అగ్ని రువాచః-
పుష్పాద్యైః పూజనాద్వి ష్ణొర్న యాతి నరకాన్వదే ।
ఆయుషో త్తే నరః ప్రాణేరనిచ్ఛన్న పి ముచ్యతే.
జలమగ్నిర్విషం శస్త్రం క్షుద్వ్యాధికి పతనం గిరేః ।
నిమిత్తం కిం చిదాసాద్య దేవీప్రాజై ర్విముచ్యతే.
అన్యచ్ఛరీరమాద తే యాతనీయం స్వకర్మభిః ।
భు జ్కై థ పాపకృద్దుఃఖం సుఖం ధర్మాయ సజ్జతః.
శ్రీ నీయతే యమదూతైస్తు యమం ప్రాణిఖ్యజరైః ।
కుపదే దక్షిణద్వారి ధార్మికః పశ్చిమాదిభిః.
మాజప్తః కిజరైస్తు పాత్యతే నర కేషు చ ।
స్వర్గే తు నీయతే ధర్మాద్వసిష్టాద్యు క్తిసంశ్రయాత్.
గోఘాతే తు మహావీచ్యాం వరలక్షం తు పీడ్యతే ।
రామకుమ్బే మహాదీస్తే బ్రహ్మహా భూమిహారకః.
మహాప్రలయకం యావదౌర వే పీడ్యతే శనైః ।
శ్రీబాలవృద్ధహస్తా తు యావదిన్దాశ్చతుర్దశ.
మహారౌరవ కే రౌద్రే గృహ క్షేత్రాదిదీపకః ।
దహ్యతే కల్పమేకం చ చౌరస్తామిస్రకే పటేల్.
నైకకల్పం తు శూలాద్యైర్భిద్యతే యమకిక్కిరై ।
మహాతామిసకే సర్పజలౌకాద్యైశ్చ పీడ్యతే.
యావద్భూమిర్మాతృహాద్యా హ్యసిపత్రవనేసిభిః ।
నై కకల్పం తు నర కే కరమ్భవాలు కోసు చ.
యేన దగ్గ జన స్తత్ర దహ్యతే వాలుకాదిభిః ।
కాకోలే కృమివిష్టాశీ ఏకాకి మిష్టభోజనః.
కోట్టలే మూత్రరక్తాశీ పఞ్చయజ్ఞక్రియో జ్ఘితః ।
సుదుర్గందే ర క్తభోజీ భవేచ్చాభక్ష్యభక్షక కః.
ఆగ్నిదేవుడు పలికెను ; వసిష్టా! ఇపుడు నరకములను గూర్చి చెప్పెదను. పుష్పాద్యుపచారములతో శ్రీమహా విష్ణువును పూజించువారికి నరక ప్రాప్తి ఉండదు. ఆయుర్దాయము పూర్తి యేనపిమ్మట వలదన్న ను మానవుడు మరణించి తీరును. దేహధారి యైన జీవుడు అగ్ని, జలము, విషము, శస్త్రఘాతము, ఆకలి, వ్యాధి, పర్వతమునుండి పడుట మొదలైన ఏదియో యొక నిమిత్తముచే ప్రాణములు విడచును. స్వకర్మానుసారముగ యాతనలు అనుభవించుటకై మరొక శరీరమును గ్రహించును. పాపకర్మ చేసినవాడు దుఃఖమును అనుభంచును. పుణ్యకర్మచేసినవాడు సుఖ మనుభవించును. మరణానంతరము యమదూతలు వచ్చి పాపాత్ముని దుర్గమమార్గము ద్వారా యమపురిలోనికి దక్షిణమార్గముద్వారా తీసికొని పోయి యమధర్మరాజు ఎదుట నిలుపుదురు. ఆ యమదూతలు చాల భయంకరముగ నుందురు. ధర్మాత్ములను మాత్రము వశ్చిమాదిద్వారములద్వారా తీసికొనిపోవుదురు. యముని ఆజ్ఞ ప్రకారము పాపాత్ములు నరకమునందు పడవేయబడుదురు. వసిష్టాదిఋషులు బోధించిన ధర్మమును ఆచరించువారిని స్వర్గమునకు తీసికొనిపోవుదురు. గోహత్య చేసినవాడు ‘మహావీచి’ నరకమునందు ఒక లక్ష సంవత్సరములు బాధ లనుభవించును. బ్రహ్మహత్య చేసినవారు