సవతు లందరు ఆమె చెప్పిన ఉపాఖ్యానము విని దీపదానప్రభావముచే స్వర్గము పొందిరి. అందుచే దీపదానము అన్ని వ్రతములకంటెను విశేషఫలదాయకము.

అగ్ని మహాపురాణమునందు దీపదానవర్ణనమను రెండు నూర్లవ అధ్యాయము సమాప్తము.

అగ్ని మహా పురాణము 1 – 200 అధ్యాయములు సమాప్తము

* * * * *