చాల ఉష్ణ మైన ‘తామ్రనుంభ’ నరకమునందు పడద్రోయబడుదురు. భూమిని అపహరించిన పాపాత్మునకు రౌరవాది నరకమునందు మహాప్రలయమువరకును మెల్ల మెల్లగ దుస్సహ మైన పీడ కల్గింపబడును. శ్రీ - బాల - వృద్ధులను చంపిన పాపాత్ములు పదునలుగురు ఇంద్రుల రాజ్యము పూర్తి యగు నంత కాలము మహారౌరవ మను రౌద్ర మైన నరక మునందు బాధ అనుభవింతురు. ఇతరుల ఇళ్లను, పొలములను తగులబెట్టిన వారిని ఒక కల్పమువరకు మహారౌరవనరకమునందు కాల్చివేయుదురు. దొంగతనము చేయువారు తామిస మను నరకమునందు బాధ లనుభవింతురు. పిదప యముని అనుచరులు దానిని బల్లెములతో పొడుచుచుందురు, ‘మహాతామిస్ర’ నరకమున సర్పములచేతను జలగ లచేతను పీడింతురు. మాతృహత్యాది పాపములు చేసినవారిని అసిపత్ర వనమను నరకమునందు పడవేయుదురు. అచట వాని అవయవములను కత్తులతో, ఈ భూమి ఉన్నంతవరకును, ఛేదించుచుందురు. ఈ లోకమునందలి ఇతరప్రాణుల హృదయములు కాల్చినవారిని అనేకకల్పముల వరకును ‘కరంథ వాలుక’ అను నరకమునందు, వేడిగా నున్న ఇసుక పై వేయించేదరు. ఇతరులకు పెట్టకుండ మిష్టాన్నమును తిన్న వాడు ‘కాకోల’ మను నరకమునందు పురుగులను, రెట్టలను తినుచుండును. పంచమహాయజ్ఞములను, నిత్యకర్మలను త్యజించువాడు కుట్టల మను నరకమునందు మూత్రమును, రక్తమును త్రాగుచుండును. అభక్ష్యవస్తువులు భక్షించువాడు మహాదుర్గంధమయ మగు నరకములో పడి రక్తమును ఆహారముగ గొనును.
తైలపాకే తు తిలవతీడ్యతే పరపీడకః ।
తైలపాకే తు పల్యేత శరణాగతఘాతకః.
నిరుచ్ఛ్వా సే దాననాశీ రసవిక్రయూధ్వరీ ।
నామ్నా వజ్రక వాటేన మహాపాతే తదానృతీ.
ఇతరులకు కష్టము కలిగించువాడు తైలపాకనరకమునందు తిలల వలె నలుగగొట్టబడును. శరణాగతుని చంపినవాడు గూడ తైలపాక నరకమునందు పక్వము చేయబడును. యజ్ఞమునకై ఏదైన ఒక వస్తువు నిచ్చెద నని చెప్పి ఇవ్వనివాడు ‘నిరుచ్చ్వాస’ నరకమునందును, రసవిక్రయము చేయువాడు ‘వజ్రకటాహ’ నరకమునందును, అసత్యము లాడువాడు ‘మహాపాత’ నరకమునందును పడవేయబడును.
మహాజ్వాలే పాపబుద్ధిః క్రకచే గమ్యగామినః ।
సంకరీ గుడపా కే చ ప్రతుదేత్పరమర్మనుత్.
వారప్రదే ప్రాణిహన్తో క్షురధా రే చ భూమిహృత్ ।
ఆమ్బరీ షే గోస్వర్ణహృద్దూమచ్ఛిద్వజశస్త్ర కే.
మధుహర్తా పరీతా పే కాలసూత్రే పరార్థహృత్ ।
కశ్మలేఒత్య స్తమాంసాశీ ఉగ్రగనే హ్యపిణ్ణదః.
దుర్గరే తూతోచభక్ష బనిగ్రాహరతాశ్చ యే ।
మజ్ఞూ షే నర కే2ప్రతిషే శ్రుతినిన్దకః.
పూతివ క్లే కూటసాక్షీ పరిలుణ్ణిద్ధనాపహా ।
బాలశ్రీవృద్దఘాతీ చ కరాలే బ్రాహ్మణార్తికృత్.
విలే పే మద్యపో విప్రో మహాతామే తు భేదినః ।
తథాక్రమ్య పరదారాన్ జ్వల న్తీమాయం శిలామ్.
శాల్మలాగ్రే తమాలిజేన్నారీ బహురంగమా ।
ఆస్ఫోటే జిహ్వోద్ధరణం శ్రీక్షణాన్నేత్రభేదనమ్.
అడ్డారరాశా క్షిప్య స్తే మాతా పుల్యాదిగామినః ।
చౌరాః రైశ్చ భిద్య నే స్వమాంసాశీ చ మాంసభుక్ .
మాసోపవాసకర్తా వై న యాతి నరకం నరః ।
ఏకాదశీవ్రతక లో భీష్మపఞ్చక సద్ర్వతీ.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నరక స్వరూపవర్ణనం నామ త్య్రధిక ద్విశతతమోధ్యాయః.
పాపాత్ముడు ‘మహాజ్వాల’నరకమునందును, ఆగమ్యాగమనము చేసినవాడు ‘క్రకచము’ నందును, వర్ణసంకర సంతానోత్పత్తి చేసినవాడు “గుడపాకము” నందును, ఇతరుల మర్మస్థానములందు బాధకలిగించినవాడు ‘ప్రతుదము’ నందును, ప్రాణిహింస చేయువాడు ‘క్షార హ్రదము’ నందును, భూమి అపహరించినవాడు ‘క్షురధారా’ నరకమునందును, గోస్వర్ణాపహారి ‘అంబరీషము’ నందును. వృక్షములను భేదించువాడు ‘వజశస్త్రము’ నందును, మధువు దొంగిలించినవాడు ‘పరీతాపము’ నందును. ఇతరుల సొత్తు అపహరించిన వాడు ‘కాలసూత్రము’ నందును. ఆధీనముగా మాంసమును తినువాడు “కశ్మలము” నందును, పితరులకు పిండప్రదానము చేయనివాడు. “ఉగ్రగంధము” నందును యమభటులచే పడద్రోయ బడును. లంచము తీసికొను వానిని “దుర్దుర” నరకమునందును, నిరపరాధులను బంధించిన వానిని “లోహమయ మంజూష” యను నరకమందును వేద నిందకుని “ఆప్రతిష్ణము” సందును అబద్ధపు సాక్ష్య మిచ్చు వానిని “పూతివకము” నందును, ధనము నపహరించిన వానిని “పరిలుంఠము” నందును, గాలశ్రీ, వృద్ధులను చంపిన వానిని, బ్రాహ్మణపీడ కుని “కరాలము” నందును, మద్యపానము చేయు బ్రాహ్మణుని “విలేపము” నందును, మిత్రులందు భేదభావము కలిగించు వానిని “మహా ప్రేతము” నందును, పడద్రోయుదురు. పరగామి యగు పురుషుడును, అనేక పురుషగామిని యగు శ్రీయు “శాల్మలము” అను వారక మునందు కాలుచున్న లోహము ఆకారములో ఉన్న ఆ ప్రియురాలిని, లేదా ప్రియుని ఆలింగనము చేసికొనవలసివచ్చును. చాడీలు చేప్పుహని నాలుకను లాగిపారవేయుదురు. పరస్త్రీలను కుదృష్టితో చూచిన వాని కండ్లు పీకి వేయుదురు. మాతా - పుత్రగామిని కణకణలాడు చున్న నిప్పులపై పడద్రోయుదురు. చోరులనుఛురికతో భేదింతురు. మాంసభక్షణము చేయు నరపిశాచులకు వారి మాంసమే కోసి తినిపింతురు. మాసోపవాసము గాని, ఏకాదశి వ్రతము గాని, భీష్మపంచక వ్రతము గాని చేయువాడు నరక మలకు వెళ్ళడు.
అగ్ని మహాపురాణమునంను నరకస్వరూపవర్తన మను రెండువందల మూడవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 203 of the Agni Purāṇa is as follows:
Agni outlines the full procedure for Śānti-karma, the pacification rite used to neutralize malefic planetary influences and inauspicious omens. The chapter details the paridhi homa, the use of specific śānti-dravyas, and the invocation of the Navagrahas. Puṇyāhavācana and Navagraha pūjā precede the homa, which culminates in ablutions offered to Viṣṇu. The rite is declared efficacious for removing pestilence, drought, and royal calamities.